ETV Bharat / state

23 February 2026 Andhra Pradesh News Today Live Updates: ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ తిరస్కరణ

ap live news updates
ap live news updates (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 7:16 AM IST

|

Updated : February 23, 2026 at 9:47 PM IST

Choose ETV Bharat

23 february 2026 Andhra Pradesh News Today Live Updates: అసెంబ్లీలో రేపు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం - రాజమహేంద్రవరంలో నలుగురు మృతి - పాల వల్లేనని అనుమానం

LIVE FEED

9:46 PM, 23 Feb 2026 (IST)

ఇరాన్‌లోని ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలి: మంత్రి కొండపల్లి

  • ఇరాన్‌లోని ప్రవాసాంధ్రులు క్షేమంగా స్వస్థలాలకు చేరుకోవాలి: మంత్రి కొండపల్లి
  • కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలు తప్పక పాటించాలి: మంత్రి కొండపల్లి
  • ఇరాన్‌లో ఉన్న విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులకు కొండపల్లి సూచన
  • వీలైనంత త్వరగా ఇరాన్ నుంచి తిరిగిరావాలని ప్రవాసాంధ్రులకు సూచన
  • ఏపీఎన్ఆర్‌టీ హెల్ప్‌లైన్ +91 8500027678ను సంప్రదించవచ్చని సూచన

9:45 PM, 23 Feb 2026 (IST)

అనూరియా కేసులపై హెల్ప్‌లైన్ ఏర్పాటు

  • రాజమహేంద్రవరం అనూరియా కేసులపై హెల్ప్‌లైన్ ఏర్పాటు
  • అనూరియా బాధితుల సహాయం, ఫిర్యాదుల కోసం 94940 60060
  • ప్రజలు ఆందోళన చెందవద్దు.. అధికారులు అండగా ఉన్నారు: కలెక్టర్

7:39 PM, 23 Feb 2026 (IST)

సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

  • రఘురామపై థర్డ్ డిగ్రీ కేసులో ఐపీఎస్ సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ తిరస్కరణ
  • సునీల్ నాయక్ ట్రాన్సిట్ వారెంట్‌ను తిరస్కరించిన పట్నా కోర్టు
  • పట్నా నుంచి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన ఏపీ పోలీసులు
  • ఇవాళ ఉదయం సునీల్ నాయక్‌ను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు
  • గుంటూరు తీసుకొచ్చేందుకు ట్రాన్సిట్ వారెంట్ కోసం కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు

7:38 PM, 23 Feb 2026 (IST)

నరసాపురంలో ఐజీ అశోక్‌కుమార్ పర్యటన

  • తూ.గో.: కోరుకొండ మండలం నరసాపురంలో ఐజీ అశోక్‌కుమార్ పర్యటన
  • వరలక్ష్మి పాలకేంద్రాన్ని పరిశీలించిన ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్‌కుమార్
  • ఒక పాల క్యాన్‌లోనే కల్తీ జరిగిందని దర్యాప్తులో తేలిందన్న ఐజీ అశోక్‌కుమార్

7:38 PM, 23 Feb 2026 (IST)

రెండు విచారణ ప్రక్రియలు కొనసాగవచ్చన్న సుప్రీంకోర్టు

  • నెయ్యి కల్తీ ఘటనలో విచారణ కమిటీ వేయడాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు
  • ప్రభుత్వ నిర్ణయం.. సుప్రీంకోర్టు నియమించిన సిట్ దర్యాప్తు పరిధిలోకి రాదన్న కోర్టు
  • చట్టప్రకారం రెండు విచారణ ప్రక్రియలు కొనసాగవచ్చన్న సుప్రీంకోర్టు
  • మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి వేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
  • స్వామి పిటిషన్‌ను విచారణకు తీసుకునేందుకు నిరాకరిస్తూ డిస్మిస్‌ చేసిన హైకోర్టు
  • పాలనలో లోటుపాట్లు, బాధ్యుల గుర్తింపునకు విచారణ కమిటీ వేసిన ఏపీ ప్రభుత్వం

5:17 PM, 23 Feb 2026 (IST)

అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి

  • రాజమహేంద్రవరం: కిడ్నీ బాధిత ప్రాంతాల్లో ఉన్నతాధికారుల పర్యటన
  • కలెక్టర్‌, ఎస్పీతో కలిసి పర్యటించిన వైద్యారోగ్యశాఖ కమిషనర్ వీరపాండియన్‌
  • కల్తీ పాల ఘటనలో ఆస్పత్రుల్లో 12 మంది ఉన్నారు: వీరపాండియన్‌
  • పాలవ్యాపారి 126 కుటుంబాలకు పాలు పోశాడు: వీరపాండియన్‌
  • పాలు, పెరుగు నమూనాలను ల్యాబరేటరీలకు పంపాం: వీరపాండియన్‌
  • పాలు తాగిన వారందరికీ రక్తపరీక్షలు నిర్వహిస్తున్నాం: వీరపాండియన్‌
  • అనుమానిత లక్షణాలు ఉన్నవారు వైద్యులను సంప్రదించాలి: వీరపాండియన్‌
  • బాధితుల వైద్యఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది: వీరపాండియన్‌

4:28 PM, 23 Feb 2026 (IST)

