ETV Bharat / state

బండి భగీరథ్​ రెగ్యులర్ బెయిల్ పిటిషన్​కు హైకోర్టు అనుమతి

బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరణకు హైకోర్టు అనుమతి - పోక్సో కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన భగీరథ్ - రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేసుకోవడానికి అనుమతించిన హైకోర్టు

HC ON BANDI BHAGEERATH CASE
HC ON BANDI BHAGEERATH CASE (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : May 21, 2026 at 8:42 PM IST

3 Min Read
Choose ETV Bharat

HC Permission To Bhageerath To File Regular Bail Petition : బండి భగీరథ్ ధాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్​ను ఉపసంహరించుకోవడానికి హైకోర్టు అనుమతించింది. ఈ మేరకు భగీరథ్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఓ మైనర్ బాలిక తల్లి ఫిర్యాదు మేరకు సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పీఎస్​లో ఈ నెల 8వ తేదీన బండి భగీరథ్​పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ బండి భగీరథ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్​పై 15వ తేదీన హైకోర్టు సుదీర్ఘ వాదనలు వింది. ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వు చేసింది.

రెగ్యులర్​ బెయిల్​ పిటిషన్​కు అనుమతి : ఈ నెల 16వ తేదీన భగీరథ్​ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. దీంతో ముందస్తు బెయిల్ పిటిషన్ నిరర్దకంగా మారింది. ఈ పిటిషన్​ను ఉపసంహరించుకునేలా బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. బండి భగీరథ్​ను పోలీసులు అరెస్ట్ చేయడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీంతో ఉపసంహరణకు అనుమతించిన హైకోర్టు, బండి భగీరథ్ రెగ్యులర్ బెయిల్ వేసుకోవడానికి అనుమతించింది.

కేసు దర్యాప్తు ముమ్మరం : బండి భగీరథ్​పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదులో ఘటన జరిగినప్పుడు భగీరథ్‌తో పాటు ఉన్న ఫ్రెండ్స్, ఆ తర్వాత రాజీ కోసం ప్రయత్నించారంటూ కొంత మంది పేర్లను చెప్పారు. దీంతో పోలీసులు ఇటీవలే వారిని కూడా పేట్​బషీరాబాద్​ పోలీస్ స్టేషన్​లో విచారించారు. ఘటన జరిగిన రోజు అసలు ఏం జరిగిందనే అంశాలపై ఆరా తీశారు. పలు విషయాలకు సంబంధించి వారిని ప్రశ్నించారు. అనంతరం బగీరథ్​ స్నేహితుల స్టేట్​మెంట్లను రికార్డు చేశారు.

బండి భగీరథ్‌పై నమోదైనటువంటి పోక్సో కేసులో పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు దర్యాప్తు కోసం ఆధారాల సేకరణపై దృష్టి సారించారు. ఈ నెల 16న నిందితుడు భగీరథ్​ను అరెస్టు చేసి పేట్‌ బషీరాబాద్‌ ఠాణాకు తీసుకెళ్లాక దాదాపు రెండు గంటల పాటు విచారణ చేసి అతడి నుంచి వాంగ్మూలం నమోదు చేసి రిమాండు రిపోర్టులో పొందుపర్చిన విషయం విదితమే. పోక్సో కేసు నమోదైన తర్వాత ఎందుకు పరారయ్యారని ప్రధానంగా ప్రశ్నించినట్లు సమాచారం.

ఇద్దరి వాంగ్మూలాలను పోల్చి : ఈ సందర్భంగా భగీరథ్‌ తన దగ్గరున్న పలు ఆధారాలను అందించడంతో పాటు తాను ఎలాంటి తప్పూ చేయలేదని పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మైనర్ బాలిక తల్లి ఇచ్చిన కంప్లైంట్, స్టేట్​మెంట్ ఆధారంగా కూడా పోలీసులు కొన్ని ప్రశ్నలు సంధించి సమాధానాలను రాబట్టారు. చివరగా బాధితురాలు ఇచ్చిన వాంగ్మూలంతో అతను చెప్పిన విషయాలను పోల్చి చూశారు. అనంతరం భగీరథ్‌కు మెడికల్ టెస్టులను నిర్వహించి న్యాయమూర్తి ముందు హాజరుపర్చి చర్లపల్లి జైలుకు తరలించారు. ఇంకా అతడిని పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు కస్టడీకి తీసుకోవాలని నిర్ణయించి, న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలుకు పోలీసులు సిద్ధం అవుతున్నారు.

ఇప్పటికే బాలిక, ఆమె తల్లి, భగీరథ్‌ ఇచ్చిన వాంగ్మూలాలు పొందుపర్చిన నేపథ్యంలో సాక్షులు చెప్పే విషయాలు కీలకం కానున్నాయి. వీరంతా చెప్పిన విషయాలతో పాటు పోలీసులు సాంకేతికంగా ఇతర రూపాల్లోనూ ఆధారాలు సేకరించనున్నారు. ఇప్పటికే మొయినాబాద్‌లోని 2 ఫామ్‌హౌస్‌లు, నానక్‌రాంగూడలోని సర్వీస్‌ అపార్టుమెంటు తదితర ప్రాంతాల నుంచి పలు ఆధారాలను పోలీసులు సేకరించారు.

అసలు ఆరోజు ఏం జరిగింది? : బండి భగీరథ్​ స్నేహితులను విచారించిన పోలీసులు

బండి భగీరథ్‌కు 14 రోజుల జ్యూడీషియల్‌ రిమాండ్ - పోలీసులు కస్టడీకి కోరితే సహకరిస్తాం