2 March 2026 Andhra Pradesh News Today Live Updates: తిరుమల చేరుకున్న ఏకసభ్య కమిషన్ - టీటీడీలో పరిపాలనా వైఫల్యాలపై విచారణ
Andhra Pradesh News Today Live Updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : March 2, 2026 at 7:22 AM IST
|Updated : March 2, 2026 at 10:13 PM IST
2 March 2026 Andhra Pradesh News Today Live Updates: ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్న మంత్రి కొండపల్లి
LIVE FEED
బాణసంచా పేలుడు ఘటనపై ప్రభుత్వం చర్యలు
- కాకినాడ: వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనపై ప్రభుత్వం చర్యలు
- కార్మికశాఖ అసిస్టెంట్ కమిషనర్ బీఎస్‌ఎం వల్లిపై సస్పెన్షన్ వేటు
- కాకినాడలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్‌గా పనిచేస్తున్న బీఎస్ఎం వల్లి
మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన
- కడప: పోరుమామిళ్ల పీఎస్ వద్ద మృతుడి కుటుంబసభ్యుల ఆందోళన
- దిలీప్ మృతదేహంతో ధర్నాకు దిగిన కుటుంబసభ్యులు, బంధువులు
- పెట్రో దాడి ఘటనలో చికిత్స పొందుతూ మరణించిన దిలీప్
- వారం గడిచినా నిందితులను పట్టుకోలేదంటూ కుటుంబసభ్యుల ఆందోళన
- దిలీప్‌ను చంపిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్
తిరుమల చేరుకున్న ఏకసభ్య కమిషన్
- తిరుమల చేరుకున్న ఏకసభ్య కమిషన్
- రేపు ఉదయం శ్రీవారిని దర్శనం చేసుకోనున్న ఏకసభ్య కమిషన్
- తాత్కాలిక కార్యాలయ ఏర్పాటుకు భవనాలు పరిశీలించిన కమిషన్
- భూదేవి కాంప్లెక్స్ వద్ద పాత ఎస్వీబీసీ కార్యాలయాన్ని పరిశీలించిన కమిషన్
- నెయ్యి కల్తీ ఘటనలో లోపాల విచారణకు కమిషన్‌ను నియమించిన ప్రభుత్వం
- 45 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని గడువు విధించిన ప్రభుత్వం
- టీటీడీలో పరిపాలనా వైఫల్యాలపై విచారణ జరపనున్న కమిషన్
- 2021 నుంచి 2024 మధ్య కాలంలో నెయ్యి సేకరణపై విచారణ
- టెండర్ నిబంధనల సడలింపు కారణాలపై విచారణ జరపనున్న కమిషన్
- సిట్ నివేదిక అంశాలను పరిగణనలోకి తీసుకుని నిబంధనల ఉల్లంఘనపై విచారణ
- క్రమశిక్షణ, క్రిమినల్ చర్యలపై ప్రభుత్వానికి సిఫారసు చేయనున్న కమిషన్
ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు
- ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు
- ఈహెచ్ఎస్ స్కీం సమీక్షించేందుకు నిర్వహణ కమిటీలో సభ్యుల నియామకం
- ఈహెచ్ఎస్ నిర్వహణ కమిటీలో ఉద్యోగ సంఘాల నుంచి ప్రతినిధులు
- నిర్వహణ కమిటీలో ప్రతినిధిగా ఏపీపీటీడీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్షుడు
- కమిటీలో ప్రతినిధిగా ఏపీపీటీడీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోషియేషన్ అధ్యక్షుడు
- తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ సీఈఓకు ఆదేశం
- ఐపీఎస్ సునీల్ నాయక్ విచారణకు హాజరుకావాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
- ఈ నెల 5 నుంచి 9 వరకు దర్యాప్తు అధికారి ముందు హాజరుకావాలని ఉత్తర్వులు
- రఘురామ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేసిన ఐపీఎస్ సునీల్ నాయక్
- ఐపీఎస్ సునీల్ నాయక్ వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు
ముగ్గురు యువకులు మృతి
