ETV Bharat / state

ఆ పని చేయకపోతే నో గ్యాస్​ సిలిండర్​, నో సబ్సిడీ - ఇంకా 2 నెలలే టైమ్

ప్రతి ఇంట్లో పెరిగిన గ్యాస్​ వినియోగం- ఈ కేవైసీ తప్పనిసరి చేసిన కేంద్ర ప్రభుత్వం - మార్చి 31తో ముగుస్తున్న గడువు - కేవైసీ పూర్తి చేయకపోతే నో గ్యాస్​ సిలిండర్​, నో సబ్సిడీ

LPG Connections KYC
LPG Connections KYC (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 6, 2026 at 12:14 PM IST

3 Min Read
Choose ETV Bharat

LPG Connections KYC : ఎల్​పీజీ గ్యాస్​ సిలిండర్ మన​ నిత్యావసరాల్లో ఒక భాగంగా మారింది. గతంలో గ్యాస్​ కలెక్షన్​ కావాలంటే ఎన్నో ఇబ్బందులు పడేవారు. కానీ ప్రస్తుతం ఈజీగా కలెక్షన్​ పొందుతున్నారు. అయితే ఇందుకు కొన్ని నిబంధనలను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. గృహ అవసరాల కోసం ఎల్​పీజీ కనెక్షన్లకు కేవైసీ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలో ఆయా గ్యాస్​ సంస్థలు ఎల్​పీజీ కనెక్షన్లకు కేవైసీ తప్పనిసరి కార్యక్రమం అమలు చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఎల్​పీజీ వినియోగదారులు కేవైసీ చేస్తున్నా, ఇంకా ఎక్కువ మంది కేవైసీ పూర్తి చేయలేదని తెలుస్తోంది.

దీని ఫలితంగా సబ్సిడీ, గ్యాస్​ సిలిండర్​ బుకింగ్​ కూడా నిలిచిపోయే అవకాశాలు ఉన్నట్లు గ్యాస్​ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఎల్​పీజీ గ్యాస్​ వినియోగదారులు ప్రధానంగా రాయితీ పొందుతున్న వారు కేవైసీని పూర్తి చేసుకోవడం తప్పనిసరి అని స్పష్టం చేస్తున్నారు. గ్యాస్​ సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నకిలీ, డూప్లికేట్​ గ్యాస్​ కనెక్షన్లను తొలగించేందుకు కేవైసీ తప్పనిసరి చేస్తూ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అర్హులైన వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ అందించడంలో భాగంగా ప్రతి డొమెస్టిక్​ గ్యాస్​ వినియోగదారుడు కేవైసీని పూర్తి చేయాల్సిందే అని స్పష్టం చేసింది.

ఎవరెవరు అర్హులు? :

  • సాధారణ డొమెస్టిక్​ గ్యాస్​ కనెక్షన్​ ఉన్నవారు
  • ప్రధానమంత్రి ఉజ్వల్​ యోజన లబ్ధిదారులు
  • సబ్సిడీ పొందుతున్న అందరూ

చేసుకోవడం ఎలా? :

  • ఆధార్​ ఆధారంగా బయోమెట్రిక్​ లేదా ఓటీపీ ద్వారా కేవైసీ చేస్తారు.
  • గ్యాస్​ సిలిండర్​ పంపిణీ సమయంలో గ్యాస్​ ఏజెన్సీ నిర్వాహకులే కేవైసీ పూర్తి చేస్తున్నారు.
  • గ్యాస్​ ఏజెన్సీ వద్ద లేదా ఆన్​లైన్​లో కేవైసీ పూర్తి చేయవచ్చు.
  • గ్యాస్​ కంపెనీ అధికారిక వెబ్​సైట్​ లేదా యాప్​లోనూ కేవైసీని పూర్తి చేయవచ్చు.

అవసరమైన ధ్రువపత్రాలు :

  • ఆధార్​ కార్డు(మొబైల్​ నంబర్​ లింక్​ అయి ఉండాలి)
  • గ్యాస్​ కస్టమర్​ నంబర్​, రిజిస్టర్డ్​ మొబైల్​ నంబర్​, చిరునామా

ఈ-కేవైసీ మార్చి 31వ తేదీలోపు పూర్తి : ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఈ-కేవైసీ మార్చి 31వ తేదీలోపు పూర్తి చేయాలి. ఇలా చేస్తే ఆ సబ్సిడీ తిరిగి చెల్లిస్తారు. లేదంటే అది శాశ్వతంగా రద్దు అవుతుంది. ఈ ప్రక్రియను గడువులోగా పూర్తి చేయాలని ఆయిల్​ కంపెనీలు చెబుతున్నాయి.

ధ్రువీకరణ తర్వాత సబ్సిడీ : ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి ఈ-కేవైసీ చేయించడం తప్పనిసరి. ఏడాదికి గరిష్ఠంగా 9 సిలిండర్లకు మాత్రమే కేంద్రం సబ్సిడీని అందిస్తుంది. అయితే 8,9వ సిలిండర్లకు సబ్సిడీ విడుదలకు ముందు ధ్రువీకరణ పూర్తి చేసిన తర్వాత సబ్సిడీ ఇస్తోంది. ఒకవేళ ధ్రువీకరణ ఆలస్యం అయితే దానిని తాత్కాలికంగా నిలిపివేస్తారు.

అధికారిక వెబ్​సైట్​ ద్వారా పూర్తి సమాచారం : గ్యాస్​ డిస్ట్రిబ్యూటర్​ ఆఫీస్​కు వెళ్లి లేదా సిలిండర్​ డెలివరీ చేసే బాయ్​ వద్ద ఉండే ఈ యాప్​ ద్వారా కూడా ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. సబ్సిడీ, ఈ-కేవైసీ ప్రక్రియ లేదా బయోమెట్రిక్​ ధ్రువీకరణ పద్ధతులపై పూర్తి వివరాలను www.pmuy.gov.in వెబ్​సైట్​లో చూసుకోవచ్చు. ఇలా మూడింటిలో ఏదో ఒక పద్ధతిని ఎంచుకుని ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలి.

తెలంగాణలో మొత్తం 1.20 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు : రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్​ కనెక్షన్లు ఉన్నాయి. రేషన్​కార్డుల ఆధారంగా గ్యాస్​ సబ్సిడీకి 39.57 లక్షల మంది అర్హులు. ప్రతి ఏడాది రాయితీ ఇవ్వాల్సిన వంట గ్యాస్​ సిలిండర్ల సంఖ్య రెండు కోట్లకు పైగా ఉంటుంది. ఇందుకు మొత్తం సబ్సిడీ కింద రూ.855.22 కోట్లు ఇవ్వాల్సి ఉంటుందని అంచనా. ఆ మేరకు నిధులను బడ్జెట్​లో కేటాయించారు.

ఈ కొత్త గ్యాస్​ సిలిండర్ పేలదు! - బరువు చాలా తక్కువ!!

గ్యాస్ ప్రమాదం జరిగిందా? - రూపాయి కట్టకుండానే రూ.30 లక్షలు బీమా పొందొచ్చని తెలుసా?