ETV Bharat / state

స్ట్రోక్ కేర్​లో కీలక మైలురాయి - క్యూఏఐ అక్రిడేషన్ పొందిన కిమ్స్ హాస్పిటల్

స్ట్రోక్ చికిత్సలో అత్యుత్తమ ప్రమాణాలను కనబరుస్తున్న కిమ్స్​ హాస్పిటల్స్​ - అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా క్యూఏఐ అక్రిడేషన్ - ఈ గుర్తింపు పొందిన తొలి ఆస్పత్రిగా నిలిచిన సికింద్రాబాద్​ కిమ్స్

KIMS got QAI Accreditation On Stroke Tratment
KIMS got QAI Accreditation On Stroke Tratment (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : April 24, 2026 at 7:13 PM IST

3 Min Read
Choose ETV Bharat

KIMS got QAI Accreditation On Stroke Tratment : సికింద్రాబాద్​ కిమ్స్ హాస్పిటల్​ తెలంగాణలో స్ట్రోక్ చికిత్సలో అత్యుత్తమ ప్రమాణాలను సాధించి క్యూఏఐ (క్వాలిటీ అండ్ అక్రిడేషన్ ఇన్‌స్టిట్యూట్) నుంచి అక్రిడేషన్ పొందింది. ఈ గుర్తింపు పొందిన తొలి ఆసుపత్రిగా నిలిచింది. ఈ గుర్తింపు అత్యవసర న్యూరాలజీ సేవల్లో నాణ్యత, చికిత్సలో వేగం, రోగులకు తగిన చికిత్స, వైద్య సేవలకు నిదర్శనంగా నిలిచింది.

సమర్థవంతమైన చికిత్సా ప్రమాణాలకు నిదర్శనంగా : ఈ సందర్భంగా ప్రముఖ స్ట్రోక్ న్యూరాలజిస్ట్ డా. సుభాష్ కౌల్ మాట్లాడారు. స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. స్ట్రోక్ ప్రారంభమైన ప్రతి నిమిషం లక్షలాది న్యూరాన్లు నశించే ప్రమాదం ఉందని తెలిపారు. సమయానికి, కచ్చితమైన చికిత్స అందితే మెదడు పనితీరును కాపాడుకోవచ్చని వివరించారు. దీని ద్వారా వైకల్యాన్ని తగ్గించవచ్చని వెల్లడించారు. రోగులు సాధారణ జీవితానికి తిరిగి చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అక్రిడేషన్ తమ వేగవంతమైన స్పందన విధానానికి, సమర్థవంతమైన చికిత్సా ప్రమాణాలకు గుర్తింపుగా నిలిచిందని స్పష్టంచేశారు.

KIMS got QAI Accreditation On Stroke Tratment
క్యూఏఐ అక్రిడేషన్ పొందిన కిమ్స్ హాస్పిటల్స్ (ETV Bharat)

"స్ట్రోక్ చికిత్సలో ప్రతి నిమిషం అత్యంత కీలకం. స్ట్రోక్ ప్రారంభమైన ప్రతి నిమిషం లక్షలాది న్యూరాన్లు నశించే ప్రమాదం ఉంది. సమయానికి, కచ్చితమైన చికిత్స అందితే మెదడు పనితీరును కాపాడుకోవచ్చు, వైకల్యాన్ని తగ్గించవచ్చు. రోగులు సాధారణ జీవితానికి తిరిగి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ అక్రిడేషన్ మా వేగవంతమైన స్పందన విధానానికి, సమర్థవంతమైన చికిత్సా ప్రమాణాలకు గుర్తింపుగా నిలిచింది" - డా. సుభాష్ కౌల్ మాట్లాడుతూ, స్ట్రోక్ న్యూరాలజిస్ట్

అత్యుత్తమ సేవల్లో కిమ్స్​దే పైచేయి : ఈ నేపథ్యంలో కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ డా. భాస్కర్ రావు మాట్లాడుతూ పలు విషయాలు వెల్లడించారు. అధునాతన స్ట్రోక్ చికిత్స, నిపుణుల న్యూరాలజీ సేవలు, రోగులు కోలుకునే మెరుగైన ఫలితాలకు ఈ గుర్తింపు మరింత బలపరుస్తోందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత, నిపుణుల బృందం సమన్వయంతో అత్యవసర సేవల అందిస్తున్నామని వెల్లడించరు. అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో కిమ్స్ హాస్పిటల్స్ ఎప్పటికీ ముందువరుసలో ఉంటాయని స్పష్టం చేశారు.

"అధునాతన స్ట్రోక్ చికిత్స, నిపుణుల న్యూరాలజీ సేవలు, రోగులు కోలుకునే మెరుగైన ఫలితాలకు ఈ గుర్తింపు మరింత బలపరుస్తోంది. అత్యాధునిక సాంకేతికత, నిపుణుల బృందం సమన్వయంతో అత్యవసర సేవల అందిస్తున్నాం. అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో కిమ్స్ ఎప్పటికీ ముందుంటుంది" - డా. భాస్కర్ రావు, సీఎండీ, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్

ఈ ప్రమాణాలు ఉంటేనే అక్రిడేషన్ : స్ట్రోక్ నిర్వహణలో వేగవంతమైన నిర్ధారణ, ఎవిడెన్స్ బేస్డ్ ట్రీట్మెంట్ (ఆధారిత వైద్యం), సమన్వయంతో కూడిన స్ట్రోక్ స్పందన వ్యవస్థ, పునరావాస సేవలు, రోగి భద్రత వంటి అనేక కఠిన ప్రమాణాలను పాటించే ఆస్పత్రులకు మాత్రమే ఈ క్యూఏఐ అక్రిడేషన్ ప్రదానం చేస్తారు.

అత్యాధునిక వైద్య సేవలు అందించే కేంద్రంగా : ఈ అక్రిడేషన్​తో కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్​లో స్ట్రోక్ చికిత్సలో ముందంజలో నిలిచింది. ప్రజలకు సమయానికి అత్యాధునిక వైద్య సేవలు అందించే కేంద్రంగా మరింత బలపడింది. ఇది రోగుల ప్రాణాలను రక్షించడంలోనే కాకుండా, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించింది.

బ్రెయిన్​ స్ట్రోక్ అంటే : మెదడుకు ఆక్సిజన్, పోషాలను తీసుకెళ్లే రక్తనాళాలకు అవరోధం కలగడం లేదా చిట్లడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీన్నే స్ట్రోక్​గా పరిగణిస్తారని, ఇందులో కూడా రకాలు ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలలో రక్తం గడ్డకట్టడం లేదా ఆ రక్తనాళం ఇరుగ్గా మారి మెదడులోని ఒక భాగానికి రక్త ప్రవాహం తగ్గిపోయి కణాలు చనిపోతాయంటున్నారు.

ఛత్తీస్​గఢ్​ నుంచి 9 నెలల శిశువు ఎయిర్​ లిఫ్ట్​ - 45 రోజుల పాటు చికిత్స చేసి కాపాడిన కిమ్స్​ వైద్యులు

బేగంపేట కిమ్స్ సన్​షైన్​లో మరో మైలురాయి - న్యూరోసర్జరీల్లో రోబోటిక్ మైక్రోస్కోప్​ సేవలకు శ్రీకారం