ETV Bharat / state

దిల్లీలో మంత్రి లోకేశ్ పర్యటన - చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ ప్రారంభం

news live updates
16-02-2026 ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వార్తలు (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 16, 2026 at 7:07 AM IST

|

Updated : February 16, 2026 at 10:02 PM IST

Choose ETV Bharat
  • 16-02-2026 ఆంధ్రప్రదేశ్​ రాష్ట్ర వార్తలు - విజయవాడ నుంచి ముంబయి మీదుగా దిల్లీకి బయల్దేరిన బిల్ గేట్స్

LIVE FEED

10:00 PM, 16 Feb 2026 (IST)

దిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన - చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ ప్రారంభం

  • దిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • చార్లీ ఫాక్స్ ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్
  • విమాన రంగానికి ప్రపంచస్థాయి నైపుణ్యాల దిశగా ముందడుగు
  • యువ పైలట్ కేడట్లతో ముఖాముఖి నిర్వహించిన లోకేశ్
  • విమానయాన రంగం శక్తిమంతానికి ఇదో పెద్ద ముందడుగు: లోకేశ్
  • విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించింది: లోకేశ్

9:57 PM, 16 Feb 2026 (IST)

ఎన్టీఆర్ జిల్లాలోని చీమలపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌

  • ఎన్టీఆర్ జిల్లా: ఎ.కొండూరు మం. చీమలపాడు పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌
  • రూ.12.50 లక్షలు లూటీ ఘటనలో నాగమణిని తొలగించిన అధికారులు
  • నెమలి, మేడూరు, సత్యాలపాడు, అమ్మిరెడ్డిగూడెం, ఊటుకూరులో చేసిన నాగమణి
  • పంచాయతీల్లోనూ నాగమణిపై ఆరోపణల దృష్ట్యా అధికారుల విచారణ
  • ఆరోపణల దృష్ట్యా విచారణ జరిపి నాగమణిని సస్పెండ్‌ చేసిన అధికారులు

9:56 PM, 16 Feb 2026 (IST)

అనకాపల్లిలో అగ్నిప్రమాదం - మహిళ సజీవ దహనం

  • అనకాపల్లిలో అగ్నిప్రమాదం, మహిళ సజీవ దహనం
  • గూడ్స్ షెడ్డు వద్ద గుడిసెలో మంటల్లో చిక్కుకుని మహిళ మృతి
  • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న అనకాపల్లి పోలీసులు

9:56 PM, 16 Feb 2026 (IST)

బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడు మృతి

  • నెల్లూరు: వింజమూరు బంగాళా సెంటర్‌లో విషాదం
  • బైకు అదుపుతప్పి ఆర్టీసీ బస్సు కిందపడి యువకుడు మృతి
  • మృతుడు ఏఎస్ పేట మం. రాజువోలు వాసి సురేంద్ర (27)

9:54 PM, 16 Feb 2026 (IST)

సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

  • సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
  • 5 గ్రామ పంచాయతీల విలీనం, పెద్దవాగు ప్రాజెక్టు, రైల్వే లైన్లు, నేషనల్ హైవేలపై చర్చ
  • ఏలూరు-కొత్తగూడెం, జగ్గయ్యపేట నేషనల్ హైవే పనులపై చొరవ చూపాలని వినతి
  • టీటీడీలో తెలంగాణకు ఐదెకరాల స్థలం ఇవ్వాలని సీఎంను కోరిన తుమ్మల
  • ఖమ్మం జిల్లా రోడ్లు, రైల్వేల ఉమ్మడి అంశాలపై చర్చించా: తుమ్మల
  • ఆనాడు పోలవరం కోసం 7 మండలాలు ఏపీకి బదిలీ చేశారు: తుమ్మల
  • పోలవరం కట్టుకోవాలంటే ఆనాడు అంగీకరించాం: తుమ్మల
  • భద్రాచలం నుంచి తెలంగాణ వెళ్లాలంటే 5 ఏపీ గ్రామాల నుంచి వెళ్లాల్సి వస్తోంది: తుమ్మల
  • ఆ 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని చంద్రబాబును కోరాం: తుమ్మల
  • ఐదు గ్రామాలు తెలంగాణలో కలవాలంటే పార్లమెంటులో చట్టం చేయాలి: తుమ్మల
  • రెండు రాష్ట్రాల అసెంబ్లీలో తీర్మానాలు చేసి పంపాలి: తుమ్మల
  • గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని కోరాం: తుమ్మల
  • సీఎం చంద్రబాబు ఆలోచిస్తామని అన్నారు: తుమ్మల
  • తిరుమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి ఐదెకరాలు కోరాం: తుమ్మల
  • పరిశీలించి చెబుతామని సీఎం చంద్రబాబు అన్నారు: తుమ్మల
  • అమరావతి మంచి రాజధాని కావాలని కోరుకుంటున్నాం: తుమ్మల
  • దేశంలోనే ప్రతిష్టాత్మక రాజధాని కావాలని కోరుకుంటున్నాం: తుమ్మల

9:54 PM, 16 Feb 2026 (IST)

