ETV Bharat / state

ట్రెండ్​ని మార్చేస్తున్న మ్యూజిక్​ కాన్సర్ట్స్ - మరింత డిమాండ్​ పెరిగే అవకాశం

జెన్​ జీ యువత సంగీత కచేరీలు, వేడుకల కోసం విస్తరిస్తున్న సంగీత పర్యాటకం - 2026లో భారత్​ జెన్​లో మ్యూజికల్​ ఫెస్టివల్స్​ కోసం ప్లాన్​ చేసిన 62 శాతం - ఎయిర్​బీఎన్​బీ నివేదిక వెల్లడి

Globally Growing Music Tourism
Globally Growing Music Tourism (Eenadu)
author img

By ETV Bharat Telangana Team

Published : January 8, 2026 at 2:09 PM IST

3 Min Read
Choose ETV Bharat

Globally Growing Music Tourism : మనలో ఉన్న ఎలాంటి భావోద్వేగాన్నయినా అందంగా, మృదువుగా ప్రదర్శించే ఆ మనసు భాష అర్థం కానిదెవరికి చెప్పండి. ఈ ప్రపంచంలో ఉన్న వందల వేల సంస్కృతుల్లో ప్రతి పాట వెనకా ఓ కథ ఉంటుంది. ఇలాంటి సంగీతాలు వింటూ ఎవరైనా మైమర్చిపోతాం. శ్రావ్యమైన పాట వింటే ఎవరైనా తలలూపాల్సిందే. అందులో మరింత హుషారైన గానం వినిపిస్తే చాలు కాలు కదుపుతాం. తనువు, మనసును పులకింపజేసి శక్తి సంగీత సర్వాలకు ఉంది.

  • ఇటీవల విజయవాడలో జరిగిన లైవ్​ మ్యూజిక్​ కాన్సర్ట్​లో పాల్గొనేందుకు హైదరాబాద్​కు చెందిన పలువురు అక్కడికి వెళ్లారు. హైదరాబాద్​లో ఎ.ఆర్​.రెహమన్​ ప్రదర్శనను ఆస్వాదించేందుకు బెంగళూరు నుంచి కొందరు ఇక్కిడికి వచ్చారు. ఇప్పుడు మన దేశంలో కొత్తగా విస్తరిస్తున్న సంగీత పర్యాటకానికి ఇవే నిదర్శనాలివి.

ప్రయాణాలకు తోడుగా : మరి ముఖ్యంగా జెన్​ జీ యువత సంగీత కచేరీలు, వేడుకల కోసం ప్రయాణాలు చేయడానికి తోడు ఇప్పుడు సంగీత పర్యాటకం బాగా విస్తరిస్తోంది. మంగళవారం ఎయిర్​బీఎన్​బీ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026లో భారత్​ జెన్​లో 62 శాతం మంది కచేరీలు, మ్యూజికల్​ ఫెస్టివల్స్​ కోసం వారి ప్రయాణాలను ప్లాన్​ చేస్తున్నట్లు వెల్లడైంది.

కొత్త నగరం సందర్శన : జెన్‌ జీలో 76 శాతం మంది మ్యూజిక్‌ ఫెస్టివల్‌ కారణంగా మొదటిసారి ఒక కొత్త నగరాన్ని సందర్శించామని తెలిపారు. సాంస్కృతిక అనుభవాలు ప్రయాణ నిర్ణయాలు ఎలా కారణం అవుతున్నాయో అన్నది స్పష్టం చేసింది.

స్నేహితులతో కలిసి : సంగీత వేడుకలకు స్నేహితులతో కలిసి ఒక టీంగా వెళ్లేవారు 70 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది. ఆ వేడుక తర్వాత స్థానిక ప్రాంతాల సందర్శనకు అక్కడ గడుపుతున్న వారు 53% ఉన్నారు. వీరంతా అక్కడి పర్యాటక కేంద్రాలు, సాంస్కృతిక ప్రదేశాలు, నైట్​లైఫ్​ను ఆస్వాదిస్తున్నారు.

