04-03-2026 Telangana News Today Live Updates : కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి
Telangana News Today Live Updates (ETV Bharat)

Published : March 4, 2026 at 7:02 AM IST
|Updated : March 4, 2026 at 10:03 PM IST
04-03-2026 Telangana News Today Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తల సమాచారం
LIVE FEED
కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారు
- కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా వేం నరేందర్‌రెడ్డి ఖరారు
- రాష్ట్రం నుంచి అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి ఖరారు
- రేపు నామినేషన్లు వేయనున్న అభిషేక్ మనుసింఘ్వి, వేం నరేందర్‌రెడ్డి
సుమారు గంటపాటు సాగిన అమిత్‌షా- రేవంత్‌రెడ్డి సమావేశం
- కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో ముగిసిన సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
- సుమారు గంటపాటు సాగిన అమిత్‌షా- రేవంత్‌రెడ్డి సమావేశం
- రాష్ట్ర పరిస్థితులు, మావోయిస్టు నేతల లొంగుబాటుపై వివరించిన సీఎం
- రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కోరిన సీఎం రేవంత్‌రెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం రేవంత్‌రెడ్డి
విజయ, రష్మిక వివాహావిందుకు హాజరవుతున్న ప్రముఖులు
- హైదరాబాద్: తాజ్ కృష్ణలో విజయ్, రష్మిక వివాహావిందు
- విజయ, రష్మిక వివాహావిందుకు హాజరవుతున్న ప్రముఖులు
టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్న నిందితులు
- హైదరాబాద్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ఇద్దరు విదేశీయులు అరెస్టు
- మహమ్మద్ అబూరబూ(ఒమన్), హసన్(పాలస్తీనా) అరెస్టు
- నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం
- డ్రగ్స్‌తో పాటు 4 సెల్‌ఫోన్లు, కత్తి స్వాధీనం చేసుకున్న పోలీసులు
- డ్రగ్స్‌పై నార్కోటిక్, రాజేంద్రనగర్ పోలీసుల జాయింట్ ఆపరేషన్
- ఏ-1 గా ఉన్న అబూరబూపై గతంలోనే 6 డ్రగ్స్ కేసులు నమోదు
- టూరిస్ట్ వీసాపై భారత్‌కు వచ్చి డ్రగ్స్ దందా చేస్తున్న నిందితులు
- వీసాల గడువు ముగిసినా.. భారత్‌లోనే ఉంటున్న అబురబూ, హసన్
- దిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న నిందితులు
రేవంత్, రాహుల్, ఖర్గేతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్న అధిష్ఠానం
- రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై పీసీసీ అధ్యక్షుడితో మాట్లాడిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి
- వేం నరేందర్ రెడ్డి, దొమ్మాటి సాంబయ్య పేర్లను ప్రస్తావించిన అధిష్ఠానం
- ఇద్దరిలో ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై అభిప్రాయం కోరినట్లు పార్టీ వర్గాల వెల్లడి
- పార్టీకి ఎవరు పనిచేశారో వాళ్లనే ఎంపిక చేయాలని సూచించిన పీసీసీ చీఫ్
- రేవంత్‌రెడ్డితో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలన్న పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్
- రేవంత్, రాహుల్, ఖర్గేతో మాట్లాడి తుది నిర్ణయం ప్రకటించనున్న అధిష్ఠానం
- రాత్రి 7 గం.కు రాహుల్, ఖర్గే, రేవంత్.. జూమ్‌లో చర్చించుకునే అవకాశం
- హైదరాబాద్: బంజారాహిల్స్‌లో భారీగా కల్తీ నెయ్యి పట్టివేత