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష

  • తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలపై టీటీడీ అదనపు ఈవో సమీక్ష
  • మార్చి 3న చంద్రగ్రహణం దృష్ట్యా 10.30 గంటలు ఆలయం మూసివేత
  • తెప్పోత్సవం, కుమారధార తీర్థ ముక్కోటి, చంద్రగ్రహణంపై సమీక్ష
  • ఈనెల 23న తెప్పల సామర్థ్యం పరీక్షించేందుకు ట్రయల్ రన్: అదనపు ఈవో
  • పుష్కరిణి, తెప్పలకు ఆకర్షణీయంగా విద్యుత్ కాంతులు: అదనపు ఈవో
  • ఐదు రోజులు పుష్కరిణి స్నానాలకు భక్తులకు అనుమతి నిరాకరణ: అదనపు ఈవో
  • మార్చి 3న కుమారధార తీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు: అదనపు ఈవో
  • ఉదయం 5 నుంచి 10 గంటల వరకు భక్తులకు అనుమతి: అదనపు ఈవో
  • చంద్రగ్రహణం వల్ల ఉదయం 9 తర్వాత అన్నప్రసాదాలు నిలిపివేత: అదనపు ఈవో
  • మార్చి 3న ఉదయం 9 గం.కు శ్రీవారి ఆలయం మూసివేత: అదనపు ఈవో
  • మార్చి 3న మధ్యాహ్నం 3.20 నుంచి సా.6.47 వరకు గ్రహణ కాలం: అదనపు ఈవో
  • 40 వేల పులిహోర ప్యాకెట్ల పంపిణీకి ఏర్పాట్లు: అదనపు ఈవో
  • వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు రద్దు: అదనపు ఈవో వెంకయ్యచౌదరి
  • ఫిబ్రవరి 26 నుంచి మార్చి 2 వరకు శ్రీవారి తెప్పోత్సవాలు: అదనపు ఈవో

9:54 PM, 16 Feb 2026 (IST)

రాష్ట్ర బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈ రంగానికి భారీ కేటాయింపులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్

  • రాష్ట్ర బడ్జెట్‌లో ఎంఎస్ఎంఈ రంగానికి భారీ కేటాయింపులు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • 'ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త' లక్ష్యంతో కేటాయింపులు: మంత్రి కొండపల్లి
  • ఎంఎస్ఎంఈ క్లస్టర్, మౌలిక సదుపాయాల అభివృద్ధికి చర్యలు: కొండపల్లి
  • రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థ బలోపేతానికి సమగ్ర ప్రణాళిక: కొండపల్లి
  • ఎంఎస్ఎంఈల ప్రమోషన్‌కు అదనంగా రూ.84 కోట్లు కేటాయింపు: కొండపల్లి
  • సూక్ష్మ, చిన్న పరిశ్రమల రుణ భరోసాకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్: కొండపల్లి
  • పథకం కింద 95 శాతం వరకు రుణ గ్యారంటీ లభిస్తుంది: మంత్రి కొండపల్లి
  • ప్రయోగాత్మకంగా బడ్జెట్‌లో రూ.10 కోట్లు కేటాయింపులు: మంత్రి కొండపల్లి
  • ఎంఎస్ఎంఈలకు చెల్లింపులకోసం ట్రెడ్స్‌ మాండేట్‌ జారీ చేస్తాం: కొండపల్లి
  • కేంద్ర బడ్జెట్‌తో అనుసంధానంలో భాగంగా 3 వ్యూహాలతో ముందుకెళ్తున్నాం: కొండపల్లి

9:54 PM, 16 Feb 2026 (IST)

దిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన

  • దిల్లీలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • చార్లీ ఫాక్స్‌ట్రాట్‌ ఏవియేషన్ సర్వీసెస్‌ను ప్రారంభించిన లోకేశ్
  • విమాన రంగానికి ప్రపంచస్థాయి నైపుణ్యాల దిశగా కీలక అడుగు: లోకేశ్
  • యువ పైలట్ కేడెట్లతో ర్యాపిడ్ ఫైర్ ప్రశ్నోత్తరాలు ఉత్సాహం ఇచ్చాయి: లోకేశ్
  • విమానయాన భవిష్యత్తుకు కొత్త ఉత్సాహం, దిశ కనిపించింది: లోకేశ్

9:54 PM, 16 Feb 2026 (IST)

రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన

  • రేపు విశాఖలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన
  • రేపు సా.4.40 గం.కు విశాఖ నేవల్ ఎయిర్ స్టేషన్ డేగాకు రాష్ట్రపతి
  • రాష్ట్రపతికి స్వాగతం పలకనున్న గవర్నర్, ఉపముఖ్యమంత్రి
  • ఎల్లుండి ఉ.10 గం.కు ఐఎఫ్ఆర్‌లో పాల్గొననున్న రాష్ట్రపతి ముర్ము
  • ఎల్లుండి మధ్యాహ్నం విశాఖ నుంచి దిల్లీ తిరుగుపయనం

9:52 PM, 16 Feb 2026 (IST)

విజయవాడ కెనాల్‌ రోడ్డులో ఘనంగా రథోత్సవం

  • విజయవాడ కెనాల్‌ రోడ్డులో ఘనంగా రథోత్సవం
  • మేళతాళాల మధ్య గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఊరేగింపు
  • రథం తాళ్లు లాగి ఉత్సవాన్ని ప్రారంభించిన పాలకమండలి ఛైర్మన్‌ గాంధీ
  • రథోత్సవంలో పాల్గొన్న విజయవాడ సీపీ రాజశేఖరబాబు, పోలీసులు

9:52 PM, 16 Feb 2026 (IST)

చంద్రగిరిలో వ్యక్తి మృతదేహం గుర్తింపు

  • తిరుపతి: చంద్రగిరిలో వ్యక్తి మృతదేహం గుర్తింపు
  • నూకలగుంట సచివాలయం వెనుక ముళ్ల పొదల్లో మృతదేహం గుర్తింపు
  • ఐదు రోజుల క్రితం మృతిచెంది ఉంటాడని భావిస్తున్న పోలీసులు
  • ఘటనాస్థలిలో మద్యం సీసాలు గుర్తించిన పోలీసులు