- ఏలూరు డీపాల్ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం, ముగ్గురు యువకులు మృతి
- ఏలూరు: వేగంగా వచ్చి కళాశాల బస్సును ఢీకొన్న ద్విచక్రవాహనం
- ద్విచక్రవాహనంపై ఉన్న ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి
మరో వ్యక్తి మృతి
- రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో మరో వ్యక్తి మృతి
- ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సత్యనారాయణ అనే వ్యక్తి మృతి
- రాజమహేంద్రవరం: కల్తీ పాల ఘటనలో ఏడుకు చేరిన మృతుల సంఖ్య
ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
- తిరుపతి: 8 మంది అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు
- కర్ణాటక హరత్నహళ్లిలో కోళ్ల ఫామ్ కేంద్రంగా ఎర్రచందనం అక్రమ రవాణా
- స్మగ్లర్ ఇచ్చిన సమాచారంతో దాడులు నిర్వహించిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు
- రూ.5 కోట్ల విలువైన 8 టన్నుల ఎర్రచందనం, 3 వాహనాలు జప్తు
- దాడి సమాచారం తెలిసి పరారైన ప్రధాన నిందితుడు, మరో ఇద్దరు వ్యక్తులు
శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలి
- ఆర్టీజీఎస్, పబ్లిక్ పాజిటివ్ పర్షెప్సన్‌పై సీఎం చంద్రబాబు (Chandrababu Review) సమీక్ష
- వివిధ శాఖల సమర్థత పెరిగేలా చూడాలని అధికారులకు సీఎం సూచనలు
- పింఛన్ల పంపిణీలో లోటుపాట్లు తలెత్తే గ్రామాలు, వార్డులపై దృష్టి పెట్టాలన్న సీఎం
- 'దీపం' సిలిండర్ల డెలివరీలో డబ్బు వసూలు చేయకుండా చూడాలన్న సీఎం
- బస్టాండ్లలో సౌకర్యాలు, పొరుగుసేవలు మెరుగ్గా ఉండాలన్న సీఎం
- అన్ని బస్టాండ్లలో శౌచాలయాలు మరమ్మతులు చేయాలని సీఎం ఆదేశం
- బాణసంచా పేలుడు ఘటనలు మరోసారి జరగకుండా చూడాలని సీఎం ఆదేశం
- శివకాశీ వెళ్లి అధ్యయనం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశం
- రిజిస్ట్రేషన్ శాఖలో స్లాట్ బుకింగ్, డిజిటల్ సేవలపై సంతృప్తి వ్యక్తం చేసిన అధికారులు
- సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతికి తావు లేకుండా చూడాలన్న సీఎం
- నిజాయతీ కలిగిన అధికారులకే అవకాశం ఇవ్వాలన్న సీఎం చంద్రబాబు
- వాట్సప్ సేవల వినియోగం వందశాతం జరగాలన్న సీఎం చంద్రబాబు
- శాఖల పనితీరు మెరుగుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్న సీఎం
పొలాల్లో తల లభ్యం
- కాకినాడ: వేట్లపాలెం పంటపొలాల్లో కార్మికుడి తల లభ్యం
- బాణసంచా పేలుడు ధాటికి తల ఎగిరిపడినట్లు భావిస్తున్న పోలీసులు
- ఘటనాస్థలానికి వంద మీటర్ల దూరంలోని పొలాల్లో తల లభ్యం
పోలీసులు పట్టించుకోవడం లేదు
- గుంటూరు కలెక్టరేట్‌లో పెట్రోల్ పోసుకుని వృద్ధుడి ఆందోళన
- తన ఇంటిని ఆక్రమించారంటూ పెట్రోల్ పోసుకున్న దాసరి పాపయ్య
- పాపయ్య నుంచి పెట్రోల్ సీసా లాక్కున్న స్థానికులు, పోలీసులు
- తన ఇంటిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వృద్ధుడి ఆవేదన
- ఫిర్యాదు చేసినా ఫిరంగిపురం పోలీసులు పట్టించుకోవడం లేదన్న వృద్ధుడు
- ఇంటి నుంచి బలవంతంగా బయటకు నెట్టారని వృద్ధుడి ఆందోళన
ఫొటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడు
- అనంతపురం: వైఎస్సార్సీపీ నేత వడ్డే పెద్దన్నపై మహిళల ఫిర్యాదు
- అసభ్యంగా ప్రవర్తిస్తూ, బెదిరిస్తున్నాడని ఎస్పీకి ఫిర్యాదు చేసిన మహిళలు
- తమ ఫొటోలు తీసి ఇబ్బందులు పెడుతున్నాడని ఎస్పీకి ఫిర్యాదు
