ETV Bharat / state

03-03-2026 Telangana News Today Live Updates : కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం

TELANGANA NEWS LIVE UPDATES
TELANGANA NEWS LIVE UPDATES (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 7:05 AM IST

|

Updated : March 3, 2026 at 10:13 PM IST

Choose ETV Bharat

03-03-2026 Telangana News Today Live : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు ప్రధాన వార్తల సమాచారం

LIVE FEED

10:10 PM, 3 Mar 2026 (IST)

మూసీలో జరిగిన నిర్మాణాలపై గతంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది: హైడ్రా

  • బీఆర్‌ఎస్‌ హయాంలోనే ఆదిత్య బిల్డర్స్‌కు అనుమతులు: హైడ్రా
  • మూసీలో జరిగిన నిర్మాణాలపై గతంలోనే హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది: హైడ్రా
  • మూసీలోకి జరిగి రిటైనింగ్ వాల్ నిర్మించడంతో అనుమతులు రద్దు చేసింది: హైడ్రా
  • వెనక్కు జరిగి నిర్మిస్తామంటూ కోర్టుకు ఆదిత్య బిల్డర్స్ చెప్పింది: హైడ్రా
  • రిటైనింగ్‌వాల్‌ను కూల్చామని ఆదిత్య బిల్డర్స్ హైకోర్టుకు నివేదిక ఇచ్చింది: హైడ్రా
  • రిటైనింగ్‌ వాల్‌ కూల్చమన్నాకే హైకోర్టు అనుమతులు పునరుద్ధరించింది: హైడ్రా
  • హైకోర్టు అనుమతుల మేరకే ఆదిత్య బిల్డర్స్‌ మళ్లీ నిర్మాణాలు చేపట్టింది: హైడ్రా
  • ఈ పరిణామాలన్నీ హైడ్రా రాకముందు జరిగినవే: హైడ్రా కమిషనర్‌
  • కవిత సహా ఈ విషయంలో స్పందించిన అందరూ ఇది గమనించాలి: హైడ్రా

10:09 PM, 3 Mar 2026 (IST)

ఉయ్యాలలో ఆడుకుంటూ మెడకు చుట్టుకుని ఊపిరాడక చిన్నారి మృతి

  • సికింద్రాబాద్: జవహర్‌నగర్ పీఎస్‌ పరిధిలో 8ఏళ్ల చిన్నారి మృతి
  • ఉయ్యాలలో ఆడుకుంటూ మెడకు చుట్టుకుని ఊపిరాడక చిన్నారి మృతి
  • భర్తకు దూరంగా ఉంటూ ఇళ్లలో పనిచేస్తూ పిల్లలను చూసుకుంటున్న తల్లి నవనీత
  • పనిచేసే ఇళ్లలో జీతం కోసం చిన్న కుమార్తెను వెంట తీసుకెళ్లిన క్రమంలో ఘటన
  • నవనీత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలింపు

9:36 PM, 3 Mar 2026 (IST)

గోదావరి నుంచి తీర్థ విందును తీసుకువచ్చి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అర్చకులు

  • చంద్రగ్రహణం అనంతరం భద్రాద్రి రాముడి ఆలయ తలుపులు తెరిచిన అర్చకులు
  • సా.7 గం.కు భద్రాద్రి స్వామివారి ఆలయం తలుపులు తెరిచిన అర్చకులు
  • గోదావరి నుంచి తీర్థ విందును తీసుకువచ్చి ఆలయ శుద్ధి సంప్రోక్షణ చేసిన అర్చకులు
  • రాత్రి 8 నుంచి భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న ఆలయ అధికారులు

9:34 PM, 3 Mar 2026 (IST)

కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం

  • కలెక్టర్లు నెలకు కనీసం 10 రోజులైనా క్షేత్రస్థాయిలో పర్యటించాలి: సీఎం
  • కలెక్టర్లు ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా పనిచేయాలి: సీఎం
  • కలెక్టర్లు వారానికి ఒకసారి ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేయాలి: సీఎం
  • పాఠశాలల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రభుత్వం సహించదు: సీఎం
  • ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల విషయంలో కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి: సీఎం
  • మిల్లర్ల దగ్గర నుంచి ధాన్యాన్ని వెనక్కి రాబట్టుకోవాల్సిన బాధ్యత కలెక్టర్లదే: సీఎం
  • మోసాలకు పాల్పడే మిల్లర్ల పట్ల కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి: సీఎం
  • ఇసుక మాఫియా, అక్రమ మైనింగ్ పట్ల కఠినంగా వ్యవహరించాలి: సీఎం
  • పనితీరు బాలేకపోతే కలెక్టర్, ఎస్పీని అక్కడికక్కడే సస్పెండ్ చేస్తాం: సీఎం
  • జూన్‌లో కలెక్టర్ల పనితీరుపై మరోసారి సమావేశం నిర్వహిస్తాం: సీఎం

9:34 PM, 3 Mar 2026 (IST)

మద్యం మత్తులో అన్నను పొడిచి చంపిన తమ్ముడు

  • హైదరాబాద్‌: మియాపూర్ పరిధిలో వ్యక్తి దారుణ హత్య
  • మద్యం మత్తులో అన్నను పొడిచి చంపిన తమ్ముడు

9:34 PM, 3 Mar 2026 (IST)

రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు

  • రాష్ట్రంలో గరిష్ఠ స్థాయికి చేరుకున్న విద్యుత్ డిమాండ్‌
  • 18,139 మెగావాట్ల రికార్డు స్థాయికి చేరుకున్న విద్యుత్‌ డిమాండ్‌
  • రాష్ట్ర చరిత్రలోనే ఇవాళ అత్యధిక విద్యుత్ వినియోగం నమోదు
  • భవిష్యత్‌ విద్యుత్ అవసరాలకు సిద్ధంగా ఉన్నాం: డిప్యూటీ సీఎం భట్టి
  • తెలంగాణ మరోసారి తన అప్రతిహత ప్రగతిని చాటుకున్నది: భట్టి
  • డిమాండ్‌కు అనుగుణంగా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా: భట్టి
  • సమర్థమంతంగా విద్యుత్‌ సరఫరా చేస్తున్న సిబ్బందికి అభినందనలు: భట్టి

