శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం - ముగ్గురు మృతి
కవిటి మండలంలో ఆగి ఉన్న ఆటోని ఢీకొన్న లారీ - ఘటనాస్థలంలో ముగ్గురు మృతి - మరో ఇద్దరికి తీవ్రగాయాలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : June 28, 2026 at 12:35 PM IST
Road Accident in Srikakulam District : శ్రీకాకుళం జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జమీందార పుట్టుక జాతీయ రహదారిపై ఆగి ఉన్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మృతులు గుజ్జు పుట్టుగకు చెందిన మురపాల పార్వతి, రాపాకు పుట్టుగకు చెందిన నర్తు పద్మమ్మ, ఇచ్చాపురం పురపరిది ఏఎస్ పేటకు చెందిన మండపల్లి తరినమ్మగా పోలీసులు గుర్తించారు. మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ఈ ఘటనపై కవిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

