ETV Bharat / state

రైల్వే ప్రయాణికులకు బంపర్​ ఆఫర్ - ఒకే టికెట్​తో వేర్వేరు తీర్థయాత్రలు - అదీ 25 శాతం తక్కువ ఛార్జీలకే

సాధారణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువకే - తీర్థయాత్రలు వెళ్లేవారికి రైల్వే విభాగం సర్క్యులేటింగ్​ జర్నీ టికెట్​ సదుపాయం - ఆ సర్క్యులేటింగ్​​ ప్రయాణాలు ఇవే!

Circular Journey Ticket for Visit for Pilgrims
Circular Journey Ticket for Visit for Pilgrims (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : February 28, 2026 at 12:47 PM IST

3 Min Read
Choose ETV Bharat

Circular Journey Ticket for Visit for Pilgrims : హైదరాబాద్​ నుంచి ఆధ్యాత్మిక ప్రదేశాలు, తీర్థయాత్రలు వెళ్లి రావాలనుకునే వారికి రైల్వే విభాగం సర్క్యులేటింగ్​ జర్నీ టికెట్​ సదుపాయం కల్పిస్తోంది. అయితే ఈ టికెట్​ సాధారణ ప్రయాణ ఛార్జీలతో పోల్చితే 25 శాతం తక్కువ ఖర్చుతో అనేక ప్రదేశాలను సందర్శించవచ్చు. కాచిగూడ, సికింద్రాబాద్​, నాంపల్లి స్టేషన్ల నుంచి మొత్తం 19 యాత్రలు అందుబాటులో ఉన్నాయి.

ఆ సర్క్యులేటింగ్​ ప్రయాణాలు ఇవే! :

  • కాచిగూడ - ఔరంగాబాద్​ - ఉజ్జయినీ - భద్రాచలం రోడ్​ - తిరుపతి - చెన్నై సెంట్రల్​ - బెంగళూరు సిటీ - మైసూర్​ - హుబ్లీ - సికింద్రాబాద్​
  • మంత్రాలయం - తిరుపతి - బెంగళూరు సిటీ - చెన్నై సెంట్రల్​ - భద్రాచలం - నాంపల్లి హైదరాబాద్​
  • భద్రాచలం రోడ్​ - హైదరాబాద్​ - ముంబయి - పూరి - వారణాసి - ఫైజాబాద్​- హౌరా - రిషికేష్​ - దిల్లీ
  • సికింద్రాబాద్​ - బీజాపూర్​ - కొల్హాపూర్​ - వాస్కోడిగామా - మైసూరు - తిరుపతి - చెన్నై సెంట్రల్​ - భద్రాచలం రోడ్​ - హైదరాబాద్​

వీటితో పాటు మరో పదిహేను ప్రయాణాలకు ఈ సదుపాయం ఉంది. వివరాలకు ఇండియన్​ రైల్వే వెబ్​సైట్​ను సందర్శించవచ్చు.

నిబంధనలు ఏంటంటే :

  • ఒక టికెట్​లో గరిష్ఠంగా 8 బ్రేక్​ ప్రయాణాలు చేయడానికి అనుమతి 56 రోజుల వరకు గడువు ఉంటుంది. (అయితే ఇది ప్రయాణ దూరానికి తగ్గినట్టుగా మారుతుంది)
  • వృద్ధులకు అదనపు రాయితీలు (పురుషులకు 40 శాతం, మహిళలకు 50 శాతం) ఉంటుంది.
  • వేర్వేరు రైళ్లు మారొచ్చు.

ఎలా బుక్​ చేసుకోవాలంటే :

  • ముందుగా సిక్రింద్రాబాద్​, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లలో డివిజనల్​ కమర్షియల్​ మేనేజర్​ లేదా చీఫ్​ రిజర్వేషన్​ సూపర్​వైజర్​ ఆఫీస్​కి వెళ్లి సంప్రదించాలి.
  • ఎంపిక చేసిన ప్రయాణానికి వాటికి సంబంధించి ఛార్జీలు లెక్కించి ఫారం అందిస్తారు.
  • ఆ ఫారం​తో బుకింగ్​ కౌంటర్​లో టికెట్​ తీసుకోవచ్చు.
  • టికెట్​ తీసుకున్న తర్వాత విడివిడిగా రిజర్వేషన్​ చేయించుకోవాలి.
  • అలా చేస్తే రిజర్వేషన్​ నిబంధనల ప్రకారమే బెర్త్​ వస్తుంది.
  • అలా కాకపోతే ఆర్​ఏసీ లేదా అన్​రిజర్వ్​డ్​ కోచ్​లో ప్రయాణం చేయొచ్చు.
  • 60 రోజుల ముందుగా, నాన్​ సీజన్​ సమయంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.

అమృత్‌ భారత్‌ 2.0 ఎక్స్‌ప్రెస్‌లో ఆ టికెట్లు ఉండవు : చర్లపల్లి తిరువనంతపురం అమృత్​ భారత్​ 2.0 ఎక్స్​ప్రెస్​లో పలు ప్రత్యేకతలు కలగనున్నాయి. సాధారణంగా సూపర్​ఫాస్ట్​ ఎక్స్​ప్రెస్​, ఎక్స్​ప్రెస్​ రైళ్లలో రిజర్వేషన్​ టికెట్​ అయిపోయాక కూడా ఆర్​ఏసీ టికెట్లు, ఆ తర్వాత వెయిటింగ్​ లిస్ట్​ టికెట్​ ఇస్తారు. కానీ అమృత్ భారత్​లో ఆర్​ఏసీ టికెట్లు ఉండవని రైల్వే బోర్డు ఇటీవల తెలిపింది. అంటే ఇందులో బెర్తుల వరకే టికెట్లు ఇస్తారు. కానీ వెయిటింగ్​ లిస్టు ప్రయాణికులు రిజర్వేషన్​ ఉన్న వారిని పక్కన కూర్చుని ఇబ్బంది పెట్టే ఛాన్స్​ ఉండదు.

సామాన్య ప్రయాణికులకు ప్రయోజనకరం : అమృత్‌ భారత్‌లో ట్రైన్​లో ఏసీ కోచ్‌లు ఉండవు. కేవలం అందులో జనరల్​, స్లీపర్​ బోగిలు మాత్రమే ఉంటాయి. ఇలా ఉండటం వల్ల సామాన్య ప్రయాణికులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మొత్తం 11 జనరల్​ సెకండ్​ క్లాస్​, 2 సెకండ్​ క్లాస్​ కోచ్​లు, 8 స్లీపర్​ కోచ్​లు, అలాగే దివ్యాంగుల ఫ్రెండ్లీ, 1 ప్యాంట్రీ కార్​ ఉంటాయి. ఇది జనవరి 27వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చింది. అయితే అమృత్​ భారత్​ ఛార్జీలే అమృత్​ భారత్​ 2.0 రైల్లోనూ అందుబాటులో ఉంటాయని రైల్వే శాఖ స్పష్టం చేసింది.

తీర్థయాత్రలు ఎందుకు చేయాలి? ఎవరు చేయాలి? ఫుల్ క్లారిటీ ఇదిగో!

సర్వ పాపాలను పోగొట్టే మహిమాన్విత దివ్యక్షేత్రం! కపిల తీర్థం దర్శిస్తే సకల దుఃఖాలు దూరం!!