బాధితుల ఫిర్యాదు మేరకు

  • కడప జిల్లా సింహాద్రిపురం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారుల దాడి
  • రూ.లక్షన్నర లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ, ఎస్‌ఐ
  • ఏసీబీకి చిక్కిన పులివెందుల సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్‌కుమార్
  • గొలుసు చోరీ కేసులో నిందితుడి నుంచి లంచం డిమాండ్ చేసిన పోలీసులు
  • పులివెందుల సీఐ, సింహాద్రిపురం ఎస్‌ఐను అదుపులోకి తీసుకున్న ఏసీబీ

4:28 PM, 23 Feb 2026 (IST)

కిలో నెయ్యి రూ.360కు ఎక్కడ దొరికినా అది కల్తీయే

  • అసెంబ్లీ లాబీలో మీడియాతో నారా లోకేశ్​ చిట్‌చాట్
  • వైసీపీ హయాంలో సాక్షి, భారతి సిమెంట్స్‌ రూ. వెయ్యి కోట్లు లబ్ధి పొందాయి: లోకేశ్​
  • మేం ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం నుంచి లబ్ధి పొందలేదు: లోకేశ్​
  • కిలో నెయ్యి రూ.360కు ఎక్కడ దొరికినా అది కల్తీయే: మంత్రి లోకేశ్​
  • మార్కెట్‌లో రూ.వెయ్యి పైన ఉంటే రూ.360కి ఇచ్చేది కల్తీ కాక మరేంటి?: లోకేశ్​
  • ఇందాపూర్ డెయిరీ.. హెరిటేజ్‌కు కో కంపెనీ అనడం విడ్డూరంగా ఉంది: లోకేశ్​
  • కో కంపెనీ ఉండదనే విషయం సీనియర్ నేత బొత్సకు తెలియదా?: మంత్రి లోకేశ్​
  • ఆధారాలు లేకున్నా హెరిటేజ్‌పై సెబీకి ఫిర్యాదు చేశారు: మంత్రి లోకేశ్​
  • టీ20 ప్రపంచకప్‌లో ఇండియా ఫైనల్‌ చేరితే తప్పనిసరిగా వెళ్తా: మంత్రి లోకేశ్​
  • మ్యాచ్ చూసేందుకు వస్తానంటే పులివెందుల ఎమ్మెల్యేకూ టికెట్‌ తీసుకుంటా: లోకేశ్​
  • బడ్జెట్‌పై చర్చ కావాలని మండలిలో వైసీపీ సభ్యులు అడగడం హాస్యాస్పదం: లోకేశ్​
  • చర్చ కావాలన్న వాళ్లు 4 రోజులు సభను ఎందుకు అడ్డుకున్నారు: లోకేశ్​

3:29 PM, 23 Feb 2026 (IST)

ముగిసిన శాసనమండలి బీఎసీ సమావేశం

  • శాంతిభద్రతలపై రేపు మండలిలో చర్చించాలని నిర్ణయం
  • ఈనెల 25న వ్యవసాయంపై మండలిలో చర్చించాలని నిర్ణయం
  • ఈనెల 26న కల్తీ లడ్డూ అంశంపై మండలిలో చర్చించాలని నిర్ణయం
  • రాష్ట్రంలో పెట్టుబడులు, ఇరిగేషన్, ఎడ్యుకేషన్‌పై మండలిలో స్వల్పకాలిక చర్చకు నిర్ణయం

3:29 PM, 23 Feb 2026 (IST)

సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగం

  • సామాజిక సమానత్వ లక్ష్యం కోసం కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది: సీఎం
  • రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు: చంద్రబాబు
  • సూపర్ సిక్స్ పథకాలు.. సూపర్ హిట్ చేశాం..: సీఎం చంద్రబాబు
  • ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేత కార్మికులకూ మేలు చేశాం: సీఎం
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు కేటాయింపులు ఎక్కువ చేశాం: సీఎం
  • పేదల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాం: సీఎం
  • మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకున్నాం: సీఎం చంద్రబాబు
  • కుటుంబానికి సంక్షేమ కార్డు తీసుకువచ్చి సాధికారత కోసం ప్రయత్నం: సీఎం
  • సమాజంలో ప్రతిఒక్కరూ గౌరవంగా జీవించేలా చేస్తాం: సీఎం చంద్రబాబు
  • సంజీవనితో వైద్యం విషయంలో పేదలకు ఆర్థిక వెసులుబాటు: సీఎం చంద్రబాబు
  • పేదవర్గాల అభ్యున్నతి లక్ష్యంగా పరిపాలన ఉండేలా చర్యలు: చంద్రబాబు

2:14 PM, 23 Feb 2026 (IST)

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం

  • కల్తీ పాల ఘటనపై అసెంబ్లీలో మాట్లాడిన సీఎం చంద్రబాబు
  • మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థికసాయం: సీఎం
  • వరలక్ష్మి మిల్క్‌ డెయిరీ పాలే అస్వస్థతకు కారణమని నిర్ధరించారు: సీఎం
  • నలుగురు చనిపోయారు.. 8 మంది ఆస్పత్రుల్లో ఉన్నారు: సీఎం
  • 8 మందిలో ఇద్దరు వెంటిలేటర్‌పై ఉన్నారు: సీఎం చంద్రబాబు
  • కల్తీకి కారణమైన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు: సీఎం
  • కల్తీచేసిన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది: సీఎం

1:43 PM, 23 Feb 2026 (IST)

తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం

  • సీఎం చంద్రబాబును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్‌లో కలిసిన మంత్రులు
  • తిరుమలలోనూ స్వర్ణ దేవాలయం తరహాలో చట్టం తీసుకొచ్చే ఆలోచనలో ప్రభుత్వం
  • ప్రత్యేక చట్టం ద్వారా తప్పుచేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం
  • ప్రత్యేక చట్టాన్ని టీటీడీకి కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం
  • స్వర్ణ దేవాలయం చట్టం వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు
  • ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే వెసులుబాటు
  • అన్యమతస్థులకు డిక్లరేషన్ నిబంధన మరింత కఠినతరం చేయాలనే అంశంపై చర్చ
  • లడ్డూలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో రేపు 4 గంటలపాటు చర్చ
  • రేపు ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం జీరో అవర్‌ రద్దు
  • రేపు ఉ. 10.30 నుంచి మ. 2 వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయం
  • టీడీపీ, జనసేన, బీజేపీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయం
  • స్వల్ప అస్వస్థత కారణంగా ఇవాళ సభకు రాని పవన్‌కల్యాణ్‌
  • రేపు సభకు వచ్చాక డిప్యూటీ సీఎం కూడా చర్చలో పాల్గొనే అవకాశం
  • రేపు మధ్యాహ్నం 12.30 నుంచి కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన
  • టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని నిర్ణయం
  • అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధన
  • ఇకనుంచి నిబంధనను తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు

1:08 PM, 23 Feb 2026 (IST)

మండలి ఛైర్మన్ నోటీసులు

  • రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలకు మండలి ఛైర్మన్ నోటీసులు
  • తన ముందు హాజరై రాజీనామాపై వివరణ ఇవ్వాలని సభ్యులకు నోటీసులు
  • ఈనెల 25న హాజరుకావాలని జయమంగళం వెంకటరమణకు ఛైర్మన్ నోటీసు
  • ఈనెల26 న హాజరుకావాలని బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌కు ఛైర్మన్ నోటీసు
  • ఈనెల 27న హాజరుకావాలని ఎమ్మెల్సీలు పోతుల సునీత, కర్రి పద్మశ్రీకి నోటీసులు

1:08 PM, 23 Feb 2026 (IST)

  • ఆందోళన చేస్తోన్న వైఎస్సార్సీపీ సభ్యులతో మండలి ఛైర్మన్ సమావేశం
  • ఈనెల 20న సభలో ఆందోళనకు సంబంధించి ఫుటేజ్‌ విడుదల చేయాలని కోరిన వైఎస్సార్సీపీ సభ్యులు
  • సభ్యుల డిమాండ్‌తో సీసీటీవీ విజువల్స్‌ను విడుదల చేస్తామని ఛైర్మన్ హామీ
  • మండలి ఛైర్మన్ హామీతో ఆందోళన విరమించిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు

1:07 PM, 23 Feb 2026 (IST)

బీఏసీ సమావేశం

  • మండలి ఛైర్మన్ మోషేన్ రాజు అధ్యక్షతన బీఏసీ సమావేశం
  • ఐదు రోజులుగా మండలిని స్తంభింపచేస్తోన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
  • ఇందాపూర్ ద్వారా టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరాపై చర్చించాలని వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన
  • మండలి సభా కార్యకలాపాలు విషయంపై బీఏసీలో చర్చ

1:07 PM, 23 Feb 2026 (IST)

వీధి కుక్కల దాడులు

  • గుంటూరులో వీధి కుక్కల దాడులపై కమిషనర్‌కు వినతిపత్రం
  • కూటమి నేతల ఆధ్వర్యంలో గుంటూరు కమిషనర్‌కు వినతిపత్రం అందజేత
  • పిల్లలు, మహిళలు, వృద్ధులపై పెరుగుతున్న కుక్కల దాడులు
  • కూటమి నేతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కమిషనర్
  • వారం రోజుల్లో కుక్కల తరలింపునకు చర్యలు తీసుకుంటామన్న కమిషనర్‌

1:06 PM, 23 Feb 2026 (IST)

చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకే వైఎస్సార్సీపీ బుకాయింపు

  • టీడీఎల్పీలో మంత్రులు అనగాని, బీసీ జనార్దన్‌రెడ్డి మధ్య చర్చ
  • టీడీఎల్పీలో కొల్లు రవీంద్ర, కొండపల్లి శ్రీనివాస్, మండిపల్లి మధ్య చర్చ
  • మండలిలోకి దేవుడి ఫోటోలు తీసుకురావడం మహాపరాధం: అనగాని
  • చేసిన తప్పు నుంచి తప్పించుకునేందుకే వైఎస్సార్సీపీ బుకాయింపు: అనగాని
  • వైఎస్సార్సీపీ హయాంలో లడ్డూ కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డి ఒప్పుకున్నారు: కొల్లు రవీంద్ర
  • కల్తీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే ధర్నా పేరిట వైఎస్సార్సీపీ కుంటి సాకులు: కొల్లు రవీంద్ర
  • సభలో కల్తీ అంశం చర్చకు వస్తే అడ్డంగా బుక్ అయ్యేది వైఎస్సార్సీపీనే: బీసీ జనార్దన్ రెడ్డి
  • సభను నిర్వహించే ఆలోచనలో వైఎస్సార్సీపీ లేదు: బీసీ జనార్దన్ రెడ్డి
  • సత్తా లేదు కాబట్టే ధర్నా పేరుతో సభను స్తంభింపజేస్తున్నారు: బీసీ జనార్దన్ రెడ్డి
  • వైఎస్సార్సీపీకి చిత్తశుద్ధి ఉంటే సభను సజావుగా నిర్వహించాలి: బీసీ జనార్దన్ రెడ్డి
  • వైఎస్సార్సీపీ లూప్‌ లైన్‌లో ఉంది: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
  • వైఎస్సార్సీపీ వాదనలో అర్ధం లేదు కాబట్టే సభ జరగనివ్వట్లేదు: కొండపల్లి
  • జగన్‌.. తాడేపల్లి ప్యాలెస్‌లో కూర్చుని సభ్యుల్ని అసెంబ్లీకి పంపారు: మండిపల్లి
  • మండలికి ఎందుకు వస్తున్నామో అర్థం కాని పరిస్థితి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలది: మండిపల్లి