9:52 PM, 16 Feb 2026 (IST)

చంద్రబాబుతో ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు బిల్ గేట్స్‌ను కలుస్తారు: పార్థసారథి

  • చంద్రబాబుతో ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు బిల్ గేట్స్‌ను కలుస్తారు: పార్థసారథి
  • జగన్‌ను నమ్ముకుంటే వారంతా గేటు బయటే ఉంటారు: పార్థసారథి
  • సామాజిక మాధ్యమంలో చర్చనీయాంశంగా మారిన మంత్రి పార్థసారథి పోస్ట్

6:48 PM, 16 Feb 2026 (IST)

జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల - ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు 100 పర్సెంటైల్‌

  • జేఈఈ మెయిన్స్‌ ఫలితాలు విడుదల
  • ఏపీకి చెందిన ఇద్దరు విద్యార్థులకు 100 పర్సెంటైల్‌
  • ఏపీ విద్యార్థి జి.నరేంద్రబాబుకు 100 పర్సెంటైల్‌
  • ఓబీసీ కేటగిరీలో నరేంద్రబాబుకు మొదటి ర్యాంకు
  • ఏపీ విద్యార్థి పసల మోహిత్‌కు 100 పర్సెంటైల్‌
  • తెలంగాణకు చెందిన వివన్‌ శరద్‌ మహీశ్వరికి 100 పర్సెంటైల్‌
  • ఎస్సీ కేటగిరీలో ఏపీ విద్యార్థి దేవ శ్రీవేద్‌కు మొదటి ర్యాంకు
  • జేఈఈ మెయిన్స్‌ రాసిన 13.04 లక్షల మంది విద్యార్థులు

6:48 PM, 16 Feb 2026 (IST)

తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బిల్ గేట్స్‌కు చూపించిన సీఎం చంద్రబాబు

  • తిరుమల శ్రీవారి చిత్రపటాన్ని బిల్ గేట్స్‌కు చూపించిన సీఎం చంద్రబాబు
  • బ్రేక్ ఫాస్ట్ సందర్భంగా తన ఛాంబర్‌లోకి వచ్చిన బిల్‌ గేట్స్‌కు శ్రీవారి చిత్రపటం చూపించిన సీఎం
  • శ్రీవారి ప్రాశస్త్యం, తిరుమల క్షేత్రం గొప్పదనాన్ని బిల్ గేట్స్‌కు వివరించిన సీఎం
  • వ్యవసాయ క్షేత్రంలో రైతులు, స్థానిక వంటకాలు రుచి చూసిన బిల్ గేట్స్

6:47 PM, 16 Feb 2026 (IST)

పంచారామ క్షేత్రంలో ఘనంగా రథోత్సవం

  • కాకినాడ: పంచారామ క్షేత్రంలో ఘనంగా రథోత్సవం
  • సామర్లకోట భీమేశ్వరస్వామి రథోత్సవం నిర్వహించిన అర్చకులు
  • సాంస్కృతిక కార్యక్రమాలతో పట్టణ వీధుల్లో భీమేశ్వరస్వామి ఊరేగింపు

6:47 PM, 16 Feb 2026 (IST)

విజయవాడ బెరం పార్కులో శాప్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ

  • విజయవాడ బెరం పార్కులో శాప్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరణ
  • శాప్ లీగ్ ట్రోఫీ ఆవిష్కరించిన కోనేరు హంపి, పీవీ సింధు
  • జిల్లా, రాష్ట్రస్థాయిలో వివిధ అంశాల్లో క్రీడా పోటీలు
  • ఫిబ్రవరి నుంచి డిసెంబర్ వరకు లీగ్ జరుగుతుంది: శాప్‌ వీసీ ఎండీ
  • పాఠశాల స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు పోటీలు: శాప్‌ వీసీ ఎండీ
  • జిల్లాస్థాయి నుంచి ఎంపిక ప్రక్రియ జరుగుతుంది: శాప్‌ వీసీ ఎండీ
  • ఈనెల 21న తిరుపతిలో చెస్ ద్వారా శాప్ లీగ్ ప్రారంభం: శాప్‌ వీసీ ఎండీ

6:47 PM, 16 Feb 2026 (IST)

శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  • శ్రీశైలంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • శ్రీశైలం పురవీధుల్లో భ్రమరాంబ మల్లికార్జునస్వామికి రథోత్సవం
  • పుష్పాలతో అలంకరించిన రథంపై స్వామిఅమ్మవార్ల విహారం
  • స్వామిఅమ్మవార్లను తిలకించేందుకు వేలాదిగా వచ్చిన భక్తులు
  • రాత్రి ఆలయ పుష్కరిణిలో స్వామిఅమ్మవార్లకు తెప్పోత్సవం

6:47 PM, 16 Feb 2026 (IST)

సముద్రంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి

  • నెల్లూరు: బోగోలు మం. తాటిచెట్లపాలెంలో విషాదం సముద్రంలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి
  • మృతులు దగదర్తి మం. ఉలవపాళ్లకు చెందిన దీపక్ (18), లోకేష్ (23)

6:46 PM, 16 Feb 2026 (IST)

అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు

  • అంబటి రాంబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్లపై ముగిసిన వాదనలు
  • జడ్జి ఎదుట వాదనలు వినిపించిన పోలీసులు, అంబటి లాయర్లు
  • ఈనెల 18వ తేదీకి‌ తీర్పు రిజర్వ్ చేసిన గుంటూరు ప్రిన్సిపల్ కోర్టు జడ్జి

