Telangana Panchayat Elections Results2025

ETV Bharat / state

పిస్తా హౌస్ యజమాని ఇంట్లో ఐటీ సోదాలు - భారీగా నగదు గుర్తింపు

రెండ్రోజులుగా ప్రముఖ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు - ఏకకాలంలో 15 చోట్ల సోదాలు చేసిన ఐటీ అధికారులు - పిస్తాహౌస్‌ యజమాని ఇంట్లో రూ.5 కోట్లు గుర్తింపు

IT Raids in Hyderabad
IT Raids in Hyderabad (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 18, 2025 at 9:38 AM IST

|

Updated : November 19, 2025 at 10:16 PM IST

2 Min Read
Choose ETV Bharat

IT Raids in Hyderabad : హైదరాబాద్​​లో రెండ్రోజులుగా ప్రముఖ బిర్యానీ హోటళ్ల యజమానుల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బుధవారం పిస్తాహౌస్‌ యజమాని ఇంట్లో రూ.5 కోట్లు ఐటీ అధికారులు గుర్తించారు.

మంగళవారం హార్డ్‌డిస్క్‌లు, దస్త్రాలు స్వాధీనం : హైదరాబాద్​లో మంగళవారం ఉదయం ఆదాయపన్నుశాఖ అధికారుల సోదాలు ప్రారంభమయ్యాయి. ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. ప్రముఖ హోటళ్లు పిస్తా హౌస్, షా గౌస్, మెహిఫిల్‌ ఛైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ఏటా వందల కోట్ల వ్యాపారం చేస్తున్న నేపథ్యంలో పన్ను ఎగవేత ఆరోపణలతో ఐటీ అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ సోదాల్లో పిస్తా హౌస్‌ యజమాని మాజీద్‌ ఇంటి వద్ద హార్డ్‌డిస్క్‌లు, పలు దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కార్మికుల గదుల్లోనూ ఉంచిన పలు హార్డ్‌డిస్క్‌లు, దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్​తో పాటు ఇతర నగరాల్లోనూ ఈ రెండు హోటళ్లు నడుస్తున్నాయి. దుబాయ్​లోనూ పిస్తా హౌస్​, షా గౌస్​, మెహిఫిల్‌ హోటళ్ల బ్రాంచ్​లను నిర్వహిస్తున్నారు.

హైదరాబాద్​లో ఐటీ సోదాలు : శాలిబండలోని పిస్తా హౌస్​ ప్రధాన బ్రాంచ్​లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. రాజేంద్రనగర్​ గోల్డెన్​ హైట్స్​ కాలనీలో నివాసం ఉంటున్న పిస్తా హౌస్​ యజమాని మాజిద్​ ఇంట్లోనూ ముమ్మర తనిఖీలు చేశారు. భారీ స్థాయిలో పన్ను ఎగవేత ఆరోపణలు వచ్చిన సందర్భంగా ఐటీ అధికారులు ఈ సోదాలు చేపట్టారు. పెద్ద కోట్ల రూపాయల విలువైన అమ్మకాలు, కొనుగోళ్ల వివరాలు గోప్యంగా ఉంచినట్లు అనుమానిస్తున్నారు. అందుకే ఈ 3 గ్రూపులకు చెందిన కార్యాలయాలు, వారికి సంబంధించిన నివాసాలు, ఇతర సంబంధిత ప్రదేశాల్లో ఏకకాలంలో దాడులు చేశారు.

విదేశాల్లోనూ ఈ హోటళ్ల బ్రాంచీలు : ఈ మూడు బ్రాండ్లకు చెందిన పలు యూనిట్లు, శాఖలు, అకౌంటింగ్​ సెక్షన్లు, గిడ్డంగులు, నిర్వాహకులకు చెందిన ఇళ్లు వంటి చోట్ల ఒకేసారి సోదాలు చేపట్టారు. మెహిఫిల్‌​ రెస్టారెంట్​కి హైదరాబాద్​ నగరంలో 15 బ్రాంచీలు ఉండగా అదనంగా యూఏఈలో కూడా శాఖలు ఉన్నాయి. పిస్తా హౌస్​కి విదేశాల్లో కలిపి మొత్తం 44 స్టోర్​లు ఉన్నాయి. గచ్చిబౌలి, ఓల్డ్​ సిటీ తదితర ప్రాంతాల్లో అనేక చోట్ల షాగౌజ్​కు స్టోర్​లు ఉన్నాయి.

సబ్​ రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్​ పూర్తయినా దాచేస్తున్న ఫైల్స్​ - ఏసీబీ సోదాల్లో విస్తుపోయే నిజాలు

దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లలో ఈడీ సోదాలు- ఆ కార్లు కొన్నందుకేనా?

Last Updated : November 19, 2025 at 10:16 PM IST