1:05 PM, 23 Feb 2026 (IST)

వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లు

  • శాసనసభలో వివిధ శాఖల బడ్జెట్ డిమాండ్లు ప్రవేశపెట్టిన మంత్రులు
  • సాంఘిక సంక్షేమ శాఖకు రూ.11,118 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి డీఎస్‌బీవీ స్వామి
  • మహిళా, శిశు, గిరిజన సంక్షేమ శాఖకు రూ.4,764 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన సంధ్యారాణి
  • బీసీ సంక్షేమ శాఖకు రూ.34,350 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి సవిత
  • అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమానికి రూ.2,956 కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన ఎన్.ఎం.డి.ఫరూఖ్
  • పౌరసరఫరాలశాఖకు రూ.3,821కోట్ల డిమాండ్ ప్రవేశపెట్టిన మంత్రి నాదెండ్ల మనోహర్

1:05 PM, 23 Feb 2026 (IST)

గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పర్యటన

  • విజయనగరం విజ్జి క్రీడామైదానాన్ని సందర్శించిన గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు
  • క్రీడా మైదానాన్ని సందర్శించిన ఎంపీ కలిశెట్టి, డీఎస్డీవో వెంకటేశ్వర్లు
  • క్రీడా మైదానం అభివృద్ధిపై జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారులతో ఆరా
  • క్రీడా విభాగాల్లో రాణించిన వారికి క్రికెట్ బ్యాట్‌లు, నగదు చెక్కులు అందజేత

1:04 PM, 23 Feb 2026 (IST)

బంగారం ధరలు

  • ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,57,500
  • ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ. 1,44,900
  • ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,70,000
  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,65,000
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,47,900
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,80,000

12:34 PM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం: నాలుగుకు చేరిన అనూరియా మృతుల సంఖ్య

  • రాజమహేంద్రవరం: నాలుగుకు చేరిన అనూరియా మృతుల సంఖ్య
  • మృతుల్లో తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రుల్లో పలువురికి చికిత్స
  • కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు
  • రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
  • ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ
  • క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు
  • ఇప్పటినరకు మొత్తం 12 కేసులు నమోదయ్యాయి: డీఎంహెచ్‌వో
  • నలుగురు మరణించారు... మిగిలిన 8 మంది చికిత్స పొందుతున్నారు: డీఎంహెచ్‌వో
  • కొత్త కేసులు నమోదు కావట్లేదు: డీఎంహెచ్‌వో
  • వైద్య శిబిరాలు ఏర్పాటు చేశాం: డీఎంహెచ్‌వో
  • రక్తనమూనాల సేకరణ కొనసాగుతోంది: డీఎంహెచ్‌వ
  • ఎప్పటికప్పుడు పరిస్థితులను గమనించి సమీక్షలు చేస్తున్నాం: ఎస్పీ
  • పాలు సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం: ఎస్పీ
  • అనధికారికంగా నడుపుతున్న డెయిరీని సీజ్‌ చేశాం: ఎస్పీ
  • విజయవాడ నుంచి కూడా నిపుణులు వచ్చారు: ఎస్పీ
  • శాంపిళ్ల సేకరణ జరుగుతోంది.. వాటి ఫలితాలు వచ్చాక మరిన్ని వివరాలు వస్తాయి: ఎస్పీ
  • ఇప్పటివరకు 73 శాంపిల్స్‌ సేకరించాం: కలెక్టర్‌
  • ఇవాళ సాయంత్రానికి ఫలితాలు వస్తాయి: కలెక్టర్‌
  • ఇంటింటి సర్వే కొనసాగుతోంది: కలెక్టర్‌
  • ఎలాంటి లక్షణాలున్నా.. చికిత్స ఆందిస్తున్నాం: కలెక్టర్‌
  • 42 మంది రైతుల నుంచి పాల సేకరణ జరుగుతోంది: కలెక్టర్‌
  • పశువులు, వాటి ఆహారం శాంపిల్స్‌ సేకరించాం: కలెక్టర్‌
  • పాల వ్యాపారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు: కలెక్టర్‌
  • కేసు కూడా నమోదైంది.. దర్యాప్తు చేస్తున్నారు: కలెక్టర్‌
  • పాలు, పెరుగు శాంపిళ్లను ఫుడ్‌ సేఫ్టీ విభాగం సేకరించింది: కలెక్టర్‌
  • ఇప్పటివరకు నలుగురు మరణించారు: కలెక్టర్‌
  • తాడి కృష్ణవేణి, తాడి రమణి, రాధాకృష్ణమూర్తి, శేషగిరిరావు మరణించారు: కలెక్టర్‌
  • 8 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు: కలెక్టర్‌
  • ఇంటింటికి వెళ్లి రక్త నమూనాల సేకరణ కొనసాగుతోంది: కలెక్టర్‌
  • ఏ లక్షణాలున్నా కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చు: కలెక్టర్‌
  • 94940 60060 కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చు: కలెక్టర్‌