6:46 PM, 16 Feb 2026 (IST)

ఎల్లుండి విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన

  • ఎల్లుండి విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
  • ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతితో పాటు పాల్గొననున్న సీఎం
  • ఎల్లుండి మ.1.20 గం.కు ఉండవల్లి నివాసానికి సీఎం తిరుగు పయనం

6:46 PM, 16 Feb 2026 (IST)

2026 నుంచి పదో తరగతిలో 2 బోర్డు పరీక్షలు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ

  • 2026 నుంచి పదో తరగతిలో 2 బోర్డు పరీక్షలు నిర్వహించనున్న సీబీఎస్‌ఈ
  • పదో తరగతిలో 2 బోర్డు పరీక్షల విధానంపై సీబీఎస్‌ఈ ప్రకటన విడుదల
  • పదో తరగతిలో మొదటి బోర్డు పరీక్ష హాజరు తప్పనిసరన్న సీబీఎస్‌ఈ
  • ఉత్తీర్ణులు, అర్హులు 3 సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అనుమతి
  • తొలి పరీక్షలో 3, ఎక్కువ పరీక్షలు రాయకపోతే రెండోసారి అనుమతి నిరాకరణ
  • మ్యాథ్స్‌, సైన్స్‌, సోషల్‌, భాషల్లో 3 సబ్జెక్టుల్లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసేందుకు అనుమతి
  • అలాంటి విద్యార్థులను ఎసెన్షియల్‌ విభాగంలో ఉంచుతారన్న సీబీఎస్‌ఈ
  • వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రధాన పరీక్షలకు అనుమతిస్తారన్న సీబీఎస్‌ఈ

3:51 PM, 16 Feb 2026 (IST)

పల్నాడు జిల్లా: కోటప్పకొండ తిరునాళ్ల నుంచి స్వగ్రామాలకు భక్తులు

  • పల్నాడు జిల్లా: కోటప్పకొండ తిరునాళ్ల నుంచి స్వగ్రామాలకు భక్తులు
  • స్వగ్రామాలకు వెళ్లేందుకు నరసరావుపేట చేరుకున్న భక్తులు
  • ప్రయాణికులతో రద్దీగా మారిన నరసరావుపేట బస్టాండ్, రైల్వేస్టేషన్‌
  • రద్దీ మేరకు సర్వీసులు లేక బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూపులు
  • రైళ్లలో సొంతూళ్లకు వెళ్లేందుకు భారీగా స్టేషన్‌కు చేరుకున్న ప్రయాణికులు

3:51 PM, 16 Feb 2026 (IST)

విశాఖ: అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో గాలి దుమారం

  • విశాఖ: అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో గాలి దుమారం
  • మినీటోర్నడో తరహాలో 20 మీటర్ల ఎత్తులో సుడులు తిరిగిన గాలి
  • ఖాళీ ప్రదేశంలో పీడనం వల్ల గాలి దుమారం ఏర్పడిందన్న వాతావరణశాఖ

2:12 PM, 16 Feb 2026 (IST)

రాష్ట్రంలో ముగిసిన గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ పర్యటన

  • రాష్ట్రంలో ముగిసిన గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌ పర్యటన
  • విజయవాడ నుంచి ముంబయి మీదుగా దిల్లీకి బయల్దేరిన బిల్ గేట్స్
  • దాదాపు 5.30 గంటలపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బిల్ గేట్స్
  • పటమట చెన్నుపాటి రామకోటయ్య మున్సిపల్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ ఆడిన బిల్ గేట్స్
  • పటమటలో కార్యక్రమం ముగించుకొని విజయవాడ విమానాశ్రయానికి బయల్దేరిన బిల్‌ గేట్స్

2:11 PM, 16 Feb 2026 (IST)

నంద్యాల జిల్లా మహానంది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

  • నంద్యాల జిల్లా మహానంది క్షేత్రానికి పోటెత్తిన భక్తులు
  • మహానంది: పెద్దసంఖ్యలో భక్తుల రాకతో ట్రాఫిక్‌కు అంతరాయం
  • మహానంది: గంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్‌, వాహనదారుల ఇబ్బందులు

2:11 PM, 16 Feb 2026 (IST)

విశాఖ: కూర్మన్నపాలెం గౌరీనగర్‌లో చక్రధర్‌రావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి

  • విశాఖ: కూర్మన్నపాలెం గౌరీనగర్‌లో చక్రధర్‌రావు అనే వ్యక్తి అనుమానాస్పద మృతి
  • నాలుగు రోజుల ముందు మృతిచెంది ఉంటాడని స్థానికుల అనుమానం
  • విశాఖ: దుర్వాసన రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన స్థానికులు
  • కొంతకాలంగా అనారోగ్యంతో కేజీహెచ్‌లో చికిత్స పొందిన చక్రధర్‌రావు

1:30 PM, 16 Feb 2026 (IST)

ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు: పవన్‌

  • ఏపీ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి గేట్స్ ఫౌండేషన్ చూపుతున్న నిబద్ధతకు అభినందనలు: పవన్‌
  • విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల బలోపేతానికి గేట్స్‌ భాగస్వామ్యం: పవన్‌కల్యాణ్‌
  • సమగ్ర, స్థిర అభివృద్ధి కోసం సహకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది: పవన్
  • చంద్రబాబుతో కలిసి బిల్‌ గేట్స్‌కు ఆత్మీయ స్వాగతం పలకడం ఆనందంగా ఉంది: పవన్

1:29 PM, 16 Feb 2026 (IST)

