19-02-2026: ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం: నారా భువనేశ్వరి
19 february 2026 ap live news updates (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 19, 2026 at 7:07 AM IST
|Updated : February 19, 2026 at 10:23 PM IST
19-02-2026 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు - సముద్రకోత నివారణ, కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి
LIVE FEED
చెరువులోపడి పదో తరగతి విద్యార్థిని దుర్మరణం
- కోనసీమ జిల్లా: పి.గన్నవరం మండలం ముంగండలో విషాదం
- చెరువులోపడి పదో తరగతి విద్యార్థిని దుర్మరణం
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
ఎంపీ వేమిరెడ్డి పీఏ పేరుతో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు
- నెల్లూరు: ఎంపీ వేమిరెడ్డి పీఏ పేరుతో బెదిరిస్తున్న వ్యక్తి అరెస్టు
- డబ్బు ఇవ్వాలంటూ జమ్మలమడుగుకు చెందిన నరేశ్‌కు ఫోన్ చేసి బెదిరింపులు
- డబ్బు డిమాండ్ చేస్తున్న వ్యక్తి తిరుపతికి చెందిన నదీమ్‌గా గుర్తింపు
- పలుసార్లు ఫోన్ చేసి డబ్బు అడిగినట్లు పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
- వేమిరెడ్డి పీఏ పేరుతో బెదిరిస్తున్న నదీమ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
- నెల్లూరు ఎంపీ కార్యాలయానికి సమాచారం ఇచ్చిన బాధితుడు నరేశ్
ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం: నారా భువనేశ్వరి
- ప్రతి పాడి రైతుకు సాధికారత కల్పించడమే హెరిటేజ్ లక్ష్యం: నారా భువనేశ్వరి
- 33 ఏళ్లుగా తాజా, ఆరోగ్యకరమైన పాల ఉత్పత్తులు అందిస్తున్నాం: నారా భువనేశ్వరి
- రూ.4 కోట్లతో ప్రారంభమై రూ.4 వేల కోట్ల సంస్థగా ఎదిగాం: నారా భువనేశ్వరి
- నాణ్యత విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీ పడలేదు: నారా భువనేశ్వరి
- ప్రతి ఉత్పత్తికీ 25 నాణ్యతా పరీక్షలు జరిగాకే మీ ఇంటికి వస్తుంది: భువనేశ్వరి
- నాణ్యతా ప్రమాణాలను 500కి పైగా నిపుణులు పర్యవేక్షిస్తున్నారు: భువనేశ్వరి
- మాకు 9 రాష్ట్రాల పరిధిలో 3 లక్షల మంది రైతులు ఉన్నారు: భువనేశ్వరి
- పారదర్శకత, న్యాయమైన ధర, సమయానికి చెల్లింపు.. ఇవే మా సూత్రాలు: భువనేశ్వరి
- కోచింగ్ సెంటర్లపై సుప్రీంకోర్టు మార్గదర్శకాల అమలుపై మంత్రి లోకేష్ సమీక్ష
- యువతకు పెద్దఎత్తున ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి లోకేష్
- ఉద్యోగాల కల్పనకు అనుగుణంగా రూట్‌మ్యాప్ సిద్ధం చేయాలి: మంత్రి లోకేష్
- జాబ్ క్యాలెండర్ సహా వర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి కసరత్తు: లోకేష్
సర్పంచులకు ప్రభుత్వం శుభవార్త
- గ్రామపంచాయతీ సర్పంచులకు ప్రభుత్వం శుభవార్త
- 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి
- ఉత్తర్వులు జారీ చేసిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ
- జనవరి 5న నిర్వహించిన తీర్మానాల మేరకు నిధుల వినియోగానికి అనుమతి
- పనులు చేసి మెజర్‌మెంట్ బుక్స్‌లో నమోదు చేస్తే బిల్లులు చెల్లించవచ్చని ఆదేశం
- తాజా నిర్ణయంతో పంచాయతీల్లో పెండింగ్ బిల్లుల చెల్లింపులు వేగవంతం
భర్తను చంపిన భార్య
- గుంటూరు: మంగళగిరి టిడ్కో ఇళ్ల సముదాయంలో భర్తను చంపిన భార్య
- టీవీ సౌండ్ విషయంలో గొడవపడి మహమ్మద్‌ను కత్తితో పొడిచి చంపిన క్రాంతి
- మహమ్మద్‌ను ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న క్రాంతి
డంపింగ్ యార్డ్‌లో ఖననం
- కులవర్ధన్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పురపాలక సిబ్బంది
- మదనపల్లె ఆస్పత్రి మార్చురీ నుంచి డంపింగ్ యార్డ్‌కు తరలింపు
- కులవర్ధన్ మృతదేహాన్ని డంపింగ్ యార్డ్‌లో ఖననం చేసిన మున్సిపల్ సిబ్బంది
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
- విశాఖ బీచ్ రోడ్‌లో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
- సిటీ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- సందర్శకులను ఆకట్టుకున్న యుద్ధనౌకల విద్యుద్దీపాలు, బాణసంచా వెలుగులు
- గగనతలంలో రంగురంగుల బాణసంచా వెలుగు జిలుగులు
- విశాఖ: సందర్శకులను అలరించిన లేజర్ షో.. నేవీ డ్రోన్ షో..