- కల్తీ నెయ్యి తయారు చేస్తున్న 'ప్రైడ్ డెయిరీ' గుట్టురట్టు
- 'ప్రైడ్ డెయిరీ'పై సిటీ టాస్క్‌ఫోర్స్, మాసాబ్‌ట్యాంక్ పోలీసుల సంయుక్త దాడి
- 460 కిలోల కల్తీ నెయ్యి స్వాధీనం, నిందితుడు జునైద్ హుస్సేన్ అరెస్టు
- రూ.18 లక్షలకుపైగా విలువైన కల్తీ నెయ్యి, తయారీ యంత్రాలు సీజ్
- వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో కల్తీ నెయ్యి తయారీ
కారు పల్టీలు కొట్టి దావీద్, వంశీ అనే ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డుప్రమాదం
- అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన కారు; ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- కారు పల్టీలు కొట్టి దావీద్, వంశీ అనే ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- అనంతగిరి మం. మొగలాయికోటలో అంత్యక్రియలకు వెళ్తున్న బాధితులు
కోకాపేటలో మైనింగ్‌లో జరిగిన ఒక అవినీతిని బయటపెట్టాం: హరీశ్‌రావు
- కాంగ్రెస్ నేతల అవినీతి, బినామీలను త్వరలోనే బయటపెడతాం: హరీశ్‌రావు
- కోకాపేటలో మైనింగ్‌లో జరిగిన ఒక అవినీతిని బయటపెట్టాం: హరీశ్‌రావు
- హెచ్ఎండీఏకు చెందిన 17 ఎకరాల భూమిని వేలం లేకుండా అప్పగించారు: హరీశ్‌రావు
సీఎం, మంత్రులకు నచ్చకపోతే వెంటనే బదిలీ చేస్తున్నారు: హరీశ్‌రావు
- ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను సీఎం బెదిరిస్తున్నారు: హరీశ్‌రావు
- కలెక్టర్ల సదస్సులో సీఎం రేవంత్‌రెడ్డి బెదిరింపు ధోరణితో మాట్లాడారు: హరీశ్‌రావు
- సీఎం, మంత్రులకు నచ్చకపోతే వెంటనే బదిలీ చేస్తున్నారు: హరీశ్‌రావు
- నచ్చిన పనులు చేస్తే కొనసాగిస్తున్నారు లేదంటే మారుస్తున్నారు: హరీశ్‌రావు
- కొందరికీ పోస్టింగులు ఇచ్చి కూడా జాయిన్ చేసుకోవడం లేదు: హరీశ్‌రావు
మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డుప్రమాదం, ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- సూర్యాపేట: మునగాల మండలం ఆకుపాముల వద్ద రోడ్డుప్రమాదం
- అదుపుతప్పి చెట్లలోకి దూసుకెళ్లిన కారు; ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- కారు పల్టీలు కొట్టి దావీద్, వంశీ అనే ఇద్దరు మృతి, ఇద్దరికి గాయాలు
- అనంతగిరి మం. మొగలాయికోటలో అంత్యక్రియలకు వెళ్తున్న బాధితులు
మంత్రి వివేక్ నన్ను చంపుతారేమోనని అనుమానం: బాల్క సుమన్
- జైలులో నన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు: బాల్క సుమన్
- జైలు నుంచి బయటకు రాకుండా అనేక కుట్రలు చేశారు: బాల్క సుమన్
- నన్ను వేధించిన మంత్రి వివేక్‌ను ప్రేమిస్తూనే ఉంటా: బాల్క సుమన్
- అధికారులు, పోలీసులు వివేక్ కంపెనీ ఉద్యోగులుగా ప్రవర్తించారు: బాల్క సుమన్
- అధికారులు, పోలీసులు, ఎన్నికల యంత్రాంగంపై నమ్మకం లేదు: బాల్క సుమన్
- క్యాతన్‌పల్లి మున్సిపల్ ఎన్నిక పారదర్శకంగా నిర్వహించాలి: బాల్క సుమన్
- మంత్రి వివేక్ నన్ను చంపుతారేమోనని అనుమానం: బాల్క సుమన్
సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన రావడం లేదు: హరీశ్‌రావు
- సీఎం రేవంత్‌రెడ్డికి పరిపాలన రావడం లేదు: హరీశ్‌రావు
- ఐఏఎస్, ఐపీఎస్‌లను పదేపదే బదిలీ చేస్తున్నారు: హరీశ్‌రావు
- రెండున్నరేళ్లలో ఐదుసార్లు భారీ ఎత్తున అధికారులను బదిలీ చేశారు: హరీశ్‌రావు
- తరచూ అధికారుల బదిలీల వల్ల పాలన కుంటుపడుతోంది: హరీశ్‌రావు