9:33 PM, 3 Mar 2026 (IST)

నిజామాబాద్: మంజీరా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

  • నిజామాబాద్: బోధన్ మున్సిపాలిటీ ఆచన్‌పల్లిలో విషాదం
  • నిజామాబాద్: మంజీరా నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు మృతి
  • హోళీ వేడుకల తర్వాత మంజీరాలోకి స్నానానికి వెళ్లిన యువకులు
  • మంజీరా నదిలో మునిగి ఆచన్‌పల్లికి చెందిన సాయి, రోని మృతి

9:33 PM, 3 Mar 2026 (IST)

పేదల ఇళ్లను కూలుస్తున్న కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కవిత

  • పోలీసులు బలప్రయోగంతో అరెస్టు చేయడం అన్యాయం: కవిత
  • పెద్దల భవనాలను వదిలేసి పేదల ఇళ్లను కూలగొడుతున్నారు: కవిత
  • పెద్దల పక్షాన్నే ప్రభుత్వాలు ఉన్నాయని చెప్పడానికి ఇదే నిదర్శనం: కవిత
  • పేదల ఇళ్లను కూలుస్తున్న కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు: కవిత
  • మూసీ ఒడ్డు నుంచి నిర్మాణాలు 30 మీటర్ల దూరం ఉండాలనే నిబంధన ఉంది: కవిత
  • కొందరు పెద్దల భవనాలు 5 మీటర్ల దూరంలోనే ఉన్నా.. చర్యలు లేవు: కవిత
  • అక్రమ నిర్మాణాలపై జాగృతి న్యాయపోరాటం చేస్తుంది: కవిత

7:40 PM, 3 Mar 2026 (IST)

నార్సింగిలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట

  • రంగారెడ్డి: నార్సింగిలో ధర్నా చేస్తున్న కవిత, జాగృతి నేతలు అరెస్టు
  • శ్రీఆదిత్య వ్యాంటేజ్‌ వెంచర్‌ వద్ద బైఠాయించిన కవిత, జాగృతి నేతలు అరెస్టు
  • కవిత అరెస్టును అడ్డుకునేందుకు ప్రయత్నించిన జాగృతి కార్యకర్తలు
  • నార్సింగిలో పోలీసులు, జాగృతి కార్యకర్తల మధ్య తోపులాట
  • నార్సింగిలో శ్రీఆదిత్య వ్యాంటేజ్‌ వెంచర్‌ వద్ద మధ్యాహ్నం నుంచి కవిత ధర్నా
  • మూసీ పక్కన శ్రీఆదిత్య వెంచర్‌ అక్రమంగా నిర్మిస్తున్నారని ఆరోపణ

7:39 PM, 3 Mar 2026 (IST)

శాఖలవారీగా 10 వివిధ థీమ్‌లతో 99 రోజుల కార్యక్రమం నిర్వహణ

  • ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమం
  • ఐదు దశల్లో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలు చేయాలని సీఎం ఆదేశం
  • శాఖలవారీగా 10 వివిధ థీమ్‌లతో 99 రోజుల కార్యక్రమం నిర్వహణ
  • ప్రజాపాలన-ప్రగతి ప్రణాళికకు నోడల్‌శాఖగా వ్యవహరించనున్న ప్రణాళికశాఖ
  • ఏప్రిల్ 2న గ్రామస్థాయి, ఏప్రిల్‌ 16న మండల స్థాయి కార్యక్రమాలు
  • మే 2న నియోజకవర్గస్థాయి, మే 22న జిల్లాస్థాయి కార్యక్రమాలు
  • ఈనెల 6న ఉమ్మడి జిల్లాల్లో మంత్రుల ఆధ్వర్యంలో సన్నాహక సమావేశాలు
  • 99 రోజుల్లో శాఖలవారీగా అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
  • ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్ రూపకల్పన

7:00 PM, 3 Mar 2026 (IST)

నార్సింగి శ్రీఆదిత్య వ్యాంటేజ్‌ వెంచర్‌ వద్ద స్థానికులతో కలిసి కవిత ధర్నా

  • రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి కవిత ఆందోళన
  • నార్సింగిలో శ్రీఆదిత్య వ్యాంటేజ్‌ వెంచర్‌ వద్ద స్థానికులతో కలిసి కవిత ధర్నా
  • మధ్యాహ్నం నుంచి శ్రీఆదిత్య వెంచర్‌ వద్ద బైఠాయించిన కవిత
  • హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ వచ్చేవరకు కదిలేదిలేదంటున్న కవిత
  • మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌పై కవిత ఆరోపణలు
  • మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌ నిర్మిస్తున్నారని ధర్నా
  • పేదల ఇళ్లు కూలుస్తూ రియల్‌ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారు: కవిత
  • హైడ్రాకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా?: కవిత

5:55 PM, 3 Mar 2026 (IST)

పోక్సో కేసులో 20 నెలలు జైలు శిక్ష విధించిన జగిత్యాల న్యాయస్థానం

  • పోక్సో కేసులో 20 నెలలు జైలు శిక్ష విధించిన జగిత్యాల న్యాయస్థానం
  • ప్రభుత్వ పాఠశాలలో అటెండర్‌గా ఉన్న మహ్మద్‌ రజాక్‌కు 20 నెలలు జైలు శిక్ష
  • నేరం రుజువు కావటంతో శిక్ష ఖరారు చేసిన జగిత్యాల న్యాయస్థానం

