21-02-2026 AndhraPradesh News Today Live : ఏపీ లిక్కర్ స్కాం కేసు - వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
ap live news updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 21, 2026 at 7:12 AM IST
|Updated : February 21, 2026 at 10:51 PM IST
21-02-2026 Andhra Pradesh News Live -నెల్లూరు: కల్తీ నెయ్యి అంశంపై కూటమి పార్టీల ఉమ్మడి సమావేశం
LIVE FEED
కెనరా బ్యాంకు వద్ద ఏటీఎం గార్డుపై యువకుల దాడి
- కడప: రాజంపేట కెనరా బ్యాంకు వద్ద ఏటీఎం గార్డుపై యువకుల దాడి
- సెక్యూరిటీ గార్డు ఉదయగిరి రాజా తలకు గాయం, ఆస్పత్రికి తరలింపు
- దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన రాజంపేట పోలీసులు
విజయవాడ-మచిలీపట్నం హైవేపై రోడ్డు ప్రమాదం
- విజయవాడ-మచిలీపట్నం హైవేపై పామర్రు వద్ద రోడ్డు ప్రమాదం
- కురుమద్దాలి పైవంతెన అండర్‌పాస్ కల్వర్టును ఢీకొని ముక్కలైన కారు
- ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి
- కారు నుంచి మృతదేహన్ని బయటకు తీసేందుకు శ్రమించిన పోలీసులు
గుంటూరు జిల్లా జైలుకు ఏ2 వాసుదేవరెడ్డి
- గుంటూరు జిల్లా జైలుకు మద్యం స్కామ్ ఏ2 నిందితుడు వాసుదేవరెడ్డి
- విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి గుంటూరు జైలుకు తరలించిన అధికారులు
- వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న వాసుదేవరెడ్డి
- వాసుదేవరెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన ఏసీబీ కోర్టు
గుర్తుతెలియని వాహనం బైక్ ఢీ - ఇద్దరు మృతి
- నెల్లూరు: సైదాపురంలోని రాపూరు రోడ్డుపై ప్రమాదం, ఇద్దరు మృతి
- గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు మృతి
- మృతులను చాగణం గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు
నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం
- తూ.గో. జిల్లాలో నాలుగేళ్ల బాలికపై 70 ఏళ్ల వృద్ధుడు అత్యాచారయత్నం
- బాలికను వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- వృద్ధుడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించిన పోలీసులు
వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- వాసుదేవరెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
- మద్యం స్కాం కేసులో వాసుదేవరెడ్డిది కీలకపాత్రగా పేర్కొన్న రిమాండ్ రిపోర్టు
- వాసుదేవరెడ్డి పాత్ర కీలకమని ఆధారాలు, ఎఫ్‌ఎస్‌ఎల్ నివేదికలు, సాక్షుల వెల్లడి
- మద్యం కుంభకోణంలో కీలక వ్యక్తిగా వ్యవహరించినట్లు రిమాండ్ రిపోర్టు వెల్లడి
- అమ్మకం, కొనుగోలు, ఆర్డర్లు, సరఫరా.. ఆయన కనుసన్నల్లోనే జరిగాయని వెల్లడి
- ఆన్‌లైన్‌లో ఉన్నవాటిని మాన్యువల్‌గా మార్చడంలో కీలకపాత్ర పోషించారని వెల్లడి
- ఏపీఎస్‌బీసీఎల్ మొత్తాన్ని ఎలాంటి అనుమతి లేకుండా మాన్యువల్‌గా నడిపారని వెల్లడి
- సిండికేట్‌గా ఉంటూ అధికారులు, సిబ్బందిని నడిపించారని వెల్లడి
- రాజ్ కెసిరెడ్డి, అతడి అనుచరులు సుమిత్, ప్రకాష్ ద్వారా సెటిల్‌మెంట్లు చేశారని వెల్లడి