- పరిస్థితులు అర్థం చేసుకునేలోపు అధికారులకు బదిలీ అవుతోంది: హరీశ్‌రావు
- జీహెచ్ఎంసీ కమిషనర్లు కూడా ఇప్పటికే నలుగురు మారారు: హరీశ్‌రావు
దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- దిల్లీ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- సాయంత్రం కాంగ్రెస్ అధిష్టానం పెద్దలతో భేటీకానున్న సీఎం రేవంత్‌రెడ్డి
- రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై రాహుల్‌గాంధీతో చర్చించనున్న సీఎం
సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష
- సచివాలయంలో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష
- ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై సమీక్ష
- ఈనెల 6 నుంచి జూన్ 12 వరకూ 99 రోజులపాటు చేపట్టనున్న కార్యక్రమాలపై దిశానిర్దేశం
- మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయం
- ఆస్పత్రి సేవలకు ఆటంకం కలగకుండా 99 రోజుల ప్రణాళిక ఉండాలని నిర్ణయం
సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మం. నందికంది వద్ద కారులో మంటలు
- సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మం. నందికంది వద్ద కారులో మంటలు
- కారులో ఒక్కసారిగా పొగలు రావడంతో కారును ఆపిన డ్రైవర్
- సంగారెడ్డి నుంచి సదాశివపేట వైపు వెళ్తుండగా ఘటన
- సంగారెడ్డి జిల్లా: కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు సురక్షితం
పాకిస్థాన్ నుంచి అత్యవసర విధులు లేని సిబ్బంది రావాలని అమెరికా ఆదేశం
- పాకిస్థాన్ నుంచి అత్యవసర విధులు లేని సిబ్బంది రావాలని అమెరికా ఆదేశం
- అత్యవసర విధులు లేని సిబ్బందిని వెనక్కి రావాలని ఆదేశించిన అమెరికా
- కరాచీ, లాహోర్ కాన్సులేట్లలో సిబ్బంది వెనక్కి రావాలని అమెరికా ఆదేశం
అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌కు నా అభిప్రాయం చెబుతా: దానం నాగేందర్
- అనర్హత పిటిషన్‌పై స్పీకర్‌కు నా అభిప్రాయం చెబుతా: దానం నాగేందర్
- స్పీకర్ నుంచి వ్యక్తిగతంగా ఇంకా నోటీసు అందలేదు: దానం నాగేందర్
- నోటీసు అందితే నా వాదన నేరుగా స్పీకర్‌కే చెబుతా: దానం నాగేందర్
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,280
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,69,280
- హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,50,800
- హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,82,000
రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యే అవకాశం
- రాజ్యసభ అభ్యర్థుల ఖరారు కోసం రాష్ట్ర నేతలతో మాట్లాడనున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- రేవంత్‌రెడ్డి, మహేష్‌గౌడ్, మీనాక్షి నటరాజన్‌తో ఫోన్‌లో మాట్లాడనున్న అధిష్ఠానం
- పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ దిల్లీ పర్యటన రద్దు
- యథావిథిగా దిల్లీకి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- దిల్లీలో అందుబాటులో లేని మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్
- సాయంత్రం అధికారికంగా రాజ్యసభ అభ్యర్థుల పేర్లు ఖరారు అయ్యే అవకాశం
శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
- జూబ్లీహిల్స్ నివాసం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి బయల్దేరిన సీఎం
- శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి
యష్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' రిలీజ్ వాయిదా
- కేజీఎఫ్ హీరో యష్ అభిమానులకు నిరాశ
- యష్ హీరోగా వస్తున్న 'టాక్సిక్' రిలీజ్ వాయిదా
- మార్చి 19 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన 'టాక్సిక్'
- యుద్ధ పరిస్థితుల వల్ల వాయిదా వేస్తున్నట్లు ప్రకటించిన నిర్మాతలు
- 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4 న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటన
హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ మను సింఘ్వీ
- హైదరాబాద్ చేరుకున్న అభిషేక్ మను సింఘ్వీ
- శంషాబాద్ విమానాశ్రయంలో స్వాగతం పలికిన హార్కర వేణుగోపాల్‌రావు, ఎం. ఏ ఫహీమ్
- రేపు భట్టి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన అభిషేక్ సింఘ్వీ
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- 1,400 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- 400 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ
- యుద్ధ ప్రభావంతో భారీగా పతనమైన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు
- డాలర్‌తో పోలిస్తే 66 పైసలు పడిపోయిన రూపాయి మారకం విలువ
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి
- చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి
- సిమెంట్ లారీని వెనుకవైపు నుంచి ఢీకొన్న కారు
- గంగవరం మండలం వైఎస్సార్ జంక్షన్ వద్ద ఘటన
- బెంగళూరు నుంచి చిత్తూరు వైపు వస్తున్న కారు
- చిత్తూరు జిల్లా: ఘటనాస్థలిలోనే ఐదుగురు మృతి
- చిత్తూరు జిల్లా: మృతుల్లో ముగ్గురు మహిళలు
భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌మార్కెట్లు
- 1700 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- 500 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ
- యుద్ధ ప్రభావంతో భారీగా పతనమైన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు
- డాలర్‌తో పోలిస్తే 66 పైసలు పడిపోయిన రూపాయి మారకం విలువ
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్లలో వివాహిత ఆత్మహత్య
- రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అరుట్లలో వివాహిత ఆత్మహత్య
- కుటుంబకలహాలతో పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య
- వివాహిత ఆత్మహత్యకు భర్త, అత్త, మామనే కారణమని బంధువుల ఆరోపణ
- రంగారెడ్డి జిల్లా: కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ఆమనగల్లు ఉత్సవాల్లో అపశ్రుతి - నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
- నల్గొండ: ఆమనగల్లు శ్రీపార్వతీరామలింగేశ్వరస్వామి ఉత్సవాల్లో అపశ్రుతి
- భక్తులు అగ్నిగుండం దాటుతుండగా ఒక్కసారిగా తొక్కిసలాట
- ఒకరినొకరు నెట్టుకోవడంతో నిప్పుల గుండంలో పడిపోయిన భక్తులు
- నల్గొండ: అగ్నిగుండంలో పడిన పదిమంది భక్తులకు గాయాలు
- నల్గొండ: నిప్పుల్లో పడ్డవారిని వెంటనే బయటకు లాగిన పోలీసులు
1700 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు
- 1700 పాయింట్లకు పైగా నష్టాల్లో సెన్సెక్స్
- 500 పాయింట్లకు పైగా నష్టాల్లో నిఫ్టీ