- విశాఖ.. తూర్పు తీరంలో ఒక కీలక స్థావరం: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఇతర దేశాలతో సత్సంబంధాలే లక్ష్యంగా ఐఎఫ్‌ఆర్, మిలన్: అబ్దుల్ నజీర్
- మన సంస్కృతి, వారసత్వం, దార్శనికతకు ఇవన్నీ మైలురాళ్లు: అబ్దుల్ నజీర్
- వాణిజ్యం, స్నేహబంధాలకు సముద్రాలు వారధులుగా నిలవాలి: గవర్నర్
ఆర్‌డీటీ సంస్థకు అండగా ఉంటామని సీఎం హామీ
- అనంతపురంలోని ఆర్‌డీటీ సంస్థకు అండగా ఉంటామని సీఎం హామీ
- సీఎం చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యేలు కాలవ, అమిలినేని, ఎం.ఎస్.రాజు
- ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌లో తీవ్ర ఆలస్యాన్ని సీఎంకు వివరించిన ఎమ్మెల్యేలు
- రెన్యువల్‌లో జాప్యం వల్ల ఆర్‌డీటీకి నిర్వహణ కష్టసాధ్యంగా మారిందన్న నేతలు
- కొన్ని ఆస్తులు అమ్మాలని ఆర్‌డీటీ నిర్ణయించడం దురదృష్టకరమన్న ఎమ్మెల్యేలు
- గత వైసీపీ పాలకుల వైఖరి వల్లే ఇలా జరిగిందన్న టీడీపీ ఎమ్మెల్యేలు
- కేంద్రంతో మాట్లాడి ఎఫ్‌సీఆర్‌ఏ త్వరగా పునరుద్ధరించేలా చూడాలన్న నేతలు
- రేపు కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని సీఎంను కోరిన ఎమ్మెల్యేలు
- దిల్లీ పెద్దలతో మాట్లాడి ఆర్‌డీటీ సమస్య పరిష్కరిస్తామని సీఎం భరోసా
యురేనియం ఫ్యాక్టరీ అధికారులను కలిసిన వైఎస్ సునీత
- కడప: తుమ్మలపల్లి యురేనియం ఫ్యాక్టరీ అధికారులను కలిసిన వైఎస్ సునీత
- వివేకా హత్య కేసులో ఏ6గా ఉన్న ఉదయ్ వివరాలపై ఆరా తీసిన సునీత
- ఉదయ్.. సీబీఐ అరెస్టు చేసే ముందు యురేనియం కర్మాగారంలో ఉద్యోగి: సునీత
- ఉదయ్‌కుమార్‌రెడ్డి 495 రోజులు జైలులో ఉన్నాడు: వైఎస్ సునీత
- జైలులో ఉన్నా ఎందుకు ఉద్యోగం నుంచి తొలగించలేదు?: సునీత
- మళ్లీ ఉద్యోగంలోకి వెళ్లేందుకు ఉదయ్‌కుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నాడు: సునీత
- ఎందుకిలా చేస్తున్నారో తెలుసుకునేందుకే యురేనియం ఫ్యాక్టరీకి వెళ్లా: సునీత
- నేను చెప్పింది యూసీఐఎల్ అధికారులు విన్నారు.. కానీ జవాబివ్వలేదు: సునీత
జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు
- క్లీన్ చిట్‌లో ఉన్న సంస్థ హెరిటేజ్: హోంమంత్రి అనిత
- హెరిటేజ్‌లో ఏదో జరిగిపోతుందని జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారు: అనిత
- ఇందాపూర్ కంపెనీ నుంచి హెరిటేజ్ ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది: మంత్రి అనిత
- హెరిటేజ్ కంపెనీ ఏ రోజు కూడా టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు: అనిత
- నెయ్యి ధరలు పెరగడాన్ని కూడా జగన్ తప్పు పడుతున్నారు: మంత్రి అనిత
- కాలానుగుణంగా వస్తువుల ధరలు పెరగలేదా?: మంత్రి అనిత
- నందిని కంపెనీకి కిలో నెయ్యికి రూ.700 చొప్పున చెల్లించారు: మంత్రి అనిత
- ఇందాపూర్ కంపెనీకి హెరిటేజ్ సంస్థ ఏ ఉత్పత్తులు అమ్మలేదు: మంత్రి అనిత
- బోలేబాబా కంపెనీస్‌లో రెండు విభాగాలు ఉన్నాయి: మంత్రి అనిత
- బోలోబాబా సంస్థ టీటీడీకి ఏరోజూ నెయ్యి సరఫరా చేయలేదు: మంత్రి అనిత
- అబద్ధాలను 3 గంటలపాటు చెప్పినందుకు జగన్‌కు గిన్నిస్ రికార్డు ఇవ్వవచ్చు: అనిత
- హెరిటేజ్‌పై బురద చల్లడమే పనిగా కొండను తవ్వి ఎలుకనూ పట్టలేకపోయారు: అనిత
- హెరిటేజ్ వెబ్‌సైట్‌లోని విషయాలపై ఏదో చెప్పాలని చూశారు: హోంమంత్రి అనిత
- ఇందాపూర్ డెయిరీ నుంచి హెరిటేజ్ కొన్ని ఉత్పత్తులు కొంటే తప్పేంటి?: అనిత
- హెరిటేజ్.. ఇప్పటివరకు ఏ సంస్థకూ నెయ్యి సరఫరా చేయలేదు: అనిత
