విశాఖలోని ఐఎఫ్‌ఆర్‌లో భారత బాహుబలి 'ఐఎన్‌ఎస్ విక్రాంత్'
ఐఎఫ్‌ఆర్‌లో ప్రత్యేక ఆకర్షణగా విమాన వాహక నౌక 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' - ఒకేసారి యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం - నౌక లోపలి డెక్‌లో మిసైల్స్‌తో మిగ్ విమానం

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 20, 2026 at 1:12 PM IST
INS Vikrant Special Attraction at The IFR: విశాఖ తీరంలో జరిగిన అంతర్జాతీయ ఫ్లీట్ రివ్యూలో విమాన వాహక నౌక 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత బాహుబలిగా పేరుగాంచిన 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' తీరంలో సందడి చేసింది. దీని ప్రత్యేకతలను నౌకాదళ అధికారులు విశదీకరించారు. నౌకాదళ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' లోపల గొప్ప ఆయుధ సంపత్తి ఉంటుంది. అంతే కాకుండా విమానాలు భద్రపరిచేందుకు అవసరమయ్యే డెక్‌లు ఉంటాయి. ఇది హెలికాప్టర్లను మోసుకెళ్లే సామర్థ్యం కలిగి ఉంటుంది. యుద్ధసమయాల్లో ఐఎన్‌ఎస్ ఎంతో క్రియాశీలకంగా వ్యవహరిస్తుందని అధికారులు తెలిపారు. మిసైల్స్‌తో శత్రువులపై దాడికి దిగుతుంది కూడా. విమాన వాహక నౌక 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' కమిషన్ 2022లో అయ్యింది. ఆ తర్వాత మొదటి ప్రయోగాత్మక పరీక్షలు నిర్వహించి 2021లో దీన్ని అధికారికంగా నౌకాదళానికి అంకితం చేశారు.
'ఐఎన్‌ఎస్ విక్రాంత్' ఓ అద్భుతం
- 3 సంవత్సరాల క్రితం 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' నౌకాదళంలో చేరింది.
- సాగర జలాల్లో ఉండే వ్యూహాత్మక ప్రాంతాల్లో సురక్షితంగా ఉండటంలో ఇది అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది.
- ఒకేసారి రన్ వేపై అత్యంత వేగంగా వచ్చే జెట్ సహా యుద్ధ విమానాలు నిర్ణీత స్థానంలో నిలిచే వ్యవస్థ ఇక్కడ అందుబాటులో ఉంది.
- ఈ రన్‌వే విస్తీర్ణం 2 చిన్నస్వామి క్రికెట్ స్టేడియాలను కలిపినంత విశాలంగా ఉంటుంది.
- గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- రాత్రి- పగలూ తేడా లేకుండా యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేయడం 'ఐఎన్‌ఎస్ విక్రాంత్' ప్రత్యేకత అని చెప్తారు అధికారులు.
- యుద్ధవిమానాల సంఖ్య తగ్గించిన అనంతరం చేతక్ హెలికాప్టర్లతో విన్యాసాలు చేస్తారు.
- ఒకవేళ విమానాలతో విన్యాసాలు చేయాల్సిన పరిస్థితులు వస్తే హెలికాప్టర్ల సంఖ్య తక్కువగా ఉండేలా చూస్తారు
- ఒకేసారి 10 మిగ్ విమానాలను ఐఎన్‌ఎస్ విక్రాంత్ రన్‌వేపైన నిలిపి ఉంచవచ్చు.
- ఎంత వేగంగా వచ్చే జెట్ విమానాలు అయినా రన్ వేపై నిర్ణీత స్థానంలో నిలిచే వ్యవస్థ దీనిపై ఉంది.
- నిరంతరం ధ్రువ్, మిగ్ 29కే, లైట్ ఎయిర్‌క్రాఫ్ట్స్, చేతక్, సీకింగ్, కమోవ్ హెలికాప్టర్లు విన్యాసాలు చేస్తూ ఉంటాయి.
- విమానం ల్యాండ్ అయ్యేవరకు నౌక కింది నుంచి 10 డెక్‌లు, ఆ పైన 8 ఉంటాయి.
ఐఎన్‌ఎస్ మరిన్ని ప్రత్యేకతలు ఇవే
| ఔరా ఐఎన్‌ఎస్ విక్రాంత్ | |
|---|---|
| నౌక | ఐఎన్‌ఎస్ విక్రాంత్ |
| నిర్మాణ సంస్థ | కొచ్చిన్ షిప్‌యార్డు |
| నిర్మాణ వ్యయం | రూ.23వేల కోట్లు |
| పొడవు | 262.5 మీటర్లు |
| ఎత్తు | 59 మీటర్లు |
| లోతు | 25.6 మీటర్లు |
| డెక్‌లు | 18 |
| కంపార్టుమెంట్లు | 2,278 |
| లోపలున్న నిచ్చెనలు | 684 |
| గంటకు ప్రయాణించే దూరం | 60 కిలోమీటర్లు |
| ఒకసారి ఇంధనం నింపితే వెళ్లే దూరం | 7,500 నాటికల్ మైళ్లు |
| పరిమిత టేకాఫ్ దూరం | 144 మీటర్లు |
| లాంగ్ టేకాఫ్ దూరం | 203.7 మీటర్లు |
| ల్యాండింగ్ రన్ వే | 191 మీటర్లు |
| సిబ్బంది | 1,700 |
| రోజుకు అవసరమైన పాలు | 500 లీటర్లు |
| గంటకు యంత్రాలతో చేసే చపాతీలు | 2500 |
| శస్త్రచికిత్స గదులు | 2 |
| సీటీ, అల్ట్రాసౌండ్ స్కానర్లు | 2 |
| డిజిటల్ ఎక్స్‌రే | 1 |
| డెంటల్ ఆసుపత్రి | 1 |
| ఐసీయూ | 1 |
| వార్డులు | 4 |
74 దేశాల భాగస్వామ్యంతో మిలన్-2026 - రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సూచనలు
విశాఖలో ఘనంగా ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ - గగనతలంలో సందడి చేసిన హెలికాప్టర్లు, విమానాలు

