మండలిలో బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అనిత - సభా వేదికగా కేటాయింపుల వివరణ
వార్షిక బడ్జెట్‌ను శాసన మండలిలోనూ ప్రవేశపెట్టిన మంత్రి వంగలపూడి అనిత - పలు రంగాలకు కేటాయించిన నిధులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభా వేదికగా ప్రజలకు, సభ్యులకు వివరణ

By ETV Bharat Andhra Pradesh Team
Published : February 14, 2026 at 5:13 PM IST
Home Minister Anitha Presented Annual Budget: 2026-27 రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం శాసన మండలిలోనూ ప్రవేశపెట్టింది. హోం మంత్రి వంగలపూడి అనిత మండలిలో ఆర్ధిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. పలు రంగాలకు కేటాయించిన నిధులను, ప్రభుత్వ ప్రాధాన్యతలను సభా వేదికగా ప్రజలకు, సభ్యులకు వివరించారు. రూ.3,32,205 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను మండలిలో ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చేస్తోన్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, హామీలను వివరించిన హోం మంత్రి వాటికి బడ్జెట్‌లో చేసిన కేటాయింపులను వివరించారు.
బడ్జెట్ కేటాయింపులు: 2026-27 రాష్ట్ర బడ్జెట్‌లో వివిధ సంక్షేమ పథకాలు, వివిధ కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పథకానికి రూ.27,719 కోట్లు, దీపం 2.0 - రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతుకి రూ.2,320 కోట్లు, స్త్రీశక్తి రూ.1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో రూ.450 కోట్లు, తల్లికి వందనం రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలు రూ.3,836 కోట్లు, రూ.సమగ్ర శిక్ష 2,946 కోట్లు, రూ.ఉన్నత విద్య 2,566 కోట్లు కేటాయించారు.
డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి రూ.2,161 కోట్లు, మన బడి, మన భవిష్యత్ రూ.1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధి రూ.1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర రూ.654 కోట్లు, యువత, క్రీడలకు రూ.438 కోట్లు, వీబీజీ రామ్‌జీకి రూ.8,365 కోట్లు, గృహ నిర్మాణం రూ.5,451 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవ రూ.4,000 కోట్లు, జల్‌జీవన్ మిషన్ రూ.4,000 కోట్లు, స్వచ్ఛభారత్ మిషన్ రూ.1,037 కోట్లు, ఆయుష్మాన్ భారత్ రూ.838 కోట్లు కేటాయించారు.
వ్యవసాయ బడ్జెట్: వ్యవసాయ బడ్జెట్‌ను శాసన మండలిలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కేటాయించిన నిధులు, ప్రాధాన్యతలను వివరించారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు బడ్జెట్‌లో రూ.53,752.12 కోట్లు కేటాయించినట్లు మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఆర్ధిక, వ్యవసాయ బడ్డెట్లు ప్రవేశపెట్టాక మండలి సమావేశాలను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేస్తూ ఛైర్మన్ కొయ్యే మోషేను రాజు ప్రకటించారు.
వ్యవసాయ, అనుబంధ శాఖల బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్న - ఎంత కేటాయించారంటే!
రూ.3,32,205 కోట్లతో ఏపీ బడ్జెట్ - ఏఏ శాఖకు ఏంతెంత కేటాయించారంటే?

