20-02-2026 Andhra Pradesh News Live: విజయనగరం ఉగ్ర కుట్ర కేసు - మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
20-02-2026 AndhraPradesh News Today Live (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 7:26 AM IST
|Updated : February 20, 2026 at 10:52 PM IST
20-02-2026 AndhraPradesh News Today Live:2027 :ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరైన సీఎం
LIVE FEED
విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విజయనగరం ఉగ్ర కుట్ర కేసులో మరో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో అనుబంధ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
- ఆరిఫ్ హుస్సేన్, ఇమ్రాన్ అక్రమ్‌పై ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్‌ఐఏ
- విజయనగరంలో పేలుళ్ల కుట్ర ఘటనపై సిరాజ్, సయ్యద్ సమీర్‌పై కేసు
- విజయనగరం పోలీసులు పెట్టిన కేసు ఆధారంగా మరో కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
- సిరాజ్, సయ్యద్ సమీర్‌పై నవంబర్‌లో తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ
అయేషా మీరా హత్య కేసు - సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
- విజయవాడ: అయేషా మీరా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు
- వైద్య బృందం సేకరించిన అవశేషాలను కుటుంబసభ్యులకు అప్పగించాలని ఆదేశం
- ఫిబ్రవరి 27న తెనాలిలో మతపరమైన ఆచారాలతో అంత్యక్రియల నిర్వహణ
- అంత్యక్రియలకు అవసరమైన భద్రత, వసతులు కల్పించాలని ఆదేశం
- మొత్తం ప్రక్రియను ప్రభుత్వ అధికారుల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశం
- విజయవాడ: సీబీఐ సమర్పించిన తుది నివేదికను అంగీకరించిన కోర్టు
స్నానానికి దిగి 9వ తరగతి విద్యార్థి మృతి
- అల్లూరి జిల్లా: వాగులో స్నానానికి దిగి 9వ తరగతి విద్యార్థి మృతి
- జి.మాడుగుల ఏకలవ్య మోడల్ స్కూల్‌లో చదువుతున్న ఆల్బర్ట్ ఫిలిప్స్ మృతి
- విద్యార్థి మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
16 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన ఐవోఎన్‌ఎస్ అధ్యక్ష పదవి
- విశాఖ: తొమ్మిదో హిందూ మహాసముద్ర నేవల్ సింపోజియం సమావేశం
- 33 దేశాల నుంచి నావికాదళ, సముద్ర భద్రతా సంస్థల అధిపతులు హాజరు
- 16 ఏళ్ల తర్వాత భారత్‌కు దక్కిన ఐవోఎన్‌ఎస్ అధ్యక్ష పదవి
- రాయల్ నేవీ నుంచి ఐవోఎన్‌ఎస్ అధ్యక్ష పదవి స్వీకరించిన భారత నేవీ చీఫ్
- ఐవోఎన్‌ఎస్‌ను బలోపేతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాం: అడ్మిరల్ దినేష్ త్రిపాఠి
క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు
- నెల్లూరు: క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు
- నెల్లూరు: బుచ్చిరెడ్డిపాలెంకు చెందిన వేణు, వెంకటరమణ అరెస్టు
- నిందితుల నుంచి రూ.34.6 లక్షలు, ల్యాప్‌టాప్, టీవీ, ఫోన్లు స్వాధీనం
- నిందితుల ఖాతాల్లో ఉన్న రూ.కోటీ 64 లక్షలు సీజ్ చేసిన పోలీసులు
- త్వరలోనే క్రికెట్ బెట్టింగ్ ముఠా నిర్వాహకులను పట్టుకుంటామన్న ఎస్పీ
విద్యా శాఖపై సమీక్ష
- విద్యా శాఖపై సమీక్ష జరిపిన మంత్రి నారా లోకేశ్
- మన చరిత్ర, సంస్కృతికి చిహ్నంగా అమరావతి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ: లోకేశ్
- ప్రపంచస్థాయి ప్రమాణాలతో సెంట్రల్ లైబ్రరీని తీర్చిదిద్దాలి: మంత్రి లోకేశ్
- సెంట్రల్ లైబ్రరీ భవన నమూనా పరిశీలించి సూచనలు చేసిన మంత్రి లోకేశ్
హైకోర్టు నిర్మాణానికి ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులు ప్రారంభం
- హైకోర్టు నిర్మాణానికి ఒకేసారి 4 రాఫ్ట్‌లలో కాంక్రీట్ పనులు ప్రారంభం
- ఏకధాటిగా 15 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ స్లాబ్ (రాఫ్ట్) నిర్మాణం
- రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభించిన మంత్రి నారాయణ
- హైకోర్టు భవనాన్ని 8 అంతస్తుల్లో నిర్మిస్తున్నాం: మంత్రి నారాయణ
- మొత్తం 21 లక్షల చ.అ. విస్తీర్ణంలో 50.4 మీటర్ల ఎత్తుతో భవన నిర్మాణం: నారాయణ
- భవనంలో మొత్తం 52 కోర్టు హాల్స్ ఉంటాయి: మంత్రి నారాయణ
- అమరావతిలో అధికారులు, ఉద్యోగులకు 4,026 ఇళ్లు నిర్మిస్తున్నాం: నారాయణ
- మార్చి ఆఖరునాటికి 3,500 ఇళ్లు పూర్తి చేస్తాం: మంత్రి నారాయణ
- ఐఏఎస్ అధికారుల భవనాలు దాదాపు పూర్తయ్యాయి: మంత్రి నారాయణ
గంజాయి కేసులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అరెస్టు
- కాకినాడ: గంజాయి కేసులో వైఎస్సార్సీపీ ఎంపీటీసీ చెల్లూరి నగేశ్‌బాబు అరెస్టు
- విశాఖ జిల్లా భీమిలి మం. దాకమర్రికి చెందిన నగేశ్‌బాబును అరెస్టు చేసిన పోలీసులు
- గంజాయి కేసులో పరారీలో ఉన్న నగేశ్‌బాబును అరెస్టు చేసిన జగ్గంపేట పోలీసులు
