ETV Bharat / state

హతమార్చేందుకు 8 నెలల క్రితమే ప్లాన్ - మాల్కాజి​గిరిలో తుపాకీతో కాల్చి భార్య హత్య

భార్యను తుపాకీతో కాల్చి చంపిన రియల్టర్ అరుణ్ కుమార్ - తుపాకీ శబ్దం విని పోలీసులకు సమాచారం ఇచ్చిన నిందితుడి తల్లి - మొదటి భార్య సోదరితో రెండో పెళ్లి

HUSBAND KILLS WIFE WITH GUN
ఘటనాస్థలంలో విచారణ చేస్తున్న పోలీసులు (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : June 10, 2026 at 10:38 AM IST

|

Updated : June 11, 2026 at 10:02 AM IST

2 Min Read
Choose ETV Bharat

Husband kills Wife with Gun in Malkajgiri : హైదరాబాద్‌ మల్కాజిగిరి పరిధి మారుతీనగర్‌లో దారుణం జరిగింది. స్థిరాస్తి వ్యాపారి అరుణ్ కుమార్‌ తన రెండో భార్య నిషారాణిపై అనుమానంతో తుపాకీతో కాల్చి చంపాడు. ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. భార్య మీద అనుమానం పెంచుకున్న భర్త, ఆ కోపంతో రగిలిపోయి భార్య తలపై తుపాకీతో కాల్చి దారుణంగా హతమార్చాడు. ఆమెను చంపేందుకు దాదాపు 8 నెలల క్రితమే ప్లాన్ వేశాడు. తనకున్న పరిచయాల ద్వారా గత జనవరిలో బిహార్‌ నుంచి తుపాకీ తెప్పించాడు. బుధవారం ఉదయమే భార్యను హతమార్చి పరారయ్యాడు. మల్కాజిగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఈ ఉదంతం ఒక్కసారిగా కలకలం రేపింది.

గతంలోనే ప్లాన్​ వేసి దొరికాడు : మల్కాజిగిరి మారుతీ నగర్‌కు చెందిన దామెర అరుణ్‌ కుమార్‌ (49) రియల్‌ ఎస్టేట్ వ్యాపారి. బొల్లారం ప్రాంతానికి చెందిన స్వర్ణలతతో అరుణ్‌కు 2002లో వివాహం జరిగింది. వీరికి సాయిహర్షిత, జోషిత్‌ సాయి అనే ఇద్దరు పిల్లలు. 2015లో స్వర్ణలత దురదృష్టవశాత్తు క్యాన్సర్‌ వ్యాధి బారిన పడింది. 2017లో గోడకూలిన ఘటనలో కుమార్తె సాయిహర్షిత మరణించింది. ఈ క్రమంలోనే అరుణ్‌ స్వర్ణలత సోదరి నిషారాణి(38)కి కొంత దగ్గరయ్యాడు.

బంధువులతో ఫోన్, అనుమానం స్టార్ట్ : నిషారాణితో అరుణ్ సన్నిహితంగా ఉంటూ కొన్నాళ్లు హోటల్‌లో ఉంచడంతో విషయం తెలిసుకున్న స్వర్ణలత ఇంటి నుంచి వెళ్లిపోయింది. 2022లో నిషారాణిని అరుణ్ యాదగిరిగుట్టలో వివాహమాడాడు. ఈ క్రమంలోనే నిషారాణిపై అనుమానం పెరిగింది. ఆమె బంధువుతో తరచూ ఫోన్‌లో మాట్లాడుతోందని కక్ష పెట్టుకుని రగిలిపోయేవాడు. తరచూ వేధిస్తూ కొట్టడంతో నిషారాణి కూడా తన బంధువుల ఇంటికి వెళ్లిపోయింది. దీంతో అరుణ్ ఎలాగైనా ఆమెను హతమార్చాలనుకున్నాడు.

HUSBAND KILLS WIFE WITH GUN
మృతురాలు నిషారాణి (ETV)

2025 నవంబరు నెలలో అరుణ్ తన స్నేహితుడు కుషాయిగూడకు చెందిన మహమ్మద్‌ అబ్బుతో నిషారాణిని హతమార్చాలనుకుంటున్నట్లు చెప్పాడు. అబ్బు తనకు తెలిసిన యాకుత్‌పురా వాసి మీర్‌ ముజమ్మిల్‌ను అరుణ్‌కు పరిచయం చేశాడు. ముజమ్మిల్‌ తన బంధువు సల్మాన్‌తో కలిసి ఈ ఏడాది జనవరిలో బిహార్‌ వెళ్లి ఓ తుపాకీ తెచ్చి అరుణ్‌కు అందించాడు. అరుణ్‌ తుపాకీతో హైదరాబాద్ నగర శివార్లలో షూటింగ్ ప్రాక్టీస్‌ చేశాడు. మార్చి రెండో వారంలో అంబర్‌పేటలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో తుపాకీతో పట్టుబడి జైలుకు కూడా వెళ్లాడు. ఈ విషయం తెలిసిన నిషారాణి భయంతో పుట్టింటికి వెళ్లిపోయింది.

జైలు నుంచి బయటకొచ్చి హత్య : జైలుకెళ్లిన అరుణ్‌ కుమార్‌ నెల తర్వాత బెయిల్​పై బయటకొచ్చాడు. బిహార్‌ నుంచి మళ్లీ మరో తుపాకీని కొనుగోలు చేశాడు. బంధువులతో ఒప్పించి నిషారాణిని ఎలాగోలా ఇంటికి తీసుకొచ్చాడు. బుధవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో భార్యతో గొడవపడి తలపై ఏకంగా 3 రౌండ్లు కాల్చాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. పక్క పోర్షన్‌లో నివాసం ఉంటున్న అరుణ్‌ కుమార్‌ తల్లి తుపాకీ శబ్దానికి బయటకు వచ్చి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్య అనంతరం నిందితుడు పరారీలో ఉండగా, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

సుపారీ గ్యాంగ్‌తో భార్యను హత్య చేయించిన భర్త - నిందితుడిని పట్టించిన కూరగాయల సంచి

పగలు లగ్జరీ లైఫ్, రాత్రేమో చోరీలు - కిలాడీ దొంగ వెనక 'గోల్డ్​ సిండికేట్​' : క్రైమ్​ థ్రిల్లర్​ను మించిన స్టోరీ

Last Updated : June 11, 2026 at 10:02 AM IST