- ఓఎఫ్‌ఎస్ మొత్తాన్ని సిండికేట్ మెంబర్స్‌తో కలిసి నడిపించారని వెల్లడి
- ఆర్డర్స్ ద్వారా కిట్ బ్యాగ్స్ తరలింపు, బ్రాండ్స్ మార్పు, సేల్స్ సమీక్ష చేశారని వెల్లడి
- నచ్చని బ్రాండ్లను ఆపడం వంటి పనుల్లో వాసుదేవరెడ్డిది కీలక పాత్రని వెల్లడి
- లిక్కర్ కంపెనీలను బెదిరించి యజమానుల నుంచి డబ్బు వసూలు చేశారని వెల్లడి
- పర్సంటేజ్ రూపంలో వసూళ్లు చేసి నేరాలకు పాల్పడ్డారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి
- పబ్లిక్ సర్వెంట్‌గా ఉంటూ నేరాలు ప్రేరేపించేలా వ్యవహరించారని వెల్లడి
- ఏ2గా ఉన్న వాసుదేవరెడ్డి తన విధులను దుర్వినియోగం చేశారని వెల్లడి
- ప్రభుత్వ ఖజానాకు వాసుదేవరెడ్డి రూ.192 కోట్లు నష్టం చేశారని వెల్లడి
- సేల్స్, ఆర్డర్స్‌ను ప్రైవేటు వ్యక్తులకు షేర్ చేశారని రిమాండ్ రిపోర్టులో వెల్లడి
- వాసుదేవరెడ్డి ద్వారా ప్రతినెలా రూ.60 కోట్ల వరకు దారి మళ్లించారని వెల్లడి
- లిక్కర్ స్కాం ఎలా చేయాలనే దానిపై తరచూ సమావేశాలు నిర్వహించారని వెల్లడి
వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్
- వాసుదేవరెడ్డికి ఈ నెల 27 వరకు రిమాండ్ విధించిన ఏసీబీ కోర్టు
- కాసేపట్లో గుంటూరు జిల్లా జైలుకు తరలించనున్న పోలీసులు
ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
- వాసుదేవరెడ్డి రిమాండ్‌పై ఏసీబీ కోర్టులో ముగిసిన వాదనలు
- సిట్ విచారణకు వాసుదేవరెడ్డి సహకరించారన్న అతడి తరఫు న్యాయవాది
- ఈ కేసులో వాసుదేవరెడ్డి అప్రూవర్‌గా మారారన్న అతడి తరఫు న్యాయవాది
- వాసుదేవరెడ్డిని అత్యవసరంగా అరెస్టు చేయాల్సిన అవసరం లేదన్న న్యాయవాది
- ప్రాసిక్యూషన్ ఏజెన్సీకి వాసుదేవరెడ్డి సహకరిస్తున్నారన్న ఆయన తరఫు న్యాయవాది
వాసుదేవరెడ్డి అరెస్టు
- విజయవాడ: మద్యం కేసులో కీలక పరిణామం
- మద్యం కేసులో ఏ2 వాసుదేవరెడ్డిని అరెస్టు చేసిన సిట్
- వాసుదేవరెడ్డిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచిన సిట్
- వైసీపీ హయాంలో ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పనిచేసిన వాసుదేవరెడ్డి
- గతంలో వాసుదేవరెడ్డి ముందస్తు బెయిల్‌ను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
మద్యం కేసు
- మద్యం కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై విచారణ ఈ నెల 27కు వాయిదా
- విచారణను ఈ నెల 27కు వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
- ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, గోవిందప్ప పిటిషన్‌పై విచారణ వాయిదా
తగ్గిన మలేరియా కేసులు
- మలేరియా కేసులపై మంత్రి సత్యకుమార్‌కు వివరించిన అధికారులు
- రాష్ట్రంలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టాయన్న అధికారులు
- మలేరియా కేసులు 71.57 శాతం తగ్గాయని అధికారుల వెల్లడి
- అల్లూరి, మన్యం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదయ్యాయని వెల్లడి
- బాపట్ల, ప.గో., కోనసీమ జిల్లాల్లో మలేరియా కేసులు లేవన్న అధికారులు