- హెరిటేజ్‌పై తాను చెప్పేవన్నీ అబద్ధాలని జగన్‌కు కూడా తెలుసు: అనిత
- 3 గంటల ప్రసంగంలో బాబాయ్ ప్రకటనపై ఎందుకు నోరెత్తలేదు?: అనిత
- కల్తీపై చర్చకు సిద్ధమని జగన్ ఎందుకు చెప్పలేకపోతున్నారు?: అనిత
- లడ్డూ కల్తీపై మాట్లాడలేకే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తెచ్చారు: అనిత
- కల్తీ లడ్డూ, హెరిటేజ్‌పై ఆరోపణలపై అసెంబ్లీలో చర్చకు మేం సిద్ధం: అనిత
- అమరావతి: జయపుర వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- కుప్పం అథారిటీ పీడీ, ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాహానికి హాజరుకానున్న సీఎం
- వికాస్ మర్మత్ వివాహానికి హాజరై రాత్రికి అక్కడే బస చేయనున్న చంద్రబాబు
- రేపు ఉదయం జయపుర నుంచి దిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు
- దిల్లీలో ఇండియా ఇంపాక్ట్ ఏఐ సదస్సుకు హాజరుకానున్న చంద్రబాబు
- విశాఖ బీచ్ రోడ్‌లో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్
- సిటీ పరేడ్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- విశాఖ బీచ్ రోడ్‌లో అలరించిన నేవీ ఆపరేషన్ డెమో
- ఆకట్టుకున్న హెలికాప్టర్లు, యుద్ధవిమానాలు, యుద్ధనౌకల విన్యాసాలు
- సందర్శకులను ఆకట్టుకున్న మెరైన్ కమెండోల సాహసాలు
- గగనతలంలో సందడి చేస్తున్న 60 నౌకాదళ హెలికాప్టర్లు, విమానాలు

హోమియో వైద్యుల ఉద్యోగాలకు డిమాండ్
- త్వరలో ఆయుష్ వైద్యుల ఎంపిక జాబితా వెల్లడి
- 72 ఆయుష్ వైద్యుల పోస్టులకు 2,430 దరఖాస్తులు
- ఒక్కో పోస్టుకు 34.1 మంది చొప్పున పోటీ
- అత్యధికంగా హోమియో వైద్యుల ఉద్యోగాలకు డిమాండ్
- మరో 286 పారా మెడికల్, అడ్మినిస్ట్రేషన్ పోస్టుల భర్తీకి చర్యలు
సాక్షి మీడియాలో కథనాలు
- సాక్షి మీడియాపై రూ.100 కోట్లకు పరువు నష్టం పిటిషన్ వేసిన హెరిటేజ్ ఫుడ్స్
- హెరిటేజ్ ఫుడ్స్ పిటిషన్‌పై విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు
- హెరిటేజ్ పుడ్స్ కి బోలెబాబా డెయిరీకి సంబంధం పేరుతో సాక్షి మీడియాలో కథనాలు
- 24 గంటల్లో టెలికాస్ట్ చేసిన అన్ని లింక్ లు తొలగించాలని ఆదేశించిన ఢిల్లీ హైకోర్టు
- లేనిపక్షంలో మెటా, గూగుల్, యూట్యూబ్ చర్యలు చేపట్టాలని ఆదేశాలు
- సాక్షి యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన ఢిల్లీ హైకోర్టు
గత ప్రభుత్వం అనేక సంస్థలను ఇబ్బంది పెట్టింది: పయ్యావుల
- వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమరావతిలోని అనేక సంస్థలను ఇబ్బంది పెట్టింది: పయ్యావుల
- గత ప్రభుత్వ విధానాల వల్ల అనేక సంస్థలు పనులు ప్రారంభించలేదు: పయ్యావుల
- ఆయా కంపెనీల భూ అవసరాలు గుర్తించి అనుమతులు ఇచ్చాం: పయ్యావుల
- 22 అంశాలపై చర్చించాం వీటిలో 7 కొత్త ప్రతిపాదనలు ఉన్నాయి: నారాయణ
- మరో 11 ప్రతిపాదనల్లో మార్పులు తెచ్చాం: మంత్రి నారాయణ
- బ్యాంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్ కోసం అడిగిన వాటిని క్లియర్ చేశాం: నారాయణ
అమరావతికి ప్రపంచస్థాయి సంస్థలు తీసుకురావడంపై చర్చ
- సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశం
- సమావేశంలో పాల్గొన్న మంత్రులు నారాయణ, కొల్లు, కందుల, సంధ్యారాణి
- సీఆర్‌డీఏ పరిధిలోని వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై చర్చ
- కొత్తగా వచ్చే సంస్థలకు భూ కేటాయింపుపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ
