ETV Bharat / state

26 February 2026 Andhra Pradesh News Today Live Updates: ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను వెళ్లడం మొదలు పెట్టాలా?: సీఎం చంద్రబాబు

Today Telugu Breaking News
Today Telugu Breaking News (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 26, 2026 at 7:06 AM IST

|

Updated : February 26, 2026 at 9:52 PM IST

Choose ETV Bharat

26 February 2026 Andhra Pradesh News Today Live Updates: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌ పర్యటన - రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్

LIVE FEED

9:51 PM, 26 Feb 2026 (IST)

విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష

  • విశాఖ మెట్రోపాలిటన్ అథారిటీ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
  • హాజరైన మున్సిపల్ శాఖ డైరెక్టర్ సంపత్ కుమార్, అధికారులు
  • వీఎంఆర్‌డీఏ, వీకేపీసీపీఐఆర్‌ మాస్టర్ ప్లాన్‌పై మంత్రి నారాయణ చర్చ
  • మాస్టర్ ప్లాన్‌పై ప్రజల నుంచి అభ్యంతరాల స్వీకరణకు ఇప్పటికే నోటిఫికేషన్
  • వీలైనంత త్వరగా మాస్టర్ ప్లాన్ విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలన్న నారాయణ
  • భోగాపురం విమానాశ్రయానికి అనుసంధానం చేసే రోడ్లను పూర్తి చేయాలన్న మంత్రి
  • విశాఖ ఎకనమిక్ రీజియన్ పరిధిలో ప్రాజెక్టులపైనా భేటీలో చర్చ

9:50 PM, 26 Feb 2026 (IST)

ఏపీ ఈగల్-ఒడిశా ఏఎన్‌టీఎఫ్ అధికారుల వర్చువల్ సమావేశం

  • ఏపీ ఈగల్-ఒడిశా ఏఎన్‌టీఎఫ్ అధికారుల వర్చువల్ సమావేశం
  • గంజాయి మాదకద్రవ్యాల నిరోధంపై అధికారుల వర్చువల్ భేటీ
  • ఏపీ-ఒడిశా సరిహద్దుల్లో డ్రగ్స్‌ అక్రమ రవాణా నిర్మూలనకు ప్రణాళిక
  • భేటీలో పాల్గొన్న ఏపీ ఈగల్ ఐజీ రవికృష్ణ, ఒడిశా ఐజీ సార్థక్ సారంగి
  • సరిహద్దుల్లో గూడచర్య వ్యవస్థను బలోపేతం చేయాలని నిర్ణయం
  • ఒడిశాలో గంజాయి సాగు ముఠాలపై చర్యలు తీసుకోవాలన్న ఒడిశా ఐజీ
  • డ్రగ్స్‌ నిర్మూలనకు సంయుక్త ఆపరేషన్‌ చేయాలని నిర్ణయం

8:16 PM, 26 Feb 2026 (IST)

వైద్యారోగ్యశాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

  • శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీ పాల అంశంపై సీఎం సమీక్ష
  • బాధితులకు వైద్య సాయం, బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం ఆదేశం
  • ఘటన జరిగాక స్పందించడం కాదు.. ముందస్తు పర్యవేక్షణ అవసరం: సీఎం
  • జిల్లా కలెక్టర్లు, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి: సీఎం
  • ప్రజల్లో ఉంటేనే సమస్యలు తెలుస్తాయి: సీఎం చంద్రబాబు
  • శ్రీకాకుళం, తూ.గో. జిల్లాల ఘటనలపై సమీక్షలో అధికారులను ఉద్దేశించి సీఎం కీలక వ్యాఖ్యలు
  • ఆకస్మిక తనిఖీలకు మీరు వెళ్తారా? నేను వెళ్లడం మొదలు పెట్టాలా?: సీఎం
  • గదుల్లో కూర్చుంటే వాస్తవాలు తెలియవు.. క్షేత్రస్థాయికి వెళ్లాలి: సీఎం
  • ప్రజలను కలిసి మాట్లాడండి.. అప్పుడే సమస్యలు తెలుస్తాయి: సీఎం
  • మీరు క్షేత్రస్థాయికి వెళ్లకపోతే నేను వెళ్లడం మొదలుపెడతా: సీఎం

8:15 PM, 26 Feb 2026 (IST)

శ్రీవారి తెప్పోత్సవాలు

  • తిరుమలలో వైభవంగా శ్రీవారి తెప్పోత్సవాలు
  • పుష్కరిణిలో తెప్పపై సీత, లక్ష్మణ, ఆంజనేయ సమేత రాముల వారి విహారం
  • శ్రీవారి తెప్పోత్సవాలు తిలకించేందుకు భారీగా తరలివచ్చిన భక్తులు

8:15 PM, 26 Feb 2026 (IST)

సెంథిల్‌కు పోలీస్‌ కస్టడీ

  • నకిలీ మద్యం కేసులో ఏ22 సెంథిల్‌కు పోలీస్‌ కస్టడీ
  • సెంథిల్‌కు 2 రోజుల పోలీస్ కస్టడీకి విజయవాడ కోర్టు అనుమతి
  • మార్చి 1, 2 తేదీల్లో సెంథిల్‌ను విచారించనున్న ఎక్సైజ్ అధికారులు

8:15 PM, 26 Feb 2026 (IST)

హత్య కేసును ఛేదించిన పోలీసులు

  • అన్నమయ్య జిల్లా: గాలివీడులో హత్య కేసును ఛేదించిన పోలీసులు
  • ఈనెల 17న రామకృష్ణారెడ్డి హత్య కేసులో మహేశ్వర్‌రెడ్డి సహా ఐదుగురు అరెస్టు
  • రూ.10 లక్షలు సుపారీ తీసుకుని రామకృష్ణారెడ్డిని హత్య చేసిన నిందితులు
  • రామకృష్ణారెడ్డి బంధువుల మధ్య భూతగాదాలే హత్యకు కారణం
  • హత్యకు కుట్రపన్నిన రామకృష్ణారెడ్డి బంధువు మహేశ్వర్‌రెడ్డి
  • హత్యలో పాల్గొన్న కుళాయప్ప, పెద్దారెడ్డి, తిరుపతిరెడ్డి
  • నిందితుల్లో కుళాయప్ప, పెద్దారెడ్డి ఇంజినీరింగ్ విద్యార్థులు
  • హత్య తర్వాత నిందితులకు రూ.5.50 లక్షలు ముట్టజెప్పిన మహేశ్వర్‌రెడ్డి
  • మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేసిన పోలీసులు
  • సీసీ ఫుటేజీ, సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా నిందితుల అరెస్టు
  • ఆస్తి తగాదాలే హత్యకు కారణమని వెల్లడించిన డీఎస్పీ కృష్ణమోహన్