విదేశాలకు సైతం : దేశీయంగా వేర్వేరు నగరాల్లో జరిగే వేడుకలే కాదు. తమ అభిమాన గాయకులు, ఆర్టిస్టులను చూసేందుకు విదేశాలకు వెళ్లేందుకూ సిద్ధంగా ఉన్నామని 40 శాతం మంది చెప్పారు.

ఖర్చు గురించి తగ్గేదే లేదు : సంగీతం మానసిక ఉల్లాసాన్ని ఇవ్వడమే కాదు. ఒత్తిడినీ దూరం చేస్తుంది. ఇందుకోసం ఖర్చుకు వెనకాడకుండా సరిగమల ప్రయాణానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. ప్రతి ఆరుగురిలో ఒకరు తమ నెలవారీ సంపాదనలో 21-40 శాతం వరకు వారు సంగీత ఆధారిత ప్రయాణాల కోసం కేటాయిస్తున్నారు. ఇది గరిష్ఠంగా 50 శాతం పైగా దాటుతుంది.

ట్రెండ్​ని మార్చేస్తున్న మ్యూజిక్​ కాన్సర్ట్స్​ : ఇప్పుడు దేశంలో బహుళ ఆదరణ పొందుతున్న రంగం ఏదైనా ఉంది అంటే అది సంగీత పర్యాటకం అనే చెప్పాలి. సంగీత నృత్యాలకు ఘన వారసత్వం కలిగిన మన దేశంలో మ్యూజిక్‌ కాన్సర్ట్‌లు టూరిజం ట్రెండ్స్‌నే మార్చేస్తున్నాయి. ప్రపంచస్థాయి అనుభవాల కోసం యువ శ్రోతల ఆరాటం, యువత ఆదాయ స్థాయులు పెరగడం సంగీత పర్యాటక పరిశ్రమకు కొత్త కళను రూపుదిద్దుతోంది. దాని ఫలితాలే లైవ్​ ఎంటర్​టైన్​మెంట్​లో భారత్‌ ప్రపంచస్థాయి గమ్యస్థానాల్లో ఒకటిగా పేరు పొందుతోంది. ఇండియాలో కాన్సర్ట్‌ ఎకానమీకి బోలెడు అవకాశాలు ఉన్నాయని మోదీ గతంలో స్పష్టం చేశారు.

అధ్యయనం ప్రకారం : ఈ కాన్సర్ట్​ 2032 నాటికి ఎకానమీ 1.2 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని వెల్లడైంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా డిమాండు బాగా పెరిగిపోతుంది. హైదరాబాద్​, బెంగళూరు, ముంబయి, దిల్లీ వంటి మహానగరాలను దాటేసి ప్రస్తుతం ఇటానగర్, గువాహటి, షిల్లాంగ్‌ వంటి ప్రాంతాలకూ ఈట్రెండ్‌ పాకుతోంది.

గత మూడేళ్ల క్రితం 2023లో 26 వేలకుపైగా లైవ్‌ ఈవెంట్లు జరగాయి. గత ఏడాది ఆ సంఖ్య 30 వేలను దాటేసింది. వ్యవస్థీకృత లైవ్‌ ఈవెంట్‌ రంగం వచ్చే మూడేళ్లలో 19శాతం సీఏజీఆర్‌ సాధించనున్నట్లు అంచనా వేస్తున్నారు. దీని కారణంగా దిల్లీ ప్రభుత్వం ఒక ప్రఖ్యాత లైవ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫ్లాట్‌ఫాంతో ఎంవోయూనే కుదుర్చుకుంది. అస్సాం తదితర రాష్ట్రాలు ప్రత్యేక పాలసీలనే తీసుకొచ్చాయి.

సన్నాయి వాయిద్యంలో రాణిస్తున్న యువతులు - పురుషులకు దీటుగా ప్రతిభ చూపుతున్న వైనం

బీట్ ఏదైనా ఓకే - కానీ సినిమా పాటే కావాలి - యూత్​ అంటే అట్లుంటది మరి