కంప్యూటర్ సైన్స్‌కే ఓటు వేస్తున్న స్టూడెంట్స్ - ఈ నెల 7 వరకు ఆప్షన్లు మార్చుకునే అవకాశం
ఇంజినీరింగ్‌లో కంప్యూటర్ సైన్స్‌కే తొలి ప్రాధాన్యమిస్తున్న విద్యార్థులు - ఇంజినీరింగ్‌లో 79,313 సీట్లకు మాక్ కేటాయింపులు - తొలివిడత 7 వరకు ఆప్షన్లు మార్చుకునే అవకాశం - 10లోగా ఎప్‌సెట్ తొలివిడత తుది కేటాయింపులు

Published : July 5, 2026 at 9:27 AM IST
Students Interest on Computer Science : తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్, ఐటీ ఆధారిత కోర్సులకు ఎక్కువ డిమాండ్ ఉంది. నూతనంగా ప్రవేశాలు కోరుకుంటున్న స్టూడెంట్స్ కంప్యూటర్‌సైన్స్, అనుబంధ కోర్సులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎప్‌సెట్ ఇంజినీరింగ్ సీట్ల భర్తీకి నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ మాక్‌సీట్ల కేటాయింపు వివరాలు శనివారం వెల్లడయ్యాయి.
నేటి నుంచి ఆప్షన్లు మార్చుకోవచ్చు : తెలంగాణలోని 175 కాలేజీల్లో కన్వీనర్ కోటాలో అన్ని బ్రాంచీల్లో కలిపి మొత్తం 88,053 సీట్లు అందుబాటులో ఉంటే మాక్ కేటాయింపుల్లో 79,313 సీట్లు (90 %) కేటాయించినట్లు కన్వీనర్ ఎ.శ్రీదేవసేన తెలిపారు. ఇంజినీరింగ్‌లో 8,740 సీట్లు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించారు. సీట్ల కోసం 8,740 మంది ఆప్షన్లు ఇచ్చినా సీటు లభించలేదని, ఈడబ్ల్యూఎస్ కోటాలో 6261 మంది సీట్లు పొందారని చెప్పారు. మాక్‌సీట్ల కేటాయింపు తాత్కాలిక అంచనా మాత్రమే అని స్పష్టం చేశారు. విద్యార్థులు ఈ నెల 5 నుంచి 7 వరకు తమ ఆప్షన్లు మార్చుకోవచ్చని, ఈ ఆప్షన్లకు అనుగుణంగా జూలై 10లోగా తొలి విడత సీట్ల కేటాయింపులు జరుగుతాయని వివరిచారు.
మాక్ కేటాయింపులు ఇలా ఉన్నాయి : -
- కంప్యూటర్‌సైన్స్, అనుబంధ కోర్సులు : ఈ కేటగిరీలో 19 రకాల కోర్సులు ఉన్నాయి. వీటిలో మొత్తం 62,509 సీట్లు ఉంటే మాక్ కేటాయింపుల్లో 58,052 సీట్లు (93 %) భర్తీ అయ్యాయి. ఇంకా 4457 సీట్లు ఉన్నాయి. ఈ సీట్ల భర్తీలో సీఎంఈ, ఏఐ, ఆర్‌ఏఐ, సీఎస్‌ఎన్, సీఎస్‌బీ, సీఎస్‌ఈ, సీఎస్‌సీ, సీఎస్‌వో, సీఎస్‌డీ, సీఎస్‌ఎం, ఐఎన్‌ఎఫ్, ఏఐఎం, సీఐసీ, ఏఐడీ కోర్సుల్లో 75 శాతానికిపైగా సీట్లు భర్తీ అయ్యాయి. డేటాసైన్స్‌లో 66 సీట్లు ఉంటే 6 సీట్లు మాత్రమే కేటాయించింది. 60 ఖాళీగా ఉన్నాయి. ఎక్కువగా కంప్యూటర్ సైన్స్ (సీఎస్‌ఈ) కోర్సులో మొత్తం 29,519 సీట్ల ఉంటే 28,009 సీట్లు భర్తీ అయ్యాయి.
- ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాలకు చెందిన 8 కోర్సుల్లో కలిపి 17,054 సీట్లు ఉన్నాయి. మాక్‌సీట్లలో 14,469 (85 %) కేటాయింపులు జరిగాయి. ఇంకా 2585 సీట్లు ఇంకా ఖాళీగానే ఉన్నాయి. ఈ సంవత్సరం ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సులో మొత్తం 11,725 సీట్లు ఉన్నాయి. ఇందులో 10,453 సీట్లు భర్తీ అయ్యాయి.
- మెకానికల్, సివిల్, ఇతర అనుబంధ కోర్సులు మొత్తం 10 విభాగాల్లో కలిపి 7455 సీట్లు ఉన్నాయి. ఇందులో 5947 సీట్లు (80 %) భర్తీ అయ్యాయి. ఇంకా 1508 సీట్లు ఖాళీగా ఉన్నాయి.
- ఇతర ఇంజినీరింగ్ విభాగంలో 11 కోర్సులు ఉన్నాయి. ఇందులో 1035 సీట్లు ఉన్నాయి. ఇందులో 845 సీట్లు (82 %) భర్తీ అయ్యాయి. జియో ఇన్ఫర్మాటిక్స్, కెమికల్, ఫుడ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, టెక్స్‌టైల్ టెక్నాలజీలో సీట్లు అన్నీ భర్తీ అయ్యాయి.
టీజీ ఎప్‌సెట్ మాక్ సీట్ల అలాట్‌మెంట్ పూర్తి - ఏ కళాశాలలో మీకు సీటొచ్చింది?
ఇంజినీరింగ్ సీట్ ఓకే - మరి జాబ్ ఎలా? - ఏ కోర్సు, కాలేజీ బెస్ట్!

