27 February 2026 Andhra Pradesh News Today Live Updates: పవన్ కార్యాలయంలోకి చొరబాటు, వాహనాలపై దాడి ఘటనపై కేసు
27 February 2026 Andhra Pradesh News Today Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 27, 2026 at 6:58 AM IST
|Updated : February 27, 2026 at 10:52 PM IST
27 February 2026 Andhra Pradesh News Today Live Updates: నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ప్రమాదం, ముగ్గురు మృతి - వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత మరోసారి సీబీఐ విచారణ - వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
LIVE FEED
పవన్ కార్యాలయంలోకి చొరబాటు, వాహనాలపై దాడి ఘటనపై కేసు
- పవన్ కార్యాలయంలోకి చొరబాటు, వాహనాలపై దాడి ఘటనపై కేసు
- పవన్ ముఖ్య భద్రతాధికారి పెంటారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు
- నిందితుడు నీలాద్రిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు
- దాడికి పాల్పడిన నీలాద్రిని అరెస్టు చేసి ప్రశ్నిస్తున్న మంగళగిరి పోలీసులు
అదుపులోకి వచ్చిన అతిసారం
- శ్రీకాకుళం నగరపాలకసంస్థ పరిధిలో అదుపులోకి వచ్చిన అతిసారం
- తాగునీటి నమూనాల్లో ఈకోలి బ్యాక్టీరియా ఉన్నట్లు నిర్ధరణ
- డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆరోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్
- నగరపాలకసంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించిన వీరపాండియన్
రాజధానిలో నిర్మిస్తున్న శాసనసభ భవనం లోపలి పనుల కోసం నిధులు
- రాజధానిలో నిర్మిస్తున్న శాసనసభ భవనం లోపలి పనుల కోసం నిధులు
- భవనంలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, ఫైర్‌ఫైటింగ్, లిఫ్ట్‌ల ఏర్పాటుకు నిధులు
- డిటెక్షన్, పబ్లిక్‌అడ్రస్ సిస్టమ్, స్ట్రక్చర్డ్ కేబులింగ్ సిస్టం, ప్లంబింగ్ పనులకు నిధులు
- అన్ని పనులకు రూ.424 కోట్లు మంజూరుకు పాలనాపరమైన అనుమతిస్తూ ఆదేశాలు
- టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలని ఏజీఐసీఎల్ ఎండీకి ఆదేశం
- తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశం
రాజధానిలో హైకోర్టు భవనం పనుల కోసం నిధులు మంజూరు
- రాజధానిలో హైకోర్టు భవనం పనుల కోసం నిధులు మంజూరు
- భవనంలో విద్యుత్, అగ్నిమాపక, లిఫ్ట్‌లు, ప్లంబింగ్ పనుల కోసం నిధులు
- పనులకు రూ.556 కోట్ల మొత్తానికి పరిపాలనా అనుమతిస్తూ ఉత్తర్వులు
- టెండర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం
- తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్‌డీఎ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశం
ముంబయిలో సంజయ్‌దత్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: లోకేష్
- ముంబయిలో సంజయ్‌దత్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉంది: లోకేష్
- ఏపీలో సమగ్ర సినీ షూటింగ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంపై ఉత్సాహంగా ఉన్నా: లోకేష్
- షూటింగ్‌లకు సింగిల్ విండో అనుమతి విధానం అమలుపై చర్చించాం: లోకేష్
- ఏపీలో కొత్త ఫిల్మ్ సిటీ ఏర్పాటు చేసే అవకాశాలపై చర్చించాం: లోకేష్
కోటి రూపాయలు విరాళం
- తిరుమల: ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళం
- విరాళం అందించిన హైదరాబాద్ భక్తురాలు రాచమల్లు వెంకట సుజాత
- రూ.కోటి చెక్కును టీటీడీ ఛైర్మన్ బి.ఆర్.నాయుడుకు అందించిన దాత