8:15 PM, 26 Feb 2026 (IST)

ఎన్‌హెచ్‌ 65 విస్తరణలో ఇబ్బందులు

  • హైదరాబాద్-మచిలీపట్నం ఎన్‌హెచ్‌ 65 విస్తరణలో ఇబ్బందులు: ఎంపీ కేశినేని
  • కనకదుర్గమ్మ పైవంతెన నుంచి బెంజ్ సర్కిల్ వరకు పైవంతెన నిర్మించాలి: కేశినేని
  • బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు 6 వరుసల పైవంతెన నిర్మించాలి: కేశినేని
  • నందిగామలో ఇప్పటికే 8 వరుసల బైపాస్ ఉంది: ఎంపీ కేశినేని శివనాథ్‌
  • బైపాస్ నిర్మాణానికి ఎంతో మంది రైతులు భూములు ఇచ్చారు: కేశినేని
  • మళ్లీ ఇప్పుడు 16 వరుసల బైపాస్‌ నిర్మాణం అసంబద్ధం: ఎంపీ కేశినేని
  • పాత ఎన్‌హెచ్‌పైనే ఇబ్రహీంపట్నం వెస్ట్ వరకు విస్తరించాలని ప్రతిపాదన: కేశినేని
  • గ్రామాల వద్ద ఫ్లైఓవర్లు నిర్మించి తక్కువ భూసేకరణతో ప్రాజెక్టు పూర్తి చేయాలి: కేశినేని
  • జాతీయరహదారుల విస్తరణలో రైతులకు ఇబ్బంది లేకుండా భూసేకరణ చేపట్టాలి: కేశినేని
  • గొల్లపూడి, జక్కంపూడి వద్ద 4 ఎన్‌హెచ్‌లు కలిసేలా కూడలి చేపట్టాలి: కేశినేని
  • కోల్‌కతా, చెన్నై, నాగ్‌పుర్‌, హైదరాబాద్‌కు అనుసంధానం పెరుగుతుంది: కేశినేని
  • బెంజ్ సర్కిల్ నుంచి కృష్ణలంక మధ్య ఆర్‌యూబీకి టెండర్లు: ఎంపీ కేశినేని
  • బందరు కాలువ మీద వంతెనలు నిర్మాణం చేయాలి: ఎంపీ కేశినేని
  • విజయవాడ మెడికల్ కాలేజీ నుంచి నిడమనూరు వరకు 6 లైన్ల పైవంతెనకు అనుమతి: కేశినేని
  • మెట్రో వల్ల పైవంతెన పనుల ఆలస్యంపై సీఎం దృష్టికి తెచ్చాం: ఎంపీ కేశినేని
  • మెట్రో పూర్తికానందున పైవంతెన చేపట్టాలని సీఎం చెప్పారు: ఎంపీ కేశినేని
  • విజయవాడ పశ్చిమ బైపాస్ నెలన్నరలో పూర్తవుతుంది: ఎంపీ కేశినేని
  • వెస్ట్ బైపాస్‌ను ప్రధాని, గడ్కరీ, చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించే యోచన: కేశినేని
  • విజయవాడ ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతాం: కేశినేని

8:14 PM, 26 Feb 2026 (IST)

పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు

  • ప్రకాశం జిల్లావ్యాప్తంగా పాల సేకరణ కేంద్రాల్లో తనిఖీలు
  • పాల సేకరణ కేంద్రాల్లో ఆహార నియంత్రణాధికారుల తనిఖీలు
  • ఏడు నమూనాలు సేకరించి చెన్నై ల్యాబ్‌కు తరలింపు

8:14 PM, 26 Feb 2026 (IST)

  • అల్లూరి జిల్లా: పోక్సో కేసులో దోషికి యావజ్జీవ కారాగార శిక్ష
  • అల్లూరి జిల్లా: దోషికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన పోక్సో కోర్టు
  • బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషి రమేష్‌కు యావజ్జీవం

5:58 PM, 26 Feb 2026 (IST)

ముప్పిడి అవినాష్‌రెడ్డికి రిమాండ్

  • మద్యం కేసులో ముప్పిడి అవినాష్‌రెడ్డికి రేపటి వరకు రిమాండ్
  • ముప్పిడి అవినాష్‌రెడ్డికి రిమాండ్ విధించిన విజయవాడ ఏసీబీ కోర్టు
  • గుంటూరు జిల్లా జైలుకు తరలించాలని ఏసీబీ కోర్టు ఆదేశాలు
  • మద్యం కుంభకోణం కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • ఉదయం విజయవాడ సిట్‌ కార్యాలయంలో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ తిరస్కరణతో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • సుప్రీంకోర్టు ఆదేశంతో సిట్‌ కార్యాలయంలో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌

5:58 PM, 26 Feb 2026 (IST)

గోదావరి పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ

  • గోదావరి పుష్కరాలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ
  • మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఉపసంఘం భేటీ
  • సమీక్షకు హాజరైన మంత్రులు కందుల దుర్గేష్, బి.సి. జనార్దన్‌, సత్యకుమార్
  • సమీక్షకు హాజరైన మంత్రులు గొట్టిపాటి, మండిపల్లి, ఉన్నతాధికారులు
  • మహా కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం
  • పుష్కరాలు ఘనంగా జరిపేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తోన్న మంత్రులు

5:37 PM, 26 Feb 2026 (IST)

రిమాండ్ రిపోర్టు

  • మద్యం కుంభకోణంలో ముప్పిడి అవినాష్‌రెడ్డి రిమాండ్ రిపోర్టు
  • మద్యం స్కామ్‌ కేసులో ముప్పిడి అవినాష్‌రెడ్డి పాత్ర కీలకమని రిమాండ్‌ రిపోర్టు
  • ఐపీసీ సెక్షన్లు 409, 420, 384, 201, 120 (B), అవినీతి నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు
  • ఏ-1 కెసిరెడ్డితో కలిసి రూ.కోట్ల మేర లావాదేవీలు చేశారని రిమాండ్‌ రిపోర్టు
  • మద్యం సిండికేట్‌తో కిక్‌బ్యాక్‌లు, కమీషన్ల ద్వారా లబ్ధి పొందారని రిమాండ్‌ రిపోర్టు
  • సిండికేట్‌కు ప్రధాన వ్యూహకర్త, ఆర్థిక నియంత్రణదారుగా వ్యవహరించారని రిపోర్టు
  • నేరపూరిత సొమ్మును మళ్లించడంలో కీలకపాత్ర పోషించారని రిమాండ్‌ రిపోర్టు
  • ముడుపులు చెల్లించే కొత్త బ్రాండ్లకు అనుకూలంగా 'ఆర్డర్ ఫర్ సప్లై' కేటాయించారని రిపోర్టు
  • పాత పాపులర్ బ్రాండ్లను మార్కెట్ నుంచి తొలగించారని రిమాండ్‌ రిపోర్టు
  • పారదర్శకంగా ఉన్న 'ఆటోమేటెడ్ ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్' తీసివేశారని రిపోర్టు

