ETV Bharat / state

గవర్నర్‌ నివాస సముదాయం నిర్మాణానికి ఆర్థికశాఖ అనుమతి - రూ. 212.22 కోట్లతో భవనం

గవర్నర్‌ నివాస సముదాయం నిర్మాణానికి ఆర్థికశాఖ అనుమతి- అమరావతిలో రూ. 212.22 కోట్లతో నిర్మించనున్న గవర్నర్‌ నివాస సముదాయం - సీఆర్‌డీఏ నిధులు ఇందుకోసం వెచ్చించాలని స్పష్టం

Governor's Residence Complex In Amaravati
గవర్నర్‌ నివాస సముదాయం నిర్మాణానికి ఆర్థికశాఖ అనుమతి (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : September 1, 2026 at 9:41 AM IST

2 Min Read
Choose ETV Bharat

Governor's Residence Complex In Amaravati : రాజధాని నగరం అమరావతి నిర్మాణంలో మరో కీలక ముందడుగు పడింది. ప్రభుత్వ సముదాయం పరిధిలో 'లోక్ భవన్' నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఆర్థిక శాఖ ఇప్పటికే దీని కోసం రూ.212.22 కోట్లు కేటాయించగా, ఇప్పుడు ప్రభుత్వం దీనికి తుది ఆమోదం ఇచ్చింది. రాజధాని ప్రాంతంలో శాశ్వత ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశ్యం.

అధికార భవనాలు కూడా నిర్మాణం : రూపొందనున్న లోక్ భవన్ సముదాయం అత్యాధునిక వసతులతో కూడి ఉంటుంది. ఇందులో గవర్నర్ నివాసం, అసెంబ్లీ దర్బార్ హాల్, కార్యాలయం, రెండు అతిథి గృహాలు వంటి ముఖ్యమైన భవనాలు నిర్మించనున్నారు. అలాగే లోక్ భవన్ అధికారులు, సహాయక సిబ్బంది కోసం నివాస గృహాలు కూడా ఈ సముదాయంలోనే ఏర్పాటు చేయనున్నారు. వీటిలో 6 అధికారుల నివాసాలు, 10 సీనియర్ సిబ్బంది నివాసాలు, 12 జూనియర్ సిబ్బంది నివాసాలు, 40 సహాయక సిబ్బంది నివాసాలు ఉంటాయి.

సుమారు 144 మంది భద్రతా సిబ్బందికి వసతి కల్పించేలా 20 గదులతో కూడిన బ్యారక్స్ కూడా నిర్మించనున్నారు. ఈ సముదాయం చుట్టూ కాంపౌండ్ వాల్ (చుట్టుగోడ)తో పాటు నాలుగు సెంట్రీ పోస్ట్‌లు, సంబంధిత చెక్-పాయింట్లు ఏర్పాటు చేయనున్నాయి. ఈ మొత్తం సముదాయం ఆర్​సీసీ నిర్మాణ పద్ధతులను ఉపయోగించి, ఆధునిక, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించనున్నారు.

నిర్ణీత బడ్జెట్ పరిధిలోనే నిర్మాణం : ఈ ప్రాజెక్టుకు నిధులు మంజూరైనప్పటికీ, ఆర్థిక శాఖ కొన్ని షరతులను విధించింది. నిర్మాణ వ్యయం ఏ పరిస్థితుల్లోనూ రూ.212.22 కోట్ల పరిమితిని మించకూడదు. నిర్ణీత బడ్జెట్ పరిధిలోనే నిర్మాణం పూర్తి కావాలి. ఈ మొత్తం కంటే అదనపు ఆర్థిక భారం పడేలా అనుమతించబోమని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఈ వ్యయాన్ని సీఆర్​డీఏ (రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ) పూర్తిగా భరించాలి తన సొంత వనరుల నుంచే అవసరమైన నిధులను సమకూర్చుకోవాలి.

ప్రభుత్వం నుంచి ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులను కోరవద్దని సూచించింది. సాంకేతిక ఆమోదాలు టెండర్ ప్రక్రియకు సంబంధించిన ఖర్చులన్నీ కూడా ఈ రూ. 212 కోట్ల పరిమితిలోనే ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పనుల తర్వాత మిగిలే అదనపు నిధులను ఇతర ప్రాజెక్టులకు మళ్లించడానికి వీలుండదు. అంతేకాకుండా ముందస్తు అనుమతి లేకుండా ప్రాజెక్ట్ పరిధిని విస్తరించడం, అదనపు పనులు చేపట్టడం లేదా సవరించిన అంచనాల ద్వారా ఆర్థిక భారాన్ని పెంచడం వంటి చర్యలకు ప్రభుత్వం అనుమతించదని పేర్కొంది. నిర్మాణం పూర్తయిన తర్వాత నిర్వహణ, మరమ్మతులు ఇతర రోజువారీ కార్యకలాపాల ఖర్చులను నేరుగా ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించకూడదు. అటువంటి ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది.


మరో ముందడుగు - అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌ను నెలకొల్పే దిశగా చర్యలు

పిల్లల చదువుతో పాటు క్రీడలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలి: స్పీకర్​ అయ్యన్నపాత్రుడు