5:55 PM, 3 Mar 2026 (IST)

జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆందోళన

  • జింఖానా గ్రౌండ్స్ వద్ద స్పోర్ట్స్‌ స్టూడెంట్స్‌ ఫెడరేషన్‌ ఆందోళన
  • హెచ్‌సీఏకి వ్యతిరకంగా ఆందోళన చేస్తున్న స్పోర్ట్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్
  • విశాఖ ఇండస్ట్రీస్‌కి బదిలీ చేసిన రూ.68.73కోట్లు వెనక్కి తీసుకోవాలని ఆందోళన
  • క్రీడాకారులకు అన్యాయం చేసి.. ప్రైవేటు వ్యక్తులు డబ్బులు దండుకుంటున్నారని ఆందోళన
  • జింఖానా గ్రౌండ్స్‌ వద్ద ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేసిన పోలీసులు

5:25 PM, 3 Mar 2026 (IST)

99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి

  • సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం
  • ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం
  • 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలి: సీఎం రేవంత్‌రెడ్డి
  • గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం ఉండాలి: సీఎం
  • అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలి: సీఎం రేవంత్‌రెడ్డి
  • రేషన్ కార్డులు, సన్నబియ్యంపై లబ్ధిదారుల అభిప్రాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం
  • ఇందిరమ్మఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం
  • విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న మార్పులపై ప్రజలకు అవగాహన కల్పించాలి: సీఎం
  • ప్రభుత్వ ఆస్పత్రులను మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేయాలి: సీఎం
  • మధ్యాహ్న భోజనం ఏజెన్సీలకు ప్రతినెలా బిల్లుల చెల్లించాలి: సీఎం

5:25 PM, 3 Mar 2026 (IST)

భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు

  • భద్రాద్రి కొత్తగూడెం: గోదావరిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు
  • మణుగూరు మండలం మల్లేపల్లి వద్ద గోదావరిలో ఇద్దరు గల్లంతు

4:53 PM, 3 Mar 2026 (IST)

రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి రియల్ ఎస్టేట్ వెంచర్​పై కవిత ఆందోళన

  • రంగారెడ్డి: నార్సింగిలో స్థానికులతో కలిసి కవిత ఆందోళన
  • మూసీ నది పక్కన నిర్మిస్తున్న అపార్ట్‌మెంట్‌పై కవిత ఆరోపణలు
  • మూసీని ఆనుకుని భారీ రియల్ ఎస్టేట్ వెంచర్‌ నిర్మిస్తున్నారని ధర్నా
  • పేదల ఇళ్లు కూలుస్తూ రియల్‌ ఎస్టేట్ వెంచర్లను వదిలేస్తున్నారు: కవిత
  • హైడ్రాకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల అక్రమ వెంచర్లు కనిపించటం లేదా?: కవిత

4:21 PM, 3 Mar 2026 (IST)

చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి

  • మేడ్చల్‌: సూరారం పరిధి పంతులు చెరువులో పడి ఇద్దరు మృతి
  • చెరువులో ఈతకు వెళ్లి నీట మునిగి ఇద్దరు యువకులు మృతి
  • హోళీ అనంతరం చెరువులో ఈతకు వెళ్లిన పలువురు యువకులు
  • సూరారం చెరువులో మునిగి సాగర్(17), అభిషేక్(17) మృతి

4:21 PM, 3 Mar 2026 (IST)

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం

  • సచివాలయంలో కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమావేశం
  • ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు సీఎం రేవంత్‌రెడ్డి దిశా నిర్దేశం
  • సమావేశంలో పాల్గొన్న మంత్రులు, సీఎస్, ఉన్నతాధికారులు, కలెక్టర్లు

4:20 PM, 3 Mar 2026 (IST)

రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జి.పి.సింగ్, సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు

  • కాజీపేట రైల్వేట్రాక్ మెయింటెనెన్స్ స్కామ్‌పై సీబీఐ కేసు నమోదు
  • ముగ్గురు ఇంజినీర్లు, ఇద్దరు ట్రాక్ మెయింటెనర్లపై సీబీఐ కేసు నమోదు
  • మెయింటెనెన్స్‌కు చెందిన సంస్థ సహా 8 మందిపై కేసు నమోదు
  • రైల్వే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ జి.పి.సింగ్, సంధ్యా కన్‌స్ట్రక్షన్స్ ప్రతినిధులపై కేసు
  • పనులు చేయకుండానే మెయింటెనెన్స్ బిల్లులు వసూలు చేసినట్లు గుర్తింపు
  • నకిలీ అటెండెన్స్ రిజిస్టర్లు సృష్టించినట్లు అధికారుల విచారణలో వెల్లడి
  • క్షేత్రస్థాయిలో తనిఖీలు చేయకుండానే బిల్లులు పాస్ చేశారని ఆరోపణలు
  • కాంట్రాక్టర్ ఖాతాల నుంచి ఇంజినీర్‌ ఖాతాలకు నగదు బదిలీలు గుర్తింపు
  • ఇప్పటికే విచారణకు డీవోపీటీ, తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్న సీబీఐ
  • కుట్ర(120B), మోసం (420), అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు

3:26 PM, 3 Mar 2026 (IST)

శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా నతాంజ్‌ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ఐఏఈఏ ధ్రువీకరణ

  • అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్‌ అణుశుద్ధి కర్మాగారం
  • శాటిలైట్‌ చిత్రాల ఆధారంగా నతాంజ్‌ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ఐఏఈఏ ధ్రువీకరణ
  • నిన్నటి దాడుల్లో నతాంజ్‌ అణుశుద్ధి కర్మాగారం దెబ్బతిన్నట్టు ధ్రువీకరణ

3:26 PM, 3 Mar 2026 (IST)