- వినుకొండ పీహెచ్‌సీని వందపడకల ఆస్పత్రిగా మారుస్తున్నాం: సీఎం
- వినుకొండలో డయాలసిస్, ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం: సీఎం
- వినుకొండలో పచ్చదనం పెంచేందుకు నిధులు కేటాయిస్తాం: సీఎం
వ్యర్ధాల సేకరణ కోసం అనుసరించాల్సిన విధానాలను దిశానిర్దేశం చేసిన సీఎం
- వినుకొండలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమానికి హాజరైన సీఎం
- ఘన వ్యర్ధాల సేకరణకు నిర్ధేశించిన స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన సీఎం
- వ్యర్ధాల సేకరణ కోసం అనుసరించాల్సిన విధానాలను దిశానిర్దేశం చేసిన సీఎం
- మార్చినాటికి గ్రామీణ ప్రాంతాల్లో వందశాతం డోర్ టు డోర్ కలెక్షన్ చేపట్టాలని ఆదేశం
- వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను తిలకించిన సీఎం చంద్రబాబు
- స్వయం సహాయ సంఘాల ద్వారా చేపట్టిన చిల్లీ, మెయిజ్ ప్రాసెసింగ్ ప్లాంట్ పరిశీలన
- స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ తదితర స్టాళ్లను పరిశీలించి అధికారులకు దిశానిర్దేశం
- 561 స్వయం సహాయ సంఘాలకు రూ.100.14 కోట్ల చెక్కును అందించిన సీఎం
- మొక్కజొన్న వేస్ట్‌తో తయారుచేసిన ఉత్పత్తులను పరిశీలించిన సీఎం
ఆలయాన్ని శుద్ధి చేసిన ప్రత్తిపాటి
- చిలకలూరిపేటలో వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని శుద్ధిచేసిన ప్రత్తిపాటి
- కలియుగ దైవంతో వైసీపీ రాజకీయ పరాచకాలు ఆడుతోంది: ప్రత్తిపాటి
- స్వామివారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవడం మహాపాపం: ప్రత్తిపాటి
- శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీయాలన్నదే వైసీపీ లక్ష్యం: ప్రత్తిపాటి
- కల్తీనెయ్యి వినియోగించారని రుజువైనా.. కావాలనే మండలిలో రచ్చ చేస్తున్నారు: ప్రత్తిపాటి
- కల్తీనెయ్యి అంశాన్ని పక్కదారి పట్టించడానికే హెరిటేజ్ సంస్థను రాజకీయాల్లోకి లాగారు: ప్రత్తిపాటి
రుణ యాప్ వేధింపులు
- మచిలీపట్నం కాసానిగూడేనికి చెందిన గిరీష్ కుమార్ ఆత్మహత్య
- రుణ యాప్ వేధింపులతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువుల ఆరోపణ
- బెల్ కంపెనీలో ఔట్‌సోర్సింగ్ విధానంలో సెక్యూరిటీ గార్డుగా విధుల నిర్వహణ
- వ్యక్తిగత అవసరాల నిమిత్తం ప్రైవేట్ లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకున్న గిరీష్
రాజమహేంద్రవరంలో కూటమి నేతల సమావేశం
- వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అరాచకాన్నే నమ్ముకున్నారు -కూటమి నేతలు
- అధికారంలో లేకున్నా వైఎస్సార్సీపీ అరాచకాన్నే నమ్ముకుంది
- వైఎస్సార్సీపీ అరాచకవాదానికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు
- చెప్పులు లేకుండా కాలినడకన కొండ ఎక్కే సంప్రదాయం మనది
- కాలికి చెప్పులు, బూట్లు వేసుకొని వెంకటేశ్వరస్వామి ఫొటోను ప్లకార్డుగా వాడతారా?
- హిందుత్వంపై వైఎస్సార్సీపీకి ఏమాత్రం గౌరవం లేదు
- లడ్డూలో వాడిన కల్తీ నెయ్యినే మీ ఇళ్లలో వాడతారా?