అరటి తోటను సందర్శించిన బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్ బృందం

  • ఉండవల్లి: అరటి తోటను సందర్శించిన బిల్‌గేట్స్, గేట్స్ ఫౌండేషన్ బృందం
  • బిల్‌గేట్స్ వెంట ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్
  • డ్రోన్లతో పురుగుమందుల పిచికారి, ఏఐ ద్వారా చీడపీడలు గుర్తించడంపై రైతులతో చర్చ
  • రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న బిల్‌గేట్స్, సీఎం చంద్రబాబు
  • డ్రోన్లు, ఏఐ సహకారంతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించిన బిల్‌గేట్స్
  • అమరావతి పర్యటన ముగించుకొని విజయవాడ వెళ్లిన బిల్‌గేట్స్
  • విజయవాడలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న బిల్‌గేట్స్

1:29 PM, 16 Feb 2026 (IST)

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,000

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,57,000
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,44,620
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,50,500

1:29 PM, 16 Feb 2026 (IST)

మానవజీవనాన్ని మెరుగుపరిచేందుకు సేవ చేయాలన్నదే మా లక్ష్యం: సీఎం

  • మానవజీవనాన్ని మెరుగుపరిచేందుకు సేవ చేయాలన్నదే మా లక్ష్యం: సీఎం
  • పరిపాలనలో వేగాన్ని, వ్యాపార సౌలభ్యాన్ని ఆర్టీజీఎస్‌ అందిస్తోంది: సీఎం
  • ప్రత్యక్షంగా ప్రజల జీవితాల్లో ఆర్టీజీఎస్‌ మార్పు తీసుకువస్తోంది: సీఎం
  • 1990లో బిల్‌గేట్స్‌ను కలిసినప్పుడు సాంకేతికతపై స్ఫూర్తి వచ్చింది: సీఎం
  • సాంకేతికత ద్వారా పౌర సాధికారత సాధ్యమనే స్ఫూర్తి వచ్చింది: సీఎం
  • నాటి ఆలోచనలే ఇవాళ టెక్నాలజీ ఆధారిత పరిపాలనకు బాటలు వేశాయి: సీఎం
  • ఆర్టీజీఎస్‌ ద్వారా ఇవాళ పలు కార్యక్రమాలను ప్రదర్శించడం సంతోషంగా ఉంది: సీఎం

12:04 PM, 16 Feb 2026 (IST)

సచివాలయంలో ముగిసిన బిల్ గేట్స్ కార్యక్రమం

  • సచివాలయంలో ముగిసిన బిల్ గేట్స్ కార్యక్రమం
  • రెండు గంటలకు పైగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్న బిల్ గేట్స్
  • కాసేపట్లో ఉండవల్లిలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్ గేట్స్ బృందం
  • వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీ సహకారంతో చేపట్టే సాగువిధానం పరిశీలన

12:04 PM, 16 Feb 2026 (IST)

కోనసీమ జిల్లా: కాట్రేనికోన మం. గచ్చకాయలపొర మొగ వద్ద మత్స్యకారుల ధర్నా

  • కోనసీమ జిల్లా: కాట్రేనికోన మం. గచ్చకాయలపొర మొగ వద్ద మత్స్యకారుల ధర్నా
  • కూనవరం డ్రెయిన్ పూడికతీత పనులు తక్షణం చేపట్టాలని ఆందోళన
  • సముద్రం పర్ర పూడికతో ఉపాధి కోల్పోయామని మత్స్యకారుల ఆవేదన
  • వేలసంఖ్యలో తరలివచ్చి మొగ వద్ద మహా ధర్నా చేపట్టిన మత్స్యకారులు
  • అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవట్లేదని మత్స్యకారుల ఆగ్రహం

11:38 AM, 16 Feb 2026 (IST)

సీఎంతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్ గేట్స్

  • సీఎంతో కలిసి సచివాలయంలో ఆర్టీజీఎస్‌ను సందర్శించిన బిల్ గేట్స్
  • ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి పాలనలో టెక్నాలజీ వినియోగాన్ని పరిశీలించిన బిల్ గేట్స్
  • ఆర్టీజీఎస్‌ ద్వారా పౌర సేవలను వేగంగా అందిస్తున్న తీరును వివరించిన సీఎం
  • డేటాలేక్, అవేర్ 2.0, వాట్సప్ గవర్నెన్స్‌ను తెలుసుకున్న బిల్‌ గేట్స్‌
  • సంజీవని ప్రాజెక్టు, రాజధాని అమరావతి ప్రాజెక్టులను తెలుసుకున్న బిల్ గేట్స్
  • ఆర్టీజీఎస్‌లోని డిస్‌ప్లే వాల్స్‌పై ప్రజెంటేషన్లను పరిశీలించిన బిల్ గేట్స్
  • డేటా లేక్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలను అనుసంధానించామన్న సీఎం
  • డేటా లేక్, వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరసేవలను సులభతరం చేయడం బాగుందన్న గేట్స్
  • అవేర్ 2.0 ద్వారా రియల్ టైమ్‌లో సమాచారాన్ని సేకరిస్తున్నామన్న సీఎం
  • సమాచారం సేకరించి వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నట్లు గేట్స్‌కు తెలిపిన సీఎం
  • ప్రభుత్వ పథకాలు, పాలసీల అమలుపై ప్రజాభిప్రాయం సేకరిస్తున్న తీరును పరిశీలించిన గేట్స్
  • కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ద్వారా జీఎస్డీపీ పెరుగుదలను అంచనా వేస్తున్నామన్న సీఎం
  • ప్రాపర్టీ రికార్డుల భద్రతకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారన్న బిల్ గేట్స్
  • బ్లాక్ చెయిన్ టెక్నాలజీతో ల్యాండ్ రికార్డులు భద్రపరుస్తున్నామన్న అధికారులు
  • క్యూఆర్ కోడ్ వంటి విధానాలతో పారదర్శక చర్యలు తీసుకున్నామన్న అధికారులు
  • పన్ను వసూళ్ల ప్రక్రియ అద్భుతంగా ఉందన్న బిల్‌ గేట్స్‌
  • జీఎస్టీ విధానంతో దేశంలో పన్నుల వసూళ్లు గణనీయంగా పెరిగిందన్న సీఎం
  • చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు అమలును అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చిత్తూరు జిల్లాలో సంజీవని ప్రాజెక్టు అమలు
  • బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ లాంటి పరీక్షల వివరాలను ఎలా నమోదు చేస్తున్నారన్న గేట్స్
  • కుప్పంలో అమలు చేసిన సంజీవని ప్రాజెక్టు చాలా చక్కగా ఉందన్న బిల్ గేట్స్
  • ప్రజల డిజిటల్ హెల్త్ రికార్డులను అనుసరించి సలహాలు ఇస్తున్నామన్న అధికారులు
  • ఏఐ వినియోగంతో ప్రజారోగ్య సేవలను మరింత మెరుగుపరిచేలా చూస్తున్నామన్న సీఎం
  • బయో డిజైన్ ద్వారా వైద్య సేవలు అందించే విధానాలను అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్
  • డయాగ్నోస్టిక్ సేవలు తక్కువ వ్యయానికే అందితే పేదలకు వెసులుబాటు ఉంటుందన్న గేట్స్
  • ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ వివరాలను అడిగి తెలుసుకున్న బిల్ గేట్స్
  • రాజధానిలో 30 శాతం గ్రీన్ అండ్ బ్లూ ప్రణాళిక బాగుందంటూ బిల్ గేట్స్ వ్యాఖ్య
  • రాజధాని నిర్మాణ తీరును బిల్ గేట్స్‌కు వివరించిన సీఎం.. గ్రేట్ వర్క్ అంటూ గేట్స్‌ కితాబు

11:38 AM, 16 Feb 2026 (IST)

  • చంద్రబాబును చూడగానే ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్
  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం
  • మంత్రులను బిల్ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం చంద్రబాబు

11:23 AM, 16 Feb 2026 (IST)

బిల్‌ గేట్స్‌ అమరావతి రాకపై ట్వీట్‌ చేసిన సీఎం చంద్రబాబు

  • బిల్‌ గేట్స్‌ అమరావతి రాకపై ట్వీట్‌ చేసిన సీఎం చంద్రబాబు
  • బిల్‌ గేట్స్‌కు స్వాగతమంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టిన చంద్రబాబు
  • బిల్‌ గేట్స్‌కు ఏపీ సాదర స్వాగతం పలుకుతుందంటూ సీఎం ట్వీట్‌

11:23 AM, 16 Feb 2026 (IST)

చంద్రబాబును చూడగానే ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్

  • చంద్రబాబును చూడగానే ఆత్మీయంగా పలకరించిన బిల్ గేట్స్
  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ను బిల్ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం
  • మంత్రులను బిల్ గేట్స్‌కు పరిచయం చేసిన సీఎం చంద్రబాబు

11:23 AM, 16 Feb 2026 (IST)

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌తో బిల్‌ గేట్స్ భేటీ

  • అమరావతి సచివాలయానికి గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌తో బిల్‌ గేట్స్ భేటీ
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ
  • ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించిన బిల్‌ గేట్స్
  • ఆర్టీజీఎస్‌ విధానాలు, ఫలితాలను బిల్‌ గేట్స్‌కు వివరించిన సీఎం చంద్రబాబు
  • గేట్స్ బృందంతో సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారుల భేటీ
  • సమావేశానికి హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు లోకేష్, పయ్యావుల
  • సమావేశానికి హాజరైన అచ్చెన్న, గొట్టిపాటి, డీఎస్‌బీవీ స్వామి, సవిత, అనిత
  • సమావేశానికి హాజరైన కొల్లు రవీంద్ర, దుర్గేష్, పార్థసారథి, నిమ్మల, అనగాని
  • సమావేశానికి హాజరైన బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్, సంధ్యారాణి, నారాయణ
  • స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్
  • ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య సహా తదితర రంగాల్లో సంస్కరణలపై ప్రజెంటేషన్
  • మెడ్‌టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సంజీవని ప్రాజెక్టులను వివరించిన సీఎం
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టును వివరించిన ప్రభుత్వం

10:29 AM, 16 Feb 2026 (IST)

గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సచివాలయంలో చర్చలు సాగుతున్నాయి: లోకేష్‌

  • గేట్స్ ఫౌండేషన్ ఛైర్మన్ బిల్ గేట్స్‌తో సచివాలయంలో చర్చలు సాగుతున్నాయి: లోకేష్‌
  • ఆరోగ్యం, వ్యవసాయం, విద్య రంగాల బలోపేతం చేసే అంశాలపై చర్చ: లోకేష్‌
  • సాంకేతిక ఆధారిత పరిపాలన రంగంలో భాగస్వామ్యాల బలోపేతంపై చర్చ: లోకేష్‌
  • ప్రజలకు స్థిరమైన, విస్తృత ప్రభావం కలిగించే పరిష్కారాలను అందించేందుకు సహకారం: లోకేష్‌
  • గేట్స్ ఫౌండేషన్‌తో సన్నిహితంగా పనిచేయడానికి ఆంధ్రప్రదేశ్ ఎదురుచూస్తోంది: లోకేష్‌
  • బిల్ గేట్స్‌కు అమరావతి స్వాగతం పలుకుతోంది: మంత్రి నారా లోకేష్‌
  • సహచర మంత్రులతో కలిసి విమానాశ్రయంలో స్వాగతించడం ఆనందంగా ఉంది: లోకేష్‌
CM With gates
బిల్​గేట్స్​తో సీఎం చంద్రబాబు భేటీ (ETV Bharat)