5:36 PM, 26 Feb 2026 (IST)

మార్చి 4వ తేదీన సభలో ప్రభుత్వ ప్రకటన

  • వైసీపీ చర్చ నుంచి పారిపోయినా మండలిలో లడ్డూ కల్తీపై చర్చిస్తాం: పయ్యావుల
  • మార్చి 4వ తేదీన సభలో ప్రభుత్వ ప్రకటన ఉంటుంది: పయ్యావుల
  • తమకు కావాల్సింది చర్చ కాదు.. రచ్చ అన్నట్లు వైసీపీ ఉంది: పయ్యావుల
  • తెల్లవారుజామున 2 గంటల వరకూ చర్చకు సిద్ధంగా ఉన్నాం: పయ్యావుల
  • సభలో స్టేట్‌మెంట్‌ వినకుండా గందరగోళం సృష్టిస్తున్నారు: పయ్యావుల
  • వాస్తవాలు తట్టుకోలేరు కాబట్టే సభలో గందరగోళం: పయ్యావుల
  • రాయలసీమపై సభలో చర్చ జరిగితే వైసీపీ నుంచి జవాబు లేదు: పయ్యావుల

5:36 PM, 26 Feb 2026 (IST)

శాసనసభ ఆమోదం

  • అసైన్డ్ భూముల చట్ట సవరణకు శాసనసభ ఆమోదం: మంత్రి అనగాని
  • క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు లీజు ద్వారా అసైన్డ్ భూముల కేటాయింపు: అనగాని
  • ఎకరాకు ఏడాదికి రూ.31 వేలు.. రెండేళ్లకోసారి 5 శాతం వరకు పెంపు: అనగాని
  • రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు క్లీన్ ఎనర్జీ చాలా కీలకం: అనగాని
  • క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు కొన్నిచోట్ల అసైన్డ్ భూములు అవసరం: అనగాని
  • అసైన్‌దారుల పూర్తి అనుమతితోనే లీజు తీసుకుంటాం: అనగాని భూముల లీజు ద్వారా అసైన్‌దారులకు అదనపు ఆదాయం: అనగాని
  • చట్ట సవరణతో రూ.10 లక్షల కోట్ల విలువైన క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు అవకాశం: అనగాని
  • ప్రాజెక్టుల ఏర్పాటుతో 7.5 లక్షల మందికి ఉపాధి: మంత్రి అనగాని

5:14 PM, 26 Feb 2026 (IST)

మార్చి 1న అమరావతికి సీజేఐ

  • మార్చి 1న అమరావతిలో సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ పర్యటన
  • ఏపీ జ్యుడీషియల్ అకాడమీ భవనం, హైకోర్టు అతిథిగృహానికి శంకుస్థాపన
  • హైకోర్టు జడ్జిల రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ ప్రారంభోత్సవంలో పాల్గొననున్న సీజేఐ

5:13 PM, 26 Feb 2026 (IST)

2018 గ్రూప్-1 నియామకాల వివాదం

  • శ్రీశైలం ఐటీడీఏ పీవోగా పి.వి.ఎస్.నాయుడు నియామకం
  • కె.ఆర్.పురం ఐటీడీఏ ఏపీవోగా పనిచేస్తున్న పి.వి.ఎస్.నాయుడు
  • హైకోర్టు ఆదేశాలతో ప్రస్తుత పీవో వెంకట శివప్రసాద్ బదిలీ
  • 2018 గ్రూప్-1 నియామకాల వివాదం నేపథ్యంలో బదిలీ
  • 2018 గ్రూప్-1 అధికారులను నాన్ ఫోకల్‌లో ఉంచాలని హైకోర్టు ఆదేశం
  • వెంకట శివప్రసాద్‌ను గిరిజన సంక్షేమ శాఖలో రిపోర్ట్ చేయాలని సూచన

4:28 PM, 26 Feb 2026 (IST)

మున్సిప‌ల్ శాఖ‌ కీలక ఆదేశాలు

  • మున్సిపాలిటీల్లో డయేరియా ప్రబ‌ల‌కుండా మున్సిప‌ల్ శాఖ‌ కీలక ఆదేశాలు
  • కలుషితం కాని సురక్షిత నీరు అందించేలా ఎస్‌వోపీ జారీ చేసిన మున్సిపల్‌శాఖ
  • మున్సిపాలిటీల్లో తాగునీరు కలుషిత‌మైతే కమిషనర్లను ఉపేక్షించేది లేదని ఆదేశాలు
  • అన్ని మున్సిపాలిటీల్లో తాగునీటి పైప్‌లైన్లు తనిఖీ చేయాలని కమిషనర్లకు ఆదేశాలు
  • డ్రైనేజీల గుండా తాగునీటి పైప్‌లైన్లు వెళ్తే వెంటనే మార్చాలని సూచన
  • డ్రైనేజీల్లో నీరు నిలవకుండా వెంటనే డీసిల్టేషన్ చేయాలని ఆదేశాలు
  • తాగునీటిపై ఫిర్యాదులు, సీజ‌న‌ల్ వ్యాధులపై కంట్రోల్‌ రూమ్ ఏర్పాటుకు ఆదేశం
  • కంట్రోల్ రూమ్ 24 గంటలు పనిచేసేలా చూడాలని ఆదేశం

4:28 PM, 26 Feb 2026 (IST)

తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ ఎలాంటి నోటీసు ఇవ్వలేదు

  • వైసీపీ సభ్యులకు చర్చపై ఎలాంటి ఆసక్తి లేదు: పయ్యావుల
  • చర్చ చేపట్టాలని శాసనసభకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదు: పయ్యావుల
  • ప్రభుత్వం ముందుకు వచ్చి వైసీపీ సభ్యుల నోటీసుపై చర్చ చేపట్టింది: పయ్యావుల
  • బీఏసీలో వైసీపీ లేవనెత్తిన అంశాలపైనే చర్చ చేపడదామని చెప్పాం: పయ్యావుల
  • శాంతిభద్రతలు, వ్యవసాయం, నీటిపారుదల, తిరుమల లడ్డూపై చర్చకు సిద్ధమయ్యాం: పయ్యావుల
  • శాసనసభలో ప్రతిపక్షం లేకపోయినా బీఏసీలో లేవనెత్తిన అంశాలు చేపట్టాం: పయ్యావుల
  • తిరుమల లడ్డూ అంశంపై వాస్తవాలు ప్రజలకు చెప్పాలనేది ఉద్దేశం: పయ్యావుల
  • లడ్డూ అంశంపై స్వల్పకాలిక చర్చకు అవకాశం ఇవ్వాలని ధూళిపాళ్ల లేఖ రాశారు: పయ్యావుల
  • ప్రతిపక్షం లేకపోయినా సాంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తున్నాం: పయ్యావుల
  • తిరుమల లడ్డూ అంశంపై వైసీపీ ఎలాంటి నోటీసు ఇవ్వలేదు: పయ్యావుల
  • వైసీపీ సభ్యులకు అల్లరి కావాలి.. సభలో చర్చ జరగలేదని దుష్ప్రచారం: పయ్యావుల
  • ప్రభుత్వం ముందుకు వచ్చి సమాచారం ఇస్తే మంత్రి చదవొద్దు అంటున్నారు: పయ్యావుల
  • సభలో రచ్చ చేసి చర్చ జరగకూడదనేది వైసీపీ సభ్యుల ఉద్దేశం: పయ్యావుల
  • ప్రభుత్వం స్టేట్‌మెంట్‌ ఇస్తుందని అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌కు రేపు లేఖ రాస్తాం: పయ్యావుల
  • ప్రభుత్వ స్టేట్‌మెంట్‌ విషయమై సంబంధిత శాఖ నుంచి నోటీసు ఇవ్వబోతున్నాం: పయ్యావుల
  • బీఏసీలో ఒప్పుకున్న ప్రకారం చర్చ చేపట్టాం: పయ్యావుల
  • రేపు వ్యవసాయ రంగంపై చర్చ జరగాల్సి ఉంది: పయ్యావుల
  • మార్చి 4న మండలిలో స్టేట్‌మెంట్‌ ఇస్తామని అధికారికంగా లేఖ రాస్తాం: పయ్యావుల

4:27 PM, 26 Feb 2026 (IST)

రోడ్డుప్రమాదంలో విద్యార్థిని మృతి

  • బాపట్ల జిల్లా: చీరాల వద్ద రోడ్డుప్రమాదం, బీటెక్‌ విద్యార్థిని మృతి
  • విజయనగర కాలనీ వద్ద హైవేపై ఆగివున్న లారీని ఢీకొట్టిన స్కూటీ
  • ప్రమాదంలో సహస్ర (20) మృతి, మరో యువకుడికి తీవ్రగాయాలు
  • గాయపడిన యువకుడిని గుంటూరు ఆసుపత్రికి తరలింపు
  • గుంటూరులోని ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న హైదరాబాద్‌ వాసి సహస్ర

4:27 PM, 26 Feb 2026 (IST)

సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చ

  • సాగునీటి రంగంపై అసెంబ్లీలో చర్చలో మాట్లాడిన ప్రత్తిపాటి
  • కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి రూ.52,724 కోట్లు కేటాయించింది: ప్రత్తిపాటి
  • 20 నెలల్లో రూ.25,948 కోట్లు ఖర్చు చేసి పురోగతికి బాటలు వేసింది: ప్రత్తిపాటి
  • ప్రతి ఎకరాకు నీరందించాలన్న సీఎం సంకల్పం త్వరలో సాకారం: ప్రత్తిపాటి
  • రూ.6వేల కోట్లతో చేపట్టిన వైకుంఠపురం-నకరికల్లు ప్రాజెక్టు పూర్తిపై స్పష్టత ఇవ్వాలి: ప్రత్తిపాటి

4:26 PM, 26 Feb 2026 (IST)

ఛైర్మన్ ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు

  • వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీలను విచారించిన మండలి ఛైర్మన్
  • నోటీసులు ఇవ్వడంతో ఛైర్మన్ ముందు విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు
  • విచారణకు హాజరైన ఎమ్మెల్సీలు బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్
  • ఎమ్మెల్సీలతో విడివిడిగా భేటీ అయి రాజీనామాలపై వివరణ తీసుకున్న మండలి ఛైర్మన్
  • ఎవరైనా ఒత్తిడి చేస్తున్నారా అని ఎమ్మెల్సీలను ప్రశ్నించిన మండలి ఛైర్మన్
  • ఎవరి ఒత్తిడి లేదని.. రాజీనామా వెంటనే ఆమోదించాలని కోరిన ఎమ్మెల్సీలు

4:25 PM, 26 Feb 2026 (IST)

లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి

  • ముప్పిడి అవినాష్‌రెడ్డిని వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడ జీజీహెచ్‌కు తరలింపు
  • అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్న సిట్‌ అధికారులు
  • ఉదయం విజయవాడ సిట్‌ కార్యాలయంలో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • మద్యం కుంభకోణం కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ తిరస్కరణతో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • సుప్రీంకోర్టు ఆదేశంతో సిట్‌ కార్యాలయంలో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌

4:25 PM, 26 Feb 2026 (IST)

మట్టి తవ్వకాలు

  • ఎన్టీఆర్ జిల్లా: ఎ.కొండూరు మండలం కోమటికుంటలో మట్టి తవ్వకాలు
  • అటవీశాఖ అధికారులకు తెలిసే తవ్వకాలు చేస్తున్నట్లు స్థానికుల వెల్లడి
  • స్థానికుల సమాచారంతో ట్రాక్టర్లను సీజ్ చేసిన అటవీ అధికారులు

2:25 PM, 26 Feb 2026 (IST)

'ఆపరేషన్ చిన్నారి తల్లి' పోస్టర్‌ ఆవిష్కరణ

  • 'ఆపరేషన్ చిన్నారి తల్లి' పోస్టర్‌ను ఆవిష్కరించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
  • మంగళగిరి డీజీపీ కార్యాలయంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం
  • రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్ చిన్నారి తల్లి ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
  • చిన్నారులపై లైంగిక నేరాల నివారణే లక్ష్యం: డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా
  • 'గుడ్ టచ్ - బ్యాడ్ టచ్‌'పై అవగాహన కార్యక్రమాలు: డీజీపీ
  • బాధితులకు కౌన్సిలింగ్, పునరావాస సహాయం అందిస్తాం: డీజీపీ
  • మహిళలు, చిన్నారుల భద్రతకు పెద్దపీట: డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా

1:54 PM, 26 Feb 2026 (IST)

