ETV Bharat / state

కొలువుల నిలయంగా ఐఐటీ హైదరాబాద్​ - ఇక్కడి విద్యార్థులు జాబ్​ కొట్టడానికి అదొక్కటే కారణం

విద్యార్థులను నూతన ఆవిష్కరణలు చేపట్టేలా ప్రోత్సహిస్తున్న ఐఐటీ హైదరాబాద్‌ - డిసెంబర్‌లో ప్లేస్‌మెంట్‌ 62 శాతానికి పైగా ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు - దివ్యాంగుల కోసం ప్రత్యేక సంస్థ

IIT Hyderabad Students New Innovations
IIT Hyderabad Students New Innovations (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 8:36 AM IST

3 Min Read
Choose ETV Bharat

IIT Hyderabad Students New Innovations : ఐఐటీ హైదరాబాద్‌ విద్యార్థుల భవిష్యత్‌కు ఆశా జ్యోతిగా మారింది. విద్యార్థులను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి దేశంలో ఏ ఐఐటీలో లేని విధంగా వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నారు. సంస్థలో చేరిన నాటి నుంచే విద్యార్థులు పరిశోధనలు, ఆవిష్కరణలపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించేలా తర్ఫీదునిస్తున్నారు. తమ ఉద్దేశం విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌లు కల్పించడం కాదని వారే ఉద్యోగాలు ఇచ్చేలా ఇక్కడ బోధనలు జరుగుతున్నాయి.

ఐఐటీహెచ్‌లో శారీరవైకల్యంతో బాధపడే విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించారు. ముఖ్యంగా గ్రంథాలయంలో దివ్యాంగులైన విద్యార్థులకు ప్రత్యేక వసతులు అందుబాటులోకి తెచ్చారు. దీంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సంస్థలో సెంటర్ ఫర్ అసిస్టెంట్ టెక్నాలజీస్ పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. త్వరలోనే దీనిని ప్రారంభించనున్నారు.

కొలువుల నిలయంగా ఐఐటీ హైదరాబాద్​ - ఇక్కడి విద్యార్థులు జాబ్​ కొట్టడానికి అదొక్కటే కారణం (ETV)

భారతి పేరిట ప్రత్యేక కార్యాక్రమం : విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు గతేడాది ఆగస్టులో సరికొత్తగా "భారతి" పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఐఐటీ హైదరాబాద్​ డైరెక్టర్‌ బీఎస్‌ మూర్తి తెలిపారు. మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ కోర్స్‌ చదువుతున్న 600 మందిని గుర్తించి వారిని 100 గ్రూపులుగా విభజించి పరిశోధనలతో పాటు ఆవిష్కరణలు చేపట్టేలా శిక్షణ కార్యక్రమాలు చేపట్టామన్నారు. వీరిలో సృజనాత్మకతను పెంపొందించేలా వర్క్‌షాప్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఇందులోని పలువురు విద్యార్థులు ఇటీవల నిర్వహించిన ఇన్నోవేషన్​ డేలో తమ ఆలోచనల ఆధారంగా పలు ఆవిష్కరణలకు సంబంధించిన ప్రదర్శనలు చేపట్టినట్లు తెలిపారు.

''మొదటి సంవత్సరం విద్యార్థుల కోసం వారు ఏదో ఒకటి ఆవిష్కరణ చేయాలి. విద్యార్థులు విభిన్నమైన దానిపైనే దృష్టి పెట్టండి. ఆ దాన్ని కొనసాగించడానికి, మీకు ఎంత కావాలంటే అంత నేను ఇస్తాను. మూడు నెలల క్రితం ఒక విద్యార్థి వచ్చి నేను కొత్తగా ఏదైనా కనుగొనాలని అనుకుంటున్నాను. నాకు డబ్బు కావాలి అని అడిగాడు. సరే అని ఇచ్చేశాను. ఈ విధంగా మేము విద్యార్థులకు మద్దతు ఇస్తున్నాము. ఇది ఇలా ఉండగా 3-4 సంవత్సరంలో చదువుతున్న విద్యార్థులు విద్యను పూర్తి చేయడానికి 30-40 మంది విద్యార్థులు తిరిగి వస్తున్నారు. మీకు కావాలంటే మీరు కూడా అలా చేయవచ్చు. కానీ మీరు రావాల్సిన అవసరం లేదు. మీ స్టార్ట్​ప్స్​తో మేము చాలా సంతృప్తిగా ఉన్నాము.'' - ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి, డైరెక్టర్‌ ఐఐటీహెచ్‌

క్రెడిట్ స్కోర్​తో ఇంటర్న్‌షిప్‌ ప్రోగ్రాం : దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఐఐటీలతో పాటు ఇతర ఇంజినీరింగ్ కళాశాలలు, ప్రైవేటు యూనివర్సిటీలు ప్లేస్​మెంట్స్​ కోసం జాబ్‌ మేళాలు నిర్వహిస్తుంటాయి. తాము మాత్రం క్రెడిట్ స్కోర్​తో ఇంటర్న్‌షిప్‌ ప్రొగ్రాం నిర్వహిస్తున్నామని ఐఐటీ డైరెక్టర్‌ తెలిపారు. దీంతో దేశ విదేశాలకు చెందిన సంస్థలు తమ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు కల్పిస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ ఇంటర్న్‌షిప్‌ను విద్యార్థులు తేలికగా తీసుకోవద్దనే ఉద్దేశంతో క్రెడిట్ స్కోర్ సౌకర్యం కల్పించామన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగానే ఐఐటీహెచ్ విద్యార్థికి నెదర్లాండ్ కు చెందిన సంస్థ భారీ ప్యాకేజీతో జాబ్ ఆఫర్ ఇచ్చిందన్నారు. ఐఐటీ హైదరాబాద్​ విద్యార్థులను పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేపట్టేదిశగా ప్రోత్సహిస్తూ ఉన్నత స్థానాలకు చేర్చుతుంది.

''ఇక్కడ ట్రైనింగ్స్​, ప్లేస్​మెంట్స్​తో ఐఐటీ హైదరాబాద్​ కౌన్సెలింగ్​ ఆఫీస్​గా మారింది. ఐఐటీలో మా ఉద్యోగం వచ్చేసి ప్రపంచానికి అవసరమయ్యే విధంగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం. అమెరికాలో ఏ యూనివర్సిటికి వెళ్లిన ప్లేస్​మెంట్స్​ ఉండవు. కానీ ఇక్కడ ఐఐటీ హైదరాబాద్​ చదివితే మాత్రం అన్ని అవకాశాలు మీకు అందుబాటులో ఉంటాయి. మేము చాలా రకాల జాబ్​ మేళలు నిర్వహించాము. ఇక్కడ ప్రతి ఏడాది జాబ్​ మేళాలు నిర్వహిస్తాము. దాదాపు 25 కంపెనీలు వస్తాయి.'' - ప్రొఫెసర్‌ బి.ఎస్‌.మూర్తి, డైరెక్టర్‌ ఐఐటీహెచ్‌

విద్యార్థుల్లో ఎన్నో రకాల ఒత్తిళ్లు - అన్నింటినీ చిత్తు చేస్తున్న సన్​షైన్!

జాక్​పాట్​ కొట్టిన ఐఐటీ హైదరాబాద్​ విద్యార్థి - రూ.2.5 కోట్ల వేతనంతో జాబ్​ ఆఫర్​