ETV Bharat / state

మార్చిలో పండగలే పండగలు - సెలవులే సెలవులు - ఇలా ప్లాన్​ చేసుకుంటే ఫుల్ ఎంజాయ్

అన్ని వర్గాల ప్రజలకు నూతన ఉత్సాహం వచ్చేది మార్చి మాసంలోనే - వరుసగా హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండుగలు - ప్రకృతికి చేరువై మానసిక ప్రశాంతత పెంచుకోవాలంటున్న నిపుణులు

FESTIVALS IN MARCH 2026
FESTIVALS IN MARCH 2026 (Getty Images)
author img

By ETV Bharat Telangana Team

Published : March 1, 2026 at 10:39 AM IST

3 Min Read
Choose ETV Bharat

Festivals in March 2026 : మార్చి మాసంలో వరుసగా వచ్చే సెలవులు అన్ని వర్గాల ప్రజలకు కొత్త ఉత్సాహాన్నిస్తాయి. వరుసగా వచ్చే హోలీ, ఉగాది, రంజాన్, శ్రీరామనవమి పండగలు జీవితాల్లో ఆనందం, ఆధ్యాత్మికత, ఐక్యతను పరిపూర్ణంగా నింపుతాయి. ప్రజలు ఈ సెలవుల్లో మొబైల్​ ఫోన్లను దూరం పెట్టి, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం, ప్రకృతికి చేరువై కావాల్సినంత మానసిక ప్రశాంతతకు నెలవులుగా మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

హోలీ : ఇది రంగులు చల్లుకునే సంబురమే కాదు. ప్రేమ, స్నేహాలు, సన్నిహితులు మరింత చేరువయ్యే చక్కని వేడుక. చదువు, ఉద్యోగాల ఒత్తిడిలో సతమతమవుతున్న వారందరికీ ఉత్సాహాన్ని, చిరునవ్వులను తీసుకువచ్చే మంచి వేదిక. వసంతోత్సవం పాత విభేదాలను మరిచి కొత్త సంబంధాలు, నూతన ఆశలకు ఆరంభ సూచికంగా భావించవచ్చు. ఇదే ఆనందంతో భవిష్యత్తులో జరగబోయే జీవన ప్రయాణాన్ని రంగుల హరివిల్లుగా కొనసాగిద్దాం. స్నేహతులు, చుట్టుపక్కల వారితో ఆనందంగా పండుగ చేసుకోవడం శారీరక ఉత్తేజాన్ని నింపుతుంది.

రంజాన్‌ : ఉపవాసం అనేది ఆకలి నియంత్రణకే పరిమితం కాకుండా సహనం, దానం, మానవత్వ విలువలను మనసుల్లో నాటే పవిత్రమైన ప్రక్రియ. ఉపవాస రోజుల్లో పరస్పర గౌరవం, ప్రేమాభిమానం పెంచి సమాజంలో ఇది ఐక్యతను గొప్పగా బలోపేతం చేస్తుంది. ఈ ఆచరణలను 30 రోజులకు పరిమితం చేయకుండా ఏడాది పొడవునా కొనసాగిస్తూ, అందరితో ఐక్యంగా ముందుకు అడుగులు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ రంజాన్​ సీజన్​లో ప్రజలు హలీమ్​ విక్రయ కేంద్రాల వద్ద తెగ సందడి చేస్తుంటారు. హలీమ్ నగరవాసులకు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

రంజాన్ పండగకు కొత్త దుస్తులు ధరించే సంప్రదాయం తరతరాలుగా ఉంది. వీటితో పాటు పాదరక్షలు, కాస్మొటిక్​ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తుంటారు. పండగ రోజున షీర్​ కుర్మా తయారీకి వినియోగించే డ్రై ఫ్రూట్స్​, పాయసానికి ఉపయోగించే పాత్రలను తీసుకుంటుంటారు. ఆ తర్వాత రాత్రి పూట రంజాన్​ మాసం సందడి చూసి తమకు అవసరం ఉన్న వస్తువులను కొనుగోలు చేయడానికి హైదరాబాద్​ నగరంలోని అన్ని వర్గాల ప్రజలు చార్మినార్​ నైట్​ బజార్​కు తరలి వెళ్తుంటారు.

శ్రీరామనవమి : శ్రీరాముడి మహోన్నత వ్యక్తిత్వాన్ని, ఆయనలోని గొప్ప సుగుణాలను స్మరించుకునే ప్రత్యేక సందర్భం. ధర్మం, నిజాయతీ, మాట నిలబెట్టుకోవడం, కుటుంబ విలువలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం వంటి లక్షణాలు మన జీవితానికి చాలా ఆదర్శంగా నిలుస్తాయి. ఈ పర్వదినం నుంచి నైతిక విలువలను ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలబడాలి.

ఉగాది : షడ్రుచుల ఉగాది పచ్చడి జీవితంలోని అనేక అనుభవాలను గుర్తుకు తెచ్చే ప్రత్యేక సంప్రదాయం. తీపి, చేదు, వగరు, పులుపు, కారం, ఉప్పు కలయిక జీవితంలో ఎదురయ్యే సుఖ దుఃఖాలను ఒకే విధంగా స్వీకరించాలన్న విషయాన్ని మనకు తెలియపరుస్తుంది. కొత్త లక్ష్యాలతో ముందుకు సాగాలనే మెసేజ్​ను ఇస్తుంది. తెలుగు సంవత్సరాది నుంచి సరికొత్త ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఉగాది పచ్చడిని కుటుంబ సభ్యులు, ఆత్మీయులతో కలిసి ఆస్వాదించడానికి ప్రయత్నం చేయండి.

కొత్త స్కిల్స్​ నేర్పించడం ఉత్తమం : ఈ మార్చి నెలలో నాలుగు పండుగలు, ఐదు ఆదివారాలు, రెండో శనివారం వంటి సెలవులు వస్తున్నాయి. మొబైల్ ఫోన్లను పక్కన పెట్టి సమాజానికి ఉపయోగపడే, పర్యావరణ రక్షణ కార్యక్రమాలకు కేటాయించడం ఉత్తమమైన మార్గం. తల్లిదండ్రులు తమ పిల్లలకు కొత్త స్కిల్స్​ నేర్పించడం, వ్యాయామం, యోగా, మ్యూజిక్, చిత్రలేఖనం, తోట పని వంటి హాబీలకు సమయం కచ్చితంగా కేటాయించేలా చూడాలి. వీటిని సోషల్​ మీడియాలో ఆప్‌లోడ్‌ చేద్దాం. వాటిని చూసిన దోస్తుల్లో, ఇతరుల్లో మనల్ని అనుకరించే ఆలోచన తప్పకుండా కలుగుతుంది.

కొరియాలో హోలీ ఉత్సవాలు- మనకంటే 7రోజుల ముందే చేసుకుంటారెందుకు?

హోలీ సంబురాల్లో మల్లారెడ్డి - మనవరాళ్లతో కలిసి మాస్​ డ్యాన్స్