నీటి ప్రాజెక్టులపై సభలో సీఎం

  • ప్రకృతిని ఆరాధించడం.. నీటిని పూజించే సంప్రదాయం మనది: సీఎం
  • గోదావరికి అఖండ హారతి ఇచ్చాం: సీఎం చంద్రబాబు
  • కృష్ణాకు పవిత్ర హారతి ఇచ్చాం: సీఎం చంద్రబాబు
  • నదులను పూజించడం సంప్రదాయంగా పెట్టుకున్నాం: సీఎం
  • గంగా-కావేరి అనుసంధానం కావాలనే నా ప్రగాఢ ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
  • ఏ పనైనా చిన్న ఆలోచనతోనే మొదలవుతుంది: సీఎం చంద్రబాబు
  • గంగా-కావేరి అనుసంధానం సాధ్యాసాధ్యాలపై ఆనాడే చర్చలు జరిగాయి: సీఎం
  • రాష్ట్రంలో కట్టిన ప్రాజెక్టులన్నీ ఎన్డీయే లేదా టీడీపీ హయాంలోనే జరిగాయి: సీఎం
  • పట్టిసీమ నుంచి వంద టీఎంసీలు కృష్ణాకు తీసుకొచ్చాం: సీఎం
  • వెలుగొండ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశా.. నేనే పూర్తిచేస్తున్నా: సీఎం
  • జిల్లాకు వెళ్లినప్పుడల్లా వాళ్లడిగేది ఒక్కటే.. శ్రీశైలం నుంచి నీళ్లు ఇమ్మన్నారు: సీఎం
  • ధవళేశ్వరం వద్ద బ్యారేజీ నిర్మాణం వల్ల కాటన్‌ దొరను ఇప్పటికీ గుర్తుపెట్టుకుంటున్నారు: సీఎం
  • గోదావరి జిల్లాలో కాటన్‌ దొర విగ్రహాలు పెట్టి పూజిస్తున్నారు: సీఎం
  • నీళ్లు రాకుండానే ఎవరైనా జాతికి అంకితం చేస్తారా?: సీఎం చంద్రబాబు
  • వైసీపీ ఐదేళ్ల పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టునూ పట్టించుకున్న పాపాన పోలేదు: సీఎం
  • పోలవరం అతిపెద్ద ప్రాజెక్టు.. ఎమ్మెల్యేలందరూ ఒకసారి చూసి రావాలి: సీఎం
  • పోలవరం వంటి పెద్ద ప్రాజెక్టు దేశంలో మరొకటి నిర్మించే అవకాశం లేదు: సీఎం
  • పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేస్తాం: సీఎం
  • అన్ని రిజర్వాయర్లు కళకళలాడుతున్నాయంటే ప్రభుత్వ దూరదృష్టి: సీఎం
  • ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలని మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం
    ప్రతి ఇంటికి నాణ్యమైన తాగునీరు అందించేలా చర్యలు: సీఎం

1:42 PM, 26 Feb 2026 (IST)

  • కల్తీ నెయ్యి అంశంపై శాసనమండలిలో గందరగోళం
  • సభ్యుల నినాదాల మధ్య మండలి రేపటికి వాయిదా
  • చర్చకు ప్రతిపక్షానికి ముందుగా అవకాశం ఇస్తామన్న మండలి ఛైర్మన్‌
  • ప్రభుత్వం నుంచి స్టేట్‌మెంట్‌ వద్దంటారా?: మంత్రి పయ్యావుల
  • స్టేట్‌మెంట్‌ ఇస్తామని మేము ముందే చెప్పాం: మంత్రి పయ్యావుల
  • లఘు చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి పయ్యావుల
  • ఎంత సమయమైనా చర్చకు అనుమతించండి: మంత్రి పయ్యావుల
  • అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగించినా మాకు ఇబ్బంది లేదు: మంత్రి పయ్యావుల
  • వినేందుకు కూడా ఓపిక లేనప్పుడు ప్రశ్నలు ఎందుకు అడగాలి?: మంత్రి పయ్యావుల
  • కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ సభ్యులు ఎందుకు భయపడుతున్నారు: మంత్రి పయ్యావుల
  • హిందూ సమాజ వ్యతిరేక చర్యలను ఎండగట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది: మంత్రి పయ్యావుల
  • నినాదాల మధ్య మండలి రేపటికి వాయిదా వేసిన ఛైర్మన్‌ మోషేన్‌ రాజు+
  • ప్రశ్నోత్తరాలు జరిపించాలని నేను ఛైర్మన్‌ను అడుగుతుంటే ఒక్కసారిగా దాడికి వచ్చారు: సోము
  • హక్కు ఉందని పదేపదే సభను వాయిదా వేస్తారా?: సోము వీర్రాజు
  • ప్రతిపక్షం మాట్లాడేందుకు అవకాశమిచ్చినప్పుడు.. ప్రభుత్వానికి ఇవ్వనక్కర్లేదా?: సోము వీర్రాజు
  • వైసీపీ సభ్యులకు కనీసం ప్రభుత్వ సమాధానం కూడా వినే ఓపిక లేకుండా పోయింది: పంచుమర్తి
  • సోము వీర్రాజుపై వైసీపీ సభ్యులు మూకుమ్మడిగా దాడికి యత్నించారు: పంచుమర్తి
  • మనుషుల మీదకు రావడమేంటి?: పంచుమర్తి
  • ప్రశ్నోత్తరాలు జరిపించండని చేతులు జోడించి ఛైర్మన్‌ను సోము అడిగారు: పంచుమర్తి
  • దాడికి యత్నిస్తున్న సభ్యులను బొత్స ఎందుకు వారించరు?: పంచుమర్తి
  • చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా వైసీపీ సభ్యులు వినలేదు: పంచుమర్తి

12:58 PM, 26 Feb 2026 (IST)

రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు

  • రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ నాయక్‌కు అరెస్ట్ వారెంట్
  • అరెస్ట్ వారెంట్ జారీ చేసిన గుంటూరు మొబైల్ కోర్టు
  • విచారణ కోసం గుంటూరు పోలీసులు నోటీసులు జారీ చేసినా స్పందించని సునీల్ కుమార్ నాయక్
  • ఇటీవల కస్టోడియల్ టార్చర్ కేసులో అరెస్టు చేసేందుకు పట్నా వెళ్లిన ఎస్పీ దామోదర్ బృందం
  • సునీల్ కుమార్ నాయక్‌కు ట్రాన్సిట్ వారెంట్ జారీ చేసేందుకు పట్నా హైకోర్టు నిరాకరణ
  • గుంటూరు మొబైల్ కోర్టులో అరెస్ట్ వారెంట్ పిటిషన్ దాఖలు చేసిన పోలీసులు

12:58 PM, 26 Feb 2026 (IST)