12:16 PM, 23 Feb 2026 (IST)

సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు

  • సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • కల్తీ నెయ్యి కేసు ఏకసభ్య కమిటీని సవాల్‌ చేస్తూ సుబ్రహ్మణ్యస్వామి పిటిషన్‌
  • సిట్‌ నివేదిక మేరకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • ఏక‌స‌భ్య క‌మిటీని స‌వాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక క‌మిటీ ఓవ‌ర్‌లాపింగ్ కిందకు రాద‌ని స్పష్టీక‌ర‌ణ‌
  • ప‌రిపాల‌నాప‌ర‌మైన లోపాల‌ గుర్తింపునకు ఏర్పాటుచేసింద‌న్న సీజేఐ ధ‌ర్మాస‌నం
  • రాజ్యాంగ‌ ప‌ద‌వుల్లోనివారు ఈ వ్యవహారంపై మాట్లాడకుండా నిలువరించాల‌న్న సుబ్రహ్మణ్యస్వామి
  • సుబ్రహ్మణ్యస్వామి తరఫు న్యాయ‌వాది విన‌తిని తోసిపుచ్చిన ధ‌ర్మాస‌నం
  • కోర్టు ప‌రిధిలో ఉన్నందున ప్రభావం చూపే ప‌రిస్థితి ఎక్కడిదన్న సుప్రీంకోర్టు
  • రాష్ట్ర ప్రభుత్వం క‌మిటీ ఏర్పాటు చేయ‌డం సిట్ ద‌ర్యాప్తున‌కు వ్యతిరేకం కాదు: సుప్రీం
  • పిటిష‌న‌ర్ వ్యక్తంచేసిన అనుమానాల‌కు ఆధారాలు లేవు: సుప్రీంకోర్టు
  • రెండు కార్యక్రమాలు చ‌ట్టప్రకారం కొన‌సాగాలి: సుప్రీంకోర్టు

12:15 PM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరంలో అస్వస్థత, మరణాలపై సీఎం సమీక్ష

  • రాజమహేంద్రవరంలో అస్వస్థత, మరణాలపై సీఎం సమీక్ష
  • కల్తీ పాల కారణంగా అనారోగ్యం బారిన పడిన ఘటనపై అధికారులతో సమీక్ష
  • సీఎం సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, ఎస్పీ, వైద్యారోగ్య శాఖ అధికారులు
  • అనారోగ్యం బారిన పడిన, మరణించిన ఘటనపై వివరాలు తెలుసుకున్న సీఎం
  • ప్రస్తుతం బాధితులకు అందుతున్న వైద్యసాయాన్ని సీఎంకు వివరించిన అధికారులు
  • చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యసాయం అందించాలని సూచన
  • పాల నమూనాలను సేకరించి ల్యాబ్‌కు పంపామని తెలిపిన అధికారులు
  • వైద్య శిబిరాలతో పాటు ర్యాపిడ్ టెస్ట్ మెడికల్ క్యాంపులు పెట్టామన్న అధికారులు
  • ఫలితాల అనంతరం విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించిన సీఎం
  • ఫుడ్ సేఫ్టీ, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు రాజమహేంద్రవరం వెళ్లాలని ఆదేశం

10:59 AM, 23 Feb 2026 (IST)

మందలించాడన్న కోపంతో తండ్రిని కత్తితో నరికి చంపిన చంద్రమహేష్‌

  • కృష్ణా జిల్లా కొడిపర్రు డి.పి.గూడెంలో తండ్రిని చంపిన తనయుడు
  • మద్యానికి బానిసైన కుమారుడిని మందలించిన తండ్రి సురేష్‌
  • మందలించాడన్న కోపంతో తండ్రిని కత్తితో నరికి చంపిన చంద్రమహేష్‌
  • మెడ, చేతులపై విచక్షణ రహితంగా కత్తితో నరికిన తనయుడు చంద్ర మహేష్
  • ఆస్పత్రికి తరలించేలోగా చంద్ర మహేష్‌ మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు

10:59 AM, 23 Feb 2026 (IST)

కృష్ణా జిల్లా పెనమలూరులోని కళాశాల విద్యార్థి ఆత్మహత్య

  • కృష్ణా జిల్లా పెనమలూరులోని కళాశాల విద్యార్థి ఆత్మహత్య
  • విజయవాడ స్టేషన్‌లో రైలుకిందపడి విద్యార్థి గణేష్ ఆత్మహత్య
  • కళాశాలలో జరిగిన వివాదంలో గణేష్‌ను ప్రిన్సిపల్‌ మందలించినట్లు సమాచారం
  • నిన్న రాత్రి కళాశాల గోడ దూకి విజయవాడ స్టేషన్‌కు వెళ్లిన గణేష్‌

10:58 AM, 23 Feb 2026 (IST)

అసెంబ్లీ: చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమంపై మంత్రి సవిత సమాధానం

  • అసెంబ్లీ: చేనేత కార్మికుల సమస్యలు, సంక్షేమంపై మంత్రి సవిత సమాధానం
  • వైసీపీ హయాంలో రూ.120 కోట్లు ఆప్కో నిధులను దారిమళ్లించింది: మంత్రి సవిత
  • అప్కో పేరిట తీసుకున్న బకాయిలు చెల్లించేందుకు చర్యలు: మంత్రి సవిత
  • యూనివర్సల్ హెల్త్ స్కీమ్‌ కింద చేనేతలకు వైద్యసేవలు అందించేలా చర్యలు: మంత్రి సవిత
  • చేనేతలకు ప్రోత్సాహకంగా తరచుగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం: మంత్రి సవిత
  • చేనేత, ఉప ఉత్పత్తుల తయారీదారులకు కూడా సంక్షేమ పథకాలు అందుతాయి: మంత్రి సవిత