- కలియుగ దైవం వెంకన్న పవిత్రతను కాపాడాల్సిన అవసరం ఉంది
- చెప్పుల కాళ్లతో వెంకన్న స్వామి ఫొటోను ప్లకార్డుగా పట్టుకున్నారు
- మండలి వాయిదా వేయగానే వెంకన్న ఫొటోలను విసిరేసి వెళ్లారు
- జగన్ ఆదేశాల మేరకే సభ్యులు ప్రవర్తించినట్లు స్పష్టంగా కనపడుతోంది
- వెంకన్న ఫొటోలతో ఉన్న ప్లకార్డులను చెప్పులు వేసుకొని పట్టుకోలేదని బొత్స బుకాయించారు
- ఫొటోలు, వీడియోలతో సహా ఆధారాలు చూపించాం ఇప్పుడు బొత్స ఏమంటారు? -కూటమి నేతలు
ఏసీబీ వలలో డిప్యూటీ తహసీల్దార్
- ఏసీబీ వలలో విజయవాడ అజిత్‌సింగ్ నగర్ నార్త్ జోన్ డిప్యూటీ తహసీల్దార్ అప్పారావు
- ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం రూ.12 వేలు లంచం డిమాండ్ చేసిన అప్పారావు
- బాంబే కాలనీకి చెందిన సాయి ఫిర్యాదు మేరకు తనిఖీలు చేసిన ఏసీబీ అధికారులు
వినుకొండలో చంద్రబాబు
- పల్నాడు జిల్లా వినుకొండ ప్రజావేదికలో పాల్గొన్న చంద్రబాబు
- స్వచ్ఛరథం వాహనాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- దివ్యాంగులకు మూడు చక్రాల వాహనాలను అందజేసిన సీఎం
- ప్రజావేదిక వద్ద స్టాళ్లను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- కాసేపట్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు
ఏసీబీ వలలో
- విజయవాడ పశ్చిమ తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు
- లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సూపరిండెండెంట్ చింతకాయల అప్పారావు
- ఫ్యామిలీ సర్టిఫికెట్‌కు రూ.12 వేల లంచం తీసుకుంటుండగా పట్టుబడిన సూపరింటెండెంట్
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,800
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,43,340
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ. 2,68,000
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,46,000
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,75,000
పేరులోనే సత్యం మాట్లాడేవన్నీ అసత్యాలే
- ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రలో పాల్గొన్న డీఎస్‌బీవీ స్వామి
- స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న చెత్త ఊడ్చిన మంత్రి డీఎస్‌బీవీ స్వామి
- గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత పెంపుకు కూటమి ప్రభుత్వం కృషి: డీఎస్‌బీవీ స్వామి
- జగన్ కళ్లలో ఆనందం కోసం వెంకటేశ్వర స్వామితో ఆటలాడుతారా?: డీఎస్‌బీవీ స్వామి
- బొత్స పేరులోనే సత్యం ఆయన మాట్లాడేవన్నీ అసత్యాలే: డీఎస్‌బీవీ స్వామి
- జగన్‌కు దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం లేదు: డీఎస్‌బీవీ స్వామి
టిడ్కో ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టి జగన్ నిధులు దారి మళ్లించారు
- పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన
- పాలకొల్లులో అభివృద్ధి పనులను పరిశీలించి అధికారులతో నిమ్మల సమీక్ష
- గత టీడీపీ ప్రభుత్వంలో టిడ్కో గృహాలను 80 శాతం పూర్తిచేశాం: నిమ్మల
- వైసీపీ ఐదేళ్ల పాలనలో.. మిగిలిన 20 శాతం ఇళ్లు పడకేశాయి: మంత్రి నిమ్మల