- విజయనగరం జిల్లా వైసీపీ ముఖ్య నాయకుడికి అనుచరుడిగా ఉన్న నగేశ్‌బాబు
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ
- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఏకసభ్య కమిటీని నియమించిన ప్రభుత్వం
- విశ్రాంత ఐఏఎస్ అధికారి దినేశ్‌కుమార్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు
- 45 రోజుల్లోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వులు జారీ
- ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో టెక్ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో టెక్ కంపెనీల సీఈవోలతో చంద్రబాబు భేటీ
- అడోబ్ సీఈవో శంతను నారాయణ్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
- ఆటోడెస్క్ ఏఐ హెడ్ మైక్ హాలేతో సీఎం చంద్రబాబు సమావేశం
- ఆరామ్‌కో ఇండియా డైరెక్టర్ అబ్దుల్ రెహ్మాన్ ఐతుకైర్‌తో చంద్రబాబు సమావేశం
- లెగో ఎడ్యుకేషన్ వైస్ ప్రెసిడెంట్ టామ్ హాల్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
- ఆధార్ ఫౌండర్ సీటీవో శ్రీకాంత్ నాదమునితో సీఎం చంద్రబాబు సమావేశం
- కాలిఫోర్నియాకు చెందిన ఖోస్లా వెంచర్స్ ఎండీ వినోద్ ఖోస్లాతో చంద్రబాబు భేటీ
టోల్‌గేట్ల సిబ్బందిని ఢీకొట్టి గంజాయితో పరారైన ముఠా
- కాకినాడ:టోల్‌గేట్ల సిబ్బందిని ఢీకొట్టి గంజాయితో పరారైన ముఠాతో వైసీపీ నేతకు సంబంధాలు
- విశాఖ జిల్లా భీమిలికి చెందిన వైసీపీ ఎంపీటీసీ చెల్లూరి నగేష్‌బాబుకు సంబంధాలు
- రాజస్థాన్ వాసి ఖాతాకు నగదు జమ చేసినట్లు పోలీసుల విచారణలో నిర్ధరణ
- కాకినాడ ఎస్పీ ఆదేశాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
- సాయంత్రం మీడియాకు వివరాలు వెల్లడించనున్న పోలీసు అధికారులు
22ఎ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్
- రెవెన్యూ శాఖకు బడ్జెట్ కేటాయింపులపై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి అనగాని
- 22ఎ నిషేధిత జాబితా భూముల పరిష్కారానికి ప్రత్యేక డ్రైవ్: మంత్రి అనగాని
- 22ఎ భూముల తొలగింపు సులభతరం చేసేలా అధికారాల బదలాయింపు: అనగాని
- జాబితా నుంచి ప్రైవేట్ భూములు తొలగించే అధికారం ఆర్డీవోలకు అప్పగింత: అనగాని
టోల్‌గేట్ సిబ్బందిని వాహనాలతో ఢీకొట్టి గంజాయితో పరారైన ముఠా
- కాకినాడ: టోల్‌గేట్ సిబ్బందిని వాహనాలతో ఢీకొట్టి గంజాయితో పరారైన ముఠా
- గంజాయితో పరారైన ముఠాతో వైసీపీ నేత చెల్లూరి నగేష్‌బాబుకు సంబంధాలు
- విశాఖ జిల్లా భీమిలి మండలం దాకమర్రికి చెందిన వైసీపీ ఎంపీటీసీ నగేష్‌బాబు
- రాజస్థాన్‌కు చెందిన నిందితుడి ఖాతాకు నగదు జమ చేసినట్లు పోలీసుల వెల్లడి
- కాకినాడ ఎస్పీ ఆదేశాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
పరిపాలనా భవనాల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ
- సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ
- పరిపాలనా భవనాల నిర్మాణంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ
- శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించాం: నారాయణ
- తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశాం: నారాయణ
- శాఖలవారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని సీఎస్‌ను కోరాం: నారాయణ
- వర్క్ స్పేస్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటాం: మంత్రి నారాయణ
- ఐకానిక్ టవర్స్‌లోనే డీజీపీ ఆఫీసు ఉండాలా అనేదానిపై సీఎందే నిర్ణయం: నారాయణ
- డీజీపీ ఆఫీసు విడిగా ఉండాలా అనే దానిపై సీఎం నిర్ణయిస్తారు: నారాయణ
చట్నీస్ హోటల్‌లో పేలుడు
- హైదరాబాద్: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‌లో పేలుడు
- పేలుడు శబ్దానికి పరుగులు తీసిన వినియోగదారులు
- చట్నీస్ హోటల్‌లోని ఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలుడు
- ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు
- అసెంబ్లీలో బడ్జెట్‌పై చర్చలో మాట్లాడిన ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి
- రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు విద్యుత్‌రంగం మూల స్తంభం: మంత్రి గొట్టిపాటి
- దేశంలో విద్యుత్ సంస్కరణలకు నాంది పలికిన వ్యక్తి.. చంద్రబాబు: గొట్టిపాటి
- 2014లో వచ్చిన 6 నెలల్లోనే ఏపీని మిగులు విద్యుత్ రాష్ట్రంగా నిలిపాం: గొట్టిపాటి
- 2014-19లో రెన్యుబుల్ ఎనర్జీని 7 గిగావాట్లకు పెంచిన ఘనత చంద్రబాబుది: గొట్టిపాటి
- వైసీపీ ప్రభుత్వం.. విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేసింది: మంత్రి గొట్టిపాటి
- ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలపై రూ.30 వేల కోట్లు భారం వేశారు: గొట్టిపాటి
తప్పు చేస్తే చట్టప్రకారం శిక్ష పడాల్సిందే
- తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ ప్రెస్‌మీట్
- ప్రజా సమస్యలను నేరుగా విని పరిష్కరించే దిశగా 'వారధి' చేపట్టాం: లంకా దినకర్
- రాజకీయాల్లో ఇలాంటి సానుకూల వాతావరణం ఉండటం సంతోషకరం: లంకా దినకర్
- అంత్యోదయ స్ఫూర్తితో అర్హులైన పేదలకు సంక్షేమం అందాల్సిందే: లంకా దినకర్
- 2019-2024 మధ్య ఉపాధి హామీ, జలజీవన్ మిషన్ నిధుల్లో అవకతవకలు జరిగాయి: లంకా దినకర్
- వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులు పక్కదారి పట్టాయి: లంకా దినకర్
- శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నిధుల వినియోగంపై అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదు: లంకా దినకర్
- అస్తవ్యస్తమైన వ్యవస్థలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం సరిదిద్దుతోంది: లంకా దినకర్
- నెయ్యిలో కల్తీ జరిగిందని వైవీ సుబ్బారెడ్డే ఒప్పుకున్నారు: లంకా దినకర్
- కొత్తగా చర్చ లేదు.. ఈ అంశంపై ఇప్పటికే సీబీఐ విచారణ జరిగింది: లంకా దినకర్
- ఎవరైనా తప్పు చేస్తే చట్టప్రకారం శిక్ష పడాల్సిందే: లంకా దినకర్
- తిరుమల ధర్మగిరి వేదపాఠశాల పూర్వ ప్రధాన ఆచార్యులు రామ్మూర్తి ఘనాపాటి మృతి
- చంద్రగిరిలో తుదిశ్వాస విడిచిన రామ్మూర్తి ఘనాపాఠి
- వేదపాఠశాల ప్రధాన ఆచార్యులుగా వేలమందికి వేదం బోధించిన రామ్మూర్తి ఘనాపాఠి
- తెలుగు రాష్ట్రాల్లోని పుణ్యక్షేత్రాల్లో వేదపండితులుగా సేవలందిస్తున్న రామ్మూర్తి శిష్యులు
- రామ్మూర్తి మృతి వేదలోకానికి తీరని లోటన్న ప్రముఖ వేద పండితులు
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వైఎస్సార్సీపీ తీరు
- చెప్పులు, బూట్లతో స్వామివారి ఫొటోలు పట్టుకొని ప్రదర్శన చేస్తారా?: దేవినేని ఉమ
- స్వామి ప్రసాదం పెడుతుంటే.. కాలికి చెప్పులు తీసి ప్రసాదం స్వీకరిస్తాం: దేవినేని ఉమ
- వైఎస్సార్సీపీ తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి : దేవినేని ఉమ
- పెద్దల సభలో వైఎస్సార్సీపీ సభ్యుల తీరును ఖండిస్తున్నాం: జ్యోతుల నెహ్రూ
- సమస్యలు ఉంటే కూర్చొని చర్చించుకుందాం: జ్యోతుల నెహ్రూ
- ఏ విషయంపై అయినా చర్చకు సిద్ధంగా ఉన్నాం: జ్యోతుల నెహ్రూ
- చెప్పులు, బూట్లు వేసుకుని వెంకటేశ్వరస్వామి ఫొటోలను ప్రదర్శిస్తారా?: జ్యోతుల నెహ్రూ
- సమస్యలపై చర్చిస్తున్నప్పుడు ఆమోదయోగ్యమైన అంశాలు ఉంటే స్వీకరిస్తాం: జ్యోతుల నెహ్రూ
- శాసనసభకు వచ్చి చర్చించుకుందాం రావాలని వైఎస్సార్సీపీ సభ్యులను ఆహ్వానిస్తున్నాం: జ్యోతుల నెహ్రూ
- మండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తనను ప్రజలంతా చూశారు: సానా సతీష్
- జగన్ ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ సభ్యులు ప్రవర్తిస్తున్నారు: సానా సతీష్
- క్రికెట్ మ్యాచ్‌కు సొంత డబ్బులతో వెళ్తే తప్పేంటి?: సానా సతీష్
బొత్స వ్యాఖ్యలపై ఎక్స్‌లో మంత్రి నారా లోకేష్ వీడియో పోస్టు
- బొత్స వ్యాఖ్యలపై ఎక్స్‌లో వీడియో పోస్టు చేసిన మంత్రి నారా లోకేష్
- చెప్పులు వేసుకుని దేవుడి ఫొటోతో సభలోకి వెళ్లినట్లు ఫొటో చూపించగలరా అని బొత్స సవాల్
- చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటో పట్టుకెళ్లిన ఫోటోలు, వీడియో విడుదల చేసిన లోకేష్
- శ్రీవారికి చేసిన మహాపాపం కప్పిపుచ్చుకోవడానికి మహాపరాధం చేశావు జగన్: లోకేష్
- మీకు దేవుడంటే భక్తి, భయం లేదు.. హిందువుల మనోభావాలంటే లెక్కేలేదు: లోకేష్
- బూట్లు, చెప్పులతో వెంకటేశ్వరస్వామి చిత్రపటాలు పట్టుకుని మహాపరాధం చేశారు: లోకేష్
- కౌన్సిల్‌లో ప్రదర్శించిన శ్రీవారి ఫొటోలు అక్కడే విసిరేసి వెళ్లడం క్షమించరాని పాపం: లోకేష్
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ - 2026లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- సదస్సుకు హాజరైన ప్రపంచ క్వాంటం-ఏఐ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు
- ఐబీఎం సహా ఇతర సంస్థలతో సీఎం సమక్షంలో ఒప్పందాలు కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఏపీలో క్వాంటం-ఏఐ రంగాల్లో నైపుణ్యాభివృద్ధి, మౌలిక వసతుల అభివృద్ధి కల్పించే దిశగా 7 ఒప్పందాలు
- అమరావతిలోని క్వాంటం వ్యాలీకి జాతీయ, అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చేలా ఎంవోయూలు
- విద్యార్థులు, యువతకు ఏఐ-క్వాంటం రంగాల్లో శిక్షణపై ఏపీ ప్రభుత్వం దృష్టి
- ప్రభుత్వ శాఖల్లో ఏఐ-క్వాంటం వినియోగంపై దృష్టి సారించిన ఏపీ ప్రభుత్వం
- టెక్నాలజీ ద్వారా ప్రజలకు సేవలను సులభతరం చేయడంపై ఏపీ ప్రభుత్వం దృష్టి
- ఏపీలో ఏఐ-క్వాంటం ఎకో సిస్టం పెంపొందించడానికి బాటలు వేయనున్న 7 ఎంవోయూలు
- క్వాంటం, ఏఐలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు యూఎన్‌ఐసీసీతో ఒప్పందం
