అత్యాచారం కేసులో సీఐ చిన్నమల్లయ్య - డిస్మిస్ చేసిన ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి
సీఐ చిన్నమల్లయ్యను ఉద్యోగం నుంచి డిస్మిస్ - శాశ్వతంగా తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు - చిన్నమల్లయ్య అత్యాచారం చేశాడని వినుకొండలో మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 3, 2026 at 10:23 PM IST
|Updated : June 3, 2026 at 10:36 PM IST
IG Dismisses CI Chinnamallaiah In Rape Case In Palnadu District: పల్నాడు జిల్లా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లిలో ఒంటరి మహిళపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సీఐ చిన్నమల్లయ్య డిస్మిస్ అయ్యారు. చిన్న మల్లయ్యని శాశ్వతంగా ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు. సీఐ చిన్నమల్లయ్య అత్యాచారం చేశారని వినుకొండ పోలీసు స్టేషన్లో ఏప్రిల్ 29న మహిళ ఫిర్యాదు చేశారు.
ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు: దాంతో మహిళ ఫిర్యాదు మేరకు అత్యాచారం కేసు నమోదైన తర్వాత చిన్నమల్లయ్య అజ్ఞాతంలోకి వెళ్లారు. అనంతరం ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు ఆపై సుప్రీం కోర్టుకు వెళ్లగా రెండు చోట్లా చుక్కెదురైంది. చిన్నమల్లయ్య బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు డిస్మిస్ చేసింది. నేరారోపణల తీవ్రత, బాధితురాలిని బెదిరించారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు, చిన్నమల్లయ్యకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దాంతో సీఐ చిన్నమల్లయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన జస్టిస్ విక్రమ్ నాథ్ , జస్టిస్ మోహన ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేశారు. చివరకు ముందస్తు బెయిల్ కోసం చిన్నమల్లయ్య దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేశారు.
కేసు నేపథ్యం: సీఐ బి. చిన్నమల్లయ్య తనపై అత్యాచారానికి పాల్పడ్డారని పల్నాడు జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా వినుకొండ పోలీసులు ఈ ఏడాది ఏప్రిల్ 29వ తేదీన సీఐ చిన్నమల్లయ్యపై కేసు నమోదు చేశారు. అనంతరం అరెస్టు భయంతో చిన్నమల్లయ్య హైకోర్టును ఆశ్రయించి ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరారు. దాంతో ఈ కేసులో ఇరుపక్షాల వాదనలు పూర్తయిన అనంతరం హైకోర్టు పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
అత్యాచార ఆరోపణల కేసు - సీఐ చిన్నమల్లయ్య బెయిల్ పిటిషన్ తిరస్కరించిన హైకోర్టు
వైఎస్సార్సీపీ అరాచకాలకు వత్తాసు - మరో ముగ్గురు పోలీసు అధికారులపై ఈసీ బదిలీ వేటు