- నాటి టిడ్కో ఇళ్లను బ్యాంకులో తాకట్టు పెట్టి జగన్ నిధులు దారి మళ్లించారు: నిమ్మల
- రుణం తీసుకొని ఖర్చు చేయకపోగా రంగులేసి చేతులు దులుపుకొన్నారు: నిమ్మల
- నేడు టిడ్కో ఇళ్లు పూర్తిచేసి పేదలకు అందించేందుకు కృషి చేస్తున్నాం: మంత్రి నిమ్మల
- ఇళ్లతో పాటు మౌలిక వసతుల దిశగా పనులు వేగవంతం చేస్తున్నాం: మంత్రి నిమ్మల
- కర్నూలులోని వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుద్ధిచేసి పూజ చేసిన మంత్రి టీజీ భరత్
- వైఎస్సార్సీపీ నేతలు చెప్పులేసుకుని వెంకన్న ఫొటోలు ప్రదర్శించడం బాధాకరం: మంత్రి టీజీ భరత్
- తిరుమల నెయ్యిలో కల్తీ జరిగింది వాస్తవం.. అందుకే జగన్ అడ్డంగా వాదిస్తున్నారు: మంత్రి
- జగన్ తిరుమల వెళ్లి క్షమాపణ చెప్పాలి: మంత్రి టీజీ భరత్
- తిరుమల వెంకన్నతో పెట్టుకుంటే ఆయనే శిక్ష వేస్తారు: మంత్రి టీజీ భరత్
నెల్లూరు: కల్తీ నెయ్యి అంశంపై కూటమి పార్టీల ఉమ్మడి సమావేశం
- నెల్లూరు: కల్తీ నెయ్యి అంశంపై కూటమి పార్టీల ఉమ్మడి సమావేశం
- నిన్న మండలిలో వైఎస్సార్సీపీ వికృత చేష్టలకు పాల్పడింది: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- చెప్పులు వేసుకొని స్వామి పటం పట్టుకోలేదన్న బొత్స వ్యాఖ్యలు అబద్ధం: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- ఇకనైనా వైఎస్సార్సీపీ నాయకులు దేవుడు, ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
- తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వైఎస్సార్సీపీ క్షమాపణ చెప్పాలి: ఎమ్మెల్సీ బీద రవిచంద్ర
- మహిళలు, చట్టసభలు అంటే గౌరవం లేని పార్టీ వైఎస్సార్సీపీ: ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి
వైఎస్సార్సీపీ శ్రీశైలం లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేసి భక్తుల విశ్వాసాన్ని వొమ్ముచేసింది: మంత్రి మండిపల్లి
- శ్రీశైలం లడ్డూలోనూ కల్తీ నెయ్యి సరఫరా చేసి వైఎస్సార్సీపీ భక్తుల విశ్వాసాన్ని వొమ్ముచేసింది: మంత్రి మండిపల్లి
- విజయ డెయిరీని పక్కనబెట్టి రాజేష్ కార్పొరేషన్ ద్వారా కల్తీనెయ్యి సరఫరా ఘోర పాపం: మంత్రి మండిపల్లి
- శ్రీశైలం వంటి పుణ్యక్షేత్రాన్నే వైసీపీ భ్రష్టుపట్టించింది: మంత్రి మండిపల్లి
- బ్రహ్మోత్సవాల్లో అలజడి సృష్టించేందుకు కుట్రలు పన్నిన వారిని వదిలిపెట్టేది లేదు: మంత్రి మండిపల్లి
- భక్తుల ఆగ్రహాన్ని ఎదుర్కోలేకే వైఎస్సార్సీపీ నేతలు నాటకాలు ఆడుతున్నారు: మంత్రి మండిపల్లి
- దేవాలయాల పవిత్రతను కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి మండిపల్లి
- భక్తుల విశ్వాసంతో చెలగాటమాడిన వైఎస్సార్సీపీకి.. ప్రజలే గుణపాఠం చెబుతారు: మంత్రి మండిపల్లి
గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి
- గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై బీజేపీ కార్యకర్తల దాడి
- రాళ్లు, కోడిగుడ్లతో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన బీజేపీ
- కాంగ్రెస్ కార్యాలయం ఎదుట బీజేపీ కార్యకర్తల నినాదాలు
- బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తల నినాదాలు