- వడ్డే పెద్దన్నపై చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్‌ను కోరిన మహిళలు
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర (Gold Rates) రూ.1,70,000
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,56,400
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,99,200
ఆదివాసీలను హడలెత్తిస్తున్న పెద్దపులి
- పోలవరం మన్యంలో ఆదివాసీలను హడలెత్తిస్తున్న పెద్దపులి (Tiger)
- పెద్దపులిని పట్టుకోవాలని రంపచోడవరం ఐటీడీఏ ఎదుట ఆందోళన
- సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రతినిధుల ఆందోళన
- పులిని పట్టుకొని ఆదివాసీలకు రక్షణ కల్పించాలని డిమాండ్
- తాళ్లపాలెం-చొప్పరిపాలెం అటవీప్రాంతంలో సంచరిస్తున్న పెద్దపులి
- గస్తీకాస్తున్న అటవీశాఖ అధికారులు, భయాందోళనలో గిరిజనులు
స్టాక్‌మార్కెట్లపై యుద్ధ ప్రభావం
- భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు (Stock Markets)
- 1,400పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- 400 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ
- స్టాక్‌మార్కెట్లపై యుద్ధ ప్రభావం
రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను వైఎస్సార్సీపీ మభ్యపెడుతోంది
- రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను వైఎస్సార్సీపీ మభ్యపెడుతోంది: మంత్రి మండిపల్లి
- జగన్ హయాంలో 102 సాగునీటి ప్రాజెక్టులకు ప్రీ-క్లోజర్ చేశారు: మంత్రి మండిపల్లి
- 2014-19లో టీడీపీ రూ.12,441 కోట్లు ఖర్చు చేసింది: మంత్రి మండిపల్లి
- వైఎస్సార్సీపీ కేవలం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది: మంత్రి మండిపల్లి
- చంద్రబాబు దృఢ సంకల్పంతో సాగునీటి ప్రాజెక్టులు వేగవంతం: మంత్రి మండిపల్లి
- హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ప్రతి ఎకరాకు నీరందించడం లక్ష్యం: మండిపల్లి
- గాలేరు, నగరి సుజల స్రవంతి పూర్తి ప్రభుత్వ ప్రాధాన్యం: మంత్రి మండిపల్లి
- రాయలసీమ ప్రాజెక్టులకు రూ.6,613 కోట్లు కేటాయింపు: మంత్రి మండిపల్లి
- హంద్రీనీవా ద్వారా 738 కి.మీ. దూరంలోని కుప్పానికి నీరు తరలింపు: మంత్రి మండిపల్లి
- శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులకు రూ.205 కోట్లు కేటాయింపు: మంత్రి మండిపల్లి
- విమర్శల రాజకీయాలకంటే అభివృద్ధి రాజకీయాలే మాకు ముఖ్యం: మంత్రి మండిపల్లి
గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారు హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలి
- గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని క్షేమంగా తీసుకొచ్చేందుకు చర్యలు: మంత్రి కొండపల్లి
- ఏపీ ఎన్నార్టీ కోఆర్డినేటర్ల ద్వారా తాత్కాలిక వసతి ఏర్పాట్లు చేశామన్న మంత్రి కొండపల్లి
- హెల్ప్ లైన్ నంబర్లను వినియోగించుకోవాలని కోరిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- ఏపీ ఎన్నార్టీఎస్ 24/7 హెల్ప్‌లైన్ 0863-2340678కు తెలియజేయవచ్చు: కొండపల్లి
- వాట్సాప్ +91 85000 27678 నెంబర్లకు తెలియజేయవచ్చు: మంత్రి కొండపల్లి
- ఈమెయిల్: helpline@apnrts.comను సంప్రదించవచ్చు: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
