ETV Bharat / state

జేఈఈ మెయిన్స్​లో టాపర్​గా నిలిచిన పసల మోహిత్ - అభినందనలు తెలియజేసిన మంత్రి లోకేశ్

జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు - పసల మోహిత్‌, నరేంద్రబాబు మహిత్​కు 100 శాతం ఉత్తీర్ణత, అత్యధిక మార్కులను సాధించడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు

Jee mains Topper Mohit From YSR District
Jee mains Topper Mohit From YSR District (ETV)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 17, 2026 at 8:23 AM IST

3 Min Read
Choose ETV Bharat

Jee mains Topper Mohith From YSR Kadapa District: ఈరోజు విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో కడపజిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన పసల మోహిత్ అనే విద్యార్థి వందశాతం ఉత్తీర్ణతను సాధించాడు. ఎన్టీఏ విడుదల చేసిన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో 12 మందికి వందశాతం పర్సంటైల్ రాగా వారిలో ముగ్గురు ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారు కావడం విశేషం.

ఏపీకి చెందిన ముగ్గురిలో పసల మోహిత్ జమ్మలమడుగులోని రామిరెడ్డిపల్లి కాలనీకి చెందిన వాసి. ఈ అబ్బాయి ప్రస్తుతం విజయవాడ శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ అబ్బాయి తండ్రి పసల కిరణ్ కుమార్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్నాడు. తల్లి సబిత గృహిణి. మోహిత్ జేఈఈ మెయిన్స్ లో వందశాతం పర్సంటైల్ సాధించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అబ్బాయి విజయవాడలోనే శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు.

జేఈఈ మెయిన్స్​లో టాపర్​గా నిలిచిన పసల మోహిత్ - అభినందనలు తెలియజేసిన మంత్రి లోకేశ్ (ETV)

ఆనందం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు: జేఈఈ మెయిన్స్ పేపర్1 ఫలితాల్లో కడప జిల్లా జమ్మలమడుగు చెందిన విద్యార్థి సత్తా చాటాడు. పసల మోహిత్ 300 కు 300 పర్సంటేలు సాధించి మన రాష్ట్రంలోని టాపర్గా నిలిచాడు. రాష్ట్రంలో 300 కి 300 పర్సంటేల్ సాధించిన ఇద్దరు విద్యార్థుల్లో జమ్మలమడుగు చెందిన విద్యార్థి ఉండడం విశేషం. 100% రిజల్ట్ సాధించడంపై తల్లిదండ్రులు డాక్టర్ సబిత, డాక్టర్ పి కిరణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ వైద్యులు అయినప్పటికీ తనకు ఇంజనీరింగ్‌పై ఉన్న ఆసక్తితోనే తాను ఇటువైపు వచ్చినట్లు జేఈఈ మెయిన్‌ పేపర్‌-1 ఫలితాల్లో 300కి 300 మార్కులు సాధించిన పసల మోహిత్‌ తెలిపాడు. కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మోహిత్‌ విజయవాడ చైతన్య క్యాంపస్‌లో తర్ఫీదు పొందుతున్నాడు.

అభినందనలు తెలియజేసిన మంత్రి లోకేశ్: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటడం గర్వకారణమని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కితాబిచ్చారు. దేశవ్యాప్తంగా కేవలం 12 మంది విద్యార్థులు 100 పర్సంటైల్ సాధించగా, అందులో మన రాష్ట్రానికి చెందిన నరేంద్ర బాబు గారి మహిత్, పసల మోహిత్ అత్యున్నత ప్రతిభ కనబరచడం అభినందనీయమని ప్రశంసించారు. కఠోర శ్రమ, క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో రాష్ట్ర కీర్తిని దశదిశలా చాటిన విద్యార్థులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

"మా అబ్బాయికి జేఈఈ మెయిన్స్​లో 100 శాతం మార్కులు సాధించడం మాకెంతో ఆనందంగా ఉంది. చిన్నతనం నుంచి మోహిత్ చదువు పట్ల చురుకుగా ఉండేవాడు. ప్రస్తుతం విజయవాడ చైతన్య క్యాంపస్‌లో తర్ఫీదు పొందుతున్నాడు. జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో జాతీయ స్థాయిలో ఈ గుర్తింపు దక్కడం మాకెంతో సంతోషాన్ని ఇస్తుంది"-డాక్టర్ టి సబిత, డాక్టర్ పి కిరణ్ కుమార్,మోహిత్ తల్లిదండ్రులు

"జేఈఈ మెయిన్స్ పేపర్1 ఫలితాల్లో 300 కు 300 పర్సంటేలు సాధించడం నాకెంతో ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రులు ఇద్దరూ ప్రభుత్వ వైద్యులు అయినప్పటికీ ఇంజనీరింగ్‌పై ఉన్న ఆసక్తితోనే నేను ఇటువైపు వచ్చాను. పరీక్షను రాసే సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి ప్రశ్నపై స్పష్టత ఎంతో ముఖ్యం. అదే విధంగా పరీక్షలకు ముందు ఎక్కువ సార్లు మాక్ టెస్ట్​లను సాధన చేయడం వలన సులువుగా మార్కులను సాధించవచ్చు. భవిష్యత్తులో ఇంజినీర్ కావాలనేదే నా లక్ష్యం"-మోహిత్ పసల, జేఈఈ టాపర్

'ఇష్టంతో కష్టపడటం వల్లే సాధ్యమైంది' - జేఈఈ టాపర్‌ గుత్తికొండ సాయి మనోజ్ఞ

జేఈఈ మెయిన్​ మొదటి సెషన్ ఫలితాలు - ఏపీ బాలికకు వంద పర్సంటైల్​