ETV Bharat / state

పుష్కరిణి శుభ్రం చేస్తుండగా బయటపడ్డ కాళికాదేవి పంచలోహ విగ్రహం

తిరుపతి జిల్లా మండలకేంద్రమైన చంద్రగిరి బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణంలోని కోనేరులో పురాతన కాళికాదేవి విగ్రహం బయటపడింది

kalikadevi Statue Found in Chandragiri
కాళికాదేవి పంచలోహ విగ్రహం (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 30, 2026 at 1:33 PM IST

2 Min Read
Choose ETV Bharat

kalikadevi Statue Found in Chandragiri: భవిష్యత్​ తరాలకు చరిత్రను చూపించడానికి పురాతన శిల్పసంపద ఎంతగానో ఉపయోగపడుతుంది. దాని ద్వారా వేల ఏళ్ల నాటి జీవన విధానాలు, సంస్కృతి సంప్రదాయాలు కొత్త తరాలకు బోధపడతాయి. అలనాటి అద్బుత కళా సంపద గురించి తరతరాలకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎన్నో పురాతణ కట్టడాలు ఉన్నాయి. చరిత్రకు తార్కాణాలుగా వేల ఏళ్లనాటి నిర్మాణాలు, దైవ విగ్రహాలు పూజలందుకుంటున్నాయి. ఇప్పటికీ తవ్వకాలు చేపడితే అలనాటి శిల్పాలు, దేవతామూర్తులు బయటపడుతున్నాయి. ఇటువంటి ఘటనే తిరుపతి జిల్లాలో జరిగింది. భారీగా భక్తులు తరలి వచ్చి దేవతామూర్తిని కొలుస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే.

మరమ్మతుల్లో బయటపడ్డ కాళికాదేవి విగ్రహం: శిథిలావస్థకు చేరిన పుష్కరిణిని శుభ్రం చేస్తుండగా పురాతన విగ్రహం బయటపడిన ఘటన తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో చోటుచేసుకుంది. స్థానిక కొత్తపేటలోని స్వర్ణముఖినది ఒడ్డున ఉన్న రాయలకాలం నాటి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోని పుష్కరిణి నిర్వహణ లేక చెట్లు, మట్టిదిబ్బలతో శిథిలావస్థకు చేరింది. ఎమ్మెల్యే పులివర్తి నాని చొరవతో స్థానికులు వికసిత్‌ భారత్‌-గ్రామీణ ఉపాధి పథకం కింద ఇక్కడ శుద్ధి పనులు చేపట్టారు. బ్రహ్మంగారి ఆలయ సమీపంలోని కోనేరు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయి. శనివారం పుష్కరిణిలోని పూడికమట్టి తొలగిస్తుండగా ఉగ్రరూపంలో దశ ఆయుధాలు చేతపట్టుకుని ఉన్న కాళికాదేవి పంచలోహ విగ్రహం లభ్యమైంది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం కోనేరులో పేరుకుపోయిన మట్టి, వ్యర్థాలను తొలగిస్తున్న సిబ్బంది ఈ విగ్రహాన్ని గుర్తించారు.

భక్తుల పూజలు: ఈ విగ్రహం ఏ కాలం నాటిదో తెలియట్లేదని, పురావస్తుశాఖ అధికారులు పరిశీలించాల్సి ఉందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. ప్రస్తుతానికి విగ్రహాన్ని వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో భద్రపరిచారు. ఈ విషయాన్ని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని దృష్టికి తీసుకెళ్లినట్లు నాయకులు తెలిపారు. కోనేరు వద్ద విగ్రహం బయటపడిందన్న వార్త తెలియగానే స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఉగ్రరూపంలో ఉన్న విగ్రహం పంచలోహాలతోనే తయారైందా? దాని చరిత్రకు ప్రాధాన్యత ఏమిటనే విషయాలను పురావస్తు, దేవాదాయ శాఖ అధికారులు అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.