భార్యను గొంతు నులిమి చంపిన భర్త - ఆపై మృతదేహంతో పోలీస్ స్టేషన్కు
బాపట్ల జిల్లాలో దారుణం - భార్యను గొంతునులిమి హత్య చేసిన భర్త - అనంతరం మృతదేహాన్ని బైక్‌పై పీఎస్‌కు తీసుకెళ్లి లొంగిపోయిన వైనం

By ETV Bharat Andhra Pradesh Team
Published : December 14, 2025 at 5:35 PM IST
Husband Kills Wife in Bapatla District: బాపట్ల జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అనుమానంతో భర్త దారుణంగా హత్య చేశాడు. అనంతరం భార్య మృతదేహాన్ని బైక్‌పై పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చి లొంగిపోయాడు. ఈ ఘటన సంతమాగులూరులో చోటు చేసుకుంది.
అసలేం జరిగిందంటే? : బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం మాచవరానికి చెందిన మహాలక్ష్మి (28)ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే భార్యాభర్తల మధ్య నెలకొన్న విభేదాలతో వెంకటేశ్వర్లుకు మహాలక్ష్మి దూరంగా ఉంది.
గొంతు నులిమి హత్య: ఈ క్రమంలో ఆదివారం మాచవరం వెళ్లిన భర్త మహాలక్ష్మి తాలూకు బంగారం ఇస్తానని చెప్పి గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. అనంతరం గొంతు నులిమి మహాలక్ష్మిని హత్య చేశాడు. తరువాత మృతదేహాన్ని బైక్‌పై సంతమూగులూరులో ఉన్న పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి లొంగిపోయాడు. వెంటనే పోలీసులు ఆమెను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కానీ అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం రొంపిచర్ల పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం: బంధువుతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందనే అనుమానంతో భార్యను హతమార్చినట్లు భర్త వెంకటేశ్వర్లు పోలీసులతో అన్నట్లు తెలిసింది. వీరివురి దాంపత్యం దాదాపు పదేళ్లు సంతోషంగానే సాగింది. భార్య బంధువుతో వివాహేతర సంబంధం పెట్టుకుందన్న అనుమానంతో వెంకటేశ్వర్లు తరుచు మహాలక్ష్మితో తరచూ గొడవ పెట్టుకునేవాడు. భార్య బంధువుపై ఫిర్యాదు చేసి పోలీస్ స్టేషన్కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చేలా చేశాడు వెంకటేశ్వర్లు.
ఓ పథకం ప్రకారం హత్య: ఈ నేపథ్యంలో భార్యాభర్తల మధ్య అభిప్రాయాలు బేధాలు పెరగడంతో భార్య మహాలక్ష్మి పుట్టింటికి వెళ్లి ఒంటరిగా ఉంటోంది. మరో వైపు వినుకొండలో బేకరీ దుకాణంలో పనులు చేసుకుంటూ వెంకటేశ్వర్లు దగ్గరే పిల్లలు ఉంటున్నారు. ఈ క్రమంలో భర్త వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం భార్య పుట్టింటికి వెళ్లి ఆమె తాలూకు బంగారం ఇస్తానని చెప్పి నమ్మించాడు. ఆదివారం ఉదయం ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఊరి శివారుకు వచ్చిన తరువాత గొంతు నులిమి చంపాడు.
విజయవాడలో పట్టపగలు నడిరోడ్డుపై దారుణం - భార్య గొంతు కోసి చంపిన భర్త
మూణ్నాళ్ల ముచ్చటగా ఇన్‌స్టాగ్రామ్ ప్రేమ - కట్నం కోసం చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరణ

