కేసీఆర్ మనవడు హిమాన్షుకు గాయం - ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్
కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు స్వల్ప గాయం - ఏఐజీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న హిమాన్షు - మనవడిని పరామర్శించిన కేసీఆర్ - కుమారుడు హిమాన్షు ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ ట్వీట్

Published : July 7, 2026 at 5:48 PM IST
|Updated : July 7, 2026 at 7:13 PM IST
KTR's Son Himanshu Injured : మాజీ సీఎం కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు రావు ప్రమాదవశాత్తు స్వల్పంగా గాయపడ్డారు. సోమవారం ఆటలాడుతుండగా అతడి ముక్కుకు చిన్న గాయమైంది. దీంతో కుటుంబ సభ్యులు ఆయనను తక్షణ చికిత్స నిమిత్తం హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (AIG) ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హైదరాబాద్ ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఏఐజీ ఆస్పత్రి చేరుకున్నారు.
మనవడిని పరామర్శించిన కేసీఆర్ : హిమాన్షుకు గాయమైన విషయం తెలియగానే కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి నేరుగా గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి చేరుకున్నారు. తన మనుమడిని పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ వెంట కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు తదితరులు ఉన్నారు. కేసిఆర్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, హిమాన్షుకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి ఆరా తీశారు.
కొంత విశాంత్రి తీసుకోవాలి : మరోవైపు తాను కోలుకుంటున్నట్లు హిమాన్షు ఎక్స్ వేదికగా వెల్లడించారు. చిన్నపాటి గాయమవ్వడంతో గత రాత్రి ఆస్పత్రిలో చేరానని తెలిపారు. పూర్తిగా కోలుకునేందుకు కొంత విశాంత్రి తీసుకోవాలని డాక్టర్లు సూచించినట్లు హిమాన్షు పేర్కొన్నారు.
Last night, I was admitted to the Hospital following a sports-related injury.
— Himanshu Rao Kalvakuntla (@TheHimanshuRaoK) July 7, 2026
I’m doing well, and the doctors have advised me to take some time to rest and recover.
Thank you all for your understanding, love, and support. Looking forward to being back soon❤️
"నిన్న రాత్రి గాయం కారణంగా నన్ను ఆసుపత్రిలో చేర్చారు. నా ఆరోగ్యం బాగానే ఉంది. కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని, విశ్రాంతి తీసుకోమని వైద్యులు చెప్పారు. మీ ప్రేమకు ధన్యవాదాలు. త్వరగా కొలుకోని మీ ముందుకు వస్తాను" - కల్వకుంట్ల హిమాన్షు ట్వీట్
హిమాన్షుకు చిన్నపాటి గాయమైంది : తన కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై కేటీఆర్ సోషల్ మీడియా (ఎక్స్) వేదికగా స్పందిస్తూ సోమవారం సాయంత్రం హిమాన్షుకు చిన్నపాటి గాయమైందని తెలిపారు. ప్రస్తుతం చికిత్స కొనసాగుతుందని, కొన్ని రోజుల్లోనే పూర్తిగా కోలుకుంటాడని వివరించారు. ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
My son Himanshu suffered a minor sports injury yesterday evening and is undergoing treatment
— KTR (@KTRBRS) July 7, 2026
He should be back to being normal in a few days. Thank you to all who’ve been calling and texting with concern
"నిన్న సాయంత్రం హిమాన్షు స్వల్పంగా గాయపడ్డాడు. ఆటలాడుతూ హిమాన్షు స్వల్పంగా గాయపడ్డాడు. ప్రస్తుతం హిమాన్షు చికిత్స పొందుతున్నాడు. కొద్ది రోజుల్లోనే కోలుకుంటాడు. హిమాన్షు ఆరోగ్యంపై ఆరా తీసిన వారందరికీ కృతజ్ఞతలు" - కేటీఆర్ ట్వీట్
ఆందోళన చెందాల్సిన పని లేదు : హిమాన్షుకు గాయమైందని తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమాలులు ఆందోళన చెందారు. ప్రస్తుతం హిమాన్షు ఆరోగ్యం స్థిరంగానే ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు, కుటుంబ సభ్యులు వెల్లడించారు.