ఇరాన్ డ్రోన్ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం

  • గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ దాడులు ఉద్ధృతం
  • సౌదీ, బహ్రెయిన్‌, ఖతార్‌, కువైట్‌పై డ్రోన్లు, క్షిపణులతో ఇరాన్ దాడులు
  • గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఎంబీసీలపైనా దాడులు చేస్తున్న ఇరాన్
  • సౌదీ రాజధాని రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్లతో విరుచుకుపడిన ఇరాన్‌
  • ఇరాన్ డ్రోన్ దాడిలో స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ఎంబసీ భవనం
  • కువైట్‌లో రాయబార కార్యాలయాన్ని మూసివేసిన అగ్రరాజ్యం
  • బహ్రెయిన్‌లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
  • స్వల్పంగా దెబ్బతిన్న అమెరికా ప్రధాన కార్యాలయం, సిబ్బంది నివాసాలు
  • బహ్రెయిన్‌లోని అమెరికా నౌకాస్థావరం నుంచి పొగలు వస్తున్న వీడియో వైరల్‌
  • పోర్టులో నిలిచి ఉన్న చమురునౌకపై డ్రోన్ దాడి జరిగిందని ఒమన్ మీడియా వెల్లడి
  • ఖతార్‌ ఇంధన కేంద్రంపై కూడా దాడి జరిగినట్లు సమాచారం
  • టెహ్రాన్‌ దాడుల్లో తమ సైనికులు ఆరుగురు చనిపోయారని అమెరికా వెల్లడి

3:25 PM, 3 Mar 2026 (IST)

నితిన్‌ నబీన్‌ను బిహార్‌ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయం

  • బీజేపీ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ను రాజ్యసభకు పంపాలని నిర్ణయం
  • నితిన్‌ నబీన్‌ను బిహార్‌ నుంచి రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయం

2:56 PM, 3 Mar 2026 (IST)

తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటన

  • తమ గగనతలాన్ని పాక్షికంగా మూసివేస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటన
  • వాణిజ్య విమానాలకు అనుమతి లేకుండా మార్చి చివరికల్లా పాక్‌ గగనతలం మూసివేత
  • పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వల్ల గగనతలం మూసివేయాలని పాక్‌ నిర్ణయం

2:56 PM, 3 Mar 2026 (IST)

ఇరాన్‌లో 787కు చేరిన మృతుల సంఖ్య

  • ఇరాన్‌లో 787కు చేరిన మృతుల సంఖ్య
  • ఇజ్రాయెల్‌- అమెరికా దాడుల్లో ఇరాన్‌లో 787 మంది మృతి

2:30 PM, 3 Mar 2026 (IST)

లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ప్రారంభం

  • లెబనాన్‌పై ఇజ్రాయెల్‌ భూతల దాడులు ప్రారంభం
  • దక్షిణ లెబనాన్‌లో ఇజ్రాయెల్‌ గ్రౌండ్‌ ఆపరేషన్స్‌
  • సరిహద్దుల నుంచి వైదొలుగుతున్న లెబనాన్‌ బలగాలు

2:30 PM, 3 Mar 2026 (IST)

ఇరాన్‌లోని గెరాష్‌ ప్రాంతంలో భూకంపం - రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు

  • ఇరాన్‌లోని గెరాష్‌ ప్రాంతంలో భూకంపం
  • ఇరాన్‌: రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 4.3గా నమోదు

2:10 PM, 3 Mar 2026 (IST)

గడీల రఘువీర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

  • గడీల రఘువీర్‌రెడ్డి క్వాష్ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు
  • కేకే కుమారుడు వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదుతో రఘువీర్‌రెడ్డిపై కేసు నమోదు
  • డబ్బులివ్వాలంటూ రఘువీర్‌రెడ్డి బెదిరిస్తున్నాడని వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు
  • వెంకటేశ్వర్‌రావుకు భూకేటాయింపులపై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన రఘువీర్‌
  • పిల్‌ విషయంలో రూ.3 కోట్లు డిమాండ్ చేశారని వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదు
  • వెంకటేశ్వర్‌రావు ఫిర్యాదుతో రఘువీర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదు
  • బంజారాహిల్స్ పీఎస్‌లో నమోదైన కేసును కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన రఘువీర్‌రెడ్డి
  • రఘువీర్‌రెడ్డి దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

1:26 PM, 3 Mar 2026 (IST)

పశ్చిమాసియాలో ముగ్గురు భారతీయ నావికులు మృతి

  • పశ్చిమాసియాలోని యుద్ధపరిస్థితుల్లో ముగ్గురు భారతీయులు మృతి
  • ఇప్పటివరకు ముగ్గురు భారతీయులు చనిపోయారని షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడి
  • ముగ్గురు భారతీయ నావికులు చనిపోయినట్లు షిప్పింగ్‌ డీజీ వెల్లడి

12:40 PM, 3 Mar 2026 (IST)

మహబూబ్‌నగర్‌: జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఉన్నతాధికారి

  • మహబూబ్‌నగర్‌: జడ్చర్ల పాత ప్రభుత్వ ఆస్పత్రిని పరిశీలించిన ఉన్నతాధికారి
  • ఆసుపత్రిని పరిశీలించిన వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్‌కుమార్
  • మార్చురీలో ఉన్న మృతదేహాన్ని కుక్కలు పీక్కుతిన్న ఘటనపై విచారణ
  • జడ్చర్ల: ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రకళపై సస్పెన్షన్‌ వేటు
  • జడ్చర్ల: ఆర్ఎంవో హరినాథ్‌, డ్యూటీ డాక్టర్, ఎంఎన్‌వోపై సస్పెన్షన్ వేటు

12:40 PM, 3 Mar 2026 (IST)

హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు

  • హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
  • హార్ముజ్‌ జలసంధిని మూసివేసిన ఇరాన్‌ ప్రభుత్వం
  • జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తే నౌకలను తగలబెడతామని హెచ్చరిక
  • ఇరాన్‌ చర్యతో హార్ముజ్‌ జలసంధి వద్ద చిక్కుకున్న 700కు పైగా నౌకలు
  • హార్ముజ్‌ వద్ద చిక్కుకున్న నౌకల్లో వందకు పైగా కంటైనర్‌ షిప్స్‌

12:40 PM, 3 Mar 2026 (IST)

హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు

  • హైకోర్టుకు మరోసారి బాంబు బెదిరింపు
  • హైకోర్టు ప్రాంగణంలో బాంబ్‌ స్క్వాడ్‌ బృందాల తనిఖీలు
  • యథావిథిగా కొనసాగుతున్న హైకోర్టు కార్యకలాపాలు
  • వారం క్రితం కూడా బాంబు బెదిరింపు మెయిల్

12:40 PM, 3 Mar 2026 (IST)

ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదు

ఇండోనేషియాలో భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై తీవ్రత 6.2గా నమోదు

12:40 PM, 3 Mar 2026 (IST)

భారత్‌ చేరుకున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు

  • భారత్‌ చేరుకున్న స్టార్ షట్లర్ పి.వి.సింధు
  • దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న పి.వి.సింధు
  • నాలుగు రోజులుగా దుబాయ్‌లో చిక్కుకుపోయిన పి.వి.సింధు

11:33 AM, 3 Mar 2026 (IST)

గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలు వీడాలని సూచన

  • యుద్ధ తీవ్రత పెరగడంతో అమెరికా విదేశాంగశాఖ కీలక అడ్వైజరీ జారీ
  • ఇరాన్‌పై భీకర దాడులు చేస్తామని ట్రంప్ పేర్కొనడంతో అడ్వైజరీ జారీ
  • గల్ఫ్‌ దేశాల్లో ఉన్న అమెరికన్లు వెంటనే ఆ దేశాలు వీడాలని సూచన
  • ఖతార్, సౌదీ, యూఏఈ, ఇజ్రాయెల్‌ను వీడాలని అమెరికా సూచన
  • సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని పేర్కొన్న అమెరికా విదేశాంగశాఖ
  • మధ్యప్రాచ్య దేశాలను వెంటనే వీడాలన్న అమెరికా విదేశాంగ మంత్రి రూబియో
  • విమాన ప్రయాణాలకు సంబంధించి ఎంబసీలు, వెబ్‌సైట్ తనిఖీ చేయాలని సూచన

11:33 AM, 3 Mar 2026 (IST)

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,74,000

  • హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,74,000
  • హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,55,850
  • హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2,94,000

11:33 AM, 3 Mar 2026 (IST)

లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు

  • లెబనాన్‌లోని హెజ్‌బొల్లా లక్ష్యంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్ దాడులు
  • బీరుట్‌లోని హెజ్‌బొల్లా కమాండ్ సెంటర్ సహా ఆయుధ నిల్వ కేంద్రంపై దాడులు
  • పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్‌కు చెందిన కమాండర్ అబు హమ్జాను హతమార్చామన్న ఇజ్రాయెల్‌
  • తమదేశ సైనికులు, పౌరులపై అబు హమ్జా అనేక ఉగ్రదాడులు చేశాడన్న ఇజ్రాయెల్‌
  • బీరుట్‌ శివారులోని ఒక ఛానల్ స్టూడియో భవనంపై క్షిపణి దాడి
  • ఇజ్రాయెల్ దాడుల్లో 52 మంది మరణించారన్న లెబనాన్ ఆరోగ్యశాఖ
  • ఇజ్రాయెల్ దాడుల్లో మరో 154 మంది గాయపడ్డారన్న లెబనాన్‌
  • ఇజ్రాయెల్ దురాక్రమణకు వ్యతిరేకంగా తాము దాడి చేసినట్లు హెజ్‌బొల్లా ప్రకటన
  • దాడులు ఆపకుంటే ప్రతిచర్య తీవ్రంగా ఉంటుందని ఇజ్రాయెల్‌ను హెచ్చరించిన హెజ్‌బొల్లా

11:09 AM, 3 Mar 2026 (IST)

సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

  • సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖ
  • రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలని లేఖ రాసిన కిషన్‌రెడ్డి

11:09 AM, 3 Mar 2026 (IST)

యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ మం. దండుమల్కాపురం వద్ద ప్రమాదం

  • యాదాద్రి జిల్లా: చౌటుప్పల్ మం. దండుమల్కాపురం వద్ద ప్రమాదం
  • కంటైనర్‌ను ఢీకొన్న ఏపీఎస్ఆర్టీసీ బస్సు, 10 మందికి గాయాలు
  • యాదాద్రి భువనగిరి జిల్లా: క్షతగాత్రులను ఆస్పత్రికి తరలింపు

11:09 AM, 3 Mar 2026 (IST)

భద్రాచలం: రూ.1.52 కోట్లు కాజేసిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు

  • భద్రాచలం: రూ.1.52 కోట్లు కాజేసిన ఇద్దరు ఎల్ఐసీ ఏజెంట్లు
  • నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీమా సొమ్ము స్వాహా
  • 39 మంది ఎల్‌ఐసీ ఖాతాదారుల పాలసీలు క్లైమ్‌ చేసి డబ్బు కాజేసిన ఏజెంట్లు
  • అశ్వాపురం మండలం సీతారామపురానికి చెందిన ఏజెంట్లు వెంకటేశ్వర్లు, సరస్వతి
  • భద్రాచలం పోలీసులకు ఫిర్యాదు చేసిన మేనేజర్ చక్రవర్తి
  • నిందితులపై కేసు నమోదు చేసిన భద్రాచలం పోలీసులు
  • చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువపత్రాలు సృష్టించిన ఎల్‌ఐసీ ఏజెంట్లు

