ETV Bharat / state

‘అదే నా రాస్తా’ - పవన్‌ కల్యాణ్ ఎక్స్​ పోస్టు వైరల్‌

తెలంగాణ విషయంలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఆసక్తికర ట్వీట్‌ - తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల నాకున్న నిబద్ధత నిన్న మొన్నటిది కాదని స్పష్టం చేసిన పవన్ కల్యాణ్

Deputy CM Pawan Kalyan Post Goes Viral
Deputy CM Pawan Kalyan Post Goes Viral (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 3, 2026 at 11:35 AM IST

2 Min Read
Choose ETV Bharat

Deputy CM Pawan Kalyan Post Goes Viral : ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సామాజిక మాధ్యమాల్లో ఆసక్తికర పోస్టు పెట్టారు. మంగళవారం తన నివాసంలో ప్రెస్​మీట్ పెట్టిన సంగతి తెలిసిందే. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటోందని పవన్ తేల్చిచెప్పారు. రాజకీయ క్షేత్రంలో నిలబడి తీరుతామని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ప్రముఖ కవి శేషేంద్ర రచించిన కవితను పవన్ కల్యాణ్ పోస్టు చేశారు. ఇప్పుడిది నెట్టింట చక్కర్లు కొడుతోంది.

తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రస్థానంపై ఆ పార్టీ అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టతనిచ్చిన మరుసటి రోజే సామాజిక మాధ్యమాల్లో పెట్టిన ఒక ఆసక్తికర పోస్టు నెట్టింట వైరల్‌ అవుతోంది. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో తెలంగాణలో జనసేన కచ్చితంగా ఉంటుందని, రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఆయన తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో, రాజకీయ క్షేత్రంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొని నిలబడతామనే సంకేతాన్ని ఇస్తూ ప్రముఖ మహాకవి గుంటూరు శేషేంద్ర శర్మ రచించిన ఒక శక్తివంతమైన కవితను పవన్‌ కల్యాణ్‌ తన ‘ఎక్స్‌’లో పంచుకున్నారు.

"ఏ రస్తా యుద్ధాలు చేస్తుందో

ప్రాణాల్ని ఆటబంతుల్లా

విసిరేస్తుందో

గెలుస్తుందో ఓడుతుందో

కానీ ముందుకు పోతుందో

అదే నా రస్తా

ఏ రాస్తాలో సంకెళ్లు కూడా

సవాల్ చేస్తాయో

ఏ రాస్తాలో అపజయం కూడా

అగ్నిజ్వాలై మండుతుందో

ఏ రాస్తాలో మరణం

మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో

అదే నా రాస్తా.."

తెలంగాణపై నా నిబద్ధత ఈనాటిది కాదు!
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పట్ల తనకున్న నిబద్ధత నిన్న మొన్నటిది కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ స్పష్టం చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీకి చెందిన "యువరాజ్యం" యువజన విభాగానికి నాయకత్వం వహిస్తున్న సమయంలో ఉస్మానియా వర్సిటీ విద్యార్థి నాయకులు, ప్రజాకవి గద్దర్‌తో కలిసి తాను "తెలంగాణ సామాజిక న్యాయ సభ'లో పాల్గొన్నానంటూ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

వైఎస్​ రాజశేఖర్‌రెడ్డి నేతృత్వంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు బహిరంగ మద్దతు పలికానన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అవకాశాల పునాదులపై నిర్మితమయ్యే "సామాజిక తెలంగాణ" కోసం పిలుపునిచ్చినట్లు తెలిపారు.

తెలంగాణకు తాను తెలిపిన మద్దతు ఎన్నడూ రాజకీయ ప్రయోజనాల కోసం చేసినది కాదని అది ఒక దృఢమైన నమ్మకం, ప్రజల ప్రజాస్వామ్య ఆకాంక్షలను గుర్తించి గౌరవించాలనే సిద్ధాంతం నుంచి పుట్టిందన్నారు. అప్పుడు తీసుకున్న ఆ నిర్ణయమే తెలంగాణ ప్రజల పట్ల తన అచంచలమైన నిబద్ధతకు నిదర్శనమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు తాను ఇచ్చిన మద్దతు రాజకీయం కోసం కాదని అది తన నైతిక సిద్ధాంతమని పవన్‌ స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లో పవన్‌ సభకు అనుమతి నిరాకరణ

తెలంగాణలో జనసేన ఉంటుంది - 2029 ఎన్నికల్లో తప్పకుండా పోటీచేస్తాం: పవన్‌ కల్యాణ్‌