సౌందర్‌రాజన్ మృతి విచారకరం
- చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకుడు సౌందర్‌రాజన్ మృతి విచారకరం: సీఎం
- సౌందర్‌రాజన్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి: సీఎం చంద్రబాబు
- సౌందర్‌రాజన్ ఆధ్యాత్మిక సేవలు చిరస్మరణీయం: సీఎం చంద్రబాబు
- ఆలయాల సంప్రదాయాలను, స్వతంత్రతను కాపాడేందుకు కృషి చేశారు: సీఎం
14, 15 ఏళ్లు వయసున్న బాలికలకు ఉచితంగా టీకా
- రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి బాలికలకు ఉచిత హెచ్‌పీవీ టీకా పంపిణీ
- చీపురుపల్లిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
- 14, 15 ఏళ్లు వయసున్న 3.45 లక్షల మంది బాలికలకు ఉచితంగా టీకా
- సర్వైకల్ క్యాన్సర్ కేసుల కట్టడి చర్యల్లో భాగంగా టీకాలు
- రాష్ట్రవ్యాప్తంగా 1,645 ఆరోగ్య కేంద్రాల ద్వారా టీకా పంపిణీ
- వ్యాక్సినేషన్‌కు రూ.14.11 కోట్లు వ్యయం: మంత్రి సత్యకుమార్
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
- కడప జిల్లా: ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ, ఇద్దరు మృతి
- బ్రహ్మంగారిమఠం మండలం నందిపల్లె సమీపంలో ప్రమాదం
త్వరగా కోలుకోవాలి
- బొత్స సత్యనారాయణ త్వరగా కోలుకోవాలి: పవన్‌కల్యాణ్
- బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారని తెలిసి బాధపడ్డాను: పవన్
- ఆయనకు ఆయురారోగ్యాలు అందించాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా: పవన్
సెక్యూరిటీపై తీవ్ర విమర్శలు
- గుంటూరు: పవన్ కల్యాణ్‌తో ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్‌చంద్ర లడ్డా భేటీ
- మంగళగిరి క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసిన లడ్డా
- ఉదయం అనుమతి లేకుండా పవన్ క్యాంపు కార్యాలయంలోకి వచ్చిన వ్యక్తి
- భద్రతా వలయాన్ని దాటి లోపలకు రావటంతో సెక్యూరిటీపై తీవ్ర విమర్శలు
స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలన
- ఉండవల్లిలోని స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ
- సీడ్ యాక్సిస్ రోడ్డును పాత గుంటూరు హైవేకు కలిపేలా స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం
- కాంక్రీట్ పిల్లర్లపై స్టీల్ గడ్డర్ల ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్న నారాయణ
- మొత్తం 88 గడ్డర్లకు గాను 20 గడ్డర్లు పూర్తయ్యాయని తెలిపిన ఇంజినీర్లు
- స్టీల్ బ్రిడ్జ్ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని సూచించిన మంత్రి
పులివెందులలో సీబీఐ విచారణ
- పులివెందులలో సీబీఐ విచారణకు హాజరైన కిరణ్ యాదవ్
- సోదరుడు సునీల్ యాదవ్‌తో కలిసి వచ్చిన కిరణ్ యాదవ్
- కిరణ్ యాదవ్‌ను మాత్రమే ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
- కిరణ్ యాదవ్-అర్జున్ రెడ్డి ఫోన్ సంభాషణపై ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
- వివేకా హత్య జరిగిన రోజు అర్జున్ రెడ్డికి కిరణ్ ఫోన్ చేసినట్లు ఆధారాలు సేకరణ
- ఫోన్ డేటా ఆధారంగా కిరణ్ యాదవ్‌ను ప్రశ్నిస్తున్న సీబీఐ అధికారులు
- సీబీఐ విచారణ ముగించుకుని వెళ్లిపోయిన మహేంద్ర యాదవ్
- కిరణ్ యాదవ్, మహేంద్ర యాదవ్ మధ్య ఫోన్ సంభాషణలపై ప్రశ్నించిన సీబీఐ
- కిరణ్ ఎందుకు కాల్ చేశాడని మహేంద్రను ప్రశ్నించిన సీబీఐ అధికారులు
- కిరణ్ బంధువు కావడంతో ఫోన్‌లో మాట్లాడుకున్నామన్న మహేంద్ర
