ETV Bharat / state

ప్రభుత్వ పాఠశాలలకు, రైతు వేదికలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్ - వ్యవసాయ, విద్య రంగాల్లో అభివృద్ధి

2,010 ప్రభుత్వ పాఠశాలలు, 1,500 రైతు వేదికలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ - టీఫైబర్‌ వినూత్న సేవలు - వ్యవసాయ, విద్య రంగాల్లో అభివృద్ధి

అడవి శ్రీరాంపూర్‌ ప్రభుత్వ బడి - ఏఐ ల్యాబ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు
అడవి శ్రీరాంపూర్‌ ప్రభుత్వ బడి - ఏఐ ల్యాబ్‌లో ఉపాధ్యాయులు, విద్యార్థులు (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 11, 2026 at 6:45 PM IST

3 Min Read
Choose ETV Bharat

High Speed Internet for Government Schools : పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్‌ గ్రామంలో సంవత్సరం క్రితం వరకు ఇంటర్నెట్‌ లేదు. ఇప్పుడు రోజుకు దాదాపు 15 టెరాబైట్ల డేటాను వాడుతున్నారు. ఇక్కడి బడులోనూ డిజిటల్‌ పాఠాలు చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ గ్రామీణ మండలం చందా గ్రామంలోని రైతు వేదిక వద్ద హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించారు. దీంతో సాగు పద్ధతులపై శాస్త్రీయ సలహాలు పొందే అవకాశం రైతులకు దక్కింది.

ఒకప్పుడు ఇంటర్నెట్‌ అంటేనే తెలియని పల్లెలు ఇవి. ప్రస్తుతం ఆ గ్రామాల్లోని పాఠశాలల్లో డిజిటల్‌ పాఠాలు బోధిస్తున్నారు. అక్కడి రైతు వేదికలకు హైస్పీడ్ఠ్‌ విజ్ఞానం అందుతోంది. అటు విద్యార్థులకు, ఇటు రైతులకు ప్రపంచ విజ్ఞానం చేరువవుతోంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సమగ్ర గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ఫైబర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్బ్‌టీఫైబర్శ్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.

సిద్దిపేట జిల్లా చిన్న గుండవెల్లి రైతువేదికలో సీఎం ప్రసంగం వింటున్న రైతులు
సిద్దిపేట జిల్లా చిన్న గుండవెల్లి రైతువేదికలో సీఎం ప్రసంగం వింటున్న రైతులు (Eenadu)

వ్యవసాయ, విద్య రంగాల్లో అభివృద్ధి : గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో విద్య, వ్యవసాయ రంగాలను బలోపేతం చేసే దిశగా బలమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తోంది. పాఠశాల విద్యాశాఖ సూచనల మేరకు గ్రామీణంలో 2,010 ప్రభుత్వ బడులకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 6 వందలకు పైగా ప్రభుత్వ బడులకు ఈ సౌకర్యం కల్పించారు. మరోవైపు దాదాపు 1,500 రైతు వేదికలకు కూడా టీఫైబర్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించారు. తద్వారా గ్రామీణ డిజిటలీకరణ అత్యంత వేగంగా విస్తరించడానికి మార్గం సులభమయ్యింది. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్‌ మౌలిక వసతులను సామాజిక మార్పునకు సాధనంగా ఉపయోగిస్తున్న నేపథ్యంలో వ్యవసాయ, విద్య రంగాల్లో సమగ్ర, స్థిరమైన అభివృద్ధి సాధించడానికి ఇది బలమైన పునాది వేస్తోంది.

