ETV Bharat / state

హోలీ ఆడుతున్నారా? - ఈ టిప్స్​ పాటిస్తే జుట్టు, కళ్లు, స్కిన్​ సేఫ్!

తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే హోలీ రంగులే ఆపదగా మారొచ్చు! - పండగ విషాదం కావద్దంటే జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణుల సూచనలు - ఈ టిప్స్​ పాటిస్తే చాలు మీ కళ్లు, జట్టు, చర్మం సేఫ్​!

Safe Holi Celebration Tips
Safe Holi Celebration Tips (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 3, 2026 at 9:47 AM IST

3 Min Read
Choose ETV Bharat

Safe Holi Celebration Tips : ప్రస్తుత వాతావరణం వసంతాన్ని పులుముకునే అద్భుత సమయంలో ఈ రంగుల పండగ హోలీ జరుపుకుంటారు. జాతి, మత భేదాలన్నీ మరచి చిన్నా, పెద్దా ఒకటై చిందేసే పండుగ ఇది. అయితే ఈ హోలీ రంగులతో తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే ఆ రంగులే ఆపదగా మారొచ్చు. ఆనందాన్ని ఆవిరి చేయొచ్చు. వాటితో అప్రమత్తంగా ఉండాల్సిందే!

హోలీ పర్వదినం రోజున అప్పట్లో ప్రకృతి ఒడిలో విరిసిన మోదుగు పూలు, కుంకుమ, పసుపు, చందనంతో వేడుక సాగేది. కానీ ఇప్పుడు అన్నింటిలో రసాయనాలు మిక్స్​ చేసి మార్కెట్లోకి ఆకర్షణీయమైన రంగలను పరిచయం చేస్తున్నారు. ఆ రంగుల వెనక పొంచి ఉన్న ప్రమాదాలను విస్మరిస్తున్నారు. దీని వల్ల చర్మ వ్యాధులు, కంటి సమస్యలతో సంబురం కాస్తా సంకటంగా మారుతోంది. మరి ఈ పండగ విషాదం కావద్దంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

  • రంగులు చర్మం లోపలి పొరల్లోకి వెళ్లకుండా ఉండాలంటే శరీరమంతా కొబ్బరినూనె రాసుకోవడం మంచిది. ఇలా రాసుకోవడం వల్ల చర్మానికి, రసాయక రంగులకు మధ్య ఒక ప్రొటెక్టివ్​ లేయర్​గా పని చేస్తుంది. దీని వల్ల వేడక పూర్తయ్యాక రంగులను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
  • హోలీ రోజు జుట్టుకీ నూనె రాసుకోవాలి. ఆ జుట్టును అలా గాలికి వదిలేయకుండా గట్టిగా ముడి వేసుకోవడం వల్ల రంగుల్లోని రసాయనాలు జుట్టును నిర్జీవంగా, గరుకుగా మారుస్తాయి. రంగులు పూసుకునేటప్పుడు స్టైల్​ కన్నా మనం రక్షణకే ప్రాధాన్యం ఇవ్వాలి.
  • వీలైనంత వరకు శరీరం మొత్తం కప్పి ఉంచే వస్త్రాలు ధరించాలి. ఈ సమయంలో సింథటిక్​ కంటే కాటన్​ దుస్తులు చర్మానికి హాయినివ్వడంతో పాటు రంగుల వల్ల వచ్చే దురదను నివారిస్తాయి.
  • గాయాలున్న వారు తప్పనిసరిగా వాటిపై బ్యాండేజీలు వేసుకోవాలి. లేకపోతే వాటిపై రంగులు పడి మరింతగా పెరిగే ప్రమాదం ఉంది.

ఇలా చేయండి :

  • కళ్లకు సన్​గ్లాసెస్​ ధరించడం వల్ల రంగులు నేరుగా కంటిలో పడకుండా ఉంటాయి.
  • ముక్కు వద్ద, చెవుల వెనుక, పెదవులపై వ్యాసెలిన్​ రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆయా చోట్ల రంగు పేరుకుపోకుండా ఉంటుంది.
  • రంగులు వదిలించుకోవడానికి చాలా మంది డిటర్జెంట్​ సబ్బులు, స్క్రబ్బర్లు ఉపయోగిస్తుంటారు. ఇది చర్మానికి మరింత హాని కలిగిస్తుంది. దీనికి బదులుగా సున్నిపిండి, నిమ్మరసం కలిపిన మిశ్రమం వాడితే ఉత్తమం.
  • మూగజీవాలపై వీధి కుక్కలు, పిల్లులపై రంగులు చల్లకూడదు. ఎందుకంటే వాటి చర్మం రసాయనాలను తట్టుకోలేదు. అవి తమ శరీరాన్ని నాలుకతో శుభ్రం చేసుకుంటాయి. అలా చేసే సమయంలో రంగులు కడుపులోకి వెళ్లి ప్రాణం పోవచ్చు.
  • హోలీ పండుగ సందర్భంగా యువత, కుర్రకారు జలపాతాలు, జలాశయాల వద్దకు వెళతారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకుండా నీళ్లలోకి దిగితే ప్రమాదాలు పొంచి ఉంటాయి. తగిన జాగ్రతలు తీసుకోవడం మంచిది.

పర్యావరణహిత రంగులు :

  • పసుపు, కుంకుమ, బీట్​రూట్​, గంధం వంటి సహజ వనరులతో ఇంట్లోనే రంగులు తయారు చేసుకోవచ్చు.
  • ఎండిన పూలను పొడి చేసి గోరింటాకు పొడిని ఉపయోగించినా మంచి సహజమైన రంగులు వస్తాయి.
  • ప్రకృతిలో లభించే మోదుగు పూల ద్వారా మంచి రంగులను తయారు చేయవచ్చు.
  • ఇలా సహజసిద్ధ రంగులు, పూలు వినియోగించడం వల్ల మనకూ, పర్యావరణానికి హాని కలగదు.

''ప్రతి ఏడాది పండగ ముగిసిన తర్వాత చర్మ సంబంధిత సమస్యలతో చాలా మంది ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రస్తుతం మార్కెట్​లో విరివిగా లభిస్తున్న రంగులన్నీ హానికర రసాయనాలతో తయారు చేస్తున్నారు. ఇందులో క్రోమియం, సిలికా, మైకా వంటి వాటితో పాటు దుస్తుల రంగుల కోసం వినియోగించే రసాయనాలను ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల దురద రావడంతో పాటు చర్మం ఎర్రగా మారుతుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే నీటితో కడిగేయాలి. అయినా కూడా సమస్య అలాగే ఉంటే డెర్మటాలజిస్ట్​ను సంప్రదించాలి. కళ్లను జాగ్రత్తగా కాపాడుకోవాలి.'' - డా. స్వప్నప్రియ, కన్సల్టెంట్​ డెర్మటాలజిస్ట్​

హోలీ స్పెషల్ : సహజ రంగుల​నే వాడండి - ఇలా సింపుల్​గా తయారు చేసుకోండి

హోళీ స్పెషల్ : ఇంట్లో దొరికే వాటితోనే సహజ సిద్ధమైన రంగులు - ఇలా తయారు చేసుకోండి