యువతి ఇంటి ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం
- అన్నమయ్య జిల్లాలో యువతి ఇంటి ముందు యువకుడు ఆత్మహత్యాయత్నం
- ప్రేమించిన యువతిని తనతో పంపలేదని నిప్పంటించుకున్న యువకుడు, ఆస్పత్రికి తరలింపు
- అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కంటేవారిపల్లెలో ఘటన
ఒకే ఇంట్లో నలుగురు అదృశ్యం
- శ్రీసత్యసాయి జిల్లా రొళ్ల మండలం హెచ్.వడ్రహట్టిలో ఒకే ఇంట్లో నలుగురు అదృశ్యం (Missing)
- నలుగురు కుటుంబసభ్యులు కనిపించకుండా పోయినట్లు పోలీసులకు ఫిర్యాదు
- కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
నెల్లూరు ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం
- నెల్లూరు ఆటోనగర్‌లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident)
- నెల్లూరు ఆటోనగర్‌లోని ప్లాస్టిక్ గోదాములో చెలరేగిన మంటలు
- మంటలతో పాటు వేదాయపాలెం మొత్తం వ్యాపించిన పొగలు
- మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక యంత్రాలు
- గోదాముకు తాళం వేసి ఉండటంతో లోపలకు వెళ్లేందుకు వీలుకాని పరిస్థితి
రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో బాధితులకు కొనసాగుతున్న చికిత్స
- రాజమహేంద్రవరం కల్తీ పాల ఘటనలో బాధితులకు కొనసాగుతున్న చికిత్స
- ఇంకా ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న 15 మంది బాధితులు
- బాధితుల్లో 11 మందికి వెంటిలేటర్‌పై డయాలసిస్ అందిస్తున్న వైద్యులు
- రాజమహేంద్రవరం: ఫోరెన్సిక్ నివేదిక కోసం ఎదురుచూస్తున్న అధికారులు
తూ.గో. జిల్లావ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలు మూసివేత
- తూ.గో. జిల్లావ్యాప్తంగా 25 బాణసంచా తయారీ కేంద్రాలు మూసివేత
- తక్షణమే బాణసంచా తయారీ కేంద్రాల మూసివేతకు కలెక్టర్ ఆదేశాలు
- వేట్లపాలెం బాణసంచా పేలుడుతో జిల్లాలో అప్రమత్తమైన అధికారులు
- నిబంధనలకు విరుద్ధంగా బాణసంచా తయారుచేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
శ్రీకాకుళం జిల్లాలో బొమ్మలతో పిల్లలకు టీచర్ పాఠాలు బోధిస్తున్నారు: మంత్రి లోకేష్
- శ్రీకాకుళం జిల్లాలో బొమ్మలతో పిల్లలకు టీచర్ పాఠాలు బోధిస్తున్నారు: మంత్రి లోకేష్
- జి.సిగడాం మండలం బూటుపేట ప్రాథమిక పాఠశాలలో వినూత్న బోధన: లోకేష్
- ప్రధానోపాధ్యాయినిగా విధులు నిర్వర్తిస్తున్నఅరుణకుమారి బోధన తీరు ప్రశంసనీయం: లోకేష్
- బొమ్మలు, షార్ట్ ఫిల్మ్స్‌తో పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా బోధన: లోకేష్
- శిక్షణల్లో కేఆర్పీగా, మాడ్యూల్ రచయితగా, ఈ-కంటెంట్ సృష్టికర్తగా ఎనలేని కృషి: లోకేష్
- ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యానికి మీరంతా స్ఫూర్తిప్రదాతలు: లోకేష్
శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు
- శ్రీకాకుళం జిల్లాలో ఏసీబీ అధికారుల సోదాలు
- సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాల ముకుందరావు నివాసంలో సోదాలు
- శ్రీకాకుళంలోని చాపురం, డీసీసీబీ కాలనీలోని 3వ చైనా బజార్ వద్ద నివాసాల్లో తనిఖీలు
- ఇంట్లోని కీలక పత్రాలు, ఆస్తుల దస్త్రాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్న అధికారులు
- గత జనవరి 28న బాల ముకుందరావుపై అవినీతి ఆరోపణలతో ఏసీబీ కేసు