10:36 AM, 23 Feb 2026 (IST)

23 february 2026 Andhra Pradesh News Today Live Updates: శాసన మండలి సమావేశాలు వాయిదా

  • శాసన మండలి సమావేశాలు వాయిదా
  • ఇందాపూర్ డెయిరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చకు వైఎస్సార్​సీపీ వాయిదా తీర్మానం
  • వైఎస్సార్​సీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి ఛైర్మన్
  • ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని పోడియం వద్ద వైఎస్సార్​సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
  • వైఎస్సార్​సీపీ సభ్యుల ఆందోళనతో సభను కాసేపు వాయిదా వేసిన మండలి ఛైర్మన్

10:35 AM, 23 Feb 2026 (IST)

సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడిపై ప్రశ్నకు హోంమంత్రి సమాధానం

  • అసెంబ్లీ: సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాల కట్టడిపై ప్రశ్నకు హోంమంత్రి సమాధానం
  • తప్పుడు ప్రచారాల కట్టడిపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటైంది: హోంమంత్రి అనిత
  • సామాజిక మాధ్యమాల నుంచి ఫిర్యాదు అధికారులను ఆహ్వానించాం: హోంమంత్రి
  • అధికారులతో కూడా చర్చించి విద్వేష, అసభ్య పోస్టుల కట్టడికి చర్యలు: హోంమంత్రి
  • రాష్ట్రంలో ఇప్పటివరకూ సోషల్ మీడియా పోస్టులపై 1,384 కేసులు: హోంమంత్రి
  • వెయ్యిమందిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టాం: హోంమంత్రి అనిత
  • కొత్త చట్టం తెచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం: హోంమంత్రి అనిత
  • పాఠశాల విద్యార్థులు సోషల్ మీడియా వినియోగించకుండా చట్టం తెచ్చే ఆలోచన ఉంది: హోంమంత్రి

10:16 AM, 23 Feb 2026 (IST)

మొత్తం 50 మంది నుంచి గణేష్‌ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌

  • రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
  • మొత్తం 50 మంది నుంచి గణేష్‌ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • పాలు పోసిన కుటుంబాలను గుర్తించారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • పాలు, పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • ఘటనపై మంత్రులు సత్యకుమార్, లోకేష్‌ ఆరా తీస్తున్నారు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌

10:15 AM, 23 Feb 2026 (IST)

తాడేపల్లి: పెనుమాకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌

  • తాడేపల్లి: పెనుమాకలో క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిని పట్టుకున్న టాస్క్‌ఫోర్స్‌
  • బెట్టింగ్ నిర్వాహకుడి నుంచి సుమారు రూ.60 వేలు స్వాధీనం
  • 12 మంది యువకులు బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించిన తాడేపల్లి పోలీసులు

10:15 AM, 23 Feb 2026 (IST)

బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌పై కేసు

  • బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడె రామచంద్ర యాదవ్‌పై కేసు
  • బోడె రామచంద్ర యాదవ్‌పై మంగళగిరి గ్రామీణ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు
  • నిన్న జరిగిన బహిరంగ సభ నిర్వహణలో కోర్టు ఆదేశాలు ఉల్లంఘించారని కేసు
  • సెక్షన్ 30 అతిక్రమించి ర్యాలీ చేశారని కేసు నమోదు చేసిన పోలీసులు

10:15 AM, 23 Feb 2026 (IST)

మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆయన ఛాంబర్‌లో కలిసిన కూటమి ఎమ్మెల్సీలు

  • మండలి ఛైర్మన్ మోషేన్ రాజును ఆయన ఛాంబర్‌లో కలిసిన కూటమి ఎమ్మెల్సీలు
  • చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోలతో సభకు వచ్చిన ఎమ్మెల్సీల సస్పెన్షన్‌కు డిమాండ్
  • సభ సజావుగా నడిపించాలని స్పష్టం చేసిన కూటమి నేతలు
  • సభా సమయం వృథా చేయకుండా చూడాలన్న నేతలు

10:14 AM, 23 Feb 2026 (IST)

పార్వతీపురం మన్యం జిల్లాలో 3 కి.మీ. కాలినడకన మృతదేహం తీసుకెళ్లిన ఘటన

  • పార్వతీపురం మన్యం జిల్లాలో 3 కి.మీ. కాలినడకన మృతదేహం తీసుకెళ్లిన ఘటన
  • దేరువాడ నుంచి వనకాబడికి రహదారి సౌకర్యం లేక డోలీలో మృతదేహం తరలింపు
  • మన్యం జిల్లా: రహదారి సౌకర్యం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్న స్థానికులు

10:14 AM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి

  • రాజమహేంద్రవరం ఘటనపై ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది: ఎమ్మెల్యే ఆదిరెడ్డి
  • మొత్తం 50 మంది నుంచి గణేష్‌ అనే వ్యాపారి పాలు సేకరించారు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • పాలు పోసిన కుటుంబాలను గుర్తించారు: ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • పాలు, పెరుగు నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపించాం: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • ఘటనపై మంత్రులు సత్యకుమార్, లోకేష్‌ ఆరా తీస్తున్నారు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సేకరిస్తున్నాం: ఆదిరెడ్డి శ్రీనివాస్‌
  • ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదు: ఆదిరెడ్డి శ్రీనివాస్‌