- ఇప్పుడు వారితో సంబంధాలు లేవు.. అదే విషయం సీబీఐకి చెప్పానన్న మహేంద్ర
- కిరణ్ నాకు ఫోన్ చేశాడు.. కాల్ డేటా ఆధారంగా తనను ప్రశ్నించారన్న మహేంద్ర
మెరుగైన వైద్యం అందించాలి
- మన్యం జిల్లా కలెక్టర్, ఐటీడీఏ పీవోతో మాట్లాడిన మంత్రి సంధ్యారాణి
- అస్వస్థతకు గురైన నలుగురు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- అస్వస్థత ఘటనపై పూర్తి విచారణ చేయాలని అధికారులకు మంత్రి ఆదేశం
- ఇంటినుంచి తెచ్చుకున్న పచ్చళ్లే విరేచనాలకు కారణమన్న అధికారులు
- తల్లిదండ్రులు, సందర్శకులు తెచ్చే ఆహార పదార్థాలు తనిఖీ చేయాలన్న మంత్రి
- వ్యవసాయ, మత్స్యకారుల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడిన గౌతు శిరీష
- జీడిపప్పుకు గిట్టుబాటు ధర ప్రకటించాలని కోరిన గౌతు శిరీష
- వజ్రపుకొత్తూరులో జెట్టీ పనులు ప్రారంభించేలా చూడాలన్న గౌతు శిరీష
వాయిదా
- శాసనసభ మార్చి 4వ తేదీకి వాయిదా
వ్యవసాయరంగ బడ్జెట్‌పై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రసంగం
- వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను ప్రోత్సహిస్తున్నాం: సీఎం
- రైతులకు ఆధునిక పరికరాలను పరిచయం ప్రోత్సహిస్తున్నాం: సీఎం
- ఫుడ్ ప్రాసెసింగ్‌పై అధిక దృష్టి పెట్టాం: సీఎం చంద్రబాబు
- ప్రకృతి సేద్యాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరిస్తాం: సీఎం చంద్రబాబు
- రాయలసీమలో 20 లక్షల ఎకరాల్లో హార్టీకల్చర్ సాగు అవుతోంది: సీఎం
- దేశంలోనే అత్యధిక పండ్లు పండే ప్రాంతంగా రాయలసీమ ఉంది: సీఎం
- రాయలసీమలో హార్టీకల్చర్‌ను 40 లక్షల ఎకరాలకు పెంచుతాం: సీఎం
- రాయలసీమ హార్టీకల్చర్‌కు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి: సీఎం
- ఏలూరు దగ్గర అతిపెద్ద కోకో సిటీ వస్తుంది: సీఎం చంద్రబాబు
- ఏజెన్సీలో కాఫీ పంట విస్తీర్ణం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
- ఆక్వా ఉత్పత్తిలో దేశంలోనే తొలి స్థానంలో ఉన్నాం: సీఎం చంద్రబాబు
- అతిపెద్ద ఆక్వా కల్చర్ హబ్‌గా మన రాష్ట్రం తయారవుతుంది: చంద్రబాబు
- సమర్థ నీటి నిర్వహణ వల్ల భూగర్భ జలాలు పెరుగుతున్నాయి: సీఎం
- రైతులకు పూర్తిగా అండగా ఉంటాం: సీఎం చంద్రబాబు
- ఒకే రకం పంట వేయడం వల్ల రైతులు బాగా నష్టపోతున్నారు: చంద్రబాబు
- రైతులు ముందే మాట్లాడుకుని భిన్నమైన పంటలు వేయాలి: చంద్రబాబు
- 2029లోగా అందరికీ ఇంటిస్థలాలు ఇవ్వాలనేది మా లక్ష్యం: చంద్రబాబు
- ఇంటిస్థలాలు దొరకనిచోట అపార్ట్‌మెంట్లు కట్టి ఇళ్లు ఇస్తాం: చంద్రబాబు
- ఈ ఏడాదిలోనే 10.64 లక్షల ఇళ్లు పూర్తి చేసి గృహప్రవేశం చేయిస్తాం: చంద్రబాబు
- ఇళ్లు లేని వారంతా దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాం: చంద్రబాబు
- పేదలకు ఇళ్లు పూర్తి చేసి ఇచ్చి భద్రత, భరోసా కల్పిస్తాం: చంద్రబాబు
- పేదల ఇళ్ల విషయంలో రాజకీయాలు చేయడం సరికాదు: చంద్రబాబు
పులివెందుల పీఎస్‌కు సీబీఐ అధికారులు
- కడప: పులివెందుల పీఎస్‌కు చేరుకున్న సీబీఐ అధికారులు
- వివేకా హత్య కేసులో రెండేళ్ల తర్వాత మరోసారి సీబీఐ విచారణ
- విచారణకు రావాలని ముగ్గురు వ్యక్తులకు నోటీసులు ఇచ్చిన సీబీఐ
- సునీల్‌యాదవ్ సోదరుడు కిరణ్‌కుమార్ యాదవ్‌కు నోటీసులు ఇచ్చిన సీబీఐ
- భరత్‌కుమార్ సోదరుడు మహేంద్ర యాదవ్‌కు నోటీసులు ఇచ్చిన సీబీఐ
- విచారణకు హాజరైన మహేంద్ర యాదవ్, కాసేపట్లో రానున్న కిరణ్ యాదవ్