- యుద్ధ ప్రభావంతో భారీగా పతనమైన దేశీయ స్టాక్‌మార్కెట్ సూచీలు
ఆదిలాబాద్: జైలులో 14 రోజుల జైలులో ఉన్న బాల్క సుమన్
- ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్, ఇతర నేతలు
- ఆదిలాబాద్: జైలులో 14 రోజుల జైలులో ఉన్న బాల్క సుమన్
తిరుపతి: అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం
- తిరుపతి: అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత సంచారం
- అలిపిరి తనిఖీ కేంద్రం సమీపంలో చిరుత దాడి, జింక మృతి
- తిరుపతి: భక్తులను అప్రమత్తం చేసిన టీటీడీ విజిలెన్స్ సిబ్బంది
నేడు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- నేడు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- మ.12 గం.కు శంషాబాద్ విమానాశ్రయం నుంచి దిల్లీ వెళ్లనున్న సీఎం
- రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై కాంగ్రెస్ అగ్రనేతలతో చర్చించనున్న సీఎం
- రాజ్యసభ సీటు ఆశిస్తున్న 16 మంది నేతలు
- అభిషేక్ సింఘ్వీకి మరోసారి అవకాశం ఇవ్వాలని భావిస్తున్న అధిష్ఠానం
- మరో అభ్యర్థిపై నేడు స్పష్టత వచ్చే అవకాశం
తెరుచుకున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
- తెరుచుకున్న యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం
- తెల్లవారుజామున 3 గంటలకు యాదగిరిగుట్ట ఆలయాన్ని తెరిచిన అర్చకులు
- గ్రహణ దోష పరిహారార్థం సంప్రోక్షణ, ఆలయ శుద్ధి చేసిన అర్చకులు
- యాదగిరిగుట్ట : స్వామివారి దర్శనానికి భక్తులను అనుమతి
కాసేపట్లో ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలకానున్న బాల్క సుమన్
- కాసేపట్లో ఆదిలాబాద్ జైలు నుంచి విడుదలకానున్న బాల్క సుమన్
- జైలు వద్దకు చేరుకున్న మాజీ మంత్రి జోగు రామన్న, బీఆర్‌ఎస్ శ్రేణులు
- 14 రోజులుగా జైలులో ఉన్న బాల్క సుమన్
ఇవాళ్టి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి పనులు ప్రారంభం
- ఇవాళ్టి నుంచి భద్రాచలంలో శ్రీరామనవమి పనులు ప్రారంభం
- శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి పనులు ప్రారంభం
- ముందుగా రోలు రోకలికి పూజలు చేసిన ఆలయ అర్చకులు
కామారెడ్డి : తెలంగాణ వర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ
- కామారెడ్డి: తెలంగాణ వర్సిటీలో అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ
- బాలుర వసతిగృహంలో సీనియర్, జూనియర్‌లకు మధ్య గొడవ
- కామారెడ్డి: పలువురు విద్యార్థులకు గాయాలు, ఆస్పత్రిలో చికిత్స
- గొడవకు గల కారణాలపై ఆరా తీస్తున్న భిక్కనూరు పోలీసులు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
- పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ కీలక ప్రకటన చేసిన ఫ్రాన్స్ అధ్యక్షుడు
- ఖతార్, కువైట్, యూఏఈలతో ఫ్రాన్స్‌కు రక్షణ ఒప్పందాలు ఉన్నాయన్న మేక్రాన్
- ఆస్తుల రక్షణకు 'చార్లెస్ డి గల్లె' విమాననౌకను పంపిస్తున్నట్లు మేక్రాన్ వెల్లడి
- పశ్చిమాసియాకు ఎయిర్ వింగ్, రక్షణ ఫ్రిగేట్లు వెళ్లనున్నట్టు తెలిపిన మేక్రాన్
- హర్ముజ్ జలసంధి మూసివేత దృష్ట్యా నేవీని రంగంలోకి దింపుతున్నట్లు ట్రంప్ వెల్లడి
- హర్ముజ్‌లో ట్యాంకర్లకు తమ నౌకాదళం రక్షణ కల్పిస్తుందన్న ట్రంప్
దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా
- దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న పశ్చిమాసియా
- టెహ్రాన్‌తో పాటు బీరుట్‌పై బాంబుల వర్షం కురిపిస్తున్న అమెరికా-ఇజ్రాయెల్
- లాంచర్లు, రక్షణ వ్యవస్థలపై వైమానిక దాడులు ముమ్మరం చేసిన అమెరికా-ఇజ్రాయెల్
- ఇరాన్ కర్మాగారాలపై వైమానిక దాడులు ముమ్మరం చేసిన అమెరికా-ఇజ్రాయెల్
- మరోవైపు పెద్దఎత్తున ప్రతిదాడులు చేస్తున్న ఇరాన్
- ఇజ్రాయెల్, దుబాయ్, ఇరాక్ సహా గల్ఫ్ దేశాల్లో ఇరాన్ దాడులు
- అమెరికా స్థావరాలే లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు
- నిన్న హర్ముజ్ జలసంధిని మూసివేసిన ఇరాన్
- అణుశక్తితో పనిచేసే విమాన నౌకను పశ్చిమాసియాకు పంపిన ఫ్రాన్స్
ఇవాళ గల్ఫ్ దేశాలకు 58 విమానాలు నడపనున్న విమానయాన సంస్థలు
- ఇవాళ గల్ఫ్ దేశాలకు 58 విమానాలు నడపనున్న విమానయాన సంస్థలు
- ఇండిగో 30, ఎయిరిండియా 23 విమానాలు నడపనున్నట్లు విమానయానశాఖ వెల్లడి
- గల్ఫ్‌లో చిక్కుకున్న ప్రయాణికుల కోసం అదనపు విమానాలు ఏర్పాటు
- విమాన టికెట్ ధరలు పెరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్న కేంద్రం
హైదరాబాద్ బాచుపల్లిలో నిన్నరాత్రి భారీ అగ్నిప్రమాదం
- హైదరాబాద్ బాచుపల్లిలో నిన్నరాత్రి భారీ అగ్నిప్రమాదం
- నిజాంపేట్ వద్ద ట్రాన్స్‌ఫార్మర్ నుంచి చెలరేగి ఫర్నీచర్ షాప్‌కు అంటుకున్న మంటలు
- అనంతరం పక్కనే ఉన్న మరిన్ని దుకాణాలకు వేగంగా వ్యాపించిన మంటలు
- మంటల ధాటికి కాలిబూడిదైన 20 నుంచి 30 వరకూ ఫర్నీచర్ దుకాణాలు
- మంటల్లో కాలిపోయిన బైక్‌లు, సామగ్రి, డబ్బు, బంగారు ఆభరణాలు
- ఒక్కో ఫర్నీచర్ షాప్‌లో రూ.30 లక్షల వరకు సామగ్రి ఉంటుందన్న నిర్వాహకులు
- కళ్ల ముందే కాలిపోతున్న ఆస్తిని కాపాడుకోలేక బోరున విలపించిన నిర్వాహకులు
- ఘటనాస్థలికి చేరుకుని ఆరు ఫైరింజన్లతో మంటలు అదుపు చేసిన సిబ్బంది
నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- నేడు దిల్లీ వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్
- రాజ్యసభ అభ్యర్థుల ఖరారుపై అధిష్ఠానంతో చర్చించనున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు
- ఖర్గే, రాహుల్, కేసీ వేణుగోపాల్‌తో భేటీకానున్న సీఎం, పీసీసీ అధ్యక్షుడు
- ఇవాళ సాయంత్రానికి రాజ్యసభ అభ్యర్థి పేరు ఖరారయ్యే అవకాశం
రాహుల్‌గాంధీకి మందకృష్ణ మాదిగ లేఖ
- రాహుల్‌గాంధీకి మందకృష్ణ మాదిగ లేఖ
- రాజ్యసభ ఎన్నికలో రాష్ట్రం నుంచి మాదిగలకు అవకాశం ఇవ్వాలని కోరిన మందకృష్ణ
ములుగు, సంగారెడ్డి జిల్లాల నీటిపారుదల అంశాలపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష
- ములుగు, సంగారెడ్డి జిల్లాల నీటిపారుదల అంశాలపై నేడు మంత్రి ఉత్తమ్ సమీక్ష
- సంబంధిత మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో సమీక్ష
టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధం
- టీ20 ప్రపంచకప్‌లో తొలి సెమీఫైనల్‌కు రంగం సిద్ధం
- నేడు తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మ్యాచ్
- కోల్‌కతాలో రాత్రి 7 గంటలకు దక్షిణాఫ్రికాతో తలపడనున్న న్యూజిలాండ్
- టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ తలపడిన మ్యాచ్‌లు ఐదు
- ఇరుజట్లు తలపడిన అన్ని మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలుపు
Last Updated : March 4, 2026 at 10:03 PM IST