- అమరావతికి ప్రపంచస్థాయి సంస్థలు తీసుకురావడంపై మంత్రుల చర్చ

ఎస్‌ఐ వెంకట్‌ను బెదిరించిన అంబటి రాంబాబు
- గుంటూరు: కాజా టోల్‌గేట్ వద్ద అంబటి రాంబాబు అనుచరుల వీరంగం
- బెయిల్‌పై విడుదలయ్యాక భారీ ర్యాలీగా వచ్చిన అంబటి రాంబాబు
- ఊరేగింపులు, ర్యాలీలకు అనుమతి లేదని అంబటికి చెప్పిన పోలీసులు
- నిబంధనలు పాటించాలన్న మంగళగిరి ఎస్‌ఐ వెంకట్‌పై అంబటి చిందులు
- అంతు చూస్తానంటూ ఎస్‌ఐ వెంకట్‌ను బెదిరించిన అంబటి రాంబాబు
నావికాదళాల మధ్య సహకారం ఇకపై ఒక ఎంపిక కాదు.. అది తప్పనిసరి
- విశాఖ: భారత నౌకాదళం ఆతిథ్యమిస్తోన్న మిలాన్‌ను ప్రారంభించిన రాజ్‌నాథ్
- ఈ ఏడాది 74 దేశాల భాగస్వామ్యంతో అత్యంత సమగ్ర ఎడిషన్‌గా నిలిచింది: రాజ్‌నాథ్
- భారత్‌పై నమ్మకం ప్రపంచ సముద్ర సమాజం ఉంచిన విశ్వాసానికి ప్రతిబింబం: రాజ్‌నాథ్
- విశ్వసనీయ ప్రపంచ స్నేహితుడిగా భారత్ పాత్రను పోషిస్తూనే ఉంటుంది: రాజ్‌నాథ్
- సమగ్ర సముద్ర భద్రత, పరస్పర శ్రేయస్సు విడదీయరానివి: రక్షణమంత్రి రాజ్‌నాథ్
- మిలాన్ వంటి వేదికలు వృత్తిపర నైపుణ్యాన్ని ఒకచోట చేరుస్తాయి: రాజ్‌నాథ్
- పరస్పర విశ్వాసం, సవాళ్లకు సమన్వయంతో ప్రతిస్పందనలను సాధ్యం చేస్తాయి: రాజ్‌నాథ్
- వాతావరణ మార్పు ప్రకృతి వైపరీత్యాలను తీవ్రతరం చేస్తోంది: రాజ్‌నాథ్‌సింగ్
- మానవతా, విపత్తు సహాయ కార్యకలాపాలను మరింత తరచుగా చేపట్టాల్సి వస్తోంది: రాజ్‌నాథ్
- ఎంత సామర్థ్యం ఉన్నా ఏ ఒక్క నావికాదళం ఒంటరిగా సవాళ్లను పరిష్కరించలేదు: రాజ్‌నాథ్
- నావికాదళాల మధ్య సహకారం ఇకపై ఒక ఎంపిక కాదు.. అది తప్పనిసరి: రాజ్‌నాథ్‌సింగ్
మద్యం కేసు
- మద్యం కేసు (Liquor Case)లో నిందితుల బెయిల్ పిటిషన్లపై విచారణ వాయిదా
- ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప బెయిల్ పిటిషన్లపై విచారణ
- విచారణ ఈనెల 21కి వాయిదా వేసిన విజయవాడ ఏసీబీ కోర్టు
- నకిలీ మద్యం తయారీ కేసు నిందితులను కోర్టులో హాజరుపరిచిన అధికారులు
- జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నిందితులను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా హాజరు
- విజయవాడ, నెల్లూరు, మదనపల్లె జైళ్లలో రిమాండ్ ఖైదీలుగా ఉన్న 10 మంది నిందితులు
- బెయిల్‌పై ఉన్నవారిలో కోర్టుకు హాజరైన 12 మంది నిందితులు
- జోగి సోదరులు విచారణకు హాజరుకాకుండా గైర్హాజరు పిటిషన్ దాఖలు
- నిందితుల రిమాండ్ గడువు మార్చి 5 వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు ఆదేశాలు
- టీటీడీకి హెరిటేజ్ నెయ్యి సరఫరా చేస్తోందన్న వైఎస్సార్సీపీ విమర్శలపై స్పందించిన బీఆర్ నాయుడు
- కల్తీ నెయ్యి కేసులో వైఎస్సార్సీపీ పీకల్లోతు కూరుకుపోయింది: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు దురుద్దేశపూర్వకం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- హెరిటేజ్ ఎప్పుడూ టీటీడీకి నెయ్యి సరఫరా చేయలేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ప్రత్యక్షంగా, పరోక్షంగా కూడా హెరిటేజ్‌కు సంబంధం లేదన్న టీటీడీ చైర్మన్
- అబద్ధాలను పదే పదే చెప్పి నిజం చేయాలని వైఎస్సార్సీపీ చూస్తోంది: టీటీడీ ఛైర్మన్
- బొత్స సత్యనారాయణ బాధ్యతాయుతంగా మాట్లాడాలని బీఆర్ నాయుడు సూచన
- ఎన్ని ఇబ్బందులు ఉన్నా సకాలంలో పింఛన్లు ఇవ్వాలని సీఎం ఆదేశించారు: పయ్యావుల
- ప్రాజెక్టులకు ఎంత ఖర్చు అనేది కాకుండా ఎన్ని వేల ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామనేది ముఖ్యం: పయ్యావుల
- యువకులకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించే దిశగా ఈ బడ్జెట్ ఉంది: పయ్యావుల
- గత ప్రభుత్వం మిగిల్చిన అప్పుల భారం నుంచి నెమ్మదిగా కోలుకుంటున్నాం: పయ్యావుల
- రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది: పయ్యావుల
- అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరుగులు పెట్టిస్తున్నాం: మంత్రి పయ్యావుల
బంగారం ధరలు
- ప్రొద్దుటూరులో 24 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,54,500
- ప్రొద్దుటూరులో 22 క్యారెట్ల 10 గ్రా. బంగారం ధర రూ.1,42,140
- ప్రొద్దుటూరులో కిలో వెండి ధర రూ.2,54,000
చిన్నారిపై లైంగిక దాడి
- విశాఖలో చిన్నారిపై లైంగిక దాడి ఘటనపై మహిళా కమిషన్ తీవ్ర ఆగ్రహం
- విశాఖ సీపీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్న ఛైర్‌పర్సన్ రాయపాటి శైలజ
- ఇలాంటి అమానుష ఘటనలు సమాజానికి మచ్చగా నిలుస్తాయన్న ఛైర్‌పర్సన్
- బాధిత చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకున్న రాయపాటి శైలజ
- నిందితులకు కఠిన శిక్ష పడేలా మహిళా కమిషన్ పర్యవేక్షిస్తుందన్న ఛైర్‌పర్సన్
సీఎం సహాయ నిధి పనితీరుతో అన్ని వర్గాలకు లబ్ధి
- అసెంబ్లీ (Assembly Budget Session 2026) లాబీలో సీఎంఆర్‌ఎఫ్‌పై బుచ్చయ్య చౌదరి, గద్దె రామ్మోహన్, అమర్నాథ్‌రెడ్డి చర్చ
- సీఎం సహాయ నిధి వ్యవస్థ పనితీరు అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరుస్తోంది: అమర్నాథ్‌రెడ్డి
- టీడీపీ కార్యాలయంలోనూ పెట్టిన వ్యవస్థ పనితీరు అద్భుతంగా ఉంది : అమర్నాథ్‌రెడ్డి
- ఎమ్మెల్యేలకు ప్రజల్లో మంచి పేరు వస్తోంది: బుచ్చయ్య చౌదరి
- కిడ్నీ వ్యాధిగ్రస్థులకు ఎక్కువ మొత్తమైనా ఉదారంగా సాయం చేస్తున్నారు: బుచ్చయ్య
- సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యేలు అందించడం వల్ల మంచిపేరు వస్తోంది: బుచ్చయ్య
- సీఎం కార్యాలయం చుట్టూ తిరిగే పనిలేకుండా ఆన్‌లైన్‌లో పారదర్శకంగా నడుస్తోంది: గద్దె రామ్మోహన్
- లబ్ధిదారులకు చెక్కుతో పాటు సీఎం ఇచ్చే సందేశపత్రం వారికి ఎంతో తృప్తి నిస్తోంది: గద్దె రామ్మోహన్
పిఠాపురం వేదికగా భారీ ప్రకటనకు సిద్ధమైన పవన్‌కల్యాణ్
- ఉప్పాడ మత్స్యకారుల కోసం పిఠాపురం వేదికగా భారీ ప్రకటనకు సిద్ధమైన పవన్‌కల్యాణ్
- గత అక్టోబర్‌లో మత్స్యకారులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కార మార్గాల అన్వేషణ
- సముద్రకోత నివారణ, కాలుష్య నియంత్రణపై డిప్యూటీ సీఎం పవన్ ప్రత్యేక దృష్టి
- మత్స్య సంపద వృద్ధి, అధునాతన పద్ధతుల్లో వేట, మెరుగైన మార్కెటింగ్ సదుపాయాలు
- గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు వ్యవసాయం, ఇతర ఉపాధి అవకాశాల మెరుగుదల
- మెరైన్ ఫిషరీస్ నిపుణులు, ఉన్నతాధికారుల సలహాలతో పక్కా రోడ్ మ్యాప్
ఇద్దరు బాలురు అదృశ్యం
- విజయవాడ భవానీపురంలో ఇద్దరు బాలురు అదృశ్యం
- నిన్న రాత్రి ట్యూషన్‌కు వెళ్లి తిరిగిరాని బాలురు
- భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేసిన బాలురు తల్లిదండ్రులు
- సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా బాలురు ఆచూకీకి పోలీసుల యత్నం
నకిలీ మద్యం కేసు నిందితులకు నేటితో ముగియనున్న రిమాండ్
- నకిలీ మద్యం కేసు నిందితులకు నేటితో ముగియనున్న రిమాండ్
- నిందితులను నేడు కోర్టులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరచనున్న అధికారులు
