ఫోన్ అధికంగా వాడుతున్నారా? - స్క్రీన్ టైమ్ అంతకుమించితే నిద్రలేమి సమస్యలు
రోజుకు సుమారు 6 గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్ టైమ్ - నాణ్యమైన నిద్రను కోల్పోతున్న భారతీయలు - వెల్లడించింన హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ తాజా సర్వే- ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా నివేదిక

Published : March 15, 2026 at 5:07 PM IST
Quality Sleep Is Missing In India : మనిషి సాంకేతికతను అభివృద్ధి చేయటానికి ఎంతో కృషి చేశాడు. ఫలితంగా ప్రతి ఒక్కరం దీనికి సంబంధించిన అభివృద్ధి ఫలాలను నేడు ఆస్వాదిస్తున్నాం. అయితే ఇదే సాంకేతికత నేడు మానవ జీవితంలో ఒక భాగమైపోయింది. వేరు చేయలేనంతలా మనలో కలిసిపోయింది. వీటిలో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి.
ఈ సాంకేతక విప్లవం పనులను సులువు చేస్తున్నప్పటికీ మన నుంచి ప్రశాంమైన నిద్రను దూరం చేస్తోంది. అయితే ఇలా టీవీలు, ఫోన్ల స్క్రీన్లకు గంటల తరబడి అతుక్కుపోవడం వల్ల భారతీయులు నాణ్యమైన నిద్రను కోల్పోతున్నారని హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ తాజా సర్వే తెలిపింది. ప్రపంచ నిద్ర దినోత్సవం సందర్భంగా ఈ నివేదికను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా సాఫ్ట్వేర్ ఉద్యోగులు, వైద్యులు, విద్యార్థులు, సహా 550 మందికి పైగా వ్యక్తులపై ఈ సర్వే నిర్వహించారు. దీనిలో ఆందోళనకర విషయాలు వెలుగులోనికి వచ్చాయి. వివరాల్లోకి వెళితే,
25 నుంచి 44 ఏళ్ల వయసున్న వారిలో : దేశంలో స్మార్ట్ఫోన్ల వినియోగం అధికంగా ఉంది. అనేక మంది రోజుకు సుమారు 6 గంటల కంటే ఎక్కువ సమయం వీటి తోనే గడుపుతున్నారు. ఈ రకంగా స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లతో గడిపే వారిలో ఈ నిద్రలేమి సమస్య 80 శాతం అధికంగా వెంటాడుతోందని ఈ సర్వేలో వెల్లడైంది. నిత్యం ఏఐ టూల్స్ వినియోగించే వారిలో పగలు అలసట, నిద్ర మత్తు ఎక్కువగా కనిపిస్తోందని తెలిపింది. ప్రధానంగా 25 నుంచి 44 సంవత్సరాల వయస్సు గల వారు అధికంగా ఏఐను వినియోగిస్తున్నారని, వారిలోనే ఈ సమస్య అధికంగా ఉందని తేలింది. అయితే ఆశ్చర్యకరంగా 65 సంవత్సరాలు పైబడిన వారు డిజిటల్ సాధనాలు వాడుతున్నా, ప్రశాంతంగా నిద్రపోతున్నారని వెల్లడించింది.
ధ్యానం చేయాలి : అనేక మంది తక్కువ నిద్రపోవడాన్ని తమ బిజీ లైఫ్‌లో ఓ భాగమని భావిస్తున్నారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ సర్వేలో 90 శాతం మంది నిద్ర కోసం మందులు వాడకపోవడం శుభపరిణామం అయినప్పటికీ, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరమని డాక్టర్ జయరామ్ తిమ్మపురం తెలిపారు.
అనేక మంది తక్కువ నిద్రపోవడాన్ని తమ బిజీ లైఫ్‌లో ఓ భాగమని భావిస్తున్నారు. అయితే ఇది అత్యంత ప్రమాదకరం. అయితే ఈ సర్వేలో 90 శాతం మంది నిద్రకోసం మందులు వాడకపోవడం శుభపరిణామం. అయితే అవసరాలకు అనుగుణంగా తమ జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అత్యవసరం. - డాక్టర్ జయరామ్ తిమ్మపురం
నిద్ర ఓ పవిత్ర అవకాశం : నిద్ర అనేది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. ఇది మనస్సును, హృదయాన్ని రీఛార్జ్ చేసే పవిత్ర సమయమని నిపుణులు పేర్కొంటున్నారు. మనిషికి సాంకేతికత అవసరమే అయినప్పటికీ ప్రకృతి సిద్ధమైన జీవన గడియారాన్ని అది దెబ్బ తీయకూడదన్నారు. నిద్రకు ముందు కాసేపు ధ్యానం చేస్తే నిజమైన ఉత్పాదకత దొరుకుతుందని, నాణ్యమైన నిద్ర లభిస్తుందని వెల్లడించారు.
"నిద్ర అనేది కేవలం శారీరక ప్రక్రియ మాత్రమే కాదు. ఇది మనస్సును, హృదయాన్ని రీఛార్జ్ చేసే పవిత్ర సమయం. మనిషికి సాంకేతికత అవసరమే అయినప్పటికీ ప్రకృతి సిద్ధమైన జీవన గడియారాన్ని అది దెబ్బతీయకూడదు. నిద్రకు ముందు కాసేపు ధ్యానం చేస్తే నిజమైన ఉత్పాదకత దొరుకుతుంది." - కమలేశ్ డి. పటేల్ (దాజీ)
పిల్లలో ఈ జాగ్రత్తలు వహించండి : ఈ అంశాలను దృష్టలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు ప్రయత్నించాలి. పిల్లల్లో ఫోన్ వినియోగాన్ని తగ్గించడంలో కృషి చేయాలి. వారికి ఫోన్లో కాకుండా బయట ఆటలపై ఆసక్తిని పెంపొందేలా వారి దృష్టిని మరల్చాలి. అధికంగా అలవాటు కలిగిన వారికి విడతల వారీగా వారానికి గంట చొప్పున తగ్గిస్తూ ఫోన్ వ్యసనం నుంచి బయటకు రప్పించే ప్రయత్నం చేయాలి.
రాత్రిళ్లు ఫోన్ వాడకాన్ని తగ్గించే 7 చిట్కాలు.. ఇలా చేస్తే హాయిగా నిద్రపోవచ్చు!