- సుప్రీంకోర్టు సూచనల మేరకు కిరణ్ యాదవ్-అర్జున్ రెడ్డి కాల్ డేటాపై విచారణ
- వివేకా హత్య జరిగిన రోజే అర్జున్ రెడ్డికి వాట్సప్ కాల్ చేసిన కిరణ్ యాదవ్
- వీరిద్దరి ఫోన్ సంభాషణపై విచారణ చేయనున్న సీబీఐ అధికారులు
వ్యక్తి హత్య
- తూ.గో.: రంగంపేట మండలం దొడ్డిగుంటలో వ్యక్తి హత్య
- నాగేంద్ర అనే వ్యక్తిపై ఆయుధంతో దాడి చేసి చంపిన శివ అనే వ్యక్తి
- నాగేంద్రను చంపాక పురుగులమందు తాగిన శివ, ఆస్పత్రిలో చికిత్స
- ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రంగంపేట పోలీసులు
- హత్యకు వివాహేతర సంబంధమే కారణమని తెలిపిన పోలీసులు
- నాగేంద్ర హత్యలో అతడి భార్య పాత్ర ఉందన్న మృతుడి బంధువులు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
- నంద్యాల జిల్లా డోన్ జాతీయ రహదారిపై ప్రమాదం, ముగ్గురు మృతి
- జగదుర్తి వద్ద క్రేన్‌ను ఢీకొట్టిన కారు, అక్కడికక్కడే ముగ్గురు మృతి
- బెంగళూరుకు చెందిన ప్రమోద్ కుటుంబంతో కలిసి తిరుపతికి వస్తుండగా ఘటన
- నంద్యాల జిల్లా: ప్రమాదంలో ప్రమోద్ భార్య, కుమారుడు, కుమార్తె మృతి
- తీవ్రంగా గాయపడిన ప్రమోద్‌ను ఆస్పత్రికి తరలించిన స్థానికులు
బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
- వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్
- హైదరాబాద్‌కు బొత్స సత్యనారాయణ తరలింపు
- సిటీ న్యూరో సెంటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న చికిత్స
- నిన్న రాత్రి సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరిన బొత్స సత్యనారాయణ
- ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉందన్న వైద్యులు
- బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురవడం విచారకరం: పల్లా శ్రీనివాసరావు
- బొత్స త్వరగా కోలుకుని ప్రజాజీవితంలోకి తిరిగి రావాలని ఆకాంక్ష: పల్లా శ్రీనివాసరావు
కోల్‌కతాలో భూకంపం
- కోల్‌కతాలో భూకంపం
- రిక్టర్‌స్కేల్‌పై తీవ్రత 5గా నమోదు
- బంగ్లాదేశ్‌లో భూకంప కేంద్రం
జీతం వస్తుంది.. సంతృప్తి పడాలి
- 2018 గ్రూప్-1 అధికారులకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
- హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను సవాల్ చేస్తూ గ్రూప్-1 అధికారుల పిటిషన్
- అప్రాధాన్య పోస్టులకు బదిలీ చేయాలన్న ఆదేశాలను సవాల్ చేసిన అధికారులు
- గ్రూప్-1 అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
- డివిజన్ బెంచ్ ఉత్తర్వులు సరిగానే ఉన్నాయన్న సుప్రీంకోర్టు
- ప్రాధాన్య పోస్టులు లేకపోతే ఉద్యోగాలు చేయలేరా?: సుప్రీంకోర్టు
- ఎక్కడ ఉన్నా జీతం వస్తుంది.. సంతృప్తి పడాలన్న ధర్మాసనం
వ్యక్తిని గుర్తించిన పోలీసులు
- జనసేన కార్యాలయంలో చొరబడిన వ్యక్తిని గుర్తించిన పోలీసులు
- శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన నీలాద్రిగా గుర్తింపు
- ఉదయం 9.30 గంటల సమయంలో జరిగిన ఘటన
వివాహ ఆహ్వానం
- సీఎం చంద్రబాబును కలిసిన తెలంగాణ మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు
- తన కుమారుడి వివాహానికి చంద్రబాబును ఆహ్వానించిన భట్టి విక్రమార్క
మండలి బుధవారానికి వాయిదా
- విరామం అనంతరం తిరిగి ప్రారంభమైన శాసనమండలి
- తిరుమల లడ్డూపై చర్చించాలని సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
- సభను బుధవారానికి వాయిదా వేసిన శాసనమండలి ఛైర్మన్
- ప్రశ్నోత్తరాలు, వ్యవసాయంపై చర్చ జరగకుండానే మండలి సమావేశం వాయిదా