- క్వాంటం, ఏఐ, సైబర్ సెక్యూరిటీలో లక్ష మంది యువతకు శిక్షణ ఇచ్చేలా ఐబీఎంతో ఎంవోయూ
- ఏపీలో క్వాంటం ఏఐ వర్సిటీ ఏర్పాటుపై ఎన్‌ఐఈఎల్‌ఐటీతో ఒప్పందం
- రాష్ట్ర స్థాయి ఏఐ టెక్ హబ్-5 లేయర్డ్ స్వదేశీ ఏఐ స్టాక్ నిర్మించేలా ఒప్పందం
- భారత్ జెన్-నెక్స్ జెన్-ఐబీఎంలతో ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఏపీలోని 50 ఉన్నత విద్యా సంస్థల్లో ఏఐ, క్వాంటం టెక్నాలజీని బలోపేతం చేసేలా ఒప్పందం
- ఏఐ అకాడమీ, ఏఐ శాండ్ బాక్స్ ఏర్పాటుకు ఏపీతో ఒప్పందం చేసుకున్న కాలిబో ఏఐ సంస్థ
- అమరావతి క్వాంటం వ్యాలీలో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఒప్పందం
- సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు ఏపీతో ఒప్పందం చేసుకున్న వైజర్ సంస్థ
- ఏపీలో ఏఐ ట్యూటర్ ఏర్పాటు అంశంపై ఐఐటీ మద్రాస్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం
కడప జిల్లా కమలాపురంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్థుల ఆందోళన
- కడప జిల్లా కమలాపురంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ వద్ద రైతులు, గ్రామస్థుల ఆందోళన
- భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రధాన గేటు వద్ద పెద్దఎత్తున ఆందోళనకు దిగిన నల్ల లింగాయపల్లి గ్రామస్థులు
- భూములు కోల్పోయిన రైతులకు ఉద్యోగాలు, పరిహారం ఇవ్వాలని గ్రామస్థుల ధర్నా
- ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలియజేస్తున్న మహిళలు
- గ్రామస్థుల నిరసనకు భారీగా తరలివచ్చి మద్దతు తెలిపిన టీడీపీ నాయకులు
- గ్రామస్థుల ఆందోళన సందర్భంగా భారీగా మోహరించిన పోలీసులు
గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండానే
- అజ్ఞాతంలోకి వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు
- అనంతబాబు (MLC Ananthababu Case) భార్యపై సిట్ ఛార్జిషీట్ దాఖలుతో అజ్ఞాతంలోకి అనంతబాబు
- గన్‌మెన్లు, వ్యక్తిగత సిబ్బంది లేకుండా మండలి నుంచి అర్ధంతరంగా వెళ్లిన అనంతబాబు
- ఇప్పటికే ఎమ్మెల్సీ అనంతబాబు భార్య లక్ష్మీదుర్గ కోసం పోలీసుల గాలింపు
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర (Today Gold Rates) రూ.1,54,100
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,41,770
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,53,500
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరైన సీఎం
- ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ (AI Impact Summit) 2026కు హాజరైన సీఎం
- ఏఐ యాక్సిలరేటర్స్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్‌లో పాల్గొన్న సీఎం
- అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాదతో కలిసి పాల్గొన్న సీఎం
- ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 7 ఒప్పందాలు
- సీఎం చంద్రబాబు సమక్షంలో 7 ఒప్పందాలు చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఐబీఎం, యూఎన్ఐసీసీ, ఐఐటీ మద్రాస్, వైసర్ తదితర సంస్థలతో జరగనున్న ఒప్పందాలు
- కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశంలో పాల్గొననున్న సీఎం
- అశ్వినీ వైష్ణవ్, డబ్ల్యూఈఎఫ్ సీఈవో బోర్గే బ్రెండేతో కలిసి సమావేశానికి సీఎం
- యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందంతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
- అరాంకో, అడోబ్, ఆటో డెస్క్ కంపెనీల ఎండీ, సీఈవోలతోనూ భేటీకానున్న సీఎం
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
- వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
- నవంబర్ 18 లోపు కేసులో విచారణ పూర్తి చేయాలని ట్రయల్ కోర్టుకు ఆదేశం
- ఆనాడు ఎమ్మెల్సీ అనంతబాబుతో పోలీసులు కుమ్మక్కయ్యారని సుప్రీంకోర్టు ఆగ్రహం
- డిఫాల్ట్ బెయిల్ వచ్చేలోగా ఛార్జిషీట్ దాఖలు చేశారని వ్యాఖ్యానించిన ధర్మాసనం
- అప్పట్లో తప్పుచేసిన పోలీసులపై ప్రస్తుత ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్న
- డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని నిలదీసిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం
- కేసు ట్రయల్ కోసం హైకోర్టు సీనియర్ న్యాయాధికారిని నియమించాలని ఆదేశం
- న్యాయాధికారిని నియమించి రోజువారీ విచారణ జరిగేలా చూడాలని ఆదేశం
- మార్చి 31 లోపు ప్రత్యేక జ్యుడీషియల్ అధికారిని నియమించాలని హైకోర్టుకు సూచన
- హైకోర్టు ఈ కేసులో జోక్యం చేసుకొని అడ్డంకులు సృష్టించవద్దని సూచించిన ధర్మాసనం
- నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టపట్టాలు వేసుకొని తిరుగుతున్నట్లుందని ధర్మాసనం వ్యాఖ్య