- బెయిల్‌పై ఉన్న నిందితులు అద్దేపల్లి సోదరులు, జోగి సోదరులు
- నేడు విచారణకు రాకుండా గైర్హాజరు పిటిషన్ వేసిన జోగి సోదరులు
చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ హత్యాచార నిందితుడు
- మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీలో కులవర్ధన్ మృతదేహం
- మృతదేహం తీసుకెళ్లేందుకు ముందుకురాని కులవర్దన్ కుటుంబసభ్యులు
- మృతదేహం బంధువులకు అప్పగించేందుకు 48 గంటలపాటు వేచిచూడనున్న పోలీసులు
- బంధువులు రానిపక్షంలో అనాథ శవంగా పరిగణించనున్న పోలీసులు
- ఇవాళ సాయంత్రం 4 గంటలకు పూర్తవవున్న 48 గంటల సమయం
- సా. 4 తర్వాత పురపాలక సంఘానికి మృతదేహాన్ని అప్పగించనున్న పోలీసులు
- కులవర్ధన్ మృతదేహాన్ని ఆనాథ శవంగా ఖననం చేయనున్న పురపాలక సిబ్బంది
ప్రొద్దుటూరులో గ్రీన్‌లాండ్ వద్ద రజకుల ఆందోళన
- కడప: ప్రొద్దుటూరులో గ్రీన్‌లాండ్ వద్ద రజకుల ఆందోళన
- దోభీఘాట్‌కు కొందరు వ్యక్తులు అక్రమంగా తాళాలు వేశారని ఆందోళన
- దోభీఘాట్‌లోకి రజకులను వెళ్లనివ్వకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన
- ప్రభుత్వం కేటాయించిన దోభీఘాట్ స్థలాన్ని కొందరు ఆక్రమిస్తున్నారని ఆరోపణ
- రజకుల ఆందోళనకు మద్దతు తెలిపిన బీజేపీ, సీపీఐ నేతలు
వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో విజిల్స్ వేయడంపై తీవ్ర అభ్యంతరం
- పోడియం వద్ద ఆందోళన చేస్తూ విజిల్స్ వేసిన పలువురు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- సభను కాసేవు వాయిదా వేసిన మండలి ఛైర్మన్
- శాసనమండలిలోకి విజిల్స్ తీసుకొచ్చిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు
- పలుమార్లు విజిల్స్ వేసిన రమేష్ యాదవ్, బొమ్మి ఇజ్రాయిల్, మొండితోక అరుణ్‌కుమార్
- మండలిలో విజిల్స్ వేయడంపై తీవ్ర అభ్యంతరం తెలిపిన మంత్రులు
- పెద్దల సభ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరించారంటూ అధికారపార్టీ సభ్యుల ఆవేదన
- గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవహరిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన సభ్యులు
- సభలోకి విజిల్స్ ఎవరు తీసుకొచ్చారనే అంశంపై భద్రతా సిబ్బంది ఆరా
సాక్షి మీడియాకు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు
- తనపై వ్యతిరేక కథనాలతోపాటు వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా కథనాలు రాస్తున్నారని సాక్షి మీడియాకు నోటీసులు
- ఇందిరా టెలివిజన్ ఎండీ భారతీరెడ్డి, ఎడిటర్, బ్యూరో చీఫ్, బోర్డ్ డైరెక్టర్లకు లీగల్ నోటీసులు
- బేషరతుగా క్షమాపణ చెప్పకుంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రఘురామ హెచ్చరిక
- నష్ట పరిహారంగా రూ.కోటి చెల్లించాలని లీగల్ నోటీసులో పేర్కొన్న రఘురామ
- పరిహారం అమరావతి రైతులకు ఇవ్వాలని లీగల్ నోటీసులో పేర్కొన్న న్యాయవాది ఉమేష్‌చంద్ర
- సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని తీసుకురావడం బాధాకరం: అచ్చెన్నాయుడు
- ఒక్క ఆధారమైనా చూపించి వైసీపీ సభ్యులు మాట్లాడాలి: అచ్చెన్నాయుడు
- హెరిటేజ్‌కు సంబంధం ఉందని కనీసం ఒక్క ఆధారమైనా చూపించండి: అచ్చెన్నాయుడు
మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం
- విశాఖ: పెడగంట్యాడ మండలంలో దారుణం
- మూడేళ్ల చిన్నారిపై యోగి అనే వ్యక్తి అత్యాచారయత్నం
- తినుబండారాలంటూ తీసుకెళ్లి అఘాయిత్యానికి యత్నించిన యోగి
