కిమ్స్ హాస్పిటల్స్ అరుదైన ఘనత - ఏడు ఆసుపత్రుల్లో ఒకే రకమైన సేవలకు గానూ ఏఏసీఐ గుర్తింపు
అమెరికన్ అక్రిడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్ నుంచి మల్టీ సైట్ అక్రిడిటేషన్ పొందిన కిమ్స్ - హాస్పిటల్ నెట్‌వర్క్‌లో ఒకే తరహా సేవలందించడంతో అంతర్జాతీయ గుర్తింపు - మూడేళ్ల కిందటే ఒక యూనిట్‌కు ఏఏసిఐ అక్రిడిటేషన్

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 29, 2026 at 8:34 PM IST
AACI Multi Site Accreditation to Kims Hospitals : ప్రపంచ ఆరోగ్యరంగ చరిత్రలో కిమ్స్ హాస్పిటల్స్ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. తన ఏడు ఆసుపత్రుల నెట్‌వర్క్‌లో ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ రోగుల భద్రత, ఉత్తమ క్లినికల్, మెరుగైన సిబ్బందిని నిర్వహిస్తోందని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు అమెరికన్ అక్రిడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్ (ఏఏసిఐ) నుంచి మల్టీ-సైట్ అక్రిడిటేషన్ పొందింది. దీంతో ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి హెల్త్‌కేర్ నెట్‌వర్క్‌గా కిమ్స్ హాస్పిటల్స్ నిలిచింది. దీని ద్వారా నిరంతరం నాణ్యతాభివృద్ధి చేపడుతూ, విజయవంతంగా అమలు చేస్తోందని విషయాన్నీ కిమ్స్ తెలియజేస్తోంది.
ఈ అంశాలను పరిశీలిస్తూ : సాధారణంగా అక్రిడిటేషన్ విధానాలు ఒకే ఆసుపత్రిని మాత్రమే అంచనా వేస్తుంటాయి. అందుకు భిన్నంగా, ఏఏసిఐ మల్టీ-సైట్ అక్రిడిటేషన్ మొత్తం ఆసుపత్రుల నెట్‌వర్క్‌ను ఒకే సమగ్ర ఆరోగ్య వ్యవస్థగా పరిగణిస్తుంది. ఇందులో ఆసుపత్రి నిర్వహణ, పరిపాలన, రోగుల భద్రత, క్లినికల్ నాణ్యత, సమానంగా సేవలందించడం, రిస్క్ మేనేజ్‌మెంట్, నిరంతరం నాణ్యతను పాటించడం వంటి అంశాల పట్ల సమగ్ర పరిశీలన చేస్తారు. కఠినమైన అంతర్జాతీయ ప్రమాణాలను విజయవంతంగా అమలు చేయడం ద్వారా కిమ్స్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. అంతేకాకుండా, ప్రతి కిమ్స్ ఆసుపత్రిలో రోగులకు ఒకే తరహా ప్రపంచ స్థాయి సేవలు అందించాలనే సంస్థ నిబద్ధతకు ఇది గుర్తింపుగా నిలుస్తోంది.
"మూడు సంవత్సరాల క్రితం మా ఆసుపత్రుల్లో ఒక యూనిట్‌కు ఏఏసిఐ అక్రిడిటేషన్ లభించింది. ఆ గుర్తింపు అక్కడ పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, పరిపాలనా సిబ్బంది, నాణ్యతా బృందాలు, సమష్టిగా చేసిన కృషికి నిదర్శనం. అదే నాణ్యతా వ్యవస్థను ఇప్పుడు మరో ఆరు ఆసుపత్రుల్లోనూ విజయవంతంగా అమలు చేశాం. ప్రామాణిక క్లినికల్ నిబంధనలను పాటిస్తూ, హాస్పిటల్ నిర్వహణ, సైంటిఫిక్ డెవలప్మెంట్ సిస్టమ్, నిరంతరం నాణ్యతను మెరుగుపరిచే విధానంతో ఉత్తమ వైద్య సేవలను ఒకే ప్రమాణాలతో మా అన్ని ఆసుపత్రుల్లో అందించగలమని మరోసారి నిరూపించుకున్నాం" - డా. భాస్కర్ రావు, కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ సీఎండీ
నిబద్ధతను పాటిస్తే మంచి ఫలితాలు : కిమ్స్ హాస్పిటల్స్ ప్రపంచ ఆరోగ్యరంగానికి ఒక కొత్త ప్రమాణాన్ని సృష్టించిందని క్రెసో ఆంటోనియో పాలిస్కా, గ్రూప్ సీఈఓ, అమెరికన్ అక్రిడిటేషన్ కమిషన్ ఇంటర్నేషనల్ (ఏఏసిఐ) పేర్కొన్నారు. ప్రపంచంలోనే తొలి ఏఏసిఐ మల్టీ-సైట్ అక్రిడిటేషన్ సాధించడం ద్వారా బలమైన నాయకత్వం, నాణ్యత, రోగి భద్రత, విధానాల్లో భాగమైతే ఎలాంటి ఫలితాలు సాధ్యమవుతాయో కిమ్స్ హాస్పిటల్స్ నిరూపించిందని తెలిపారు.
ఇతరులకు ప్రేరణగా : ఒకే విధమైన క్లినికల్ విధానాలను పాటిస్తూ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో ఒకే ప్రమాణాలను విజయవంతంగా అమలు చేయగలమని నిరూపించినట్లు కిమ్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ డైరెక్టర్ అనిత అన్నారు. ఈ ఘనతతో కిమ్స్ హాస్పిటల్స్ దేశంలోనే కాకుండా ప్రపంచ ఆరోగ్య రంగానికి కూడా ఆదర్శంగా నిలుస్తోందన్నారు. మల్టీ హాస్పిటల్ నెట్‌వర్క్‌లో ఈ ఘనత సాధించడం చాలా అరుదని ఆమె తెలిపారు.
సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రి రికార్డు - 10 వేలకు పైగా బ్రెయిన్ ట్యూమర్ సర్జరీలు విజయవంతం