- తదుపరి దర్యాప్తు చేతగాకపోతే సీబీఐకి కేసును అప్పగించాల్సి వస్తుందన్న సీజేఐ
అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామడూరులో చిరుత సంచారం
- అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం మామడూరులో చిరుత సంచారం
- ఆవు దూడను పొలం సమీపంలోని చెరువులోకి ఎత్తుకెళ్లి చంపేసిన చిరుత
అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు, వెకిలివేషాల కేంద్రాలుగా మార్చారు: ప్రత్తిపాటి
- అధికారంలో ఉన్నప్పుడు చట్టసభలను బూతులు, వెకిలివేషాల కేంద్రాలుగా మార్చారు: ప్రత్తిపాటి
- వైఎస్సార్సీపీ సభ్యుల ప్రవర్తన మండలి చరిత్రలో బ్లాక్ డేగా నిలుస్తుంది: ప్రత్తిపాటి పుల్లారావు
- ఏకంగా దేవుడి ఫొటోలతో దిక్కుమాలిన రాజకీయాలా?: ప్రత్తిపాటి పుల్లారావు
- పెద్దల సభలో దేవుణ్ని అవమానించే సభ్యులు.. ప్రజాస్వామ్యానికి పట్టిన చీడపురుగులు: ప్రత్తిపాటి
వైఎస్సాప్సీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది: మంత్రి కందుల దుర్గేష్
- వైసీపీ తీరును జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది: మంత్రి కందుల దుర్గేష్
- జగన్ ఆదేశాలతోనే జరిగిందని స్పష్టంగా కనబడుతోంది: మంత్రి కందుల దుర్గేష్
- వెంకన్న చిత్రపటాన్ని ప్లకార్డుగా సభలో ప్రదర్శిస్తారా?: మంత్రి కందుల దుర్గేష్
- చెప్పులు, బూట్లు వేసుకొని వెంకన్న ప్లకార్డులు ప్రదర్శిస్తారా?: మంత్రి కందుల దుర్గేష్
- హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: మంత్రి కందుల దుర్గేష్
చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫొటోతో ర్యాలీ చేస్తారా?: సోము వీర్రాజు
- చెప్పులు, బూట్లు ధరించి వెంకన్న స్వామి ఫొటోతో ర్యాలీ చేస్తారా?: సోము వీర్రాజు
- వెంకటేశ్వరస్వామి ప్రతిమను ఎలా అవమానపరుస్తున్నారో చూస్తున్నాం: సోము వీర్రాజు
- సభ వాయిదా వేయగానే వెంకన్న ఫొటోలను విసిరివేసి వెళ్తారా: సోము వీర్రాజు
- వెంకన్నను కలియుగ దైవంగా భావిస్తున్న భక్తుల మనోభావాలు దెబ్బతీస్తారా?: సోము వీర్రాజు
- జగన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే వైఎస్సార్సీపీ సభ్యులు ఇలా ప్రవర్తించి ఉంటారు: సోము వీర్రాజు
- వెంకన్న ఫొటోలతో చెప్పులు, బూట్లు వేసుకొని సభలోకి జగన్ వెళ్లమన్నారా?: సోము వీర్రాజు
- హిందూత్వం పట్ల వైసీపీ విధానమేంటో జగన్.. స్పష్టం చేయాలి: సోము వీర్రాజు
- భారత జాతికి జగన్ క్షమాపణ చెప్పాల్సిందే: సోము వీర్రాజు
- వైసీపీ సభ్యులు చేసిన పనిని జాతి క్షమించదు: సోము వీర్రాజు
- హిందుత్వంపై చులకన భావం తగదని వైఎస్సార్సీపీ సభ్యులను హెచ్చరిస్తున్నా: సోము
రెచ్చగొట్టే చర్యలతో సభను అడ్డుకోవాలని చూస్తే ఏమనుకోవాలి?: పయ్యావుల
- రెచ్చగొట్టే చర్యలతో సభను అడ్డుకోవాలని చూస్తే ఏమనుకోవాలి?: పయ్యావుల
- సమాజానికి జగన్ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది: పయ్యావుల
- హిందూత్వం పట్ల వైఎస్సార్సీపీ విధానమిది అని జగన్.. ప్రజలకు చెప్పాల్సిందే: పయ్యావుల
- స్వామి ప్రసాదం పెడుతుంటే.. కాలికి చెప్పులు తీసి ప్రసాదం స్వీకరిస్తాం: పయ్యావుల
- గత 3, 4 రోజుల నుంచి వైఎస్సార్సీపీ సభ జరగకుండా చేస్తూనే ఉంది: పయ్యావుల
- హద్దులు దాటి ఇవాళ ప్రవర్తించిన తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది: పయ్యావుల
- ప్లకార్డులో వెంకన్న ఫొటో వాడి చెప్పులు వేసుకుని ర్యాలీ చేస్తారా?: పయ్యావుల
- వైఎస్సార్సీపీ సభ్యుల తీరు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి: పయ్యావుల
- రాజకీయాలకు ఆఖరికి దేవుణ్ని కూడా వాడతారా?: పయ్యావుల కేశవ్
- దేవుడి పట్ల వైఎస్సార్సీపీకి ఏమాత్రం గౌరవం లేదనేది ఇవాళ్టి చర్యలతో నిరూపితమైంది: పయ్యావుల
మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో కూటమి పార్టీల సభ్యుల నిరసన
- మండలి ఛైర్మన్ ఛాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో కూటమి పార్టీల సభ్యుల నిరసన
- వైఎస్సార్సీపీ చేసిన మహాపచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని కూటమి సభ్యుల డిమాండ్
- నిరసనలో పాల్గొన్న మంత్రులు కేశవ్, దుర్గేష్, అనిత, సంధ్యారాణి, సవిత
- నిరసనలో పాల్గొన్న మంత్రులు నిమ్మల, గొట్టిపాటి, స్వామి, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీలు
- హిందూమతాన్ని అవమానించారని ఛైర్మన్‌కు తెలిపిన మంత్రులు
- ఇలాంటి చర్యకు ఛైర్మన్‌గా ఎలా అంగీకరిస్తారని మంత్రుల నిలదీత
- వైఎస్సార్సీపీ చేసింది తప్పేనని స్పష్టం చేసిన మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
- వైఎస్సార్సీపీ సభ్యులను పిలిచి మాట్లాడతానన్న మండలి ఛైర్మన్ మోషేన్ రాజు
- బహిరంగ క్షమాపణలు చెప్పించి లెంపలేసుకునేలా చేయాలని కూటమి సభ్యుల డిమాండ్
దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు - కాసేపట్లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరుకానున్న సీఎం
- దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- కాసేపట్లో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు హాజరుకానున్న సీఎం
- ఏఐ యాక్సిలరేటర్స్ ఇండియాస్ ఎకనమిక్ గ్రోత్ ప్లీనరీ సెషన్‌లో పాల్గొననున్న సీఎం
- అసోం సీఎం హిమంత బిశ్వశర్మ, కేంద్రమంత్రి జితిన్ ప్రసాదతో కలిసి పాల్గొననున్న సీఎం
- ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 7 ఒప్పందాలు
- సీఎం చంద్రబాబు సమక్షంలో 7 ఒప్పందాలు చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
- ఐబీఎం, యూఎన్ఐసీసీ, ఐఐటీ మద్రాస్, వైసర్ తదితర సంస్థలతో జరగనున్న ఒప్పందాలు
- కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశంలో పాల్గొననున్న సీఎం
- అశ్వినీ వైష్ణవ్, డబ్ల్యూఈఎఫ్ సీఈవో బోర్గే బ్రెండేతో కలిసి సమావేశానికి సీఎం
- యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందంతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
- అరాంకో, అడోబ్, ఆటో డెస్క్ కంపెనీల ఎండీ, సీఈవోలతోనూ భేటీకానున్న సీఎం
కూటమి సభ్యుల అత్యవసర సమావేశం
- కూటమి సభ్యుల అత్యవసర సమావేశం
- టీడీఎల్పీలో లోకేష్ నేతృత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్సీల సమావేశం
- వెంకన్న స్వామికి సభలో అవమానం జరిగిందన్న కూటమి పార్టీల సభ్యులు
- ప్లకార్డులా దేవుడి ఫొటో వాడి మహాపచారానికి పాల్పడ్డారన్న సభ్యులు
- మండలిలో వైసీసీ సభ్యుల తీరును తీవ్రంగా పరిగణించాలని నిర్ణయం
- ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు.. ఇది క్షమించరాని నేరమన్న సోము వీర్రాజు
- దేవుడికి అపచారం జరిగిందని సమావేశం నుంచే పార్టీ జాతీయ పెద్దలకు తెలిపిన సోము వీర్రాజు
- దేవుడికి జరిగిన అవమానానికి కోపంతోనే హెడ్‌ఫోన్ విసిరానన్న పయ్యావుల కేశవ్
శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం, సభ వాయిదా
- శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం, సభ వాయిదా
- ఇందాపూర్ డెయిరీపై చర్చించాలని సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన
- శ్రీవారి ఫొటోలు, ప్లకార్డులు పట్టుకొని వైఎస్సార్సీపీ సభ్యుల నినాదాలు
- వేంకటేశ్వరస్వామి ఫొటోలతో నిరసన తెలపడంపై మంత్రి పయ్యావుల తీవ్ర అభ్యంతరం
- చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫొటోతో సభకు వచ్చారని మండిపడిన మంత్రులు
- చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ అధికార పక్ష సభ్యుల నిరసన
- వైఎస్సార్సీపీ సభ్యుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేసిన కూటమి పార్టీల సభ్యులు
- దేవుడి ఫొటోలను పట్టుకుని నిరసన తెలపడం అనైతికం: మంత్రి పయ్యావుల
- సభలో దేవుడి ఫొటోలు అనుమతించవద్దని కోరిన మంత్రి పయ్యావుల
- దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు.. వైఎస్సార్సీపీ సభ్యులకు బుద్ధుందా?: పయ్యావుల
- దేవుడిని రాజకీయాల్లోకి లాగే దుర్మార్గపు చర్యలను అనుమతించకూడదు: పయ్యావుల
- వైసీపీ సభ్యులకు దేవుడంటే భయం లేదు, నమ్మకం లేదు: మంత్రి పయ్యావుల
- వైఎస్సార్సీపీ సభ్యులంతా.. వారి నాయకుడు చెప్పినట్లు నడుచుకుంటున్నారు: పయ్యావుల
- హిందూ గౌరవం, జాతి నమ్మకం తగ్గించడం, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు: పయ్యావుల
- దుర్మార్గ చర్యను ఎట్టి పరిస్ధితుల్లో అనుమతించవద్దని కోరిన పయ్యావుల
- వైసీపీ సభ్యుల ఆందోళనతో సభను వాయిదా వేసిన మండలి ఛైర్మన్
అసెంబ్లీ లాబీలో మీడియాతో హోంమంత్రి అనిత చిట్‌చాట్
- అసెంబ్లీ లాబీలో మీడియాతో హోంమంత్రి అనిత చిట్‌చాట్
- జాతీయ జెండా కూడా ఎగురవేయకుండా ప్యాలెస్‌లో పబ్జీ ఆడేవాళ్లా మాట్లాడేది?: అనిత
- ప్యాలెస్‌లో పబ్జీ ఆడేవాళ్లకు క్రికెట్ మ్యాచ్.. టీవీలో చూస్తే చాలనే ఆలోచనలే వస్తాయి: అనిత
- భారత్ - పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ అంటే ప్రతి భారతీయుడు ఇండియా గెలవాలని కోరుకుంటారు: అనిత
- టీమిండియాను ప్రోత్సహించి ఆ గెలుపులో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలనుకుoటారు: అనిత
- దేశభక్తి, దేశం పట్ల గౌరవం ఉన్న ఎవరికైనా ఇది అర్థమవుతుంది: హోంమంత్రి అనిత
- లోకేష్ సొంత ఖర్చులతో కొలొంబో వెళ్లింది కూడా ఇందులో భాగమే: అనిత
- ప్రజలంతా టీమిండియా గెలుపు చూస్తే.. వైఎస్సార్సీపీ వాళ్లే లోకేష్‌లో తప్పు చూశారు: అనిత
- ప్రజలు మాత్రం లోకేష్‌లో దేశభక్తి చూశారు: హోంమంత్రి అనిత
అసెంబ్లీ: గురజాల నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రశ్న
