అల్లూరి జిల్లాలో అకాల వర్షం - పాడేరులో గంట పాటు భారీ వాన
మోదకొండమ్మ జాతరలో ఇబ్బందులు - తడిసిన స్టాళ్లు - ఈదురుగాలులకు ఎగిరిపోయిన టెంట్లు, ఫ్లెక్సీలు

By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2026 at 6:17 PM IST
Heavy Rains in Paderu At Alluri District: అల్లూరి జిల్లాలో అకాల వర్షం బీభత్సం సృష్టించింది. పాడేరులో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం గంటపాటు కురిసింది. ఈ వర్షం కారణంగా శ్రీ మోదకొండమ్మ జాతర మహోత్సవాల్లో రెండో రోజు చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటపాటు కురిసిన వర్షం కారణంగా స్టాళ్లు పూర్తిగా తడిచిపోయాయి. ఈదురుగాలులకు టెంట్లు, ఫ్లెక్సీలు ఎగిరిపోయాయి. స్టాళ్ల లోపల ఆకృతులు నీటిలో తడిచిపోయాయి. పాడేరుతోపాటు, జి.మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగూడ మండలాల్లో సైతం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది.
అప్రమత్తత అవసరం: అనిశ్చిత వాతావరణ పరిస్థితుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన భద్రతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచించారు. పంటలకు నివాస గృహాలకు సంభవించే నష్టాన్ని తగ్గించుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని సలహా ఇచ్చారు. ప్రస్తుతం నెలకొన్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండలన్నారు. పంట, ఆస్థి నష్టం జరగకుండా ఉండేందుకు అధికారులు జారీ చేసే సూచనలను కచ్చితంగా పాటించడం ఆవశ్యకమని అధికారులు చెప్పారు. గత కొన్ని రోజులుగా అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నప్పటికీ, వేడి తీవ్రత మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే.
ఈదురు గాలులతో బీభత్సం - అల్లూరి జిల్లాలో భారీ వర్షం - నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
అల్లూరి జిల్లాలో భారీ వర్షం.. పాడేరు-అరకు రోడ్డులో కొట్టుకుపోయిన కల్వర్టు