విశాఖ: భీమిలి సాగరతీరం హోటల్ గదిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
- విశాఖ: భీమిలి సాగరతీరం హోటల్ గదిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
- విశాఖ పాత పోస్టాఫీస్ ప్రాంతానికి చెందిన శ్యామ్‌కుమార్(26)గా గుర్తింపు
- హోటల్ గదిలో మద్యం సీసాలు, ఎలుకలమందుతో పాటు ఫ్యాన్‌కు ఉరివేసుకున్నట్లు ఆనవాళ్లు
- ఓ యువతి మృతి కేసులో శ్యామ్‌కుమార్‌పై హైదరాబాద్ జీడిమెట్లలో కేసు నమోదు
- అనకాపల్లి, ఆనందపురం పోలీసుస్టేషన్లలో పోక్సో కేసు కూడా నమోదు
- మృతుని కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చిన పోలీసులు
- మృతుని తమ్ముడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్న భీమిలి పోలీసులు
శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని వైఎస్సార్సీపీ చూడడం మహాపాపం: మంత్రి అనగాని
- శ్రీవారిని రాజకీయ ఆయుధంగా వాడుకోవాలని వైఎస్సార్సీపీ చూడడం మహాపాపం: మంత్రి అనగాని
- శ్రీవారి పేరుతో రాజకీయ లాభం పొందాలనుకునే వారిని దేవుడు క్షమించరు: మంత్రి అనగాని
- శ్రీవారి భక్తుల మనోభావాలను వైఎస్సార్సీపీ నేతలు పదేపదే దెబ్బతీస్తున్నారు: మంత్రి అనగాని
- దేవుడన్నా.. ఎన్నుకున్న ప్రజలన్నా.. వైఎస్సార్సీపీ నేతలకు లెక్కలేదు: మంత్రి అనగాని
- దేవుడితో రాజకీయ ఆటలాడుతున్న వైఎస్సార్సీపీ నేతలను ఆ దేవుడే శిక్షిస్తాడు: మంత్రి అనగాని
ప్రజలంతా ఈగల్ వ్యవస్థకు సహకరించాలి: ఈగల్ చీఫ్ రవికృష్ణ
- సమాజానికి శత్రువైన గంజాయిని పారద్రోలాలి: ఈగల్ చీఫ్ రవికృష్ణ
- గంజాయి నిరోధానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం: ఈగల్ చీఫ్ రవికృష్ణ
- డ్రగ్స్ వద్దు బ్రో వంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం: ఈగల్ చీఫ్ రవికృష్ణ
- ఎక్కడ ఏ చిన్న గంజాయి సమస్య ఉన్నా తక్షణమే అప్రమత్తం కావాలి: ఈగల్ చీఫ్ రవికృష్ణ
- ప్రజలంతా ఈగల్ వ్యవస్థకు సహకరించాలని కోరుతున్నా: ఈగల్ చీఫ్ రవికృష్ణ
భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలే: భానుప్రకాష్‌రెడ్డి
- భూమన కరుణాకర్‌రెడ్డి చెప్పినవన్నీ అవాస్తవాలే: భానుప్రకాష్‌రెడ్డి
- వైవీ సుబ్బారెడ్డి నెయ్యి టెండర్ నిబంధనల్లో మార్పు చేశాక మీరు ఉన్నారు కదా.. కరుణాకర్‌రెడ్డి: భానుప్రకాష్‌రెడ్డి
- దొంగలు దొంగలు ఒకటై ఇవాళ మాకు నీతులు చెబుతారా?: భానుప్రకాష్‌రెడ్డి
- ఆరోజు మౌనమునిగా ఉండి.. ఇవాళ మాట్లాడుతుంటే ప్రజలు స్వీకరిస్తారా?: భానుప్రకాష్‌రెడ్డి
- చరిత్రలో మీరు హిందూ ద్రోహులుగా మిగిలిపోతారు: భానుప్రకాష్‌రెడ్డి
- కాలికి చెప్పులు, బూట్లు వేసుకొని స్వామివారి చిత్రపటంతో ర్యాలీ చేస్తారా?: భానుప్రకాష్‌రెడ్డి
- వెంకటేశ్వరస్వామిపై భక్తి ఉంటే ఇలా చేయరు?: భానుప్రకాష్‌రెడ్డి
పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- విజయవాడ: పూర్వ విద్యార్థుల సంఘం స్వర్ణోత్సవ సంబరాల్లో పాల్గొన్న వెంకయ్యనాయుడు
- పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ పూర్వ విద్యార్థుల సంబరాలు
- ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- మన దేశం, మాతృభాష, గురువులను మరచిపోకూడదు: వెంకయ్యనాయుడు