10:13 AM, 23 Feb 2026 (IST)

రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో పోలీసు అధికారి సునీల్‌కుమార్‌ నాయక్‌ అరెస్టు

  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో పోలీసు అధికారి సునీల్‌కుమార్‌ నాయక్‌ అరెస్టు
  • గతంలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌కుమార్‌ నాయక్‌
  • కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌కుమార్‌ నాయక్‌
  • బిహార్‌ క్యాడర్‌కు చెందిన సునీల్‌కుమార్‌ నాయక్‌ను అరెస్టు చేసిన పోలీసులు
  • బిహార్‌ నుంచి గుంటూరు నగరంపాలెం పీఎస్‌కు తీసుకొస్తున్న పోలీసులు
  • ఏపీ పోలీసుల అదుపులో బిహార్‌ క్యాడర్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సునీల్‌ నాయక్‌
  • రఘురామ కస్టోడియల్‌ టార్చర్‌ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్‌ నాయక్‌
  • కస్టోడియల్‌ టార్చర్‌ సమయంలో సీఐడీ డీఐజీగా పనిచేసిన సునీల్‌ నాయక్‌
  • గుంటూరు నగరంపాలెం పోలీసుస్టేషన్‌లో సునీల్‌ నాయక్‌పై కేసు
  • సునీల్‌ నాయక్‌ను బిహార్‌లో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు

10:13 AM, 23 Feb 2026 (IST)

నాకు అత్యంత ఆప్తుడు ఎర్రన్నాయుడు: సీఎం

  • నాకు అత్యంత ఆప్తుడు ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: సీఎం
  • ఎమ్మెల్యేగా, లో‍క్‍సభ సభ్యుడిగా, కేంద్రమంత్రిగా ఆయన సేవలు మరువలేనివి: సీఎం
  • చివరిక్షణం వరకూ ప్రజాసేవలోనే గడిపిన ఎర్రన్న స్ఫూర్తి అందరికీ ఆదర్శం: సీఎం

9:33 AM, 23 Feb 2026 (IST)

బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు: మంత్రి లోకేష్‌

  • బలహీనవర్గాల అభ్యున్నతికి అవిశ్రాంతంగా కృషిచేసిన వ్యక్తి ఎర్రన్నాయుడు: మంత్రి లోకేష్‌
  • రాజకీయాల్లో విలక్షణ నాయకుడిగా ఎర్రన్నాయుడు పేరుగడించారు: మంత్రి లోకేష్‌
  • కేంద్రమంత్రిగా, టీడీపీ సీనియర్ నేతగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం: లోకేష్‌
  • ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా ఘన నివాళులర్పిస్తున్నా: మంత్రి లోకేష్‌

9:33 AM, 23 Feb 2026 (IST)

విశాఖ: గాజువాక గంగవరం పోర్ట్ రోడ్డులో రాత్రి దోపిడీ

  • విశాఖ: గాజువాక గంగవరం పోర్ట్ రోడ్డులో రాత్రి దోపిడీ
  • పార్కింగ్‌ చేసి వెళ్తున్న బిహార్‌ లారీ డ్రైవర్‌ను అడ్డగించిన దుండగులు
  • కత్తితో బెదిరించి లారీ డ్రైవర్‌ నుంచి నగదు లాక్కెళ్లిన దుండగులు
  • దోపిడీ ఘటనపై దర్యాప్తు చేస్తున్న గాజువాక క్రైమ్ పోలీసులు

9:33 AM, 23 Feb 2026 (IST)

అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్‌

  • అసెంబ్లీ లాబీలో మీడియాతో మంత్రి నారా లోకేష్ చిట్‌చాట్‌
  • లడ్డూ కల్తీకి సంబంధించి వాస్తవాలన్నీ రేపు అసెంబ్లీలో పెడతాం: లోకేష్‌
  • దేవదేవుడికి జరిగిన మహాపచారం అసెంబ్లీ వేదికగానే బయటపెడతాం: లోకేష్‌
  • అసెంబ్లీకి రావాలని ఎవరూ బొట్టుపెట్టి పిలవరు: మంత్రి నారా లోకేష్‌
  • సభకు రావడం సభ్యులుగా వారి బాధ్యత: మంత్రి నారా లోకేష్‌
  • దేవుడిని కూడా వైసీపీ రోడ్డుమీదకు తీసుకురావడం బాధాకరం: లోకేష్‌
  • దేవుడి ఫొటోలతో చట్టసభల్లో ర్యాలీలు ఆక్షేపణీయం: మంత్రి నారా లోకేష్‌

9:03 AM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో 4కు చేరిన మృతుల సంఖ్య

  • రాజమహేంద్రవరం: కిడ్నీ సంబంధిత సమస్యతో 4కు చేరిన మృతుల సంఖ్య
  • ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ ఇద్దరు వృద్ధులు మృతి
  • లాలాచెరువు చౌడేశ్వరినగర్‌కు చెందిన శేషగిరిరావు(65), రాధాకృష్ణమూర్తి(74) మృతి
  • కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న 11 మంది బాధితులు
  • కలుషిత పాలు తాగి అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరిన బాధితులు
  • రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
  • ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ
  • క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసిన అధికారులు
  • ఘటనపై ఇంటింటా సర్వే చేపట్టిన ఆరోగ్యశాఖ, నగరపాలక అధికారులు