9:47 AM, 16 Feb 2026 (IST)

అమరావతి సచివాలయానికి గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌

  • అమరావతి సచివాలయానికి గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి లోకేష్‌తో బిల్‌ గేట్స్ భేటీ
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ
  • ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించనున్న బిల్‌ గేట్స్
  • ఆర్టీజీఎస్‌ విధానాలు, ఫలితాలను బిల్‌ గేట్స్‌కు వివరించనున్న సీఎం చంద్రబాబు
Cm
బిల్​గేట్స్​కు స్వాగతం పలుకుతున్న సీఎం (ETV Bharat)

9:47 AM, 16 Feb 2026 (IST)

సచివాలయానికి చేరుకున్న గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌

  • సచివాలయానికి చేరుకున్న గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌
  • ఎయిర్‌పోర్టు నుంచి బిల్‌ గేట్స్‌ను దగ్గరుండి సచివాలయానికి తీసుకొచ్చిన లోకేష్
  • బిల్ గేట్స్‌కు స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు

9:06 AM, 16 Feb 2026 (IST)

సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు

  • సచివాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
  • కాసేపట్లో బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు
  • ఇప్పటికే సచివాలయానికి చేరుకున్న మంత్రులు
  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్‌తో సమావేశం కానున్న బిల్‌ గేట్స్
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో చేపట్టిన ప్రాజెక్టులను విస్తరించే అంశంపై చర్చ
  • ఆర్టీజీఎస్‌కు వెళ్లి పాలనలో సాంకేతిక వినియోగాన్ని పరిశీలించనున్న బిల్‌ గేట్స్
  • ఆర్టీజీఎస్‌ విధానాలు, ఫలితాలను బిల్‌ గేట్స్‌కు వివరించనున్న సీఎం చంద్రబాబు
  • గేట్స్ బృందంతో భేటీకానున్న సీఎం, మంత్రులు, వివిధ శాఖల అధికారులు
  • స్వర్ణాంధ్ర విజన్-2047 లక్ష్యాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఎం చంద్రబాబు
  • ప్రజారోగ్యం, వ్యవసాయం, విద్య సహా తదితర రంగాల్లో సంస్కరణలపై ప్రజెంటేషన్
  • మెడ్‌టెక్, డయాగ్నోస్టిక్స్ సేవలు, సంజీవని ప్రాజెక్టులను వివరించనున్న సీఎం
  • గేట్స్ ఫౌండేషన్ సహకారంతో నడుస్తున్న సంజీవని ప్రాజెక్టును వివరించనున్న ప్రభుత్వం
  • అమరావతిలో ఉండవల్లి వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లనున్న బిల్‌ గేట్స్
  • వ్యవసాయంలో డ్రోన్లు, ఏఐతో చేపట్టే సాగు విధానాన్ని పరిశీలించనున్న బిల్‌ గేట్స్
satyakumar yadav
పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి సత్యకుమార్​ యాదవ్​ (ETV Bharat)

9:06 AM, 16 Feb 2026 (IST)

అమరావతి చేరుకున్న గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌

  • అమరావతి చేరుకున్న గేట్స్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక ఛైర్మన్‌ బిల్‌ గేట్స్‌
  • విమానాశ్రయంలో బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికిన మంత్రి నారా లోకేష్‌
  • బిల్ గేట్స్‌కు మంగళగిరి శాలువా కప్పి సాదర స్వాగతం పలికిన లోకేష్
  • లోకేష్‌తో పాటు బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికిన అనిత, అచ్చెన్న, సత్యకుమార్‌
  • విమానాశ్రయం నుంచి సచివాలయానికి బయల్దేరిన బిల్‌ గేట్స్‌ బృందం
home minister anitha
స్వాగతం పలుకుతున్న హోం మంత్రి అనిత (ETV Bharat)

9:05 AM, 16 Feb 2026 (IST)

గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్‌ గేట్స్‌

  • గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్‌ గేట్స్‌
  • పొగమంచు వల్ల కొద్దిసేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన బిల్‌ గేట్స్‌ విమానం
  • క్లియరెన్స్‌ లభించడంతో విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన బిల్‌ గేట్స్‌ విమానం
  • బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికిన కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
  • బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికి సచివాలయానికి బయల్దేరిన లోకేష్‌
  • సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలకనున్న సీఎం
lokesh
పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి లోకేశ్​ (ETV Bharat)

9:05 AM, 16 Feb 2026 (IST)

గన్నవరం: బిల్‌గేట్స్‌ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం

  • గన్నవరం: బిల్‌గేట్స్‌ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం
  • గన్నవరం: గాలిలో చక్కర్లు కొడుతున్న బిల్‌గేట్స్‌ ప్రత్యేక విమానం
  • పొగమంచు వల్ల గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అంతరాయం
  • బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
  • బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికేందుకు విమానాశ్రయం లాంజ్‌లో వేచి ఉన్న లోకేష్
  • బిల్‌గేట్స్‌ను దగ్గరుండి సచివాలయం తీసుకురానున్న మంత్రి లోకేష్
  • సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్‌గేట్స్‌కు స్వాగతం పలకనున్న సీఎం చంద్రబాబు
minister
బిల్​గేట్స్​కు పుష్పగుచ్ఛం అందిస్తున్న మంత్రి అచ్చెన్నాయుడు (ETV Bharat)