- హాస్టల్ వార్డెన్ల నుంచి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదుతో కేసు
- వసూళ్ల కేసులో గతంలోనే ఆయనను పట్టుకున్న ఏసీబీ అధికారులు
- కేసు విచారణలో భాగంగానే ఆకస్మికంగా సోదాలు చేస్తున్న ఏసీబీ అధికారులు
లక్ష్య నిర్దేశానికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలి: మంత్రి నారాయణ
- లక్ష్య నిర్దేశానికి అనుగుణంగా నిర్మాణ సంస్థలు పనిచేయాలి: మంత్రి నారాయణ
- పనులు చేయకుంటే ప్రభుత్వపరంగా గట్టిగా అడిగి తీరుతాం: మంత్రి నారాయణ
- అమరావతిపై వైఎస్సార్సీపీ విమర్శలు అర్ధరహితం: మంత్రి నారాయణ
- నిరాధార ఆరోపణలను ప్రజలు నమ్మే పరిస్థితిల్లో లేరు: మంత్రి నారాయణ
- ఉద్యోగులకు నిర్మిస్తున్న 4,026 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి: మంత్రి నారాయణ
- మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాం: మంత్రి నారాయణ
- గత 3 నెలల్లో రాజధానిలో నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి: మంత్రి నారాయణ
- వచ్చే మూడేళ్లలో పరిపాలన భవనాలు అందుబాటులోకి తెస్తాం: మంత్రి నారాయణ
- రహదారులు 3 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: మంత్రి నారాయణ
- వర్షాకాలంలో పనులకు ఇబ్బంది లేకుండా భూగర్భ పనులు ముందుగా పూర్తిచేస్తాం: నారాయణ
ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధంతో కోనసీమ జిల్లా వాసుల్లో తీవ్ర ఆందోళన
- ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం (Israel-Iran War)తో కోనసీమ జిల్లా వాసుల్లో తీవ్ర ఆందోళన
- గల్ఫ్ దేశాల్లో సుమారు 2 లక్షల మంది ఉమ్మడి తూ.గో. జిల్లా వాసులు
- గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న సఖినేటిపల్లి, మలికిపురం, రాజోలు వాసులు
- గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్న అల్లవరం, ఉప్పలగుప్తం, కమలాపురం వాసులు
- యుద్ధ పరిస్థితులతో స్థానికంగా తీవ్ర ఆందోళన చెందుతున్న జిల్లా వాసులు
- జాగ్రత్తగా ఉండాలని తమ వాళ్లకు సూచిస్తున్న కుటుంబసభ్యులు, బంధువులు
రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ ఆగ్రహం
- రాజధాని నిర్మాణ పనులు ఆలస్యం చేస్తున్నారంటూ మంత్రి నారాయణ ఆగ్రహం
- కాంట్రాక్టు సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నారాయణ
- రాజధాని ప్రాంతంలో పర్యటించిన మంత్రి నారాయణ
- నేలపాడులో వివిధ నిర్మాణాలు పరిశీలించిన మంత్రి నారాయణ
- పని చేయలేకపోతే వెళ్లిపోవాలని నిర్మాణ సంస్థ ప్రతినిధులపై మంత్రి అసహనం
- షాపూర్ జీ పల్లోంజీ కన్‌స్ట్రక్షన్ నిర్మాణ సంస్థకు చెందిన ఇద్దరు ప్రతినిధులను పంపించేయాలని ఆదేశాలు
- పనుల ఆలస్యంపై సంస్థ యాజమాన్యం సీఎం చంద్రబాబుకు సంజాయిషీ ఇవ్వాలని ఆదేశం
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశించాం: మంత్రి గొట్టిపాటి
- వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను 2 నెలల్లో అందుబాటులోకి తేవాలని ఆదేశించాం: మంత్రి గొట్టిపాటి
- అవసరమైన సామగ్రిని విద్యుత్ సంస్థలు సమకూర్చుకుంటున్నాయి: మంత్రి గొట్టిపాటి
- అంచనాలు తయారుచేసి, మంజూరుకు సిద్ధం చేసేలా చర్యలు తీసుకుంటున్నాం: మంత్రి గొట్టిపాటి
- వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఊరట లభించనుంది: గొట్టిపాటి
