ETV Bharat / state

ఆర్టీసీ​ ప్రయాణికులకు గుడ్​న్యూస్​ - సంక్రాంతికి 1,387 స్పెషల్​ బస్సులు మీ కోసం

సంక్రాంతి పండగకు సొంతూళ్లకు వెళ్తున్నారా? - ప్రయాణికులకు తీపికబురు చెప్పిన టీజీఎస్​ఆర్టీసీ - ప్రయాణికుల రద్దీ ఆధారంగా అవసరమైతే సర్వీసులు పెంచటానికి సన్నాహాలు

TGSRTC Special Buses for Sankranti
TGSRTC Special Buses for Sankranti (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 12:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

TGSRTC Special Buses for Sankranti : సంక్రాంతి పండగ కోసం సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్‌టీసీ తీపికబురు అందించింది. ఈ పండగ సమయాల్లో ప్రయాణికులను గమ్యస్థానాలను చేరవేసేందుకు ఆర్టీసీ యజమాన్యం ప్రత్యేక బస్సులను షెడ్యూల్​ను సిద్ధం చేసింది. అలాగే సంస్థకు ఆదాయాన్ని పెంచడంతో పాటు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించినప్పటి నుంచి ప్రయాణీకుల సంఖ్య మరింత పెరిగింది.

హైదరాబాద్​ వంటి ప్రముఖ నగరాల నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఖమ్మం రీజియన్​ అధికారులు స్పెషల్​ బస్సుల ప్రణాళిలను ఖరారు చేశారు. ఖమ్మం రీజియన్​ పరిధిలో 11 రోజుల్లో 1,387 సర్వీసులు నడపాలని షెడ్యూల్​ రూపొందించారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండగకు హైదరాబాద్​ నుంచి లక్షలాది మంది ప్రయాణికులు ఖమ్మం, భద్రాద్రి జిల్లాలతో పాటు సరిహద్దు ప్రాంతాలకు తరలివస్తుంటారు. దీంతో బస్సుల్లో సీటు, రైళ్లలో బెర్తులు దొరక్కపోవటం, ప్రైవేట్​ వాహనాల అధిక ఛార్జీల వల్ల ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రధానంగా ఖమ్మం నగరం, సత్తుపల్లి, మధిర, భద్రాచలం, ఇల్లెందు వంటి పట్టణాలకు ప్రయాణికుల రాకపోకలు అధికంగా ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

601 సర్వీసులకు రిజర్వేషన్‌ సౌకర్యం : సాధారణ బస్సులు రెగ్యులర్​ ఛార్జీలే వసూలు చేస్తారు. అయితే కొన్ని ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండొచ్చు. ఇక ప్రైవేట్​ ట్రావెల్స్ మాత్రం ఈ పండగ వేళలో ఛార్జీలు రెండింతలు చేస్తారు. మహాలక్ష్మి పథకంలో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్​ప్రెస్​ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం యథావిధిగా కొనసాగుతుంది. ప్రయాణికులు రద్దీని దృష్టి పెట్టుకుని దాదాపు 601 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్​ సౌకర్యం ఉంది. దీని ద్వారా ప్రయాణికులకు సీటు గ్యారెంటీపై ఆర్టీసీ భరోసా కల్పించింది. రిజర్వేషన్​ టికెట్ల బుకింగ్​ కోసం అధికారిక వెబ్​సైట్​లను సంప్రదించాలని సూచిస్తున్నారు.

ఖమ్మం నుంచి హైదరాబాద్‌కు : పండక్కి వెళ్తున్నారు? బాగానే ఉంది. మరి తిరుగు ప్రయాణం సంగతేంటి? అందుకు భయమే అవసరం లేదు. పండగ తర్వాత ప్రయాణానికి సైతం ప్రయాణికుల సౌలభ్యం కోసం జనవరి 16 నుంచి 20 వరకు 569 సర్వీసులను ఏర్పాటు చేశారు. రిజర్వేషన్​ బస్సులు 236, సాధారణ బస్సులు 333 ఉన్నాయి. ఇందులో గరిష్ఠ రద్దీ రోజులుగా అంచనా వేస్తూ 11,12,13 తేదీల్లో హైదరాబాద్​ నుంచి ఖమ్మం రీజియన్​కు ఒక్కోరోజు 156 బస్సుల చొప్పున నడపనున్నారు. తిరుగు ప్రయాణంలో 18వ తేదీన అత్యధికంగా 173 బస్సుల అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

హైదరాబాద్‌ నుంచి ఖమ్మం రీజియన్‌కు : జనవరి 9 నుంచి 15 వరకు ప్రత్యేక బస్సుల అందుబాటులో ఉంటాయి. మొత్తం 818 సర్వీసులు నడపాలని అధికారులు షెడ్యూల్​ ని రూపొందించారు. వీటిలో 365 సర్వీసులకు రిజర్వేషన్​ సదుపాయం కల్పించారు. మిలిగిన 453 సాధారణ సర్వీసులను ఏర్పాటు చేశారు.

సంక్రాంతికి రైళ్లు సర్వీసులు ఇలా : ఈ సంక్రాంతి నేపథ్యంలో రైల్వే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనపు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఖమ్మం రైల్వేస్టేషన్​ మీదుగా 11 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారని రైల్వే చీఫీ కమిర్షియల్​ ఇన్​స్పెక్టర్​ డి.రాజగోపాల్​ పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమై ఈ నెల 25వ తేదీ వరకు నడుస్తాయన్నారు. ఇప్పటికే ఈ రైళ్లకు సంబంధించి టికెట్​ రిజర్వేషన్లు ప్రారంభించారని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు రైల్వేస్టేషన్​లో సంప్రదించాలని తెలిపారు.

సంక్రాంతి పండగకు 1,200 ప్రత్యేక బస్సులు - నగరం నలువైపుల నుంచి అందుబాటులో

డిమాండ్ పెరిగినా బస్సులు మాత్రం పెరగలేదు - ఉన్నవాటితోనే నెట్టుకొస్తున్న ఆర్టీసీ