9:04 AM, 16 Feb 2026 (IST)

టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు: సీఎం

  • టీ20 ప్రపంచకప్‌లో విజయం సాధించిన టీమిండియాకు అభినందనలు: సీఎం
  • ఇషాన్ కిషన్ అద్భుత బ్యాటింగ్‌తో మ్యాచ్‌ను నడిపించారు: సీఎం చంద్రబాబు
  • ఇదే జోష్, ఇదే పట్టుదలతో టోర్నమెంట్ మొత్తం కొనసాగాలని కోరుకుంటున్నా: సీఎం

9:04 AM, 16 Feb 2026 (IST)

తొమ్మిదో రోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

  • శ్రీశైలంలో తొమ్మిదో రోజుకు చేరుకున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
  • సాయంత్రం 5 గంటలకు స్వామి అమ్మవార్లకు ఆలయ ప్రధాన పురవీధిలో రథోత్సవం
  • రాత్రి 8 గంటలకు ఆలయ పుష్కరిణిలో స్వామి అమ్మవార్లకు తెప్పోత్సవం
  • శ్రీశైలంలో నేత్రపర్వంగా సాగిన మహా శివరాత్రి ఉత్సవాలు
  • శివరాత్రి సందర్భంగా అర్ధరాత్రి ఘనంగా స్వామివారి కల్యాణ ఘట్టం
  • స్వామి అమ్మవార్లకు వైభవంగా బ్రహ్మోత్సవ కల్యాణం

9:03 AM, 16 Feb 2026 (IST)

శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లింగోద్భవ దర్శనం

  • వాయు లింగేశ్వరస్వామి, ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్న లక్షమందికి పైగా భక్తులు
  • ఒక్కరోజులో దర్శనం టికెట్లతో రూ.55 లక్షల ఆదాయం
  • ఉదయం 10 గంటలకు మాడవీధుల్లో రథోత్సవంలో విహరించనున్న ఆదిదంపతులు
  • నేడు శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్థానికులకు ఉచిత దర్శనం

9:03 AM, 16 Feb 2026 (IST)

తిరుమల సర్వదర్శనానికి 10 గంటల సమయం

  • తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 10 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి 18 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • నిన్న శ్రీవారిని దర్శించుకున్న 80,502 మంది భక్తులు
  • నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.74 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,608 మంది భక్తులు

9:03 AM, 16 Feb 2026 (IST)

గ్యాస్ లీక్ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి

  • మన్యం జిల్లా బలిజిపేట గ్యాస్ లీక్ ఘటనపై కలెక్టర్‌తో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి
  • ఘటనకు కారణాలు ఆరా తీసి విచారణకు ఆదేశించిన మంత్రి
  • అస్వస్థతకు గురైనవారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశం
  • పరిస్థితిని ఎప్పటికప్పుడు నివేదించాలని అధికారులకు సూచించిన సంధ్యారాణి

9:03 AM, 16 Feb 2026 (IST)

విశాఖ తీరానికి పోటెత్తిన భక్తులు

  • విశాఖ ఆర్కే బీచ్‌కు పోటెత్తిన భక్తులు
  • సముద్ర స్నానాలు ఆచరిస్తున్న వందలాది భక్తులు
  • శివరాత్రి జాగారం ముగించి పూజలు చేస్తున్న భక్తులు

9:02 AM, 16 Feb 2026 (IST)

బిల్‌గేట్స్‌ బృందం ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం

  • బిల్‌గేట్స్‌ ప్రత్యేక విమానం ల్యాండింగ్‌కు అంతరాయం
  • గాలిలో చక్కర్లు కొడుతున్న బిల్‌గేట్స్‌ ప్రత్యేక విమానం
  • పొగమంచు వల్ల గన్నవరం విమానాశ్రయంలో ల్యాండింగ్‌కు అంతరాయం
  • బిల్‌గేట్స్‌కు స్వాగతం పలికేందుకు వచ్చిన కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
  • ఈరోజు ఉదయం 10 గంటలకు సచివాలయానికి రానున్న బిల్ గేట్స్
  • అనంతరం ఆర్‌టీజీఎస్‌లో సాంకేతికత వినియోగాన్ని పరిశీలించనున్న బిల్‌ గేట్స్‌

9:02 AM, 16 Feb 2026 (IST)

సురక్షితంగా గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న బిల్‌ గేట్స్‌

  • పొగమంచు వల్ల కొద్దిసేపు గాలిలోనే చక్కర్లు కొట్టిన బిల్‌ గేట్స్‌ విమానం
  • క్లియరెన్స్‌ లభించడంతో విమానాశ్రయంలో ల్యాండ్‌ అయిన బిల్‌ గేట్స్‌ విమానం
  • బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికిన కలెక్టర్‌, ఎస్పీ, ప్రజాప్రతినిధులు
  • బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలికి సచివాలయానికి బయల్దేరిన లోకేశ్​
  • సచివాలయం మొదటి బ్లాక్ వద్ద బిల్‌ గేట్స్‌కు స్వాగతం పలకనున్న సీఎం
bill gates
విమానాశ్రయంలో బిల్​గేట్స్​ (ETV Bharat)
Last Updated : February 16, 2026 at 10:02 PM IST