ETV Bharat / state

ఆ కోటలు విజయనగర వైభవానికి ప్రతీకలు - మనసు పెడితే సీమకే తలమానికం!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో పేరుగాంచిన కోటలపై నిర్లక్ష్యం - పర్యాటకంగా తీర్చిదిద్దాలంటున్న నిపుణులు - ఈ దిశగా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలన్న ఆకాంక్ష

Negligence on Joint Anantapur Forts
గుత్తికోట సాహసాల గాథ (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : August 23, 2026 at 7:23 PM IST

2 Min Read
Choose ETV Bharat

Negligence on Joint Anantapur Forts : గుత్తికోట దుర్గం, పెనుకొండంత వైభవం, రాయదుర్గం రాతి ప్రాకారాలు, రత్నగిరి శిల్ప సంపద. ఇవి కేవలం కట్టడాలు మాత్రమే కాదు తరాల సీమ చరితకు, సంస్కృతికి ప్రత్యక్ష సాక్ష్యాలు. విజయనగర వైభవానికి ప్రతీకలు. ఇంతవరకు బాగానే ఉన్నా జిల్లాలో ఇవన్నీ నిర్లక్ష్యానికి గురవుతుండటం ఆవేదన కలిగిస్తోంది. ఈ నాలుగు కోటలను పర్యాటకంగా తీర్చిదిద్దితే ఉమ్మడి అనంతపురం జిల్లా రూపురేఖలు మారడంతో పాటు స్థానిక ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతమవుతుందన్నది నిపుణుల అభిప్రాయం. ఈ దిశగా సర్కార్ ప్రత్యేక కార్యాచరణ రూపొందించి పకడ్బందీగా అమలు చేయాలన్న ఆకాంక్ష వ్యక్తమవుతోంది.

స్వదేశీ దర్శన్‌ 2.0 పథకం కింద హెరిటేజ్‌ సర్క్యూట్‌కు ప్రతిపాదనలు పంపి నిధులు రాబట్టవచ్చు. ప్రసాద్‌ పథకం ద్వారా కోటల్లోని ఆధ్యాత్మిక ప్రదేశాలను అభివృద్ధి చేయవచ్చు. పురావస్తుశాఖ ద్వారా ప్రత్యేక గ్రాంట్లు తీసుకోవచ్చు. అడాప్ట్‌ ఏ హెరిటేజ్‌ కార్యక్రమం ద్వారా పీపీపీ విధానంలో కార్పొరేట్‌ సంస్థల ద్వారా పర్యాటక వసతులనూ ఏర్పాటు చేసుకోవచ్చు.

Gutthikota
గుత్తికోట (ETV Bharat)

సందర్శించడానికి అనువుగా : గుత్తికోటల సముదాయాన్ని సందర్శించడానికి అనువుగా రోప్‌వే, ట్రెక్కింగ్‌ ట్రాక్‌ ఏర్పాటుకు అవకాశం ఉంది. రాక్‌ క్లైంబింగ్, జిప్‌ లైనింగ్‌ వంటి సాహస క్రీడలనూ ప్రోత్సహించవచ్చు. రాజుల యుద్ధాల విశేషాలు, తాగునీటి బావుల ఇంజినీరింగ్‌ అద్భుతాలను వివరించేలా డిజిటల్‌ ఏర్పాట్లు చేస్తే పర్యాటకులను ఆకర్షించవచ్చు. స్థానికులు వచ్చేలా పార్కులు అభివృద్ధి చేసినా ప్రయోజనమే.

Negligence on Joint Anantapur Forts
పెనుకొండ వారసత్వ అండ (ETV Bharat)

3డీ లేజర్‌ షో : విజయనగర రాజుల రెండో రాజధాని పెనుకొండ. ఎన్‌హెచ్‌ - 44కు ఆనుకుని ఉండటం పర్యాటకంగా కలిసొస్తోంది. గగన్‌ మహల్, తిమ్మరుసు జైలు పరిసర ప్రాంతాలను పునరుద్ధరించడంతో పాటు వారాంతాల్లో గగన్​మహల్‌ వద్ద 3డీ లేజర్‌ షో నిర్వహిస్తూ విజయ నగర వైభవం పేరుతో సాంస్కృతిక ప్రదర్శనల ఏర్పాటు ఉపయుక్తమే. అడ్వెంచర్‌ ట్రెక్కింగ్‌కు మంచి అవకాశం. రెస్టారెంట్లు, రీసార్టులు పెడితే సందర్శకులు పెరుగుతారు. ఐటీ ఉద్యోగుల కోసం వీకెండ్‌ ప్యాకేజీలు రూపొందిస్తే మంచి ఆదాయం కూడా వస్తుంది.

Negligence on Joint Anantapur Forts
రత్నగిరి కోట (ETV Bharat)

కోట చుట్టూ ఎకో టూరిజం : ప్రకృతి ఒడిలో ఉన్న రత్నగిరికోట చుట్టూ ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. పార్కులు, ఓపెన్‌ క్యాంపింగ్‌కు అనువుగా తీర్చిదిద్దవచ్చు. గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించేలా రూరల్‌ టూరిజంనూ ప్రోత్సహించవచ్చు. ప్రధాన రహదారుల నుంచి రత్నగిరి కోటకు వెళ్లే లింక్‌ రోడ్లను విస్తరించాల్సిన అవసరం ఉంది.

Negligence on Joint Anantapur Forts
రాయదుర్గం కోట (ETV Bharat)

కింది భాగంలో దశభుజ గణపతి : రాయదుర్గం కోటపైన రామాలయం, కింది భాగంలో దశభుజ గణపతి, వెంకటరమణ స్వామి దేవాలయం, ఉత్తరాది మఠం, 5 కిలోమీటర్ల దూరంలోని దేశంలోనే ప్రసిద్ధిగాంచిన పశుపతినాథ ఆలయాలను కలిపి రాయదుర్గం కోటను టెంపుల్‌ టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేయవచ్చు. ప్రస్తుతం పురావస్తుశాఖ ఆధ్వర్యంలో రూ. 70 లక్షలతో కోట ముఖద్వారాన్ని పునరుద్ధరిస్తుండటం విశేషం.

భవిష్యత్ సవాళ్లను ఎదుర్కోవాలంటే కంఫర్ట్‌ జోన్‌ నుంచి బయటికి రావాలి: వ్యోమగామి శుభాంశు శుక్లా

భార్య కనిపించడం లేదని పోలీస్​స్టేషన్​కు భర్త - విచారణలో బయటపడ్డ భయంకరమైన నిజం