- అసెంబ్లీ: గురజాల నియోజకవర్గంలో సిమెంట్ పరిశ్రమలకు భూ కేటాయింపులపై ప్రశ్న
- ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నకు సమాధానం ఇచ్చిన మంత్రి టీజీ భరత్
- 1995 నుంచి ఇప్పటివరకూ 14 వేల ఎకరాలు సిమెంట్ పరిశ్రమలకు కేటాయించారు: టీజీ భరత్
- 14 వేల ఎకరాల్లో ప్రభుత్వ భూములతో పాటు రైతుల భూములు కూడా ఉన్నాయి: టీజీ భరత్
- నిబంధనల మేరకు భూములు తీసుకున్న మూడేళ్లలో పరిశ్రమ ఏర్పాటు చేయాలి: టీజీ భరత్
- ఆరు కంపెనీలు పరిశ్రమలు ఏర్పాటు చేయలేదు: మంత్రి టీజీ భరత్
- పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటాం: టీజీ భరత్
- పరిశ్రమల కోసం రైతులు భూములు ఇచ్చి ఉపాధి కోల్పోయారు: యరపతినేని
- భూములు తీసుకున్న వారిలో పులివెందుల ఎమ్మెల్యే కూడా ఉన్నారు: యరపతినేని
- సరస్వతి సిమెంట్స్ కోసం 6 వేల ఎకరాలు తీసుకున్నారు: యరపతినేని శ్రీనివాసరావు
- ఇప్పటివరకూ కంపెనీ కూడా ఏర్పాటు చేయలేదు: యరపతినేని శ్రీనివాసరావు
- జగన్‌కు పరిశ్రమలు రావడం ఇష్టం లేదు: యరపతినేని శ్రీనివాసరావు
- అమరావతికి పరిశ్రమలు వస్తుంటే అడ్డుకుంటారు: యరపతినేని శ్రీనివాసరావు
- భూములు తీసుకున్నవారు తాకట్టు పెట్టి బ్యాంకు రుణాలు పొందారు: యరపతినేని
- రైతుల పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారు: యరపతినేని శ్రీనివాసరావు
- రైతులు భూమి కోల్పోయి ఉపాధి లేక కూలీలుగా మారారు: యరపతినేని శ్రీనివాసరావు
- కంపెనీలు ఏర్పాటు చేయకపోతే ఆ భూములు వెనక్కి తీసుకోవాలి: యరపతినేని
అసెంబ్లీ: గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానం
- అసెంబ్లీ: గోదావరి పుష్కరాలపై ఎమ్మెల్యే నల్లమిల్లి ప్రశ్నకు మంత్రి నిమ్మల సమాధానం
- 2027 జూన్ 6 నుంచి గోదావరి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి: నిమ్మల
- డ్రెయిన్లతో పాటు పారిశ్రామిక కాలుష్యంతో ఇబ్బందులు ఉన్నాయి: నిమ్మల
- భక్తుల రద్దీ పెరిగే దృష్ట్యా స్నానఘట్టాలు పెంచాం: మంత్రి నిమ్మల రామానాయుడు
- ప్రభుత్వ శాఖల సమన్వయంతో నది కాలుష్యం కాకుండా జాగ్రత్తలు: నిమ్మల
- కాలుష్య నియంత్రణ మండలి సూచనలు కూడా తీసుకుంటాం: మంత్రి నిమ్మల
- గోదావరి నది పవిత్రత కాపాడటం కూడా ప్రభుత్వ బాధ్యత: మంత్రి నిమ్మల
- కొన్నిచోట్ల జంతు కళేబరాలు, పౌల్ట్రీ వ్యర్థాలు కూడా నీటివనరుల్లో కలిపేస్తున్నారు: నిమ్మల
- ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది: నిమ్మల రామానాయుడు
కల్తీ నెయ్యి అంశం దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్‌పై వైఎస్సార్సీపీ విమర్శలు: యనమల
- కల్తీ నెయ్యి అంశం దృష్టి మళ్లించేందుకే హెరిటేజ్‌పై వైఎస్సార్సీపీ విమర్శలు: యనమల
- జగన్.. అమూల్ డెయిరీకి ఏపీ డెయిరీ వ్యాపారాన్ని మోసపూరితంగా అప్పగించారు: యనమల
- మన పాడి రైతుల ప్రయోజనాలను జగన్ దెబ్బతీశారు: యనమల రామకృష్ణుడు
- హెరిటేజ్ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి జగన్ తన పాలనలో ప్రయత్నించారు: యనమల
ఆల్ ఇండియా పోలీసు సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన హోంమంత్రి, డీజీపీ
- ఆల్ ఇండియా పోలీసు సౌత్ జోన్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవం
- స్పోర్ట్స్ మీట్‌ను ప్రారంభించిన హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
- మంగళగిరి ఏపీఎస్పీ ఆరో బెటాలియన్ గ్రౌండ్స్‌లో స్పోర్ట్స్ మీట్
- ఆల్ ఇండియా స్థాయిలో రెండోసారి జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్
- ఈనెల 24 వరకు జరగనున్న క్రికెట్ పోటీలకు ఆతిధ్యమిస్తున్న ఆంధ్రప్రదేశ్
- ప్రజా భద్రతకు పోలీసులు అహర్నిశలు కష్టపడతారు: హోంమంత్రి అనిత
- క్రీడా స్ఫూర్తితో ప్రతిఒక్కరూ అడుగులు వేయాలి: హోంమంత్రి అనిత
- మహిళా పోలీసులకూ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయాలని డీజీపీని కోరుతున్నా: హోంమంత్రి
- స్నేహపూర్వక వాతావరణంలో స్పోర్ట్స్ మీట్ జరుగుతుంది: డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
- నిత్యం విధుల్లో బిజీగా ఉండే పోలీసులు స్పోర్ట్స్ మీట్‌లో పాల్గొనడం అభినందనీయం: డీజీపీ
అనంతపురం జిల్లా రాయదుర్గం వద్ద కొండపై చిరుత మృతి
- అనంతపురం జిల్లా రాయదుర్గం వద్ద కొండపై చిరుత మృతి
- ఏనుగుల బావిలో అనుమానాస్పద స్థితిలో చిరుత కళేబరం
- అనంతపురం జిల్లా: దర్యాప్తు చేస్తున్న అటవీశాఖ అధికారులు
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తట్రకల్లు సమీపంలో ప్రమాదం
- అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం తట్రకల్లు సమీపంలో ప్రమాదం
- టైరు పేలడంతో అదుపుతప్పి చెట్టును ఢీకొన్న కారు, ఒకరు మృతి
- ప్రమాదంలో భర్త నగేష్ మృతి, భార్య రేణుకకు తీవ్రగాయాలు
