ETV Bharat / state

చంద్రంపాలెం హైస్కూల్​లో అంతర్జాతీయ స్థాయిలో గ్రౌండ్‌ - ప్రారంభించనున్న మంత్రి లోకేశ్‌

మంత్రి నారా లోకేశ్‌ చొరవతో సరికొత్త హంగులు - అత్యాధునిక సౌకర్యాలతో క్రీడా ప్రాంగణం నిర్మాణం - కూటమి ప్రభుత్వం, దివీస్‌ సంస్థ చొరవతో సౌకర్యాలు

సంవత్సర కాలంలో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా మారిన చంద్రంపాలెం హైస్కూల్​
సంవత్సర కాలంలో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా మారిన చంద్రంపాలెం హైస్కూల్​ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 21, 2026 at 5:01 PM IST

2 Min Read
Choose ETV Bharat

International Level Facilities in Chandrampalem Zilla Parishad High School: ఒకప్పుడు తల్లిదండ్రుల తొలి ఎంపికగా ఉన్న ప్రైవేట్‌ పాఠశాలల స్థానంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు వచ్చి చేరుతున్నాయి. తరగతి గదుల ఆధునికీకరణ నుంచి విద్యా ప్రమాణాల పెంపు వరకు ప్రభుత్వం చేపట్టిన చర్యలు సర్కారు బడులపై వారికి భరోసానిస్తున్నాయి. మెరుగైన మౌలిక వసతులు, నాణ్యమైన బోధన, సాంకేతిక ఆధారిత విద్యతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ ఇకపై ప్రైవేట్‌కు తామేం తక్కువ కాదని ప్రభుత్వ పాఠశాలలు చాటి చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తుంది చంద్రంపాలెం ఉన్నత పాఠశాల.

రేపే ప్రారంభం: 2900 మంది ఉన్న ప్రభుత్వ పాఠశాల వర్షం పడితే నీట మునిగి, అడుగుపెట్టేందుకు వీలులేకుండా ఉండేది. ఏడాది క్రితం విశాఖ మధురవాడ పరిధిలోని చంద్రంపాలెం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల దుస్థితిపై మంత్రి నారా లోకేశ్‌ చొరవ చూపించారు. ఈ సంవత్సర కాలంలో సరికొత్త హంగులతో సర్వాంగ సుందరంగా మారింది. దివీస్ యాజమాన్యం​ కోట్లాది రూపాయలు వెచ్చించి పాఠశాలను అభివృద్ది చేసింది. ప్రస్తుతం ఈ బడి ప్రైవేటు పాఠశాలకు తీసిపోని విధంగా తయారైంది. డిజిటల్ ప్యానెళ్ల ద్వారా విద్యార్థులకు బోధన, ల్యాబ్‌ సౌకర్యాలు, విద్యార్థులకు క్రీడల కోసం అంతర్జాతీయ స్థాయిలో గ్రౌండ్‌ను తీర్చిదిద్దారు. రేపు మంత్రి లోకేశ్‌ చేతుల మీదుగా ప్రారంభం కానుంది.

చంద్రంపాలెం హైస్కూల్​లో అంతర్జాతీయ స్థాయిలో గ్రౌండ్‌ - ప్రారంభించనున్న మంత్రి లోకేశ్‌ (ETV Bharat)

'రాష్ట్రంలోనే అత్యధిక విద్యార్థులతో విశాఖ జిల్లా చంద్రంపాలెం ఉన్నత పాఠశాల ముందు వరుసలో నిలుస్తోంది. ట్రిపుల్‌ ఐటీలో సీట్లు సాధించడమే లక్ష్యంగా ఇక్కడ బోధన సాగుతుండటంతో ప్రవేశాలకు విపరీతమైన డిమాండ్​ ఉంది. ఈ సంవత్సరం కొత్తగా 400 మంది చేరగా విద్యార్థుల సంఖ్య 2,900కు పెరిగింది. మొత్తం 104 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు.' -పాఠశాల సిబ్బంది

62 తరగతి గదుల్లో ఐఎఫ్‌పీలతో డిజిటల్‌ బోధన, అధునాతన గ్రంథాలయం, నిపుణులతో వ్యక్తిత్వ వికాస శిక్షణ అందిస్తున్నారు. క్విజ్, వ్యాసరచన, వక్తృత్వం, భగవద్గీత పోటీలు నిర్వహించి ప్రోత్సహిస్తున్నారు. జాతీయ ప్రతిభా ఉపకార వేతనం పరీక్షతో పాటు ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, నేవీ, భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్, గ్రీన్‌కోర్‌లో తర్ఫీదు ఇస్తున్నారు. ఏఐ ల్యాబ్‌లో రోబోటిక్స్, కంప్యూటర్‌ పరిజ్ఞానం, కోడింగ్‌లో మెలకువలు, స్టెమ్‌టూల్స్, సెన్సర్ల వంటి వాటిపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తూ సాంకేతిక విద్యకు పెద్దపీట వేస్తున్నారు. ఇప్పటివరకు నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్‌ ఐటీలకు 27 మంది విద్యార్థులు ఎంపికయ్యారు.

బడి కోసం గురువు తపన - తన జీతంతో పాఠశాల రూపురేఖలు మార్చేసిన హెచ్​ఎం

సర్కారీ బడులకు సంస్కరణల కళ - మారుతున్న పరిస్థితి, పెరుగుతున్న అడ్మిషన్లు