ETV Bharat / state

డిగ్రీతో కొలువుల పంట - కాస్త శ్రద్ధగా చదివితే భవిష్యత్తు బంగారు మయం!

డిగ్రీ అర్హతతోనే దేశంలో ఎన్నో ఉన్నత ఉద్యోగాలు - రాష్ట్రంలో గ్రూప్స్​ ఉద్యోగాలే నిదర్శనం - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే చాలు మంచి రంగాల్లో అవకాశాలు

Job Opportunities After Graduate Degree
Job Opportunities After Graduate Degree (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : November 8, 2025 at 3:19 PM IST

2 Min Read
Choose ETV Bharat

Job Opportunities After Graduate Degree : దేశంలో అత్యున్నత స్థాయి ఉద్యోగం ఏది సాధించాలన్నా దానికి గ్రాడ్యుయేషన్​ అవసరం. గ్రాడ్యుయేషన్​ అంటే అటు మూడేళ్ల డిగ్రీ అయినా, ఇటు నాలుగేళ్ల టెక్నికల్​ డిగ్రీ(బీటెక్​) అయినా ఫర్వాలేదు. కేవలం డిగ్రీ అర్హతతోనే కొన్ని ఉద్యోగాలు ఉంటాయి. వాటిలో కొలువు సాధిస్తే రూ.లక్షల్లో జీతంతో పాటు మంచి సదుపాయాలను పొందవచ్చు. అయితే ఇందుకు ఇంటర్​ లేదా డిప్లొమా నుంచే డిగ్రీ కోసం తగిన సాధన చేయవచ్చు.

డిగ్రీతోనే ఉన్నత ఉద్యోగాలు : డిగ్రీలో జాయిన్​ అయిన మొదటి లేదా రెండో ఏడాదిలోనే చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధిస్తున్నారు. దీంతో వారు మూడేళ్ల డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఈ విద్యార్హతతో ఉద్యోగంలో ప్రమోషన్​లు సాధించి, పై స్థాయి ఉద్యోగాలను సాధించవచ్చు. కానీ ఈ డిగ్రీ చదువుతున్న దశలోనే కాస్త శ్రద్ధ పెడితే ఉద్యోగ అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం ఇటీవలి కాలంలో గ్రూప్స్​ ఉద్యోగాలు సాధించిన వారే.

గత నెల వరకు మూడేళ్ల డిగ్రీ ప్రథమ సంవత్సర ప్రవేశాలు అనేవి కొనసాగిన విషయం తెలిసిందే. అందుకే ప్రాథమిక తరగతుల్లో డిగ్రీ విద్య ప్రాధాన్యం-భవిష్యత్తు అవకాశాలపై విస్తృతంగా అవగాహన అనేది కల్పిస్తున్నారు. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులైతే సివిల్స్​, గ్రూప్స్​నకు చక్కటి రూట్​ మ్యాప్​ అనేది సిద్ధం చేసుకోవచ్చు. కేవలం డిగ్రీ అర్హతతోనే యూపీఎస్సీ, యూనిఫాం సర్వీసులు, పోస్టల్​, ఆర్​ఆర్​బీ, బ్యాంకింగ్​, ఎస్​ఎస్​సీ, బోధన రంగాల్లో విశేష అవకాశాలు ఉన్నాయి.

కళాశాల స్థాయిలో తర్ఫీదు : సిద్దిపేట ఆటనామస్ కలిగిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఏడాదిలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో వందలాది మంది ఉద్యోగాలు సాధిస్తున్నారు. మరి కొంత మంది వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. కళాశాల స్థాయిలో తర్ఫీదు అందిస్తున్నారు. అలాగే ఇంటర్న్​షిప్​ సదుపాయం కల్పిస్తున్నారు. ప్రాజెక్టులు, కార్యశాల, క్షేత్రస్థాయి పర్యటనలు, సదస్సులు మార్గనిర్దేశనం చేస్తున్నాయి. ప్రాంగణ నియామకాలు చేపడుతున్నారు. కంపెనీలతో ఎంవోయూలు చేసుకుంటున్నారు. సర్టిఫికేట్​ కోర్సులతో నైపుణ్యాలు పెరుగుతున్నాయి. ఏడాదిలో ఉద్యోగాలు సాధించిన సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు 400 మంది ఉన్నారు.

''సిద్దిపేట మహిళా డిగ్రీ కళాశాలలో హెచ్​ఈపీ కోర్సు 2022లో పూర్తయింది. గ్రూప్స్​ ఉద్యోగ సాధన లక్ష్యంగా డిగ్రీలో చేరాను. చదువుతూనే పరీక్షలకు సన్నద్ధమయ్యాను. 2023లో గ్రూప్​-4 రాసి ఎంపికై సిద్దిపేట మున్సిపల్​ వార్డు అధికారిణిగా పది నెలలుగా కొనసాగుతున్నా. ఈ పరీక్షలకు డిగ్రీ పాఠ్యాంశాలు ఉద్యోగ సాధనకు ఉపయోగపడ్డాయి.'' - దాసరి రసజ్ఞ, నంగునూరు

సాధనకు ఉపయోగపడే అంశాలు ఇవే :

  • సబ్జెక్టులకు అనుగుణంగా ఎస్​సీఈఆర్టీ, ఎన్​సీఈఆర్టీ పాఠ్యపుస్తకాలు చదవాలి.
  • గ్రంథాలయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
  • హాజరుశాతం 80 శాతం పైగా ఉంటే అవకాశాలు మెండు.
  • సోషల్​ మీడియాలో మితిమీరి సమయం గడపవద్దు.
  • టీఎస్​కేసీ, టాస్క్​ అందించే శిక్షణలు వినియోగించుకోవాలి.

''సిద్దిపేట అటానమస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ (ఎంపీపీఎస్​) 2024లో పూర్తయింది. ఎన్​సీసీ-సీ సర్టిఫికేట్​ ఉపయోగపడింది. మొదట్లో నేవీలో ఎస్​ఎస్​ఆర్​ ఉద్యోగానికి ఎంపికవగా రిపోర్టు చేశాను. ఆ వెంటనే సెంట్రల్​ ఆర్ముడ్​ పోలీసు ఫోర్సెస్​లో ఎస్​ఎస్​సీ ద్వారా ఇండో టిబెటిన్​ బోర్డర్​ పోలీసుగా ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం తమిళనాడులో శిక్షణ పొందుతున్నా. నెల తర్వాత జమ్మూ కశ్మీరులో విధుల్లో చేరుతా.''- కె.స్వామి, కొడకండ్ల

అబ్దుల్​ కలాం స్ఫూర్తితో ప్రణాళిక సిద్ధం చేసుకొని - గ్రూప్​-1లో 25వ ర్యాంకు సాధించి డిప్యూటీ కలెక్టర్​గా!!

YUVA : మూడేళ్లలో రోజుకు 14 గంటల కఠోర శ్రమ - గ్రూప్​-1లో ఎంపీడీవోగా కొలువు