- ఉరవకొండ నుంచి గుంతకల్లుకు శుభకార్యాలయానికి వెళ్తున్న దంపతులు
అనంతపురం జిల్లా గుత్తిలో రైలు ప్రయాణికురాలి నగలు దోపిడీ
- అనంతపురం జిల్లా గుత్తిలో రైలు ప్రయాణికురాలి నగలు దోపిడీ
- మైసూర్ నుంచి కాచిగూడకు వెళ్తున్న రైలులో దోపిడీ ఘటన
- రైలు కిటికీ పక్కన కూర్చున్న అరుణ మెడలో నగలు లాక్కెళ్లిన దొంగ
- అనంతపురం నుంచి కాచిగూడ వెళ్తున్న ప్రయాణికురాలు అరుణ
- కర్నూలులో జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితురాలు అరుణ
టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- తిరుమల: టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ వరకు వేచి ఉన్న భక్తులు
- తిరుమల:నిన్న శ్రీవారిని దర్శించుకున్న 57,682 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.65 కోట్ల రూపాయలు
- తిరుమల: నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 27,020 మంది భక్తులు
ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దేలా పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం
- దిల్లీ: ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026కు నేడు హాజరుకానున్న సీఎం చంద్రబాబు
- ఏపీని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దేలా పారిశ్రామికవేత్తలతో భేటీ కానున్న సీఎం
- పలు సంస్థలతో ఒప్పందాలు చేసుకోనున్న సీఎం చంద్రబాబు
- 'ఏఐ యాక్సిలరేటర్స్, ఫ్యూయలింగ్ ఇండియాస్ ఎకనామిక్ గ్రోత్' పై మాట్లాడనున్న సీఎం
- అసోం సీఎం, కేంద్రమంత్రి జితిన్ ప్రసాద, టీసీఎస్ ప్రతినిధులతో కలిసి పాల్గొననున్న సీఎం
- ఏఐ, క్వాంటమ్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ అంశాలపై మాట్లాడనున్న సీఎం
- ఏఐ మౌలిక సదుపాయాలు, క్వాంటం నైపుణ్యాభివృద్ధికి సంబంధించి 7 ఒప్పందాలు
- ఐబీఎం, యూఎన్ఐసీసీ, ఐఐటీ మద్రాస్, వైసర్ తదితర సంస్థలతో జరగనున్న ఒప్పందాలు
- సీఎం చంద్రబాబు సమక్షంలో 7 ఒప్పందాలు చేసుకోనున్న రాష్ట్ర ప్రభుత్వం
- కృత్రిమ మేధస్సు ద్వారా పోటీతత్వం అంశంపై సమావేశంలో పాల్గొననున్న సీఎం
- అశ్వినీ వైష్ణవ్, డబ్ల్యూఈఎఫ్ సీఈవో బోర్గే బ్రెండేతో కలిసి సమావేశానికి సీఎం
- యునైటెడ్ కింగ్డమ్ ప్రతినిధి బృందంతో భేటీకానున్న సీఎం చంద్రబాబు
- అరాంకో, అడోబ్, ఆటో డెస్క్ కంపెనీల ఎండీ, సీఈవోలతోనూ భేటీకానున్న సీఎం
- 10 లక్షల మందికి నైపుణ్య కల్పించేలా ఐబీఎంతో ఒప్పందం చేసుకోనున్న సీఎం
- క్వాంటమ్ ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం ఏర్పాటుకు యూనిసిస్ సంస్థతో ఒప్పందం
- రాష్ట్రంలో క్వాంటమ్ ఏఐ వర్సిటీ ఏర్పాటుకు ఎన్‌ఐఈఎల్ఐటీతో ఎంవోయూ
- ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్యూటర్ ఏర్పాటుకు ఐఐటీ మద్రాస్‌తో ఒప్పందం
- ఎన్విడియా భాగస్వామ్యంతో ఏపీలో ఏఐ లివింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై ప్రకటన చేయనున్న సీఎం
- వరల్డ్ ఎకనామిక్ ఫోరం నిర్వహించే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొనున్న సీఎం
- అనంతరం యూకే ప్రతినిధులతో సమావేశం కానున్న సీఎం చంద్రబాబు
అసెంబ్లీలో శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ
- అసెంబ్లీలో నేటి నుంచి శాఖల వారీగా బడ్జెట్ పద్దులపై చర్చ, ఆమోదం
- నేడు విపత్తు నిర్వహణ, రెవెన్యూ, ఇంధన, న్యాయ శాఖల పద్దులపై అసెంబ్లీలో చర్చ
- మండలిలోనూ బడ్జెట్ ప్రసంగంపై చర్చకు సమాధానం ఇవ్వనున్న ఆర్థికమంత్రి
- అసెంబ్లీ ఆమోదించిన 7 బిల్లులు నేడు మండలిలో ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
- స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు ప్రభుత్వం కీలక నిర్ణయం
- స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అమలుకు వీలుగా ప్రత్యేక చర్యలు
- బీసీల జనాభా, వెనుకబాటుతనం అధ్యయనానికి డెడికేటెడ్ కమిషన్ నియామకం
- విశ్రాంత ఐఎఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలో డెడికేటెడ్ కమిషన్
- కమిటీకి సెక్రటరీగా ఉంటూ సహకారం అందించనున్న బీసీ సంక్షేమ శాఖ అదనపు డైరెక్టర్ చంద్రశేఖరరాజు
- రాష్ట్రవ్యాప్తంగా బీసీల జనాభా, వెనుకబాటుతనాన్ని అధ్యయనం చేయనున్న డెడికేషన్ కమిషన్
- స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ల నిష్పత్తిని నిర్ణయించేందుకు డెడికేషన్ కమిషన్ నియామకం
- వేర్వేరు సంస్థలు, వ్యక్తుల సహాయం, సమాచారం, గణాంకాలు తీసుకోవచ్చన్న ప్రభుత్వం
- అవసరమైన సమాచారం లేదా గణాంకాలు పొందేందుకు వీలు కల్పించిన ప్రభుత్వం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల నుంచి గణాంకాలు తీసుకోవచ్చని ఆదేశాలు
- 45 రోజుల్లో అధ్యయన నివేదికను సమర్పించాలని స్పష్టం చేసిన ప్రభుత్వం
Last Updated : February 20, 2026 at 10:52 PM IST

