ETV Bharat / state

భావి శాస్త్రవేత్తలకు ‘ఇస్రో’ ఆహ్వానం - అర్హులు ఎవరెంటే?

‘యువిక-2026’ పేరిట పాఠశాలల విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ - 27 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం - తెలుగు రాష్ట్రాల్లో రెండు కేంద్రాలు - ఖర్చులన్నీ ఇస్రోవే - ముఖ్యమైన తేదీలు ఇవే

Isro Yuvika 2026 Application Details
Isro Yuvika 2026 Application Details (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 23, 2026 at 10:33 AM IST

3 Min Read
Choose ETV Bharat

Isro Yuvika 2026 Applications : భవిష్యత్తులో శాస్త్రవేత్తగా మారి దేశఖ్యాతిని ఇనుమడింపజేయాలని కలలు కంటున్నారా? అంతరిక్షం అంటే అంతులేని ఆసక్తి ఉందా? అయితే మీలాంటి బాల మేధావుల కోసం ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) అద్భుత అవకాశం కల్పిస్తోంది.

'యువిక-2026' (యువ విజ్ఞాని కార్యక్రమ్) పేరిట ప్రత్యేక తర్ఫీదు తరగతులు నిర్వహించనుంది. స్పేస్ సైన్స్, స్పేస్ టెక్నాలజీ, స్పేస్ అప్లికేషన్స్​లో ప్రాథమిక జ్ఞానాన్ని, అత్యాధునిక పోకడలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

ఎవరు అర్హులంటే?

  • దేశం నలుమూలల ఉన్న పాఠశాలల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • 2026 జనవరి 1 నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే అర్హులు.

వెబ్​సైట్ లింక్: ఆసక్తి గల విద్యార్థులు దరఖాస్తులు సమర్పించేందుకు ఇస్రో 'జిగ్యాస' https://jigyasa.iirs.gov.in/yuvika పోర్టల్ నిర్వహిస్తోంది. లేదా https://www.isro.gov.in/ నుంచి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ విధానం:

  • విద్యార్థులు ముందుగా జిగ్యాస వెబ్​సైట్​లోకి వెళ్లి పేరు, ఈ-మెయిల్ ఐడీతో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ ఈ-మెయిల్​కు లింక్​ వస్తుంది. దానిపై లింక్​ పై క్లిక్ చేసి వెరిఫై చేసుకోవాలి.
  • లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు ఆన్​లైన్ క్విజ్​లో పాల్గొనాలి. ఇది ఒక్కసారి మాత్రమే రాసే అవకాశం ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కులకు సెలక్షన్​లో 10% వెయిటేజీ ఉంటుంది.
  • క్విజ్ పూర్తి అయ్యాక, మీ వ్యక్తిగత వివరాలు, చదువుకు సంబంధించిన వివరాలను ఆన్​లైన్ ఫామ్​లో నమోదు చేయాలి.
  • మీ అర్హతను నిర్ధారించే సర్టిఫికెట్లను స్కాన్ చేసి అప్​లోడ్ చేయాలి.
  • మీరు పంచాయతీ పరిధిలోని పాఠశాలలో చదువుతున్నట్లు అయితే, దానికి సంబంధించిన సర్టిఫికెట్ పై ప్రధానోపాధ్యాయుడు లేదా సంబంధిత అధికారి సంతకంతో అప్​లోడ్ చేయాలి. దీని వల్ల 15 శాతం అదనపు వెయిటేజీ లభిస్తుంది.
  • అన్ని వివరాలు సరి చూసుకున్న తర్వాత దరఖాస్తును సబ్మిట్ చేయాలి. ఆ కాపీని డౌన్లోడ్ చేసుకుని భద్రపరచుకోండి.
  • 8వ తరగతిలో పొందిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఉంటుంది. గత 3 ఏళ్లలో పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏదైనా సైన్స్ ప్రతిభ పరీక్షలు, వైజ్ఞానిక ప్రదర్శన, ఒలంపియాడ్​లో పాల్గొని ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వారికి 10% వరకు వెయిటేజీ ఇవ్వనున్నారు.
  • రిజిస్టర్డ్ క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలు, అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన విద్యార్థులకు 5% వెయిటేజీ ఇస్తారు.
  • ఎన్​సీసీ, స్కౌట్, ఎన్​ఎస్​ఎస్​ల్లో సభ్యులుగా ఉన్న వారికి 5% వరకు వెయిటేజీ కేటాయిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లో 2 కేంద్రాలు: ఇస్రో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ఎంపికైన విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న 7 ఇస్రో కేంద్రాల్లో ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, హైదరాబాద్​లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఉన్నాయి. మిగతా కేంద్రాలు బెంగళూరు, తిరువనంతపురం, దెహ్రాదూన్, అహ్మదాబాద్, షిల్లాంగ్​ల్లో ఉన్నాయి.

ఖర్చులు అవసరం లేదు: యువిక 2026కు ఎంపిక అయిన విద్యార్థులకు అయ్యే ఖర్చు మొత్తం ఇస్రోనే భరించనుంది.

  • కోర్సు మెటీరియల్, వసతి, భోజనం ఉచితం
  • ప్రయాణ ఖర్చులు ఏసీ బస్సు ఛార్జీలు లేదా రైలు విద్యార్థికి తిరిగి చెల్లిస్తారు.

ముఖ్యమైన తేదీలు ఇవే:

రిజిస్ట్రేషన్లు ప్రారంభం: ఫిబ్రవరి

రిజిస్ట్రేషన్లకు చివరి తేదీ: మార్చి 31

మొదటి ఎంపిక జాబితా విడుదల: ఏప్రిల్ 13

ఖాళీల ఆధారంగా రెండో జాబితా: ఏప్రిల్ 20

యువిక శిక్షణ: మే 11 నుంచి 22 వరకు

‘అగ్నివీర్‌’ నియామకాలకు దరఖాస్తుల ఆహ్వానం - ఆ రోజే చివరి తేదీ

యాపిల్ స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్ 2026 షురూ- విద్యార్థులకు బంగారం లాంటి అవకాశం!