ETV Bharat / state

చంద్రబాబు, పవన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు - జర్నలిస్ట్‌ కేవీఆర్‌కు రిమాండ్

జర్నలిస్ట్‌ కేవీఆర్‌కు ఈనెల 14 వరకు రిమాండ్‌ విధించిన బొబ్బిలి కోర్టు - బొబ్బిలి సబ్ జైలుకు జర్నలిస్ట్‌ కేవీఆర్‌ను తరలించిన పోలీసులు- కేవీఆర్‌ను నిన్న అరెస్టు చేసి బొబ్బిలి తీసుకొచ్చిన బాడంగి పోలీసులు

Hyderabad Journalist K Venkatrami Reddy Arrest
Hyderabad Journalist K Venkatrami Reddy Arrest (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : July 2, 2026 at 3:48 PM IST

1 Min Read
Choose ETV Bharat

Hyderabad Journalist K Venkatrami Reddy Arrest : తెలంగాణకు చెందిన జర్నలిస్ట్‌ కె. వెంకటరామిరెడ్డి (కేవీఆర్‌)ని బాడంగి పోలీసులు విజయనగరం జిల్లా బొబ్బిలి కోర్టులో హాజరు పరిచారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఆయన్ను అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 14 వరకు రిమాండ్‌ విధించారు. దీంతో కేవీఆర్‌ను బొబ్బిలి జైలుకు తరలించారు.

విజయనగరం జిల్లా బాడంగి మాజీ సర్పంచ్‌ కండి రమేశ్‌ ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్​ కేవీఆర్‌ని హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో బాడంగి పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. భారత రాజ్యాంగం, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లపై అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు చేశారని రమేశ్‌ ఏప్రిల్‌ 10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేవీఆర్‌ను బొబ్బిలి పోలీస్‌స్టేషన్‌కు బుధవారం తీసుకొచ్చారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యపరీక్షలు నిర్వహించారు. విచారణకు హాజరు కావాలని బాడంగి పోలీసులు నోటీసులు జారీ చేసినా పట్టించుకోకపోవడంతో బొబ్బలి గ్రామీణ సీఐ శ్రీనివాస్​తో కూడిన బృందం కేవీఆర్ ఇంటికే వెళ్లి అరెస్టు చేసింది.