- న్యూపోర్టు పోలీసులకు బాలిక తల్లి ఫిర్యాదు, యోగిపై పోక్సో కేసు నమోదు
- యోగిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్న న్యూపోర్టు పోలీసులు
అసెంబ్లీ వాయిదా అనంతరం జయపురకు సీఎం చంద్రబాబు
- నేడు జయపుర వెళ్లనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- అసెంబ్లీ వాయిదా అనంతరం జయపురకు సీఎం చంద్రబాబు
- ఐఏఎస్ అధికారి వివాహ వేడుకకు హాజరుకానున్న చంద్రబాబు
- రాత్రికి జయపురలోనే బసచేయనున్న సీఎం చంద్రబాబు
- రేపు జయపుర నుంచి దిల్లీకి ముఖ్యమంత్రి చంద్రబాబు
- దిల్లీలో జరిగే ఏఐ సమ్మిట్‌లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
- ఈనెల 21న వినుకొండలో పర్యటించనున్న చంద్రబాబు
- స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొననున్న సీఎం
- ఈనెల 24న ప్రకాశం జిల్లాకు ముఖ్యమంత్రి చంద్రబాబు
- వెలుగొండ ప్రాజెక్టును పరిశీలించి కీలక సమీక్ష చేయనున్న సీఎం
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీచేసిన నిందితుడు అరెస్టు
- పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తల్లి ఇంట్లో చోరీచేసిన నిందితుడు అరెస్టు
- పోలీసుల అదుపులో ఏలూరు జిల్లా పెదపాడుకు చెందిన నిందితుడు రాజేష్
- చింతలపూడిలోని ప్రమీలాదేవి ఇంట్లో రూ.70 లక్షలు విలువైన బంగారం, వెండి ఆభరణాలు చోరీ
- రాజేష్‌పై పెదపాడు పోలీసుస్టేషన్‌లో పలు కేసులు నమోదు
- ఓ కేసులో 4 రోజుల క్రితమే జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన రాజేష్
- ఒంగోలులో వాలీబాల్ ఆడేందుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో చోరీకి పాల్పడినట్లు సమాచారం
- ఏలూరు పోలీసుల సహకారంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పొన్నూరు పోలీసులు
- నిందితుడి నుంచి 10 కేజీల వెండిని స్వాధీనం చేసుకోగా కొంత బంగారం విక్రయించినట్లు సమాచారం
- మిగిలిన ఆభరణాలను ఏలూరులోని ఓ వైసీపీ సర్పంచ్ ఇంట్లో పెట్టినట్లు విచారణలో గుర్తింపు
- వైఎస్సార్సీపీ సర్పంచిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్న పోలీసులు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ - త్వరలో మరో డీఎస్సీ
- మరో డీఎస్సీ ప్రకటనకు సిద్ధమైన కూటమి ప్రభుత్వం
- ఏటా డీఎస్సీ నిర్వహిస్తామని ఇటీవల మంత్రి లోకేష్ హామీ
- మంత్రి లోకేష్ హామీ మేరకు డీఎస్సీ నోటిఫికేషన్‌కు కసరత్తు
- ఉగాది పండగ సందర్భంగా డీఎస్సీ ప్రకటించాలని యోచన
- క్షేత్రస్థాయి నుంచి ఖాళీల వివరాలు సేకరించిన పాఠశాల విద్యాశాఖ
అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు శాఖాధిపతులు అందుబాటులో ఉండాలి : సీఎస్
- అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు శాఖాధిపతులు అందుబాటులో ఉండాలని సీఎస్ ఆదేశాలు
- తమ కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలని ఆదేశించిన సీఎస్ విజయానంద్
- ఎమ్మెల్యేలకు అధికారులు రోజూ మ. 3 నుంచి సా. 6 వరకు అందుబాటులో ఉండాలన్న సీఎస్
- అందుబాటులో లేక ప్రజాప్రతినిధులు ఇబ్బంది పడుతున్నారని సర్క్యులర్ జారీచేసిన సీఎస్
- ప్రజాప్రతినిధుల కోసం రోజూ మ. 3 నుంచి సా. 6 వరకూ తమ కార్యాలయంలో ఉండాలని ఆదేశం
- అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు అధికారులు ఆదేశాలు పాటించాలన్న సీఎస్
ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ విందు
- ప్రజాప్రతినిధులు, కుటుంబసభ్యులకు మంత్రి నారా లోకేష్ విందు