రిమాండ్ పొడిగింపు
- ఏపీ మద్యం కేసులో నిందితులకు మార్చి 13 వరకు రిమాండ్ పొడిగింపు
- నేటితో రిమాండ్ గడువు ముగియడంతో కోర్టులో హాజరు
- విచారణ జరిపిన ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ
రాష్ట్రానికి రానున్న మరో కీలక కంపెనీ
- స్టీల్ కర్మాగారం ఏర్పాటు చేయనున్న ప్రొటీరియల్ సంస్థ
- మెట్‌గ్లాస్ ఇండియా పేరుతో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటన
- శ్రీసిటీలో కర్మాగారం ఏర్పాటు చేయనున్న ప్రొటీరియల్ సంస్థ
- అల్లాయ్ రిబ్బన్‌ను ఉత్పత్తి చేయనున్న ప్రొటీరియల్ సంస్థ
- తొలిదశలో 77 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్న సంస్థ
- అక్టోబర్ నుంచి కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సీఈఓ వెల్లడి
- అధునాతన జపాన్ టెక్నాలజీని వాడనున్నట్టు తెలిపిన సీఈవో
- తొలిదశలో ఏటా 30వేల టన్నులు ఉత్పత్తి చేయనున్న ప్లాంట్
బంగారం నేటి ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర (Gold Rate) రూ.1,57,200
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,44,620
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,72,000
శాసనమండలిలో తిరుమల లడ్డూపై ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
- శాసనమండలిలో తిరుమల లడ్డూ (Laddu Adulteration)పై ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం
- రూల్ 306 కింద ప్రభుత్వం ప్రకటన చేస్తుందని నోటీసు ఇచ్చిన మంత్రి ఆనం
- మండలి ఛైర్మన్‌ను కలిసిన మంత్రులు అచ్చెన్న, మనోహర్, సత్యప్రసాద్
- ప్రకటన ఇచ్చేందుకు సిద్ధమని రాతపూర్వకంగా లేఖ ఇచ్చిన మంత్రులు
- ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరిన మంత్రులు
తెలంగాణ ప్రజలకు నేను మొదట్నుంచి చెప్తున్నాను: కవిత
- తెలంగాణ ప్రజలకు నేను మొదట్నుంచి చెప్తున్నాను: కవిత
- కడిగిన ముత్యం వలే బయటికి వస్తానని అప్పుడే చెప్పాను: కవిత
- న్యాయవ్యవస్థపై నేను పెట్టుకున్న నమ్మకం నిలబడింది: కవిత
- ఇది కేవలం రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని ఎన్నోసార్లు చెప్పా: కవిత
- ఈ కేసు వల్ల నేను, నా కుటుంబం కొన్ని నెలలపాటు క్షోభ అనుభవించాం: కవిత
- నా కష్టసమయంలో నాకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు: కవిత
- మరింత ఉత్సాహంతో ప్రజలకు సేవ చేస్తా: కవిత
అయేషామీరా అవశేషాలు తల్లిదండ్రులకు అప్పగింత
- కోర్టు ఆదేశాలతో అయేషామీరా (Ayesha Meera) అవశేషాలను తల్లిదండ్రులకు అప్పగించిన అధికారులు
- కోర్టు ప్రాంగణం నుంచి ర్యాలీగా బయల్దేరిన అయేషా తల్లిదండ్రులు
- ర్యాలీకి అనుమతి లేదని, నేరుగా తెనాలి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేసిన పోలీసులు
- అయేషా మీరా అస్థికలతో కోర్టు నుంచి బందర్‌రోడ్డులో అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ
- అస్థికలు తీసుకొని తెనాలి బయల్దేరిన అయేషా మీరా తల్లిదండ్రులు
- తెనాలి ముస్లిం శ్మశానవాటికలో అంత్యక్రియలకు ఏర్పాట్లు
- కోర్టు ఆదేశాలతో ప్రభుత్వం తరఫున అంత్యక్రియలకు ఏర్పాట్లు
నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణిని విచారిస్తున్న పోలీసులు
- నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో కాకాణిని (YSRCP Leader Kakani Govardhan Reddy) విచారిస్తున్న పోలీసులు