నేటి బంగారం ధరలు

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర (Gold Rate) రూ.1,57,300
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,44,720
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,72,000

12:23 PM, 26 Feb 2026 (IST)

డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌ పర్యటన

  • శ్రీకాకుళం: డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో కేంద్రమంత్రి రామ్మోహన్‌ పర్యటన
  • అతిసార వ్యాధితో మృతిచెందిన సురేష్ కుటుంబసభ్యులను పరామర్శించిన రామ్మోహన్
  • ప్రస్తుత పరిస్థితులపై కలెక్టర్, జేసీ, ఎమ్మెల్యేలతో సమీక్షించిన రామ్మోహన్‌నాయుడు
  • పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యపై ఆరా తీసిన కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
  • ఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం వెంటనే చర్యలకు ఉపక్రమించింది: రామ్మోహన్‌
  • అత్యవసర చికిత్స పొందుతున్న వాళ్లు కూడా కోలుకుంటున్నారు: రామ్మోహన్‌
  • ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు: కేంద్రమంత్రి రామ్మోహన్‌
  • మొరుగైన తాగునీటి సదుపాయాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం: రామ్మోహన్‌
  • వైఎస్సార్​సీపీ నాయకులకు శవాలతో రాజకీయాలు చేయడం అలవాటుగా మారింది: రామ్మోహన్‌

12:23 PM, 26 Feb 2026 (IST)

శెట్టూరు మండలం బసంపల్లిలో ఎలుగుబంటి హల్‌చల్‌

  • అనంతపురం జిల్లా శెట్టూరు మండలం బసంపల్లిలో ఎలుగుబంటి హల్‌చల్‌
  • అనంతపురం జిల్లా: ఎలుగుబంటిని పొలాల్లో చూసి పరుగులు తీసిన స్థానికులు
  • అటవీశాఖ స్పందించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

12:01 PM, 26 Feb 2026 (IST)

శాసమండలిలో కొద్దిసేపు ఉద్రిక్తత

  • శాసమండలిలో కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం
  • ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై దూసుకెళ్లిన వైఎస్సార్​సీపీ సభ్యులు
  • ఎమ్మెల్సీ ఇజ్రాయిల్‌తో పాటు సోము మీదకు వెళ్లిన ఇతర వైఎస్సార్​సీపీ సభ్యులు
  • రాయలసీమ లిఫ్ట్‌పై నిమ్మల సమాధానం పూర్తయినా చర్చకు పట్టుబట్టిన వైఎస్సార్​సీపీ సభ్యులు
  • సమాధానం పూర్తయినందున తర్వాత ప్రశ్నకు అవకాశం కల్పించిన ఛైర్మన్
  • ఛైర్మన్ అవకాశం కల్పించడంతో తర్వాతి ప్రశ్న లేవనెత్తిన బీజేపీ ఎమ్మెల్సీ సోము
  • ఛైర్మన్ తీరుకు నిరసనగా సోము వీర్రాజు మీదకు వెళ్లిన వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయిల్
  • నిరసన తెలుపుతుంటే మైక్ ఎందుకు తీసుకున్నావంటూ వీర్రాజుపై దాడికి యత్నం
  • ఇజ్రాయిల్‌ను అనుసరించిన ఇతర వైఎస్సార్​సీపీ సభ్యులు
  • సోము వీర్రాజుకు మద్దతుగా వెళ్లి అడ్డుకున్న మంత్రులు అనిత, గొట్టిపాటి రవికుమార్
  • ఉద్రిక్త వాతావరణం మధ్య సభను కొద్దిసేపు వాయిదా వేసిన ఛైర్మన్

11:56 AM, 26 Feb 2026 (IST)

మండలి వాయిదా

వైఎస్సార్​సీపీ సభ్యుల ఆందోళనతో శాసనమండలి మరోసారి వాయిదా

  • రాష్ట్ర ప్రజల కోసం ఏ ప్రశ్న అయినా వేస్తాం.. సమాధానం చెప్పాల్సిందే: బొత్స
  • వాళ్లకు కావాల్సిన ప్రశ్నలు మేము ఎందుకు అడుగుతాం?: బొత్స
  • రేవంత్‌రెడ్డి చెప్పింది నిజమా.. కాదా అనేదే మేము అడుగుతున్నాం: బొత్స

  • ప్రతిపక్ష సభ్యుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మేము తప్పించుకోలేదు: మంత్రి పయ్యావుల
  • గంట పాటు ప్రశ్నోత్తరాలు జరపాలని మొదటిరోజే అనుకున్నాం: మంత్రి పయ్యావుల
  • సమాధానం ఏం చెప్పాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది: మంత్రి పయ్యావుల
  • వాళ్లకు కావాల్సిన సమాధానం మేము ఎలా ఇవ్వాలి?: మంత్రి పయ్యావుల
  • ప్రశ్న వేసే ముందే ప్రతిపక్ష సభ్యులు ఆలోచించుకోవాలి: మంత్రి పయ్యావుల
  • చేతగాని దద్దమ్మ ప్రభుత్వం ఆనాడు అధికారంలో ఉందని మేం చెప్పాలా?: మంత్రి పయ్యావుల
  • వైఎస్సార్​సీపీ సభ్యులు వాకౌట్‌ చేయకుండా వింటే ఏ చర్చకైనా సిద్ధంగా ఉన్నాం: మంత్రి నిమ్మల
  • రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అన్ని అంశాలపై చర్చిస్తాం: మంత్రి నిమ్మల
  • రాయలసీమకు ద్రోహం చేసిందెవరో అందరికీ తెలుసు: మంత్రి నిమ్మల
  • రేవంత్‌రెడ్డి అంశాన్ని ప్రశ్నిస్తున్నోళ్లు .. హరీష్‌రావు మాట్లాడింది ఎందుకు తేవట్లేదు: మంత్రి నిమ్మల
  • పొరుగు రాష్ట్రాల్లో వారి రాజకీయ లబ్ధి కోసం వారు మాట్లాడతారు: మంత్రి నిమ్మల
  • మనం వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ బాగుంటుంది: మంత్రి నిమ్మల
  • ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో ఏ ఒక్క ప్రాజెక్టు అయినా పట్టించుకున్నారా?: మంత్రి నిమ్మల
  • అధికారంలో ఉంటే ఒకరకంగా.. ప్రతిపక్షంలో మరోరకంగా మాట్లాడడం వైఎస్సార్​సీపీకి అలవాటు: మంత్రి నిమ్మల
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి: మంత్రి నిమ్మల
  • రాయలసీమ వెనుకబాటుతనం పోవాలంటే గోదావరి జలాలు రావాలని ఆనాడే కేసీఆర్‌ చెప్పారు: మంత్రి నిమ్మల
  • రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి సూటిగా సమాధానం చెప్పండి: బొత్స
  • చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్‌రెడ్డి తెలిపారు: బొత్స
  • రేవంత్‌రెడ్డి ప్రకటనపై సభలో ప్రకటన చేయాలని అడుగుతున్నాం: బొత్స