- గత రాత్రి అనంతపురం, హిందూపురం పార్లమెంటు నియోజకవర్గాల పరిధి నేతలకు ఆహ్వానం
- కూటమి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను కుటుంబాలతో సహా ఆహ్వానించిన లోకేష్
- కుటుంబసభ్యులను తీసుకురాని జేసీ అస్మిత్‌రెడ్డిని ఆటపట్టించిన మంత్రి నారా లోకేష్
- చిన్నారులను ఎత్తుకొని ముద్దాడి సరదాగా గడిపిన మంత్రి నారా లోకేష్
- ఇంటికొచ్చిన మహిళలకు మంగళగిరి వీవర్ శాల నుంచి తెప్పించిన పట్టుచీరలు అందజేత
తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం
- శ్రీవారి సర్వదర్శనానికి14 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
- నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63,804 మంది భక్తులు
- నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.90 కోట్లు
- నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 24,142 మంది భక్తులు
పల్నాడు జిల్లా: వినుకొండలో స్వల్ప భూ ప్రకంపనలు
- పల్నాడు జిల్లా: వినుకొండలో స్వల్ప భూ ప్రకంపనలు
- తెల్లవారుజామున రెండున్నర గంటలకు ఐదు సెకండ్ల పాటు కంపించిన భూమి
- వినుకొండతో పాటు నడిగడ్డ పరిసర ప్రాంతాలలో కూడా భూ ప్రకంపనలు
తెలంగాణలోని గద్వాలలో ఆర్టీసీ బస్సుకు ప్రమాదం - 20 మందికి గాయాలు
- గద్వాల జిల్లా: ఉండవెల్లి మం. ఇటిక్యాలపాడు వద్ద ప్రమాదం
- గద్వాల జిల్లా: అదుపుతప్పి గుంతలో పడ్డ ఆర్టీసీ బస్సు
- గద్వాల జిల్లా: ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలు
- క్షతగాత్రులను కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు
- హైదరాబాద్ నుంచి అనంతపురం వస్తున్న ఆర్టీసీ బస్సుకు ప్రమాదం
నేడు విశాఖకు రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- నేడు విశాఖకు రానున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- భారత నౌకాదళం ఆతిథ్యమిస్తోన్న మిలాన్ ప్రారంభోత్సవానికి రానున్న రాజ్‌నాథ్‌సింగ్
- నౌకాదళ ఉన్నతాధికారులతో సమీక్షించనున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్
- నౌకాదళ స్థావరంలోని సముద్రిక ఆడిటోరియంలో ప్రారంభోత్సవ కార్యక్రమం
- కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించనున్న రాజ్‌నాథ్
నేటి సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్
- ఇవాళ సాయంత్రం విశాఖ ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్
- అంతర్జాతీయ యుద్ధనౌకల పండుగను పురస్కరించుకుని సిటీ పరేడ్
- సాయంత్రం 5 నుంచి 7.20 వరకు సిటీ పరేడ్, నౌకాదళం విన్యాసాలు
- కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న గవర్నర్ అబ్దుల్ నజీర్
- పార్క్ హోటల్ కూడలి నుంచి కోస్టల్ బ్యాటరీ వరకు సిటీ పరేడ్
- సిటీ పరేడ్‌లో వివిధ దేశాలకు చెందిన సాంస్కృతిక బృందాల ప్రదర్శన
- ఏపీకి చెందిన కళాకారులు, త్రివిధ దళాల సిబ్బంది, ఎన్‌సీసీ ప్రదర్శనలు
రాష్ట్ర పండుగగా రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
- రాష్ట్ర పండుగగా రాజాంలోని శ్రీ పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర
- అమ్మవారి జాతరను రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశాలు
- ఉత్సవాల కోసం రూ.50 లక్షల నిధుల మంజూరుకు ప్రభుత్వం ఆదేశాలు
- తదుపరి చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశం
Last Updated : February 19, 2026 at 10:23 PM IST