- కోవూరు పరిధిలోని గుమ్మళ్లదిబ్బలో బాలిక మృతిపై నిరాధార ఆరోపణల కేసులో విచారణ
- నిరాధార ఆరోపణలు చేశారని కోవూరు పీఎస్‌లో కాకాణిపై కేసు నమోదు
- డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్, కోవూరు సీఐ సుధాకర్‌రెడ్డి విచారణ
మంగళగిరి జనసేన కార్యాలయంలోకి చొరబడిన అజ్ఞాత వ్యక్తి
- మంగళగిరి జనసేన కార్యాలయం (Janasena Party)లోకి చొరబడిన అజ్ఞాత వ్యక్తి
- కార్యాలయ ప్రాంగణంలో కార్ల అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తి
- వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించిన భద్రతా సిబ్బంది
- మంగళగిరి పోలీసుస్టేషన్‌కు వచ్చిన జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
మీడియా ముందు కన్నీటిపర్యంతమైన కేజ్రీవాల్
- దిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు భారీ ఊరట
- దిల్లీ మద్యం పాలసీ కేసు (Delhi Liquor Case) నుంచి కేజ్రీవాల్‌ను డిశ్చార్జ్ చేసిన రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టు
- మీడియా ముందు కన్నీటిపర్యంతమైన కేజ్రీవాల్
- ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఐదుగురు నేతలను జైలులో పెట్టారు: కేజ్రీవాల్
- సీఎం, డిప్యూటీ సీఎం సహా ఐదుగురిని జైలులో పెట్టారు: కేజ్రీవాల్
- కేజ్రీవాల్ ఏనాడూ అవినీతికి పాల్పడలేదు: అరవింద్ కేజ్రీవాల్
- అవినీతికి వ్యతిరేకంగా పోరాడినవాళ్లం మేము: కేజ్రీవాల్
- కేవలం విపక్షాలపైనే ప్రధాని మోదీ దృష్టి పెట్టారు: కేజ్రీవాల్
- ప్రజల సమస్యలను ప్రధాని మోదీ ఏమాత్రం పట్టించుకోరు: కేజ్రీవాల్
- దిల్లీ మద్యం పాలసీ కేసులో కల్వకుంట్ల కవితకు ఊరట
- దిల్లీ మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్, మనీశ్ సిసోదియా, కవితకు విముక్తి
- నిందితుల పేర్లను డిశ్చార్జ్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు
- సరైన ఆధారాలు లేకుండానే కేసులో పేర్లు చేర్చారని సీబీఐపై కోర్టు ఆగ్రహం
- అభియోగాలు మోపిన 22 మందికి విముక్తి కల్పించిన రౌస్ అవెన్యూ కోర్టు
మండలి వాయిదా
- తిరుపతి లడ్డూ అంశంపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం
- తిరుపతి లడ్డూ అంశంపై శాసనమండలిలో చర్చ జరపాలని వైఎస్సార్సీపీ డిమాండ్
- చర్చ జరపాలని వాయిదా తీర్మానం ఇచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన మండలి ఛైర్మన్
- నిబంధనల మేరకు ప్రశ్నోత్తరాలను ప్రారంభించిన మండలి ఛైర్మన్
- తిరుపతి లడ్డూపై చర్చించాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలు
- సభ్యుల నినాదాల మధ్య సభను కాసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్
- కల్తీ నెయ్యి అంశంపై చర్చ విషయంలో మండలిలో గందరగోళం
- సభ్యుల నినాదాల మధ్య సభ కొద్దిసేపు వాయిదా వేసిన ఛైర్మన్
- సభ జరగకుండా పదేపదే అడ్డుకోవటం వైఎస్సార్సీరీకి అలవాటుగా మారింది: మంత్రి అచ్చెన్న
- కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైఎస్సార్సీపీ సభ్యులు భయపడుతున్నారు: మంత్రి అచ్చెన్న
- కల్తీ నెయ్యి అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి అచ్చెన్న
- తిరుపతి లడ్డూ అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం: మంత్రి అచ్చెన్న
- చర్చకు భయపడేది మేము కాదు... వైఎస్సార్సీపీ సభ్యులే: మంత్రి అచ్చెన్నాయుడు
- ఇంత అసమర్థ ప్రతిపక్షాన్ని నేనెప్పుడూ చూడలేదు: మంత్రి అచ్చెన్నాయుడు
కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు భయపడుతున్నారు: మంత్రి అచ్చెన్న
- కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు వైఎస్సార్సీపీ సభ్యులు భయపడుతున్నారు: మంత్రి అచ్చెన్న
- కల్తీ నెయ్యి అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి అచ్చెన్న
- తిరుపతి లడ్డూ అంశంపై ఎన్ని రోజులైనా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం: మంత్రి అచ్చెన్న
- చర్చకు భయపడేది మేము కాదు వైఎస్సార్సీపీ సభ్యులే: మంత్రి అచ్చెన్నాయుడు
అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి లోకేశ్
- అసెంబ్లీ: మనమిత్ర యాప్, వాట్సప్ గవర్నెన్స్‌పై మంత్రి లోకేశ్ సమాధానం
- వాట్సప్ గవర్నెన్స్ ద్వారా 943 రకాల సేవలు అందిస్తున్నాం: మంత్రి లోకేశ్
- ఇప్పటివరకు కోటి 40 లక్షలమంది సేవలు పొందారు: మంత్రి లోకేశ్
- వాట్సప్ గవర్నెన్స్‌కు కృత్తిమ మేథ జోడించి యూజర్ ఫ్రెండ్లీగా మార్చాం: మంత్రి లోకేశ్
- ఉన్న సౌకర్యాన్ని మన అవసరాల కోసం వినియోగించుకునేలా చేశాం: మంత్రి లోకేశ్
- యాప్‌ను మరింతగా ఆధునీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది: మంత్రి లోకేశ్
- వేగంగా స్పందించటం, రశీదు రావాలనే అంశాలపై దృష్టి సారిస్తాం: లోకేశ్
- సభ్యులు కూడా క్షేత్రస్థాయి పరిస్థితులపై ఫీడ్ బ్యాక్ ఇవ్వాలి: మంత్రి లోకేశ్
- మనమిత్ర 2.0ను కూడా ప్రారంభించాలని ఆలోచిస్తున్నాం: మంత్రి లోకేశ్
అన్నవరంలో ప్రేమవివాహం - ఆపై యువతి సోదరుల ఘాతుకం
- కోనసీమ జిల్లా మండపేట మండలం వేములపల్లిలో వ్యక్తి హత్య
- సూర్యప్రకాష్ అనే వ్యక్తిని రాళ్లతో కొట్టిచంపిన యువతి సోదరులు
- నిన్న సంధ్యను అన్నవరంలో ప్రేమవివాహం చేసుకున్న సూర్యప్రకాశ్
- డిప్యూటీ తహసీల్దార్‌గా పనిచేస్తున్న సంధ్యను ప్రేమపెళ్లి చేసుకున్న సూర్యప్రకాశ్
- రాత్రి వేములపల్లి గ్రామానికి ఇద్దరూ వస్తుండగా అడ్డగించిన సంధ్య సోదరులు
- బండరాయితో కొట్టి సూర్యప్రకాశ్‌ను హత్యచేసిన సంధ్య సోదరులు
ఐదు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తిని హత్య చేసిన దుండగులు
- అనకాపల్లి జిల్లా మాడుగుల మండలం జంపిన గ్రామంలో వ్యక్తి హత్య
- ఐదు హత్య కేసుల్లో ముద్దాయిగా ఉన్న ఉపేంద్రబాబును హత్య చేసిన దుండగులు
- విజయనగరం జిల్లాలో చోరీ కేసులో బెయిల్‌పై బయటకొచ్చిన ఉపేంద్రబాబు
- అర్ధరాత్రి దాటాక మారణాయుధాలతో ఉపేంద్రబాబును హత్యచేసిన దుండగులు
కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు
- తూర్పుగోదావరి జిల్లాలో వైభవంగా ప్రారంభమైన కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాలు
- నేటి నుంచి 5 రోజులపాటు స్వామి సన్నిధిలో విశేష పూజలు, ఆరాధనలు
- మధ్యాహ్నం లక్ష్మీనరసింహస్వామి రథోత్సవం, రాత్రికి కల్యాణోత్సవం
- అన్నవరం దేవస్థానానికి దత్తత ఆలయంగా ఉన్న కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయం
- అన్నవరం దేవస్థానం ఆధ్వర్యంలో భక్తులకు కొండపైన, దిగువన ఏర్పాట్లు
- తెల్లవారుజాము నుంచే కొండెక్కుతున్న భక్తులు, పొన్న చెట్టు దీపారాధనకు పూజలు
వద్ద బొలెరో వాహనం బోల్తా-20 మంది కూలీలకు గాయాలు
- కర్నూలు జిల్లా ఆస్పరి మండలం పుట్టకలమర్రి వద్ద బొలెరో వాహనం బోల్తా
- 20 మంది కూలీలకు గాయాలు, ఆసుపత్రికి తరలింపు
- వ్యవసాయ పనులకు వెళ్తున్న 50 మంది కూలీలు
'చర్చ అంటే రచ్చ చేసి సభ వాయిదా వేయించుకుని పారిపోతున్న వైఎస్సార్సీపీ నేతలు'