9:03 AM, 23 Feb 2026 (IST)

తిరుమలలో రూ.300 క్యూలైన్‌లో పాము కలకలం

  • తిరుమలలో రూ.300 క్యూలైన్‌లో పాము కలకలం
  • తెలంగాణకు చెందిన భక్తురాలు మౌనిక(27)ను కాటేసిన పాము
  • తిరుమల: భక్తురాలి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యుల వెల్లడి

9:03 AM, 23 Feb 2026 (IST)

మ‌హాశివ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళ‌హ‌స్తిలో ప్రవచన కార్యక్రమం మంచి ఆలోచన: లోకేష్‌

  • మ‌హాశివ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో శ్రీకాళ‌హ‌స్తిలో ప్రవచన కార్యక్రమం మంచి ఆలోచన: లోకేష్‌
  • ఇవాళ సాయంత్రం బ్రహ్మశ్రీ చాగంటి ప్రవ‌చ‌నాలు చాలా మంచి ఆలోచ‌న‌: లోకేష్‌
  • ప్రవ‌చ‌నాల కార్యక్రమం ఏర్పాటు చేసిన నిర్వాహ‌కుల‌కు అభినంద‌న‌లు: మంత్రి లోకేష్‌
  • భ‌క్తి భావ‌న‌, ఆధ్యాత్మిక చింత‌న‌తో ప్రజ‌ల్లో నైతిక విలువ‌లు పెరుగుతాయి: మంత్రి లోకేష్‌
  • మంచి ఆలోచనతో ఏర్పాటు చేసిన కార్యక్రమం విజ‌య‌వంతం కావాల‌ని కోరుకుంటున్నా: లోకేష్‌

7:16 AM, 23 Feb 2026 (IST)

నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు

  • నేటి నుంచి మార్చి 24 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు
  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్‌ పరీక్షలు
  • ఇంటర్ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,537 పరీక్షా కేంద్రాలు
  • 45 కేంద్రాలను సున్నిత కేంద్రాలుగా గుర్తించిన అధికారులు
  • ఇంటర్‌ పరీక్షలు రాయనున్న 10,57,899 మంది విద్యార్థులు
  • సెట్‌-1 ప్రశ్నపత్రం ఎంపిక చేసిన ఇంటర్‌ బోర్డు కార్యదర్శి రంజిత్‌ బాషా

7:16 AM, 23 Feb 2026 (IST)

తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం

  • తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
  • శ్రీవారి సర్వదర్శనానికి 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 76,506 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.20 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,049 మంది భక్తులు

6:44 AM, 23 Feb 2026 (IST)

శాసనసభలో నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • నేడు ఎనిమిదో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
  • శాసనసభలో నేడు రెండు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • ఏపీ జైళ్లు, సంస్కరణ సర్వీసుల బిల్లు ప్రవేశపెట్టనున్న హోంమంత్రి అనిత
  • రైతుల నీటి పారుదల వ్యవస్థల యాజమాన్య సవరణ బిల్లు ప్రవేశపెట్టనున్న మంత్రి నిమ్మల
  • విద్యుత్ చట్టంలోని 182వ సెక్షన్‌ ప్రతులను సభలో పెట్టనున్న మంత్రి గొట్టిపాటి
  • శాఖల వారీగా బడ్జెట్‌ పద్దులపై చర్చ- ఆమోదం

6:44 AM, 23 Feb 2026 (IST)

అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులు నేడు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

  • అసెంబ్లీ ఆమోదించిన ఏడు బిల్లులు నేడు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
  • పురపాలక శాఖకు సంబంధించి రెండు చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
  • దేవదాయ శాఖకు సంబంధించి రెండు చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
  • విద్యుత్‌, పంచాయతీ రాజ్‌ శాఖల చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
  • వైద్యారోగ్య శాఖ సంబంధించి చట్ట సవరణ బిల్లులు మండలిలో పెట్టనున్న ప్రభుత్వం
  • శాసనమండలిలో శాంతి భద్రతలపై నేడు లఘు చర్చ

6:43 AM, 23 Feb 2026 (IST)

కర్నూలులో హత్య దారుణ హత్య

  • కర్నూలులో హత్య దారుణ హత్య
  • కర్నూలు: పాతబస్టాండ్‌లోని అనిల్ బార్ వద్ద మనోహర్‌ హత్య
  • కర్నూలు: మనోహర్ అనే వ్యక్తి ని హత్య చేసిన దుండగులు

6:43 AM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం: అనూరియా కేసులపై మంత్రి కందుల దుర్గేష్‌ ఆరా

  • రాజమహేంద్రవరం: అనూరియా కేసులపై మంత్రి కందుల దుర్గేష్‌ ఆరా
  • అనూరియా కేసుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దుర్గేష్
  • కలెక్టర్‌, వైద్యశాఖ అధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్న మంత్రి
  • నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి: మంత్రి దుర్గేష్‌

6:43 AM, 23 Feb 2026 (IST)

రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ

  • రాజమహేంద్రవరం ఘటనపై అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ
  • ఘటన జరిగిన ప్రాంతాల్లో పాలు, నీరు, ఇతర నమూనాల సేకరణ క్షేత్రస్థాయిలో వైద్య శిబిరాల ఏర్పాటు చేసి రాపిడ్ రెస్పాన్స్ పర్యటన
  • రాజమహేంద్రవరం: ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న వారి పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
Last Updated : February 23, 2026 at 9:47 PM IST