YUVA : తండ్రి పెయింటర్, ఇళ్లల్లో పనిచేసే తల్లి - కూతురు బీఎస్‌ఎఫ్ జవాన్
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తోన్న సౌమ్య - 11 నెలల కఠోర శిక్షణ పూర్తి చేసిన సౌమ్య - ఐపీఎస్ సాధించడమే భవిష్యత్ లక్ష్యమంటున్న యువతి - నిరుపేద కుటుంబానికి చెందిన సౌమ్య

Published : February 27, 2026 at 6:54 PM IST
BSF Jawan Alekhya From Khammam : అత్యంత నిరుపేద కుటుంబం. తండ్రి కార్పెంటర్. రోజువారి పనులకు వెళ్లే తల్లీ. పైగా ముగ్గురూ ఆడపిల్లలే. వీటన్నింటినీ గమనించి సైన్యంలో చేరాలనే లక్ష్యం పెట్టుకుంది ఆ అమ్మాయి. అందుకు అహర్నిశలు శ్రమించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మొక్కవోని దీక్షతో కాలంతో పాటే ముందుకు సాగింది. సైన్యంలోకి వెళ్లాలనే తన సంకల్పానికీ తల్లిదండ్రులూ ఏనాడు అడ్డుచెప్పలేదు. లక్ష్య సాధనకు రాత్రింబవళ్లు శ్రమించి చివరికి అనుకున్నది సాధించింది. అత్యంత ధైర్యసాహసాలతో కూడిన సరిహద్దు భద్రతా దళం-BSF కొలువు సాధించింది. 11 నెలల పాటు కఠోరమైన శిక్షణను పూర్తిచేసుకుని సరిహద్దుల్లో జవాన్‌గా విధులు నిర్వర్తించేందుకు సిద్ధమైంది ఖమ్మం నగరానికి చెందిన బొడ్డు అలేఖ్య.
అందరు నాకు మద్దతు ఇచ్చారు : తాను భువనగిరి జిల్లాలోని ఆర్మీ డిగ్రీ కాలేజీలో చదువుకున్నానని, అప్పుడే డిఫెన్స్ వైపు వెళ్లాలనే ఆలోచన వచ్చిందని అలేఖ్య తెలిపారు. ఉద్యోగాల కోలం నోటిఫికేషన్ పడినప్పుడు అప్లై చేసి ఎలాగైనా ఉద్యోగం సాధించాలి అని ప్రిపేర్ అయ్యానని ఆమె పేర్కొన్నారు. అందులో భాగంగానే పరీక్ష రాసి అందులో క్వాలిఫై అయ్యి ఆ తర్వాత ఉండే ఫిజికల్ టెస్టు కోసం ఇంటి దగ్గరే ప్రాక్టీస్ చేసి ఉద్యోగం సాధించినట్లు తెలిపారు. తాను డిఫెన్స్ సైడ్ వెళ్లాలి అని అనుకున్నట్లు చెప్పారు. మొదటి నుంచే అటు వైపు వెళ్లాలనే ఆలోచనలు ఉండేవన్నారు. ఇంటర్ పూర్తి అయినప్పటి నుంచి ప్రతి ఉద్యోగానికి అప్లై చేయడం వంటివి చేసిన అలేఖ్య డిగ్రీ చదువు పూర్తి చేయడానికి తన ఫ్యామిలీ, బంధువులు చాలా సపోర్ట్ చేశారని చెప్పారు.
"చిన్న వయస్సులో ఏదైనా సాధించి తీరాలి అని నిర్ణయించుకున్నాను. ఇంతకు ముందు నేను అగ్నివీర్ పరీక్షలో క్వాలిఫై అయ్యాను. కానీ దానికి సంబంధించిన ఈవెంట్స్ తమిళనాడులో ఉన్నాయి. చదువుకోవడానికి కుటుంబం నుంచి ఎంతో మద్దతు లభించింది. కానీ తమిళనాడు వెళ్లడానికి అవసరమైనంత సపోర్ట్ మాత్రం లభించలేదు. నాకు కూడా అందరిలాగే సాధారణంగా భయం ఉంటుంది. కానీ ట్రైనింగ్లో అక్కడ అందరిని చూశాక మనం కూడా ఇలా చేయొచ్చా అని అనిపించేది. దీంతో నాలో కూడా ఆత్మవిశ్వాసం పెరిగింది" -అలేఖ్య, బీఎస్‌ఎఫ్ జవాన్
కష్టపడి చదివాను : ఈ బీఎస్‌ఎఫ్ ఉద్యోగంతో ఆగకుండా ఇంకా మంచి స్థాయికి వెళ్లేలా అంటే సివిల్స్ రాసి ఐపీఎస్ సాధించాలని అనుకుంటున్నట్లు అలేఖ్య తెలిపారు. కాకపోతే ఇది తన మొదటి అడుగుగా పేర్కొన్నారు. నాన్న పెయింటర్‌గా, అమ్మ ఇళ్లలో పనిచేస్తూ తనని చదివించారన్నారు. తన చదువు 5 నుంచి టెన్త్ వరకు టేకులపల్లి రెసిడెన్షియల్ సూళ్లో జరిగిందన్నారు. ఇంటర్మీడియట్ కూడా దానిలోనే పూర్తి చేశానన్నారు. భువనగిరిలోని ఆర్మీ డిగ్రీ కాలేజీలో డిగ్రీ చేయడంతో అక్కడ తనలో మంచి స్పిరిట్ ఇంకా పెరిగిందన్నారు.
బీఎస్‌ఎఫ్ ట్రైనింగ్లో రన్నింగ్ అనేది చాలా ముఖ్యమైందని అలేఖ్య తెలిపారు. బరువులు వేసుకుని పరుగెత్తడం, అలాగే వెపన్ షూటింగ్ అన్ని ఉంటాయని అన్నారు. అలా 11 నెలల పాటు కఠినమైన శిక్షణ ఇచ్చి తర్వాత బార్డర్లో ఉండే డ్యూటీకి పంపిస్తారని చెప్పారు. తమ ట్రైనింగ్ మొత్తం పంజాబ్‌లో జరిగిందని అక్కడ తనకు హిందీ రాకపోడంతో కొంత ఇబ్బంది ఉండేదని తెలిపారు. కానీ 11 నెలల శిక్షణ సమయంలో కొంత హిందీ నేర్చుకున్నట్లు తెలిపారు. చివరగా అమ్మాయిలు దేనిలో తక్కువ అని అనుకోకుండా దేనినైనా సాధించే శక్తి వారిలో ఉంటుందని దానిని వారే తెలుసుకుని ఎవరి మీద ఆధారపడకుండా జీవితంలో మంచి ఉద్యోగాల్లో ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
YUVA : లగ్జరీ ఇల్లులా వ్యాన్ - మూవింగ్ హోమ్ జర్నీ కాన్సెప్ట్‌తో ఫేమస్

