ETV Bharat / state

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం - ప్రభుత్వాసుపత్రుల్లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స ఎప్పటికి వస్తుంది?

ప్రభుత్వాసుపత్రుల్లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్స లేకపోవడంపై హైకోర్టు ఆక్షేపణ - చికిత్స ఎప్పటికి అందుబాటులోకి తెస్తారో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం - చికిత్స అందించే ఆర్థిక సాయం పెంచే అంశాన్ని పరిశీలించాలన్న హైకోర్టు

HC On Cancer Treatment At Government Hospitals
HC On Cancer Treatment At Government Hospitals (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : February 18, 2026 at 9:12 AM IST

2 Min Read
Choose ETV Bharat

HC On Cancer Treatment At Government Hospitals : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ (మూలుగ మార్పిడి) చికిత్స అందుబాటులో లేకపోవడాన్ని హైకోర్టు ఆక్షేపించింది. ఇతర రాష్ట్రాల్లో ఈ చికిత్స ఉచితంగా అందిస్తున్నప్పుడు అభివృద్ధి దిశగా పయనిస్తోన్న ఏపీలో ఈ సౌకర్యం లేకపోవడం ఏమిటని ప్రశ్నించింది.

దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవా పథకం కింద బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సకు వెసులుబాటు ఉన్నప్పటికి రోగులకు చెల్లించే సొమ్ముపై రూ.11 లక్షలు పరిమితిని విధించడాన్ని తప్పుపట్టింది. రోగులకు చెల్లించే ఆర్థిక సాయాన్ని (రీయింబర్స్​మెంట్) పెంచే అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోన్​మారో ట్రాన్స్​ప్లాంటేషన్ చికిత్స అందుబాటులోకి తెచ్చే విషయంలో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి తదితరులను ఆదేశించింది.

మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రులలో బోన్‌మారో వంటి ప్రత్యేక వైద్య చికిత్సలను తీసుకొచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్​. ప్రణతి హైకోర్టుకు నివేదించిన నేపథ్యంలో చికిత్సను ఎప్పటి నుంచి అందుబాటులోకి తెస్తారనే వివరాలను తెలియజేస్తూ అఫిడవిట్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్​సింగ్ ఠాకుర్, జస్టిస్ చల్లా గుణరంజన్​లతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు ఉత్తర్వులు ఇచ్చింది.

అత్యంత ఖరీదైన బోన్‌మారో ట్రాన్స్‌ప్లాంటేషన్‌ చికిత్సలను ప్రభుత్వాసుపత్రులు, వైద్య కళాశాలల్లో అందుబాటులో తీసుకు రాకపోవడాన్ని సవాలు చేస్తూ ఎన్టీఆర్ జిల్లా పెనుగొలను గ్రామానికి చెందిన వెంకటసాయి కుమార్‌ హైకోర్టులో పిల్‌ వేశారు. ఆయన నేరుగా వాదనలు వినిపించారు. '' ప్రైవేట్ ఆసుపత్రులలోనే ఈ చికిత్స అందుబాటులో ఉంది. అందుకు రోగులు భారీ స్థాయిలో సొమ్ము చెల్లించాలి వస్తోంది. ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ చికిత్సకు అందించే సాయాన్ని రూ.11 లక్షలకే పరిమితం చేశారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్సకు భారీ మొత్తం వెచ్చించలేక పలువురు ప్రాణాలు కోల్పోయారు. పొరుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బోన్​మారో ట్రాన్స్​ప్లాంటేషన్ చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు.'' అని తెలిపారు.

బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్ ఎప్పుడు అవసరం : బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్ (మూలుగ మార్పిడి) చికిత్స రెండు రకాలు. అవి అటులాగాస్ బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్, అల్లోజెనిక్ బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్. వీటిని క్యాన్సర్ నివరాణకు వాడతారని నిపుణులు చెబుతున్నారు.

అటులాగాస్ బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్ : ఈ చికిత్స విధానంలో రోగి నుంచి మూల కణాలు తీసుకొని ఎక్కిస్తారు.

అల్లోజెనిక్ బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్ : ఈ చికిత్సలో ఇతరుల నుంచి మూల కణాలను తీసుకొని వినియోగించాల్సించాల్సి ఉంటుంది. అటులాగాస్ బోన్​మారో ట్రాన్సుప్లాంటేషన్ తిరగ బెట్టిన క్యాన్సర్ రోగులకు చేస్తారు. మరికొన్ని బ్లడ్ క్యాన్సర్లకు చేయాల్సి ఉంటుందిని నిపుణులు చెబుతున్నారు.

అంబటి రాంబాబుకు నోటీసులిచ్చి వివరణ తీసుకోవాలి - పోలీసులకు హైకోర్టు ఆదేశం

పోలీసుల లుక్‌ఔట్‌ సర్క్యులర్​పై హైకోర్టు అభ్యంతరం - ఎల్​వోసీని కొట్టేస్తూ ఉత్తర్వులు జారీ