- 46,113 మంది రైతులు కొత్త కనెక్షన్ల కోసం దరఖాస్తు చేశారు: మంత్రి గొట్టిపాటి
- వైసీపీ హయాంలో కనెక్షన్లు ఇవ్వకుండా పెండింగ్‌లో పెట్టింది: మంత్రి గొట్టిపాటి
- కూటమి అధికారంలోకి వచ్చేనాటికి 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి: మంత్రి
- పెండింగ్‌తో కలిపి డిస్కంలు సుమారు 1.12 లక్షల కొత్త కనెక్షన్లు ఇచ్చాం: గొట్టిపాటి
ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థి బలవన్మరణం
- ప్రొద్దుటూరు మోడంపల్లిలోని ప్రభుత్వ వసతిగృహంలో విద్యార్థి బలవన్మరణం
- వసతిగృహంలోని చెట్టుకు ఉరేసుకుని విద్యార్థి నరసింహులు ఆత్మహత్య
- వసతిగృహం సమీపంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థి
- ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
- ప్రొద్దుటూరు: ఆత్మహత్యకు కారణాలపై ఆరా తీస్తున్న పోలీసులు
- విద్యార్థి నరసింహులు స్వగ్రామం మైలవరం మండలం కల్లుట్ల
చంద్రగ్రహణం
- తిరుమల: రేపు శ్రీవారిని ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ
- చంద్రగ్రహణం కారణంగా సుమారు 10.30 గంటల పాటు ఆలయం మూసివేత
- రేపు ఉదయం 9 గం.కు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు
- రేపు మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ కాలం
- రేపు ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేత
- రేపు సాయంత్రం గ్రహణం వీడాక శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభం
- రేపటి బ్రేక్ దర్శనాలకు ఇవాళ సిఫార్సు బ్రేక్ లేఖల స్వీకరణ అనుమతి నిరాకరణ
- రేపు శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు
- ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
- ఈనెల 4న సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభం
- రేపు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేత
- విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్‌లైన్ టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ
టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 15 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి భక్తులతో నిండిన అన్ని కంపార్టుమెంట్లు
- కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 83,112 మంది భక్తులు
- తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 30,054 మంది భక్తులు
సత్తెనపల్లి గార్లపాడు సెంటర్‌లో ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం
- సత్తెనపల్లి గార్లపాడు సెంటర్‌లో ఎలక్ట్రికల్ దుకాణంలో అగ్నిప్రమాదం
- స్థానికుల సమాచారంతో మంటలు అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
అమరావతిని ఆధునిక న్యాయనగరంగా అభివృద్ధి చేస్తున్నాం: సీఎం
- అమరావతిని ఆధునిక న్యాయనగరంగా అభివృద్ధి చేస్తున్నాం: సీఎం
- అమరావతిలో కోర్టులు, న్యాయశిక్షణ అకాడమీ నిర్మిస్తున్నాం: సీఎం
- అమరావతిలో మధ్యవర్తిత్వ కేంద్రాలు, లీగల్ సర్వీసెస్ సంస్థలు: సీఎం
- సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ రాక అమరావతికి కీలక అడుగు: సీఎం చంద్రబాబు
- అమరావతిలో న్యాయ, మౌలికవసతుల బలోపేతానికి ఇది మైలురాయి: సీఎం
Last Updated : March 2, 2026 at 10:13 PM IST