11:09 AM, 3 Mar 2026 (IST)

యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు

  • యూఏఈలో ఉన్న భారతీయులను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు
  • యూఏఈ నుంచి 4 విమానాలు నడుపుతున్న స్పైస్ జెట్‌
  • యూఏఈలోని ఫుజైరా నుంచి దిల్లీ, ముంబయి, కొచ్చికి విమానాలు
  • రేపట్నుంచి ఫుజైరా-దిల్లీ, ఫుజైరా-ముంబయి విమాన సర్వీసులు
  • అవసరాల మేరకు మరిన్ని విమానాలు నడిపేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడి
  • దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న కొందరు ప్రయాణికులు
  • ఒమన్ నుంచి ప్రయాణికులతో దిల్లీ చేరుకున్న మరో విమానం

11:09 AM, 3 Mar 2026 (IST)

గద్వాల జిల్లా: అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయం మూసివేత

  • గద్వాల జిల్లా: అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారి ఆలయం మూసివేత
  • చంద్రగ్రహణం దృష్ట్యా జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలు మూసివేత
  • రేపు ఉ.9గం.కు ఆలయశుద్ధి మాహసంప్రోక్షణ అనంతరం దర్శనమివ్వనున్న అమ్మవారు

11:09 AM, 3 Mar 2026 (IST)

ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

  • ఎంబీబీఎస్ విద్యార్థులకు ఆర్థికసాయం అందించిన ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
  • బీఎల్ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ తరపున వైద్యవిద్య కోసం లక్ష్మారెడ్డి ఆర్థికసాయం
  • హరీశ్‌రావు చేతుల మీదుగా విద్యార్థులకు చెక్కుల పంపిణీ
  • ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిని అభినందించిన హరీశ్ రావు
  • 122 మంది ఎంబీబీఎస్ విద్యార్థులకు బీఎల్ఆర్ ట్రస్ట్ తరపున సాయం

9:48 AM, 3 Mar 2026 (IST)

సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం

  • సచివాలయంలో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం
  • సాయంత్రం ఆరు గంటల వరకు జరగనున్న కలెక్టర్ల సదస్సు
  • ఉదయం సెషన్‌లో జనగణనపై కలెక్టర్ల సమావేశం
  • మధ్యాహ్నం 99 రోజుల కార్యచరణ ప్రణాళికపై చర్చ
  • మధ్యాహ్నం సెషన్‌లో పాల్గొననున్న సీఎం రేవంత్‌రెడ్డి
  • ప్రజా పాలన - ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న సీఎం

9:10 AM, 3 Mar 2026 (IST)

చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత

  • తిరుమల: చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేత
  • తిరుమల: గర్భాలయం, మహాద్వారం తలుపులు మూసిన టీటీడీ
  • తిరుమల: తరిగొండ వెంగమాంబ అన్నవితరణ కేంద్రాన్ని మూసిన టీటీడీ
  • తిరుమల: భక్తులకు 40 వేల పులిహోర ప్యాకెట్లు పంపిణీ చేసిన టీటీడీ

9:08 AM, 3 Mar 2026 (IST)

యాదాద్రి జిల్లా: బీబీనగర్ మండలం గొల్లెగూడెంలో విషాదం

  • యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండలం గొల్లెగూడెంలో విషాదం
  • యాదాద్రి జిల్లా: ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి
  • 10 నెలల శిశువు, రెండేళ్ల కుమారుడిని చంపి ఉరేసుకున్న తల్లి ఐశ్వర్య
  • కుటుంబకలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల అనుమానం

8:31 AM, 3 Mar 2026 (IST)

సౌదీ అరేబియా: రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి

  • సౌదీ అరేబియా: రియాద్‌లోని అమెరికా ఎంబసీపై డ్రోన్ల దాడి
  • రియాద్‌లోని అమెరికా ఎంబసీపై 2 డ్రోన్లు దాడి చేశాయన్న సౌదీ
  • డ్రోన్ల దాడితో మంటలు చెలరేగి, భవనం స్వల్పంగా దెబ్బతిందన్న సౌదీ

8:31 AM, 3 Mar 2026 (IST)

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత

  • యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
  • సంపూర్ణ చంద్రగ్రహణం దృష్ట్యా అలయాన్ని మూసివేసిన అర్చకులు
  • యాదగిరిగుట్ట: రేపు ఉదయం 3 గంటల వరకు ఆలయం మూసివేత
  • సంప్రోక్షణ, ఆలయ శుద్ధి అనంతరం నిత్యా పూజలు చేసి దర్శనానికి భక్తులకు అనుమతి

8:30 AM, 3 Mar 2026 (IST)

జగిత్యాల జిల్లా: వైభవంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు

  • జగిత్యాల జిల్లా: వైభవంగా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు
  • ధర్మపురి: స్వామివారికి బ్రహ్మ పుష్కరిణిలో తెప్పోత్సవం, డోలొత్సవం
  • చంద్రగ్రహణం దృష్ట్యా ఉ. 9 గం.కు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మూసివేత
  • రేపు ఉదయం సంప్రోక్షణ, గ్రహణ హోమం అనంతరం భక్తుల దర్శనానికి అనుమతి

8:30 AM, 3 Mar 2026 (IST)

చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయం మూసివేత

  • చంద్రగ్రహణం సందర్భంగా భద్రాద్రి ఆలయం మూసివేత
  • భద్రాచలం: ఉదయం 8.30 గంటలకు ఆలయం మూసివేత
  • భద్రాచలం: సంప్రోక్షణ అనంతరం రాత్రి 8 గం.కు భక్తులకు దర్శనాలు

6:56 AM, 3 Mar 2026 (IST)

