ఫ్యాన్సీ నంబర్ల వేలం - తెలంగాణ రవాణా శాఖకు భారీగా ఆదాయం
రవాణాశాఖకు కాసులు కురిపిస్తున్న ఫ్యాన్సీ నంబర్లు - ఒక్కరోజులోనే రూ.65 లక్షల ఆదాయం - TG 09 H 9999 నంబర్‌కు అత్యధికంగా రూ.22 లక్షలు

Published : November 14, 2025 at 10:44 PM IST
|Updated : November 15, 2025 at 7:01 AM IST
Huge Revenue For Fancy Numbers Transport Department In Telangana : ఫ్యాన్సీ నంబర్లు తెలంగాణ రవాణాశాఖకు కాసులు కురిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో ఆదాయం వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 56 రవాణా శాఖ కార్యాలయాలు ఉండగా, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలోనే ఫ్యాన్సీ నంబర్లకు గిరాకీ ఎక్కువగా ఉంటుందనే విషయం తెలిసిందే. అయితే అందరినీ ఆశ్యర్య పరిచే విధంగా ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయానికి ఒక్కరోజులోనే రూ.65,38,889ల ఆదాయం వచ్చినట్లు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ రమేష్ వెల్లడించారు. అత్యధికంగా TG 09 H 9999 నంబరు రూ.22,72,222ల ధర పలికింది. అతి తక్కువగా TG 09 J 0003 నంబరుకు రూ.1,15,121ల ఆదాయం వచ్చింది.
'9'కి ఉన్న క్రేజ్ వేరు గురు : చాలామంది 9 నంబరును తమ అదృష్ట సంఖ్యగా భావిస్తుంటారు. ఎప్పుడు వేలం నిర్వహించినా 9 సీరిస్ ఉన్న నంబర్లే అత్యధిక ధర పలుకుతున్నాయి. అంతేదుకు స్వయానా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ వాహనాలకు 9వ నంబరు ఉంటుంది. దీంతో 9 నంబరుకు ఉన్న క్రేజ్‌ను మనం అర్థం చేసుకోవచ్చు. తొమ్మిది నంబరు ఉన్న వాహనాలుంటే తమ జీవితంలో చేసే పనులు వారికి కలిసి వస్తాయని కొంతమంది నమ్మకం. అందుచేత ఫ్యాన్సీ నంబర్ల వేలం పాటలో ధర అంతకంత పెరుగుతూనే ఉంటుంది.
- TG 09 H 9999 నంబరు రూ. 22,72,222ల ధర పలుకగా హనర్ ప్రైమ్ హౌసింగ్ ఎల్ఎల్పీ అధినేతలు కైవసం చేసుకున్నారు.
- TG 09 J 0009 రూ. 6,80,000ల ఆదాయం రాగా ఈ నంబర్‌ను మెస్సర్స్ దండు ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం దక్కించుకుంది.
- TG 09 J 0006 రూ. 5,70,666ల వేలం పాడగా ఈ నంబర్‌ను సాయి సిల్క్స్ కళామందిర్ లిమిటెడ్ యాజమాన్యం దక్కించుకుంది.
- TG 09 J 0099 రూ. 3,40,000ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను మెస్సర్స్ గోదావరి ఫార్చూన్ సంస్థ దక్కించుకుంది.
- TG 09 J 0001 రూ.2,60,000ల ధర పలుకగా ఈ నంబర్‌ను శ్రీనిధి ఐటీ స్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ కైవసం చేసుకుంది.
- TG 09 J 0005 రూ.2,40,100ల ఆదాయం వచ్చింది. ఈ నంబర్‌ను నిహారిక ఎంటర్ టైన్ మెంట్ అనే సంస్థ దక్కించుకుంది.
- TG 09 J 0018 రూ.1,71,189లకు ఈ నంబర్‌ను రోహిత్ రెడ్డి ముత్తు అనే వ్యక్తి కైవసం చేసుకున్నారు.
- TG 09 J 0007 రూ.1,69,002లకు ఈ నంబర్‌ను కొండవరపు శ్రీనివాస్ నాయుడు అనే వ్యక్తి దక్కించుకున్నారు.
- TG 09 J 0077 రూ.1,41,789ల ఆదాయం సమకూరగా ఈ నంబర్‌ను మీనాక్షి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కైవసం చేసుకుంది.
- TG 09 J 0123 రూ.1,19,999ల ధర పలుకగా ఈ నంబర్‌ను ఆకుల మాధురి అనే మహిళ దక్కించుకున్నారు.
- TG 09 J 0003 రూ.1,15,121లకు ఈ నంబర్‌ను జీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ కైవసం చేసుకుంది.
కాసులు కురిపించిన ఫ్యాన్సీ నంబర్లు - 9999 నంబరుకు రూ.25 లక్షలు