విద్యార్థులకు విజ్ఞానం : -

  • హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ బడుల్లో లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్బ్‌ఎల్‌ఎంఎస్శ్, డిజిటల్‌ క్లాస్‌రూమ్‌లు, ఆన్‌లైన్‌లో మూల్యాంకనాలు, ఇంటరాక్టివ్‌ లెర్నింగ్‌ టూల్స్‌ను ఉపయోగించుకుంటున్నారు.
  • పర్‌ప్లెక్సిటీ, చాట్‌జీపీటీ వంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యావేదికల ద్వారా స్టూడెంట్స్​ ఆధునిక విజ్ఞానాన్ని పొందే అవకాశాలు పెరిగాయి.
  • ప్రాంతీయ భాషల డిజిటల్‌ కంటెంట్‌ పెంపు ద్వారా స్టూడెంట్స్​లో అవగాహన మరింత పెరుగుతోంది.
  • పాఠ్యాంశాలను ముందుగానే అధ్యయనం చేసే అవకాశం కుదురుతోంది.
  • కోడింగ్, వృత్తి విద్య, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్‌ వంటి అంశాలను పాఠశాల స్థాయిలోనే పరిచయం చేయవచ్చు.

రైతులకు అండ : -

  • రైతు వేదికలకు ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించడం ద్వారా రైతన్నలు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో వర్చువల్‌ మీటింగుల్లో పాల్గొని ఆధునిక సాగు పద్ధతులపై, పంటల ఆరోగ్యం, సమస్యలపై ప్రత్యక్షంగా చర్చలు జరిపే అవకాశం దొరికింది. శాస్త్రీయ సూచనలు తెలుసుకుంటున్నారు.
  • పంట ధరల సమాచారం, ఎగుమతి అవకాశాలపై రియల్‌ టైమ్‌ అప్‌డేట్స్‌ పొందొచ్చు.
  • భూసార నివేదికలు, వాతావరణ అంచనాలు రైతులకు చేరడం ద్వారా సాగు నిర్ణయాలు మరింత శాస్త్రీయంగా మారుతాయి.
  • పంటల నిర్వహణపై సరికొత్త నిర్ణయాలు, రైతులు తమ ఉత్పత్తులకు సరసమైన ధర పొందడం, మెరుగైన దిగుబడులు తదితర అంశాలపై అవగాహన కలుగుతుంది.
  • ఇది తెలంగాణ గ్రామీణ వ్యవసాయ ఉత్పాదకతను పెంచే దిశగా కీలక ముందడుగుగా నిలుస్తోంది.

తెలంగాణలో మారుమూల ప్రాంతాలైన కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా బెజ్జూరు మండలం కుకుడా, ఆసిఫాబాద్‌ మండలం జనకాపూర్‌ గ్రామాల్లోని ఎంపీపీఎస్‌ బడుల్లో ఇంటర్నెట్‌ సౌకర్యం అందుబాటులోకి రావడమనేది ఒక కలే. అలాంటి బడుల్లో ప్రస్తుతం స్టూడెంట్స్ డిజిటల్‌ సౌకర్యాలతో విద్యను అభ్యసిస్తున్నారు.

"వ్యవసాయ, విద్య రంగాల్లో సమాన అవకాశాలు కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు అనుగుణంగా సమగ్ర కార్యక్రమాల ద్వారా డిజిటల్‌ మౌలిక సదుపాయాలను సామాజిక మార్పునకు శక్తిమంతమైన సాధనంగా ఉపయోగిస్తున్నాం. తొలిదశలో 5,000 ప్రభుత్వ బడులకు కనెక్టివిటీ అందించి తదుపరి దశల్లో తెలంగాణలోని మొత్తం 26,000 పాఠశాలలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలతో ఒక మారుమూల ప్రాంతంలోని ప్రభుత్వ స్కూల్ కూడా పట్టణాల్లోని కార్పొరేట్‌ స్కూళ్లతో సమానమైన డిజిటల్‌ అవకాశాలను పొందేందుకు అవకాశం ఉంటుంది." - పన్నీరు వేణుప్రసాద్, ఎండీ, టీఫైబర్‌

పాఠశాల దశనుంచే సివిల్స్​ వైపు అడుగులు - ఈ సర్కారు బడి​ గురించి మీకు తెలుసా?