- పరిశోధనలకు యువత ప్రాధాన్యత ఇవ్వాలి: వెంకయ్యనాయుడు
- తెలుగు భాషా గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి: వెంకయ్యనాయుడు
- భారత్ విశ్వగురువు అయినా వేరే దేశంపై దండయాత్రలు చేయలేదు: వెంకయ్యనాయుడు
- ఆత్మరక్షణ కోసమే భారత్ ముందడుగు వేస్తుంది: వెంకయ్యనాయుడు
- రాజకీయ నాయకులు బూతులు విపరీతంగా మాట్లాడుతున్నారు: వెంకయ్యనాయుడు
- గత ఎన్నికల్లో బూతులు మాట్లాడిన వాళ్లంతా ఓడిపోయారు: వెంకయ్యనాయుడు
- బూతులు మాట్లాడే వారిని ప్రోత్సహించకూడదు.. సమాజం నుంచి బహిష్కరించాలి: వెంకయ్యనాయుడు
- సీఎం చంద్రబాబు టెక్నాలజీకి ప్రాధాన్యత ఇస్తున్నారు: వెంకయ్యనాయుడు
- ఏఐని అదుపు చేసుకుని ముందుకెళ్లాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- సోషల్ మీడియా తప్పుడు అంశాలకు వేదికైంది: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- మంచి సమాజ నిర్మాణానికి మనందరం కృషిచేయాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
- తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
- సీఎం ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రం పరిశీలించాం: రామ్మోహన్
- మేము కూడా మా శాఖలో కేంద్రం ప్రారంభించాలని ప్రయత్నం చేశాం: రామ్మోహన్
- మాకు కూడా ఉపయోగపడేలా ఏఐని టీటీడీ తీర్చిదిద్దింది: రామ్మోహన్‌నాయుడు
- ఇలాంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కేంద్రాన్ని స్థాపించడమంటే కొన్నేళ్లు పడుతుంది: రామ్మోహన్
- వైకుంఠం క్యూకాంప్లెక్సులో ఏఐకి పనిచేసిన బృందంతో మేము కూడా చర్చిస్తాం: రామ్మోహన్
- దేశంలో 74 నుంచి 125 విమానాశ్రయాలు ఉన్నాయి: కేంద్రమంత్రి రామ్మోహన్
- దేశంలో విమానయాన శాఖ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోంది: రామ్మోహన్
- మరో 20 ఏళ్లు కూడా ప్రతి ఏటా 10 శాతం వృద్ధితో ముందుకెళ్తోంది: రామ్మోహన్
- ప్యాసింజర్ల సమాచారం, ఆపరేషన్స్ కమాండ్ కేంద్రం నుంచి నడిపిస్తే మంచి సౌకర్యాలు ఇవ్వొచ్చు: రామ్మోహన్
- టీటీడీ కమాండ్ కేంద్రం మాకు ఆదర్శం: కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు
వైఎస్సార్సీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం లేదు: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
- వైఎస్సార్సీపీ నేతలకు దేవుడంటే భయం, భక్తి, విశ్వాసం లేదు: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
- వైఎస్సార్సీపీ నేతలు స్వార్థ రాజకీయాల కోసం దేవుణ్ని వాడుకోవడం దుర్మార్గం: డీఎస్‌బీవీ స్వామి
- నిండు సభలో వెంకటేశ్వరస్వామిని అపవిత్రం చేసి సిగ్గు లేకుండా బుకాయిస్తారా?: మంత్రి
- వైఎస్సార్సీపీవన్నీ ఫేక్ మాటలు, ఫేక్ రాజకీయాలే: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
- సత్యనారాయణ అని పేరు పెట్టుకొని బొత్స అసత్యాలు మాట్లాడుతున్నారు: మంత్రి
- వైఎస్సార్సీపీ చేసిన తప్పులకు దేవుడే తగిన విధంగా శిక్షిస్తాడు: మంత్రి డీఎస్‌బీవీ స్వామి
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- మన అస్తిత్వానికి సుస్థిర కోట నిర్మించేది మన మాతృభాషే: వెంకయ్యనాయుడు
