ETV Bharat / state

లవ్​ ఫెయిలైనా ఉందిలే 'మంచి జీవితం ముందు ముందునా' - సూసైడ్​ చేసుకునే ముందు 'ఆలోచించు నంద నందనా'

తెలిసీ తెలియని వయసులో ప్రేమ - ప్రేమ ఫెయిల్​ అవ్వగానే ఆత్మహత్యలు చేసుకుంటున్న యువత - ప్రేమ జీవితం అన్నట్లు జీవితం మీద విరక్తి - ప్రేమ ఒక్కటే జీవితం కాదంటున్న నిపుణులు

Medical Student Died in Medical College
Medical Student Died in Medical College (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 7, 2026 at 10:45 AM IST

3 Min Read
Choose ETV Bharat

How to Move on with Life After a Failed Love : ఈ మధ్యకాలంలో యువత తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడుతున్నారు. సహజంగా రెండు మనసుల మధ్య ఈ ప్రేమ చిగురిస్తుంది. ఆ ప్రేమకు ఏ తేడా ఉండదు. మొదట్లో కొన్ని రోజులు బాగానే ఉంటుంది. ఆ తర్వాతే గొడవలు మొదలవుతాయి. ఈ గొడవలు కాస్త విడిపోవడానికి కారణమవుతున్నాయి. ఇలా వారి ప్రేమ విఫలం కావడంతో మనస్తాపంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఊబిలో చిక్కుకొని నిండు జీవితాలను గాల్లో దీపంలా మార్చుకుంటున్నారు.

ఇలాంటి ఘటనలు ఉమ్మడి మెదక్​, వికారాబాద్​ జిల్లాల్లో బోలెడన్నీ వెలుగులోకి వస్తున్నాయి. మృత్యువాత పడుతున్న వారంతా భవిష్యత్తును అంచనా వేయలేక తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నవారే ఎక్కువగా ఉన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లాలో ఓ ఘటన చోటు చేసుకుంది. ఓ జూనియర్​ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడం ఆమె కుటుంబ సభ్యుల ఆశలను ఆవిరి చేసింది.

కారణం ఏంటంటే : చిన్నప్పటి నుంచి డాక్టర్​, ఇంజినీర్​ అవ్వాలనే ప్రతి ఒక్కరి కల. అదే పేద కుటుంబం నుంచి వచ్చిన వారు ఉన్నత చదువైన డాక్టర్ చదువు​ చదవడం అంటే ఎంతో కష్టపడాలి. అదే శ్రమతో చదివి వైద్య కళాశాలలో సీటు సంపాదించుకుంది. ప్రస్తుతం జూనియర్​ వైద్యురాలుగా పని చేస్తుంది. అందరూ ప్రేమలో పడినట్టే ఈమెలో కూడా ప్రేమ చిగురించింది. కానీ యువతి ప్రేమలో మోసపోయి మనస్తాపం చెంది అఘాయిత్యానికి పాల్పడింది. ఈ వైద్యురాలు అర్ధాంతరంగా తనువు చాలించడంతో తన కుటుంబ సభ్యుల ఆశలను ఆవిరి చేసింది. ఈ అమ్మాయి చదువు, క్రీడల్లో ఎంతో చురుగ్గా ఉండేది. కానీ, ప్రియుడి చేతిలో మోసపోవడం తను తీసుకోలేకపోయింది. ఆమె బలవన్మరణం అప్రమత్తంగా ఉండాల్సిన ఆవశ్యకతను చెబుతోంది.

లక్ష్యం వైపు దృష్టి పెట్టేలా : యువత ఇలాంటివి అధిగమించాలంటే తల్లిదండ్రులు, కుటుంబీకులు అండగా నిలవాలి. వారి జీవితాన్ని ప్రేమించేలా, లక్ష్యం వైపు దృష్టి సారించేలా ప్రోత్సహించాలి. అసలు ఎందుకీ పరిస్థితి వస్తోంది. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి మానసిక నిపుణురాలు డా.శాంతి కొన్ని సూచనలు సూచిస్తున్నారు.

జీవితంలో ఎదగడానికి కావాల్సింది తొలుత విద్య, ఆ తర్వాత ఉద్యోగం ఇలాంటి ఆలోచనలు ఉంటేనే జీవితంలో స్థిరపడతారు. కానీ ప్రస్తుతం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తూ యువత తప్పటడుగులు వేస్తోంది. జరిగే మోసాన్ని ముందుగా గుర్తించలేకపోతున్నారు. విష వలయంలో చిక్కుకుని విలవిల్లాడుతోంది. చివరికీ విషయం తెలుసుకొని కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నారు. మెదక్​కు చెందిన ఓ యువతి మోసపోయి ఆత్మహత్య చేసుకోవడం ఈ కోవలోకే వస్తుంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉంది.

ఎలా అధిగమించాలంటే :

  • చిన్నప్పుడు, టీనేజీ దశ ఏదైనా తల్లిదండ్రులు పిల్లలను గమనించాలి. అనుభవాలను వివరించాలి.
  • స్నేహపూర్వక వాతావరణంలో మెలగాలి. స్నేహితులు, పరిచయాలపై ఆరా తీయాలి.
  • పిల్లలు, తల్లిదండ్రుల మధ్య అంతరం పెరగకూడదు.
  • ప్రతి విషయమైనా పంచుకునేలా వారిని ప్రోత్సహించాలి.
  • ఒకవేళ ప్రేమలో పడినా, విఫలమైనా, వెన్నుదన్నుగా నిలిచి ఓ మంచి మార్పు వైపు వారిని ప్రోత్సహించాలి.
  • విద్యాసంస్థలు చదువుతో పాటు సమాజంలో జరుగుతున్న పరిణామాలను తెలియజేయాలి.

వీటిని గమినిస్తేనే :

  • పిల్లల ప్రవర్తన, భావోద్వేగాలను ఎప్పటికప్పుడు గమనించాలి.
  • నోటి నుంచి చనిపోతామనే మాట వస్తే వారిపై పర్యవేక్షణ పెంచాలి.
  • ఒంటరిగా ఉండటం, నిద్రించకపోవడం, తరచూ ఏడుస్తుండటం ప్రమాదకరమని తెలుసుకోవాలి.
  • సరైన నిద్ర లేకపోవడం, మత్తు పదార్థాలు, వ్యసనాల బారినపడుతుంటే అప్రమత్తం చేయాలి.
  • మానసిక, వ్యక్తిత్వ వికాస నిపుణులతో కౌన్సెలింగ్‌ ఇప్పించాలి.
  • జీవితంలో స్థిరపడటం తొలి లక్ష్యంగా వివరించాలి. నచ్చిన రంగంలో వారిని ప్రోత్సహించాలి.

నా భర్తలా నేను చూసుకోలేను - ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తల్లి ఆత్మహత్య

'అమ్మ, నాన్న, తమ్ముడు క్షమించండి' - అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య