ETV Bharat / state

టెక్నలాజియా : ఇంటిని ఈజీగా పైకెత్తేస్తున్నారు - ఎలా చేస్తున్నారో మీరూ చూడండి

ఇంటి చుట్టూ హైడ్రాలిక్ జాకీలు, ఫ్రేమ్లను అమర్చి క్రమపద్ధతిలో ప్రక్రియ - అత్యాధునిక సాంకేతికత చూసి ఆశ్చర్యపోతున్న స్థానికులు - హర్యానా నుంచి వచ్చిన ఈశ్వర్ హౌస్ లిఫ్టింగ్ సంస్థ సిబ్బంది

HOUSE LIFTING IN NIRMAL
కొనసాగుతున్న ఇంటి ఎత్తు పెంపు పనులు (ETV)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 1:12 PM IST

3 Min Read
Choose ETV Bharat

House Lifting Process In Nirmal Town : నిర్మల్ జిల్లా కేంద్రానికి చెందిన గంగిశెట్టి శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానికంగా రేషన్​ డీలర్. గతేడాది నిర్మల్​ పట్టణం శాస్త్రీనగర్​లో కురిసిన భారీ వర్షాల కారణంగా వీరి ఇంట్లో మూడు అడుగుల మేర నీరు చేరింది. దీంతో పలు వస్తు సామగ్రి, విద్యుత్తు ఉపకరణాలు దెబ్బతిని ఆర్థికంగా తీవ్ర నష్టం వాటిల్లింటి. దీంతో వర్షం కురిసినప్పుడల్లా ఆ కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతూ వచ్చింది.

దశలవారీగా పైకి : అదే సమయంలో ఇంటి ఎత్తును పెంచే సాంకేతికత వారికి పరిచయస్థుల ద్వారా తెలిసింది. దాంతో వారు వెంటనే ఇంటి ఎత్తును పెంచే పనిలో పడ్డారు. వర్షాకాలంలో వరద నీరు ఇంటిని ముంచెత్తుతుండటంతో యజమాని హర్యానా నుంచి నిపుణులను పిలిపించారు. భవన పునాదికి జాక్‌లు అమర్చి మిల్లీమీటర్‌ స్థాయిలో సమతుల్యత కాపాడుతూ పైకి ఎత్తుతున్నారు. గోడలు, స్తంభాలకు పగుళ్లు రాకుండా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. లిఫ్టింగ్‌లో ముందుగా భవన నిర్మాణ బలాన్ని పరీక్షించి, లోపల ఉండే గోడలు, పిల్లర్లు, బేస్​మెంట్​ సామర్థ్యాన్ని ఇంజినీర్ల ద్వారా విశ్లేషించారు. తర్వాత దశల వారీగా పైకి ఎత్తడం, కొత్త పునాదిపై అమర్చడం, సేఫ్టీ టెస్టులతో ముందుకు వెళుతున్నారు. పెద్ద పెద్ద నగరాలు, పట్టణాల్లో ఈ తరహా సాంకేతిక వినియోగం చూసిన స్థానికులు, ఇప్పుడు వారి కళ్ల ముందే కనిపిస్తుండటంతో ఆశ్చర్యంగా వీక్షిస్తున్నారు.

'ఇంటికి ప్రాణం పోసినట్టు' - హైడ్రాలిక్ జాకీలతో పైకెత్తేస్తున్నారు (ETV)

"గతంలో కురిసిన వర్షానికి మా ఇంట్లో 3 ఫీట్ల వరద నీరు చేరింది. పక్కకు కెనాల్​ ఉంది. ఆ సమయంలో అది జామ్​ అయ్యింది. దీంతో మా ఇంట్లోని ఫర్నీచర్, వాహనాలు అన్నీ పాడైపోయాయి. పక్కింటి వాళ్ల దగ్గర ఆశ్రయం పొందాము. రూ.వేలు విలువ చేసే వస్తువులు పాడైపోయాయి. అలాగే వర్షం పడినప్పడల్లా మాకు టెన్షన్ అవుతుంది. దీంతో హైడ్రాలిక్​ లిఫ్టింగ్​ గురించి తెలుసుకుని పనులు చేపట్టాం" - గంగిశెట్టి శ్రీనివాస్, ఇంటి యజమాని

వర్షాలకు 3 మేర మునిగిన ఇల్లు : సగటున 10 నుంచి 15 జాకీలకు ఒకరు చొప్పున సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొంటున్నారు. ఎవరికి వారు నిర్దేశిత పరిమాణంలో జాకీలను పైకి లేపుతున్నారు. గోడలు, కిటికీలు, మెట్లు ఏమాత్రం దెబ్బతినకుండా పలు జాగ్రత్తలు చేపడుతున్నారు. రోజుకు కొంత ఎత్తు పెంచే స్థాయిలో వారు ఏర్పాట్లు చేస్తున్నారు. అంటే వారు ఎంత సమన్వయంతో పని చేస్తారో అర్థం చేసుకోవచ్చు. గోడల ఎత్తు పెంచడానికి, పిల్లర్ల నిర్మాణానికి అవసరమైన స్టీల్, సిమెంట్, ఇటుకల ఖర్చు మాత్రం ఇంటి యజమానే భరించాలని చెబుతున్నారు. గతంలో తమ కుమార్తె కుమార్తె గర్భిణిగా ఉన్న సమయంలో వర్షాలు వచ్చినప్పుడు 3 అడుగుల మేర తమ ఇల్లు మునిగిందని, అందుకే లిఫ్టింగ్‌ అవకాశం ఉందని తెలుసుకుని ఈ పనులు చేపట్టినట్లు ఇంటి యజమాని గంగిశెట్టి శ్రీనివాస్‌ తెలిపారు.

అవసరానికి తగిన విధంగా : పాత ఇళ్ల విలువను కాపాడుతూ, వర్షాల ముప్పు నుంచి విముక్తి కల్పిస్తున్న ఈ సాంకేతికత నిర్మల్ జిల్లా కేంద్రంలో చేరడం గొప్ప పరిణామం. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇలాంటి పరిష్కారాలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇది ముంపు ప్రజలకు చాలా ఉపశమనాన్ని కలిగిస్తుందని స్థానికులు ప్రశంసిస్తున్నారు. నిజానికి ఇల్లు దెబ్బతినకుండా పైకెత్తడమంటే అంత సులభమేమీ కాదు. ఏ మాత్రం అటు ఇటు అయినా నిర్మాణమంతా ఒక్కసారిగా దెబ్బతింటుంది. ఈ విషయంలో భవనం సామర్థ్యం అత్యంత కీలకం. అన్నివిధాలా బాగుందనుకుంటేనే ఇంటి చుట్టూ హైడ్రాలిక్ జాకీలు, ఫ్రేమ్​లను అమర్చి క్రమపద్ధతిలో వాటిని భీమ్స్, పిల్లర్లు, గోడల కింద ఏర్పాటు చేస్తున్నారు. ఇలా అవసరానికి తగిన విధంగా 200 నుంచి 300 వరకు జాకీలు బిగించి ఏకకాలంలో నెమ్మదిగా ఎత్తును పెంచుతున్నారు.