- చట్టసభల్లో ప్రజా సమస్యలపై చర్చ అంటేనే వైఎస్సార్సీపీ నేతలు పారిపోతున్నారు: మంత్రి సంధ్యారాణి
- తిరుమల ప్రసాదం కల్తీపై చర్చ పెడితే ధైర్యం లేక వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు సభకే రాలేదు: సంధ్యారాణి
- మండలిలో చర్చ అంటే రచ్చతో సభను వాయిదా వేయించుకుని పారిపోతున్నారు: సంధ్యారాణి
- వైఎస్సార్సీపీ చర్చ నుంచి పారిపోయినా వారి దుర్మార్గాలు చట్టసభల ద్వారానే ఎండగడతాం: సంధ్యారాణి
- వాస్తవాలు కళ్లముందుకొస్తే తట్టుకోలేరు కాబట్టే సభలో గందరగోళం సృష్టిస్తున్నారు: సంధ్యారాణి
రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
- తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం పండ్లూరు వద్ద రైలు పట్టాలపై యువకుడి మృతదేహం
- ఈనెల 24న హుస్సేన్‌ను ముగ్గురు హిజ్రాలు ఆటోలో తీసుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు
- యువకుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కిడ్నాప్ కేసు నమోదు చేసిన నాయుడుపేట పోలీసులు
- రెండు రోజుల తర్వాత రైలు పట్టాలపై పడి ఉన్న యువకుడి మృతదేహం
- యువకుడిని హిజ్రాలు హత్య చేసి రైలు పట్టాలపై పడేశారని అనుమానిస్తున్న పోలీసులు
వ్యక్తి తలపై నుంచి వెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి
- కడప జిల్లా రాజంపేట మండలం బోయినపల్లి వద్ద రోడ్డుప్రమాదం
- కడప-చెన్నై ప్రధాన రహదారిపై ఆటోను ఢీకొన్న లారీ
- వ్యక్తి తలపై నుంచి వెళ్లిన లారీ, అక్కడికక్కడే మృతి
శాసనసభ వ్యవసాయ శాఖకు సంబంధించి బిల్లును ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్నాయుడు
- ఉదయం 9 గం.కు ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు
- ప్రశ్నోత్తరాలతో సభా కార్యకలాపాలు ప్రారంభించనున్న స్పీకర్
- వ్యవసాయ శాఖకు సంబంధించి బిల్లును సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి అచ్చెన్న
- గృహ నిర్మాణశాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి కె పార్థసారథి
విజయవాడలో 'సైన్స్ సమగ్ర మహోత్సవ్'
- నేడు విజయవాడలో 'సైన్స్ సమగ్ర మహోత్సవ్' కార్యక్రమం
- ఏపీ సైన్స్ సిటీ ఆధ్వర్యలో నేడు 'సైన్స్ సమగ్ర మహోత్సవ్' ముగింపు కార్యక్రమం
- రాష్ట్రవ్యాప్తంగా ఎంపికైన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, సర్టిఫికెట్లు అందజేత
ఆదివారం తిరుపతిలోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన
- రేపటి నుంచి రాష్ట్రంలో పర్యటించనున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- రెండ్రోజులు పాటు ఏపీలో పర్యటించనున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- రేపు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్
- ఎల్లుండి తిరుపతిలోని 16 కోర్టు భవనాల కాంప్లెక్స్ నిర్మాణానికి సీజేఐ శంకుస్థాపన
- ఏపీ జ్యుడిషియల్ అకాడమీ భవనానికి, హైకోర్టు అతిథి గృహ భవనానికి సీజేఐ శంకుస్థాపన
శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- తిరుమలలో ప్రారంభమైన శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- మార్చి 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
- సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా నేడు సహస్రదీపాలంకార సేవ
- రేపు, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు
Last Updated : February 27, 2026 at 10:52 PM IST

