ETV Bharat / state

2002లో మీ ఓటు ఎక్కడుందో తెలుసా?

ఎన్నికల సంఘం వారి సర్వీస్ సిటిజన్ సర్వీస్ పోర్టల్లో ముందుగా లాగిన్ - ఆన్లైన్ జాబితాలో మీ పేరు పరిశీలన - ఆపై వివరాల నమోదు

How to Know Where is Your Vote in 2002
How to Know Where is Your Vote in 2002 (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : June 17, 2026 at 10:33 AM IST

2 Min Read
Choose ETV Bharat

How to Know Where is Your Vote in 2002: ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా, కచ్చితత్వం, సమగ్రంగా మార్చేందుకు ఎన్నికల సంఘం చేపట్టిన ఒక ప్రత్యేక కార్యక్రమమే 'సర్' (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్). రాష్ట్రంలో సోమవారం నుంచి ఓటర్ల జాబితా నవీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. దీని కోసం ఇంటింటికీ బూత్ స్థాయి ఎన్నికల అధికారులు (బీఎల్ఓ) వస్తారు. వీరితో పాటు రాజకీయ పార్టీల ప్రతినిధులు ఉంటారు. 2002లో మీకు ఓటు హక్కు ఉంటే ఆ ఓటు ఎక్కడ ఉందో అడుగుతారు. మీకు తెలియకపోతే మీ వివరాలు వారు తీసుకుని ఆన్లైన్ జాబితాలో మీ పేరు పరిశీలిస్తారు. ఇప్పుడున్న జాబితాతో పోల్చి చూస్తారు. వివరాలు నమోదు చేస్తారు. అయితే అద్దెకు ఉన్న వారు, సొంత ఇళ్లల్లోకి వెళ్లిన వారికి తమ ఓటు ఎక్కడ ఉందో, నాటి ఓటరు కార్డు నంబరు చెప్పలేకపోవచ్చు. ఆన్​లైన్​లో సిటిజన్​ సర్వీస్​ పోర్టల్​ (Citizen Service Portal) ద్వారా మీరు కూడా తెలుసుకోవచ్చు.

పలు మార్పులు

'సర్'కు సన్నద్ధమిలా: 2002 రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలు ఉండేవి అప్పటి విభజన కాలేదు. ఉదాహరణకు అప్పుడు కృష్ణా జిల్లా ఒక్కటే ఉండగా ఇప్పుడు కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలుగా విభజించారు. నియోజకవర్గాల హద్దులు మారిపోయి కొత్తవి వచ్చాయి. విజయవాడలోని ప్రాంతాలు విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, కంకిపాడు నియోజకవర్గంలో ఉండేవి. తర్వాత హద్దులు మారి సెంట్రల్, ఈస్ట్, వెస్ట్​గా మారిపోయాయి. ఎన్ని నియోజకవర్గాలు మారినా మీ పేరును సులువుగా తెలుసుకోవచ్చు.

2002 ఓటరు వివరాలు: మీ పేరు, తండ్రి/ భర్త పేరు, బంధుత్వం, వయసు, రాష్ట్రం, జిల్లా, నియోజకవర్గం పేర్లు వస్తాయి. పోలింగ్ స్టేషన్ నంబరు, పేరు ఉంటుంది. ఇందులో మీ ఓటు ఏ సీరియల్ నంబరులో ఉందో అదే పార్ట్ సీరియల్ నంబరు. ఇంటికి వచ్చే బూత్ అధికారులకు ఈ వివరాలు ఇస్తే వారు నమోదు చేసుకుంటారు.

సిటిజన్ సర్వీస్ పోర్టల్​లో లాగిన్: ఎన్నికల సంఘం వారి సర్వీస్ సిటిజన్ సర్వీస్ పోర్టల్లో ముందుగా లాగిన్ కావాలి. ఓటర్లు https://voters.eci.gov.in/ అనే సైట్​లో లాగిన్ అవ్వాలి. ఎన్నికల సంఘం పేజీ వస్తుంది. 'సెర్చ్ యువర్ నేమ్ ఇన్ లాస్ట్ సర్' అనే బాక్స్​ను క్లిక్ చేయాలి. ఇక్కడ 'సెర్చ్ బై ఎలక్ట్రోర్ డిటైల్స్'ను ఎంపిక చేసుకోండి. రాష్ట్రం పేరు 'ఆంధ్రప్రదేశ్', జిల్లా మీది ఏ జిల్లా అయితే అది అని, 2002లో మీ నియోజకవర్గం ఎంపిక చేయండి. ఓటరు పేరు, 'క్యాప్చా' నమోదు చేసి సెర్చ్ చేస్తే ఆ ఓటర్ల జాబితా వస్తుంది. అందులో మీ పేరు ఏదో గుర్తించండి.

ఏపీలో నేటి నుంచే "సర్" ప్రక్రియ - జులై 14 వరకూ సాగనున్న సర్వే

అకారణంగా ఓటర్లను తొలగించే ప్రసక్తే లేదు: ఎన్నికల ప్రధాన అధికారి వివేక్‌ యాదవ్‌ వెల్లడి