ETV Bharat / state

సౌదీలోని రియాద్​ విమానాశ్రయంపై దాడి - హైదరాబాద్​ వాసి యూసుఫ్​ అలీ మృతి

Hyderabad Man Died At Riyadh Airport రియాద్​ ఎయిర్​పోర్టుపైన దాడిలో హైదరాబాద్​ వాసి మృతిచెందారు. తీవ్రంగా గాయపడిన యూసఫ్​కు చికిత్స అందించినా, అనంతరం గుండెపోటుతో మరణించారు.

Yusuf Ali, who died in the Riyadh airport attacks
రియాద్​ విమానాశ్రయం దాడి మృతి చెందిన యూసుఫ్​ అలీ (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : October 12, 2026 at 11:45 AM IST

2 Min Read
Choose ETV Bharat

Hyderabad Man Died at Riyadh Airport : ఉద్యోగరిత్యా హైదరాబాద్​కు చెందిన యూసుఫ్​ సౌదీలో ఉంటున్నారు. భార్యాపిల్లల్ని చూసేందుకు ఈ నెల ఇంటికి వచ్చారు. మదినాను దర్శించుకోవాలనే ఉద్దేశంతో యూసుఫ్​ కుటుంబ సభ్యులను తీసుకుని సౌదీకి వెళ్లారు. ఇక్కడ వరకు అంతా బాగుంది. ఎప్పుడైతే వీరు మదినాకు వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చారో అప్పుడే అంతా తారుమారయ్యింది. విమానాశ్రయంలో ఆకస్మిక మిస్సైల్​ దాడి జరిగింది. దాంట్లో యూసుఫ్​తోపాటు కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఘటనలో యూసుఫ్​ తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఐటీ ఇంజినీర్​గా సౌదీలో ఉద్యోగం

మెహిదీపట్నానికి చెందిన మహ్మద్​ యూసుఫ్​ అలీ (45) పదేళ్ల క్రితం ఉద్యోగరీత్యా సౌదీకి వెళ్లారు. రియాద్​లో ఐటీ ఇంజినీర్​గా పని చేస్తున్నారు. యూసుఫ్​కు భార్య సమీరాతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు ఆమన్‌ బీటెక్‌ చదువుతుండగా చిన్న కుమారుడు వాసే ఖురాన్‌, కుమార్తె ఆరో తరగతి చదువుతోంది. వీరు రెండేళ్లుగా మెహిదీపట్నంలోనే నివాసం ఉంటున్నారు. ఏడాదికి ఒకసారి రియాద్‌ నుంచి వచ్చి వెళ్తుండేవాడు. అలా యూసుఫ్​ అలీ 15 రోజుల క్రితం సౌదీ నుంచి నగరానికి వచ్చారు.

విమానాశ్రయంలో ఆకస్మాత్తుగా దాడులు

కుటుంబంతో కొన్ని రోజులు గడిపాక ఈ నెల 2న భార్యాపిల్లల్ని తీసుకొని తిరిగి సౌదీకి వెళ్లిపోయారు. అక్కడ కుటుంబంతో కలిసి మదినాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. శనివారం వీరంతా విమానాశ్రయానికి చేరుకున్నారు. అకస్మాత్తుగా విమానాశ్రయంలో మిస్సైల్‌ దాడి జరిగింది. ఈ దాడిలో యూసుఫ్​ అలీ తీవ్రంగా గాయపడ్డారు. అయితే అతని భార్య, కుమార్తె ప్రమాదం నుంచి బయటపడ్డారు. పిల్లలు ఆమన్‌కు మోకాలికి గాయం కావడంతో శస్త్ర చికిత్స నిర్వహించారు. వాసే కాలివేళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. యూసుఫ్​ బంధువు అతియా సుల్తానా తలకు గాయమైంది. వీరందరినీ వెంటనే ఆస్పత్రికి తరలించారు.

తీవ్రమైన గుండెపోటుతో మృతి

వైద్యులు యూసుఫ్​కు శస్త్రచికిత్స చేసి రెండు కాళ్లను తొలగించారు. చికిత్స అనంతరం కోలుకుంటాడని భావించారు. కానీ ఆదివారం ఉదయం తీవ్రమైన గుండెపోటు రావటంతో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని రియాద్​లో ఉంటున్న యూసుఫ్​ బావమరిది ధ్రువీకరించారు. ప్రమాదంలో యూసుఫ్​తో పాటు గాయపడ్డ వారికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. యూసుఫ్​ మృతి పట్ల ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి అన్ని విధాలా ఆదుకునేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపినట్టు ఓవైసీ పేర్కొన్నారు. ఈ మేరకు అసదుద్దీన్‌ ఈ విషయాన్ని ఎక్స్‌లో పోస్టు చేశారు.

ఆ ఇంటి దీపాన్ని ఆర్పేసిన నవరాత్రులు! - చెరువులో పడి ఒకే కుటుంబంలోని ముగ్గురి మృతి

అమెరికాలో హైదరాబాద్ యువకుడి అనుమానాస్పద మృతి - కుటుంబంలో విషాద ఛాయలు