11:41 AM, 26 Feb 2026 (IST)

నెల్లూరు మేయర్‌గా దేవరకొండ సుజాత

  • నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్‌గా దేవరకొండ సుజాత
  • దేవరకొండ సుజాత ఎన్నికైనట్లు ప్రకటించిన అధికారులు
  • నెల్లూరు: మేయర్ ఎన్నికకు హాజరుకాని వైసీపీ కార్పొరేటర్లు
  • నెల్లూరు: మేయర్‌ ఎన్నికకు హాజరైన మాజీ మేయర్ పొట్లూరి స్రవంతి
  • గతేడాది డిసెంబర్ 14న మేయర్ పదవికి స్రవంతి రాజీనామా
  • ఇన్‌ఛార్జి మేయర్‌గా 70 రోజులు కొనసాగిన డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్ యాదవ్

11:07 AM, 26 Feb 2026 (IST)

మద్యం కుంభకోణం కేసులో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి

  • విజయవాడ సిట్‌ కార్యాలయంలో లొంగిపోయిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • మద్యం కుంభకోణం కేసులో ఏ7గా ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • సుప్రీంకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణతో లొంగిపోయిన అవినాష్‌రెడ్డి
  • తన న్యాయవాదితో కలిసి సిట్‌ కార్యాలయానికి వచ్చిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • గతంలో హైకోర్టులోనూ బెయిల్‌ నిరాకరణతో పరారీలో ఉన్న ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • కేసు నమోదైన తర్వాత విదేశాలకు వెళ్లిన ముప్పిడి అవినాష్‌రెడ్డి
  • లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో సిట్‌ కార్యాలయానికి వచ్చిన అవినాష్‌

11:03 AM, 26 Feb 2026 (IST)

మండలిలో వైఎస్సార్​సీపీ సభ్యుల ఆందోళన

  • రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై మండలిలో వైఎస్సార్​సీపీ సభ్యుల ఆందోళన
  • సభ్యుల ఆందోళనతో మండలి సమావేశాన్ని కాసేపు వాయిదా వేసిన ఛైర్మన్
  • చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్‌రెడ్డి తెలిపారు: బొత్స
  • రేవంత్‌రెడ్డి ప్రకటనపై సభలో ప్రకటన చేయాలని ఆందోళన చేసిన వైసీపీ సభ్యులు
  • సభ్యుల ఆందోళనతో మండలి సమావేశాన్ని కాసేపు వాయిదా వేసిన ఛైర్మన్

11:02 AM, 26 Feb 2026 (IST)

పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

10:48 AM, 26 Feb 2026 (IST)

నెల్లూరు మేయర్​ ఎన్నిక ప్రారంభం

  • నెల్లూరు నగర పాలక సంస్థ మేయర్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం
  • నెల్లూరు: హాజరైన 42మంది టీడీపీ మద్దతు కార్పొరేటర్లు
  • ర్యాలీగా చేరుకున్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, రూప్‌కుమార్, పట్టాభి రామిరెడ్డి
  • ఎన్నికల ప్రత్యేక అధికారిగా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు
  • చేతులెత్తి ఎన్నుకునే పద్ధతిలో నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక
  • నెల్లూరు నగర పాలక సంస్థలో మొత్తం 54 డివిజన్లు
  • ఒక కార్పొరేటర్‌ రాజీనామాతో ప్రస్తుతం 53 డివిజన్లు
  • టీడీపీకి 42, వైఎస్సార్​సీపీకి 15 మంది సభ్యుల బలం
  • టీడీపీ నూతన మేయర్ అభ్యర్థిగా దేవరకొండ సుజాత
  • మేయర్‌గా టీడీపీ అభ్యర్థి దేవరకొండ సుజాత ఎన్నిక లాంఛనమే
  • నెల్లూరు: మేయర్ ఎన్నికకు పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు

10:36 AM, 26 Feb 2026 (IST)

రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసు

  • రాయలసీమకు ఎవరు ద్రోహం చేశారో అందరికీ తెలుసు: మంత్రి నిమ్మల
  • వైఎస్సార్​సీపీ హయాంలో ఏ ప్రాజెక్టునూ పట్టించుకోలేదు: మంత్రి నిమ్మల
  • గోరకల్లు రిజర్వాయర్‌కు ఒక్క రూపాయి కూడా ఇవ్వనివాళ్లు మమ్మల్ని విమర్శిస్తారా?: మంత్రి నిమ్మల
  • హంద్రీనీవాకు ఐదేళ్ల వైఎస్సార్​సీపీ పాలనలో తట్ట మట్టి కూడా వేయని పరిస్థితి: మంత్రి నిమ్మల
  • ఆఖరికి మోటార్ల బిల్లులు కూడా చెల్లించని పరిస్థితి: మంత్రి నిమ్మల
  • కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే చేసి చూపించాం: మంత్రి నిమ్మల

10:35 AM, 26 Feb 2026 (IST)

తిరుమల కనుమ రహదారిలో ప్రమాదం

  • తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి కనుమ రహదారిలో ప్రమాదం
  • అదుపుతప్పి లోయలోకి తీసుకెళ్లిన బైక్‌; ఒకరు మృతి, మరొకరి పరిస్థితి విషమం

10:30 AM, 26 Feb 2026 (IST)

కల్తీ పాల బాధితులకు పరామర్శ

  • రాజమహేంద్రవరం కిమ్స్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన మంత్రి దుర్గేష్
  • వైద్యులను అడిగి బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న మంత్రి దుర్గేష్
  • వెంటిలేటర్లపై ఉన్న బాధితులకు ధైర్యం చెప్పి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
  • కన్నీరుమున్నీరవుతున్న బాధిత కుటుంబాలను ఓదార్చిన మంత్రి కందుల దుర్గేష్
  • బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు మంత్రి దుర్గేష్ సూచన
  • కల్తీ ఘటనకు కారణమైన నిందితులపై కఠిన చర్యలుంటాయన్న మంత్రి దుర్గేష్
  • కల్తీ ఘటన కేసులో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తి లేదన్న మంత్రి దుర్గేష్
  • నమూనాలు సేకరించాం.. నివేదికలు వచ్చాక చర్యలుంటాయని మంత్రి వెల్లడి

10:29 AM, 26 Feb 2026 (IST)