తిరుమల : నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత

  • తిరుమల: నేడు చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూత
  • ఉదయం 9 గం.కు గర్భాలయంతో పాటు మహాద్వారం తలుపులు మూసివేత
  • తిరుమల: నిన్న శ్రీవారిని దర్శించుకున్న 75,174 మంది భక్తులు
  • తిరుమల: నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.20 కోట్లు
  • నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 17,734 మంది భక్తులు

6:42 AM, 3 Mar 2026 (IST)

ఇరాన్‌పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్

  • ఇరాన్‌పై దాడుల వివరాలను వెల్లడించిన అమెరికా శ్వేతసౌధం ప్రతినిధి కరోలిన్ లీవిట్ (White House Carolyn Leavitt)
  • ఇరాన్‌లో 49 మంది అత్యున్నత స్థాయి నేతలను మట్టుబెట్టాం: కరోలిన్‌ లీవిట్‌
  • "ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ" ద్వారా ఇరాన్‌లో 49 మంది నేతలను మట్టుబెట్టాం: కరోలిన్‌
  • ఒమన్ గల్ఫ్‌లో ఉన్న ఇరాన్‌కు చెందిన 11 యుద్ధ నౌకలను పేల్చేశాం: కరోలిన్‌ లీవిట్‌
  • ఇరాన్‌ దాడుల్లో ఇప్పటివరకు ఆరుగురు అమెరికా సైనికులు మృతి: కరోలిన్‌ లీవిట్‌

6:42 AM, 3 Mar 2026 (IST)

నేడు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం

  • నేడు సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశం(CM Revanth Reddy with collectors)
  • ఉదయం 9.30 నుంచి సా. 6 గంటల వరకు కలెక్టర్లతో సీఎం సమావేశం
  • ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్న రేవంత్‌రెడ్డి
  • ఉదయం సెషన్‌లో జనగణనపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్న ఉన్నతాధికారులు
  • మధ్యాహ్నం 99 రోజుల ప్రణాళికపై చర్చించనున్న ఉన్నతాధికారులు
  • నేడు కలెక్టర్లతోనూ చర్చించి 99 రోజుల ప్రణాళికను ఖరారు చేయనున్న సీఎం
  • శాఖల వారీగా ప్రజెంటేషన్‌లు ఇవ్వనున్న ఉన్నతాధికారులు
  • జనగణన కోసం 89వేల మంది సిబ్బందికి శిక్షణ ఇవ్వనున్న ఉన్నతాధికారులు

6:42 AM, 3 Mar 2026 (IST)

సౌదీ అరేబియా: రియాద్‌లోని అమెరికా దౌత్య కార్యాలయంపై డ్రోన్ల దాడి

6:42 AM, 3 Mar 2026 (IST)

తిరుమల: నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ

  • తిరుమల: నేడు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్న టీటీడీ(Srivari temple closed TTD)
  • చంద్రగ్రహణం కారణంగా సుమారు 10.30 గంటల పాటు ఆలయం మూసివేత
  • ఉదయం 9 గం.కు శ్రీవారి ఆలయ తలుపులను మూసివేయనున్న అర్చకులు
  • మధ్యాహ్నం 3.20 నుంచి సాయంత్రం 6.47 గంటల వరకు చంద్రగ్రహణ కాలం
  • ఉదయం 9 గంటలకు అన్నవితరణ కేంద్రాల్లో ప్రసాదాల తయారీ నిలిపివేత
  • సాయంత్రం గ్రహణం వీడాక శుద్ధి, పుణ్యాహవచనంతో దర్శనాలు ప్రారంభం
  • నేటి బ్రేక్ దర్శనాలకు సిఫార్సు బ్రేక్ లేఖల స్వీకరణ అనుమతి నిరాకరణ
  • ఇవాళ శ్రీవారి ఆలయంలో పలు ఆర్జిత సేవలు రద్దు
  • ఇప్పటికే తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల జారీ నిలిపివేత
  • రేపు శ్రీవారి సర్వదర్శన టోకెన్లు జారీ పునఃప్రారంభం
  • నేడు శ్రీవాణి ట్రస్టు దాతల టికెట్ల విక్రయాలు నిలిపివేత
  • విమానాశ్రయంలో 200, రోజువారీ ఆన్‌లైన్‌ టికెట్ల జారీ నిలిపివేసిన టీటీడీ
  • చంద్రగ్రహణం కారణంగా నేడు మల్లన్న ఆలయం మూసివేత(Lunar eclipse)
  • ఉదయం 6 నుంచి రాత్రి 7.30 గంటల వరకు ఆలయ ద్వారాలు మూసివేత
  • రాత్రి 7.30 గంటల నుంచి ఆలయ ద్వారాలు తెరవనున్న అర్చకులు
  • నేడు ఆలయ శుద్ధి, మంగళ వాయిద్యాలు, సుసాంధ్యం, సంప్రోక్షణ కార్యక్రమాలు
  • రాత్రి 9 గం.కు శ్రీ స్వామిఅమ్మవార్ల మహామంగళ హారతులు
  • రాత్రి 9 నుంచి రాత్రి 10.30 గంటల వరకు భక్తులకు స్వామివారి అలంకార దర్శనం

6:42 AM, 3 Mar 2026 (IST)

నేడు జెడ్డా నుంచి భారత్‌కు ప్రత్యేక విమానాలు నడపనున్న కేంద్రం

  • నేడు జెడ్డా నుంచి భారత్‌కు ప్రత్యేక విమానాలు నడపనున్న కేంద్రం
  • జెడ్డాలో చిక్కుకున్న వారిని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్న కేంద్రం
  • 10 ఇండిగో విమానాలు నడపనున్నట్లు పౌరవిమానయానశాఖ వెల్లడి
  • మధ్యప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్షించిన కేంద్రమంత్రి రామ్మోహన్(Union Minister Rammohan)
  • విమానాలు జెడ్డా నుంచి హైదరాబాద్, ముంబయిలో దిగుతాయని వెల్లడి
  • విమానాలు జెడ్డా నుంచి దిల్లీ, అహ్మదాబాద్‌లో దిగుతాయని వెల్లడి

