ETV Bharat / state

హోలీ స్పెషల్ - ఆర్టిఫిషియల్​ రంగులకు చెక్​ - ఇంట్లోనే నేచురల్​గా చేసుకోండిలా

రసాయనాల రంగులు లేకుండా వసంతాల కేళి - ఇంట్లోనే సహజ సిద్ధంగా రంగులను తయారు చేయడానికి నిపుణుల టిప్స్ - అవి ఏంటంటే?

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : March 2, 2026 at 7:12 PM IST

2 Min Read
Choose ETV Bharat

How to Make Natural Colors for Holi 2026 : చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సహంగా జరుపుకునే పండుగలలో హోలీ ఒకటి. దేశ వ్యాప్తంగా ఈ పండుగను కుల, మత బేధాలు లేకుండా అందరూ ఒక్కటై ఆనందంగా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ సంతోషంగా జరుపుకుంటారు. ముఖ్యంగా యూత్‌ అంతా ఒక్కటై ఫ్రెండ్స్‌తో కలిసి ఆ రోజంతా ఎంతో ఎంజాయ్‌ చేస్తారు. ఏటా ఫాల్గుణ మాసం శుక్లం పక్షం పౌర్ణమి రోజున హోలీ పండుగను జరుపుకుంటారు. ఈ సంవత్సరం హోలీ పండగను మార్చి 4 బుధవారం రోజున జరుపుకోనున్నారు.

ఇదిలా ఉంటే హోలీ అంటేనే రంగుల పండగ. హోలీనాడు మార్కెట్లో దొరికే రంగు రంగుల కలర్లను ఎక్కువ మంది కొని చల్లుకుంటుంటారు. కానీ, ఇవి తయారు చేయాడానికి చాలా రకాల కెమికల్స్‌ యూజ్‌ చేస్తారని నిపుణులు అంటున్నారు. పొరపాటున ఇవి కళ్లలోకి, నోట్లోకి వెళ్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి వసంతాల కేళి హోలీ పండగను రంగులు లేకుండా ఎలా జరుపుకోవాలి అని ఆలోచిస్తున్నారా ? అయితే, మీ కోసమే ఇది. ఇంట్లోనే సహజ సిద్ధంగా రంగులను తయారు చేయడానికి నిపుణులు కొన్ని టిప్స్​ సూచిస్తున్నారు. అవి ఏంటంటే.

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)

పసుపు రంగు : హోలీలో ఎక్కువగా పసుపు రంగును చల్లుకుంటుంటారు. మరి దీనిని ఇంట్లోనే తయారు చేయడానికి శనగపిండి, పసుపును 1:2 నిష్పత్తిలో కలపుకోవాలి. అంతే పసుపు కలర్​ రెడీ. అదే కాకుండా పసుపు కలర్‌ కోసం బంతి, చామంతి పూలను ఎండబెట్టి పొడి చేసుకున్నా సరిపోతుంది. ఒకవేళ మీకు పసుపు రంగులో నీళ్లు కావాలనుకుంటే బంతి పూలను నీటిలో ఉడకబెట్టి తయారు చేసుకోవచ్చు.

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)

ఎరుపు రంగు : సహజ సిద్ధంగా రెడ్‌ కలర్‌ తయారు చేయడానికి కొన్ని ఎర్ర మందార పువ్వులను తీసుకోవాలి. తర్వాత వాటిని ఎండబెట్టి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇది తయారు చేయడానికి కాస్త టైమ్‌ పట్టినా కూడా చాలా బాగుంటుంది. ఎక్కువగా ఎర్ర రంగు ఉండటానికి ఇందులో ఎర్ర కుంకుమపువ్వుతో పాటు శనగపిండిని కూడా కలపవచ్చు.

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)

మెజెంటా (ముదురు గులాబీ) : ముదురు గులాబీ రంగును తయారు చేయడానికి ఇంట్లోనే బీట్‌రూట్‌ ముక్కలను కోసి రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు ఆ నీటిని కొద్దిగా మరిగిస్తే సరిపోతుంది, మెజెంటా కలర్‌ నీళ్లు రెడీ.

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)

ఆకుపచ్చ రంగు : హోలీనాడు గ్రీన్‌ కలర్‌ను కూడా ఎక్కువగా చల్లుకుంటుంటారు. దీనిని ఇంట్లోనే తయారు చేయడానికి బియ్యం పిండిలో గోరింటాకు పొడిని కలుపుకోండి. గ్రీన్‌ కలర్‌లో వాటర్‌ రెడీ చేయడానికి నీళ్లలో హెన్నా పొడిని వాడుకోవచ్చు.

How to Make Natural Colors for Holi 2026
How to Make Natural Colors for Holi 2026 (ETV Bharat)

బ్రౌన్ కలర్‌ : బ్రౌన్ కలర్‌ నీళ్ల కోసం కాఫీ పౌడర్‌ను వాటర్‌లో వేసి మరిగించండి. అంతే బ్రౌన్‌ కలర్‌ వాటర్ రెడీ అయిపోతుంది.

గిరిజనుల హోలీ స్పెషల్ - 60 అడుగుల ‘హోలీ టవర్‌’ దహనం

హోలీ కోసం నేచురల్​ కలర్స్ తయారుచేస్తున్న మహిళలు- వారి హెర్బల్ గులాల్‌కు ఫుల్ డిమాండ్