అన్నదమ్ముల ఆస్తి వివాదం - అర్ధరాత్రి ఘర్షణ

  • ఎన్టీఆర్‌ జిల్లా రెడ్డిగూడెం మండలం కొత్త నాగులూరులో అర్ధరాత్రి ఘర్షణ
  • ఎన్టీఆర్‌ జిల్లా: ఉద్రిక్తంగా మారిన అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదం
  • కత్తులు, కర్రలతో దాడిచేసుకున్న అన్నదమ్ములు, వారి బంధువులు
  • ఇరువర్గాలకు చెందిన 8 మందికి గాయాలు, ఆస్పత్రుల్లో చికిత్స

10:28 AM, 26 Feb 2026 (IST)

పని చేయని ఫాస్ట్ ట్యాగ్​

  • గుంటూరు జిల్లా కాజా టోల్‌ప్లాజా వద్ద సరిగా పనిచేయని ఫాస్ట్ ట్యాగ్ వ్యవస్థ
  • టోల్ చెల్లింపు కోసం పది నిమిషాల సమయం పడుతున్న వైనం
  • ఆలస్యం అవుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వాహనదారులు
  • వారం రోజులుగా సర్వర్లు సరిగా పనిచేయకపోయినా నిర్వాహకులు పట్టించుకోవట్లేదని ఆరోపణ
  • ఫాస్ట్ ట్యాగ్ వచ్చినా ఉపయోగం లేదని వాపోతున్న వాహనదారులు

9:57 AM, 26 Feb 2026 (IST)

కల్తీ పాలు - ఇంకా విషమంగానే బాధితుల ఆరోగ్య పరిస్థితి

  • కల్తీ పాల ఘటనలో ఇంకా విషమంగానే బాధితుల ఆరోగ్య పరిస్థితి
  • రాజమహేంద్రవరం: వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 15 మంది బాధితులు
  • కిమ్స్‌ ఆస్పత్రిలో బాధితుల ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్న మంత్రి దుర్గేష్‌
  • రాజమహేంద్రవరం: విషమంగా ఉన్న 8 మందికి ఆస్పత్రుల్లో కొనసాగుతున్న చికిత్స
  • ముంబయి నుంచి ప్రత్యేక ఔషధాలు తెప్పించిన కలెక్టర్‌ కీర్తి చేకూరి
  • రాజమహేంద్రవరం చౌడేశ్వరినగర్‌, స్వరూప్‌నగర్‌లో కొనసాగుతున్న వైద్య శిబిరం

9:56 AM, 26 Feb 2026 (IST)

కర్నూలులో మహిళ మృతి

  • కర్నూలు జిల్లా పత్తికొండలోని కొండగేరివీధిలో మహాలక్ష్మి(26) అనుమానాస్పద మృతి
  • భర్త, అత్తమామలు కొట్టి ఉరివేసి చంపారని మృతురాలి తల్లిదండ్రుల ఆరోపణ
  • అనారోగ్య కారణాల వల్ల ఉరివేసుకొని మృతిచెందినట్లు చెబుతున్న భర్త బంధువులు

9:08 AM, 26 Feb 2026 (IST)

ఫిజియోథెరపీ విద్యార్థిని ఆత్మహత్య

విశాఖ: గాజువాక వోడా కాలనీలో విద్యార్థిని పైడా రజిని(21) ఆత్మహత్య

విశాఖ: ఫిజియోథెరపీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న రజిని

ప్రేమ విఫలమే ఆత్మహత్యకు కారణమని సూసైడ్‌ నోట్‌లో వెల్లడి

7:57 AM, 26 Feb 2026 (IST)

శ్రీశైలంలో విద్యుదాఘాతం

  • శ్రీశైలం దేవాంగ సత్రంలో విద్యుదాఘాతం, తప్పిన ప్రాణనష్టం
  • సత్రం ప్యానల్ బోర్డులో విద్యుదాఘాతంతో మంటలు
  • హుటాహుటిన మంటలు అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది

7:57 AM, 26 Feb 2026 (IST)

తెలుగు గంగ కెనాల్‌కు గండి

  • నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో తెలుగు గంగ కెనాల్‌కు గండి
  • నారాయణపురం గ్రామ సమీపంలో తెలుగు గంగ ఫోర్త్ బ్లాక్‌కు గండి
  • నెల వ్యవధిలోనే తెలుగుగంగకు రెండోసారి గండి, ఆందోళనలో రైతులు

7:05 AM, 26 Feb 2026 (IST)

ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు

  • ఉదయం 9 గంటలకు ప్రారంభంకానున్న శాసనసభ సమావేశాలు
  • ప్రశ్నోత్తరాలతో సభ కార్యకలాపాలు ప్రారంభించనున్న స్పీకర్
  • శాసనసభలో రెండు బిల్లులు ప్రవెశ పెట్టనున్న ప్రభుత్వం
  • అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు ప్రవెశపెట్టనున్న మంత్రి అనగాని
  • గ్రామ, వార్డు సచివాలయాల చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి డీబీవీ స్వామి
  • సచివాలయాల పేర్లు స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డులుగా మార్చేలా బిల్లు
  • జలవనరుల శాఖ బడ్జెట్ డిమాండ్లను సభలో ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల

6:41 AM, 26 Feb 2026 (IST)

తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

  • నేటి నుంచి తిరుమల శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
  • మార్చి 2 వరకు జరగనున్న శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు
  • రాత్రి 7 నుంచి 8 గంటల వరకు పుష్కరిణిలో స్వామి, అమ్మవార్ల దర్శనం
  • తెప్పోత్సవాల కారణంగా నేడు, రేపు సహస్రదీపాలంకార సేవ
  • ఈనెల 28, మార్చి 1, 2న ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దు

6:41 AM, 26 Feb 2026 (IST)

కడప జిల్లాలో అగ్నిప్రమాదం- ఒకరు మృతి

  • కడప జిల్లా: అర్ధరాత్రి రాజంపేట డీప్ లాడ్జిలో అగ్నిప్రమాదం, ఒకరు మృతి
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా లాడ్జిలో భారీగా వ్యాపించిన మంటలు
  • మంటల్లో చిక్కుకుని రిసెప్షన్‌లో ఉన్న వ్యక్తి మృతి
  • కిటికీలు, డోర్లు పగలగొట్టి 39 మందిని కాపాడిన అగ్నిమాపక సిబ్బంది
  • ఘటనాస్థలికి చేరుకుని మంటలార్పిన అగ్నిమాపక సిబ్బంది

6:41 AM, 26 Feb 2026 (IST)

పాల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు

Last Updated : February 26, 2026 at 9:52 PM IST