6:42 AM, 3 Mar 2026 (IST)

రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇరాన్ విదేశాంగమంత్రి

  • నేడు పుతిన్‌తో చర్చలు జరుపుతామన్న ఇరాన్ విదేశాంగమంత్రి అరగ్చీ(Iranian Foreign Minister Araghchi)
  • నేడు మాస్కోలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో చర్చలు జరుపుతామని వెల్లడి
  • ఇప్పటికే తుర్కియే అధ్యక్షుడితో మాట్లాడామన్న ఇరాన్ విదేశాంగమంత్రి
  • రష్యా, తుర్కియే మధ్యవర్తిత్వం వహించాలని కోరిన ఇరాన్ విదేశాంగమంత్రి
  • ఇజ్రాయెల్‌, అమెరికా చర్యలు అంతర్జాతీయ న్యాయసూత్రాలకు విరుద్ధం: ఇరాన్‌
  • మా దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడుకుంటాం: ఇరాన్ విదేశాంగమంత్రి

6:42 AM, 3 Mar 2026 (IST)

ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్

  • మధ్యప్రాచ్యంలో తీవ్రమవుతున్న యుద్ధం(War in the Middle East)
  • ఇరాన్‌పై దాడులను మరింత పెంచుతామన్న ట్రంప్
  • అవసరమైతే భూతల పోరాటానికి దిగుతామని ట్రంప్‌ స్పష్టీకరణ
  • ఇరాన్‌పై దాడుల్లో గల్ఫ్‌ దేశాలు తమ వెంటే ఉన్నాయన్న ట్రంప్‌
  • దుర్మార్గపు పాలనతో పొంచిఉన్న ముప్పులను తొలగించడానికి ఇది ఉత్తమ అవకాశం: ట్రంప్‌
  • ఇరాన్‌పై దాడుల విషయంలో మా లక్ష్యాలు చాలా స్పష్టంగా ఉన్నాయి: ట్రంప్‌
  • మొదటిది ఇరాన్ క్షిపణి సామర్థ్యాలను నాశనం చేస్తున్నాం: ట్రంప్‌
  • కొత్త క్షిపణులను తయారు చేసే వారి శక్తిని నాశనం చేస్తున్నాం: ట్రంప్‌
  • రెండోది ఇరాన్‌ నౌకాదళాన్ని మేము సమూలంగా తుడిచిపెడుతున్నాం: ట్రంప్‌
  • ఇప్పటికే 10 నౌకలను సముద్ర గర్భంలో కలిపేశాం: డొనాల్డ్‌ ట్రంప్‌
  • మూడోది ఇరాన్‌ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి అతిపెద్ద స్పాన్సర్: ట్రంప్‌
  • ఇరాన్‌ ఎన్నటికీ అణు ఆయుధాన్ని పొందకుండా నిర్ధారిస్తున్నాం: ట్రంప్‌

6:42 AM, 3 Mar 2026 (IST)

ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్‌

  • ఖమేనీ మృతితో ఇరాన్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు: ట్రంప్‌(Khamenei dies)
  • ఇరాన్‌ నాయకత్వం లొంగిపోయేందుకు సిద్ధంగా ఉంది: ట్రంప్‌
  • ఇరాన్‌ మిలిటరీ ఉన్నతాధికారులు చాలావరకు చనిపోయారు: ట్రంప్‌
  • ఇరాన్‌లోని వందల లక్ష్యాలపై దాడులు చేశాం: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌
  • ప్రపంచం కనీవినీ ఎరుగని రీతిలో ఇరాన్‌పై దాడులు చేశాం: ట్రంప్‌
  • ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ స్థావరాలు, ఎయిర్‌ డిఫెన్స్ వ్యవస్థపై దాడి చేశాం: ట్రంప్‌
  • ఇరాన్‌కు చెందిన 9 నౌకలను ధ్వంసం చేశాం: డొనాల్డ్‌ ట్రంప్‌
  • ప్రాణాలు కాపాడుకునేందుకే ఇరాన్ సైనికులు లొంగిపోవాలనుకుంటున్నారు: ట్రంప్‌
  • అణ్వాయుధాలు, క్షిపణులను ఇరాన్‌ వేగంగా తయారుచేస్తోంది: ట్రంప్‌
  • అమెరికాను, మా స్థావరాలను ఢీకొట్టగలిగే క్షిపణులు ఇరాన్ వద్ద ఉన్నాయి: ట్రంప్‌
  • అమెరికాను చేరుకోగలిగే క్షిపణులను కూడా ఇరాన్ తయారుచేస్తోంది: ట్రంప్‌
  • అణ్వాయుధాల అభివృద్ధికి కవచంగా మిసైళ్లను వాడుకుంటున్నారు: ట్రంప్‌
  • ఇరాన్ అణ్వాయుధాలు, దీర్ఘశ్రేణి క్షిపణులు మధ్యప్రాచ్యం, అమెరికాకు ముప్పు: ట్రంప్‌
  • అమెరికాకు ఇప్పటికీ ఇరాన్‌ నుంచి ముప్పు పొంచి ఉంది: ట్రంప్‌
  • ఇరాన్‌తో ఒబామా చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసినందుకు గర్వపడుతున్నా: ట్రంప్‌
  • ఒప్పందం కొనసాగి ఉంటే ఇరాన్‌ ఇప్పటికే అణ్వాయుధాలు కలిగి ఉండేది: ట్రంప్‌

6:42 AM, 3 Mar 2026 (IST)

టీ20 ప్రపంచకప్‌లో రేపు తొలి సెమీఫైనల్‌ మ్యాచ్‌

Last Updated : March 3, 2026 at 10:13 PM IST