- మనకంటూ గర్వంగా చెప్పుకోవడానికి ఓ సమాధానం మన భాష, సంస్కృతులే: వెంకయ్యనాయుడు
- మన భాషను మనం గుర్తించకుంటే.. ఎవరు గుర్తిస్తారు?: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- తల్లిదండ్రులు మాతృభాష పట్ల మమకారం కలిగి ఉండాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
- విద్యార్థుల్లో ఉపాధ్యాయులు మాతృభాష పట్ల ప్రేమను పెంచాలి: వెంకయ్యనాయుడు
- ప్రభుత్వాలు మాతృభాషలో చదువుకున్నవారికి ఉద్యోగాల్లో అవకాశాలివ్వాలి: వెంకయ్యనాయుడు
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 20 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు
- కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 68,156 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 28,295 మంది భక్తులు
నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- నేడు పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
- వినుకొండలో 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర'లో పాల్గొననున్న సీఎం
- ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో వినతులు స్వీకరించనున్న సీఎం
- ప్రజా వేదికలో స్వచ్ఛ రథాన్ని ప్రారంభించనున్న సీఎం
- ప్రజా వేదిక బహిరంగసభలో ప్రసంగించనున్న సీఎం చంద్రబాబు
- సభ ముగిసిన తర్వాత నియోజకవర్గ టీడీపీ నేతలతో విడివిడిగా సీఎం సమావేశం
- కమ్యూనిటీ హెల్త్‌లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులతో సీఎం ముఖాముఖి
భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి
- విజయవాడ: భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి
- ట్యూషన్ వెళ్లకుండా ఆటోలో బస్టాండ్‌కు వెళ్లిపోయిన ఇద్దరు పిల్లలు
- మేరారామ్(12), ఉమారామ్(13) డబ్బులు వెంట తీసుకుని వెళ్లినట్లు సమాచారం
- నిన్న విజయవాడ బస్టాండ్ నుంచి ముంబయి వెళ్లిన ఇద్దరు పిల్లలు
- పిల్లలు గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తుండగా గుర్తించిన పోలీసులు
- పిల్లలను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
- విజయనగరంలో పేలుళ్ల కుట్ర ఘటనపై సిరాజ్, సయ్యద్ సమీర్‌పై కేసు
- విజయనగరం పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
- సిరాజ్, సయ్యద్ సమీర్‌పై నవంబర్‌లో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- ప్రస్తుతం పరారీలో ఉన్న ఇమ్రాన్ అక్రమ్
- సిరాజ్, సమీర్‌కు పేలుడు పదార్థాలు తయారుచేసేందుకు సాయం చేసినట్లు గుర్తింపు
- పేలుడు సామగ్రి కొనేందుకు ఇమ్రాన్ ఫండింగ్ చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
- విదేశాలకు పారిపోతున్న ఆరిఫ్‌ను గతేడాది దిల్లీలో పట్టుకున్న ఎన్ఐఏ
- సిరాజ్‌తో కలిసి ఆయుధాలు సరఫరా చేసేందుకు కుట్ర పన్నినట్లు గుర్తింపు
- సరిహద్దుల మీదుగా అక్రమంగా ఆయుధాలు రవాణా చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
- సోషల్ మీడియా ద్వారా జిహాదీ సిద్ధాంతాన్ని ప్రచారం చేసినట్లు గుర్తించిన ఎన్‌ఐఏ
Last Updated : February 21, 2026 at 10:51 PM IST

