ETV Bharat / state

న్యుమోనియాకు అల్ట్రా రాపిడ్ ఎక్మోతో ట్రీట్​మెంట్ - బాలిక ప్రాణాలు కాపాడిన 'కిమ్స్ కడల్స్'

తీవ్రమైన న్యుమోనియాతో ఇబ్బంది పడుతున్న బాలిక - అల్ట్రా రాపిడ్ ఎక్మోతో ప్రాణాలు కాపాడిన కిమ్స్ కడల్స్ వైద్యులు - సకాలంలో స్పందించడంతో బాలికకు తప్పిన ప్రాణగండం

Kims Cuddles Hospital In Kondapur
Kims Cuddles Hospital In Kondapur (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : January 28, 2026 at 3:08 PM IST

3 Min Read
Choose ETV Bharat

Kims Cuddles Hospital In Kondapur : కిమ్స్ కడల్స్ కొండాపూర్ ఆస్పత్రి పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (పీఐసియూ) వైద్య నైపుణ్యంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న పేషెంట్​ ప్రాణాలను కాపాడారు. తీవ్రమైన న్యుమోకోకల్ న్యుమోనియా, ఎంపయెమా, ఆక్సిజన్ లెవల్స్ తగ్గి, సెప్టిక్ షాక్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న 14 ఏళ్ల బాలికను అల్ట్రా–రాపిడ్ వెనో-వెనస్ ఎక్స్‌ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ (వీవీ ఎక్మో) విధానంతో వైద్యులు విజయవంతంగా కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను బాలికకు చికిత్స అందించిన కిమ్స్ కడల్స్ కొండాపూర్ క్లినికల్ డైరెక్టర్ (పీడియాట్రిక్స్) పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి డాక్టర్ పరాగ్ డేకాటే వెల్లడించారు.

Kims Cuddles Hospital In Kondapur
పేషెంట్​ కుటుంబ సభ్యులతో ఆస్పత్రి వైద్యులు (ETV Bharat)

డాక్టర్ పరాగ్ డేకాటే తెలిపిన వివరాల ప్రకారం : మెదక్ జిల్లాలోని ములుగు గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో సతమతమవుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ఆమెను మొదట కొంపల్లిలోని డాక్టర్ మహిపాల్ సంరక్షణలో చేర్చారు. చికిత్స అనంతరం ఆమెకు మరింత మెరుగైన ట్రీట్​మెంట్ కోసం కిమ్స్​ కొండాపూర్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటికే ఆ బాలికకు ఆక్సిజన్ లెవల్స్​ పడిపోయాయి. తీవ్రమైన న్యుమోనియాతో ఏమాత్రం స్పందించకుండా వెంటిలేటర్​పై ఉంది. వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి పీడియాట్రిక్ ఐసీయూ బృందం వైద్యసేవలందించింది. ఆస్పత్రిలో చేరిన 50 నిమిషాల్లోనే వీవీ ఎక్మో కాన్యులేషన్​ పూర్తి చేసి, ఒక గంట సమయంలోపే బాలికను ఈసీఎంఓ సపోర్ట్​పైకి తీసుకొచ్చారు. ఆస్పత్రి వైద్యులు వెంటనే స్పందించడంతో ఆమె ప్రాణలు కాపాడగలిగామని పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి తెలిపారు.

"బాలికకు మొత్తం ఎనిమిది రోజులపాటు వీవీ ఎక్మో సపోర్ట్ అందించిన తర్వాత (వీవీ ఎక్మో అంటే ఊపిరితిత్తులు ఏమాత్రం పనిచేయని పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే అత్యాధునిక లైఫ్-సపోర్ట్ చికిత్స) శ్వాసక్రియ, ఆక్సిజన్ స్థాయిలు క్రమంగా మెరుగుపడ్డాయి. అనంతరం ఆమెను విజయవంతంగా డీకాన్యులేట్ చేసి వెంటిలేటర్ తొలిగించాం. కోలుకుంటున్న దశలో బాలికకు అరుదైన సంక్లిష్టంగా ఉండే పేగుల్లో రక్తం గడ్డ (బ్లడ్ బీజోర్) కారణంగా చిన్నపేగులో అడ్డంకి ఏర్పడింది. ఈసీఎంఓకు సంబంధించి చాలా అరుదుగా కనిపించే ఈ సమస్యను సకాలంలో గుర్తించిన వైద్యులు, పీడియాట్రిక్ సర్జరీ ద్వారా విజయవంతంగా చికిత్స చేసి పూర్తిగా కోలుకునేలా చేశారు"- డాక్టర్ పరాగ్ డేకాటే, పీడియాట్రిక్ ఐసీయూ విభాగాధిపతి

35 రోజుల పాటు శ్రమించి : మొత్తం 35 రోజుల పాటు తమ వైద్య బృందాల పర్యవేక్షణలో ఐసీయూ చికిత్స పొందిన అనంతరం, బాలిక పూర్తిస్థాయి న్యూరోలాజికల్, ఆరోగ్యంగా డిశ్చార్జ్ అయ్యిందని కిమ్స్​ కడల్స్ వైద్యులు వెల్లడించారు. తమ కుమార్తె అనారోగ్యం నుంచి కాస్త తేరుకోవడంతో ఆమె తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర శ్వాసకోశ వైఫల్యంతో బాధపడుతున్న పిల్లలను కాపాడడంలో అల్ట్రా–రాపిడ్ ఈసీఎంఓ నిర్ణయాలు, సమన్వయంతో కూడిన రిట్రీవల్ విధానాలు, బలమైన మల్టీస్పెషాలిటీ వైద్య బృందం ఒకే చోట ఉండడం ఈ కేసులో కీలకమని వైద్యులు తెలిపారు.

ఈ చికిత్సలో డాక్టర్ పరాగ్ డేకాటే, డాక్టర్ అవినాష్ రెడ్డి పి, డాక్టర్ కల్యాణ్ కె, డాక్టర్ శ్రీవిద్య ఎల్, డాక్టర్ వినోద్ పి సహా నర్సింగ్, పెర్ఫ్యూషన్, ట్రాన్స్‌పోర్ట్ పీడియాట్రిక్ సర్జరీ బృందం డా. యోగానాగేంధ్ర, డా. మనీషా రెడ్డి, డా. అశీష్ కొడాలి కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో కిమ్స్ కడల్స్, కొండాపూర్‌లో ఇప్పటివరకు మొత్తం 25 ఈసీఎంఓ కేసులు పూర్తయ్యాయి. అధునాతన పీడియాట్రిక్ క్రిటికల్ కేర్‌లో తమ నైపుణ్యాన్ని ఆస్పత్రి మరోసారి చాటుకుంది. ఇప్పటికే ఎంతోందికి మెరుగైన సేవలను అందించింది.

విదేశాల్లో సాధ్యం కాని వ్యాధికి కిమ్స్​​​లో చికిత్స - ఎనిమిదేళ్లుగా ఉన్న సమస్యకు శాశ్వత విముక్తి

క్లోమంలో అరుదైన క‌ణితి - విజయవంతంగా సర్జరీ చేసిన కిమ్స్ వైద్యులు